కలనైనా కలగనలేదే------ఇలా అవుతుందని
కాటుక కన్నులు కరువాయే- జాజుల
సిగలే లేవాయే
గాజుల గలగలలు ఎటుపోయే - మొగ్గల
సిగ్గులు ఏమాయే
నుదిటి కుంకుమలు కానరావాయే -పెదవుల
చిరునగవులు విరియవాయే
ముంగిట ముగ్గులు విచిత్రమాయే - ముంగిళ్ళు
లేని లోగ్గిల్లాయే
గడప నెరుగని గుమ్మాలు- గుమ్ము పాలే తాగని పిల్లలు
బాల్యం నెరుగని భావి పౌరులు -భవిష్యత్తు
పై భయాందోళనలు
కంప్యూటర్ల పై కసరత్తు - కాగితాలపై
భవిష్యత్తు
కాలువ సేద్యం కానరావు - అరకలు
మడులు సరిపోవు
నేలను విడిచిన సాము- నింగికి నెగరని -బ్రతుకులు
కుప్ప కూలుతున్నాయి -సరుకేలేని
స్టాకు మార్కెట్ లా
No comments:
Post a Comment