Saturday, July 08, 2017

నిజాయితీ అనేది..వ్యవస్థలో ఉండాలి ..వ్యక్తుల్లో కాదు .



 
            వ్యవస్థలో నిజాయితీ ఉంటే వ్యక్తులు అవినీతి పరంగా మారాల్సిన అవసరం ఉండదు .అలా మారిన వాళ్ళు నేరస్థు లవుతారు ఇవ్వాళ్ళ అవినీతి అనేది..అక్రమ సంపాదన అనేది..వ్యక్తుల స్థాయిని దాటి వ్యవస్థా పూరితమై పోయింది వ్యక్తులు నిజాయితీగా ఉండి వ్యవస్థ నాశనమవుతే .వ్యక్తులు నాశనం అయిపోతారు .
నిజమే నేను నిజాయితీ పరుణ్ణి .ఒక్క పయిసా కూడా లంచం తీసుకోను .అలా అని నా భార్య ప్రసూతి ఆసుపత్రికి వెళితే ..నాకు అక్కడ ఉచితంగా జేర్చుకోరు.నేను నిజాయితీ పరుణ్ణని భారతీయ విద్యాభవన్ లో నో..చిన్మయ స్కూల్ లోనో వొట్టిగా నా పిల్లలకి సీటివ్వరు .నా నిజాయితీ ఇవ్వాల్టి రోజుల్లో చేతగానితనం గా..మారిపొయింది.నిజాయితీపరులని చేతగానివాడిగా ప్రజలే ముద్దర వేసే స్థితికి ..వ్యవస్థను సర్వ నాశనం చేసారు నాయకులు . ఇవాళ్ళ మనిషంటే డబ్బు.మనిషి పుట్టటానికి ఓ మాదిరిగా అసుపత్రి ఖర్చులెంత అవుతున్నాయో చూసుకోండి.మనిషి చచ్చిపోతే స్మశానం..కర్మల కెంత ఖర్చవుతున్నదో చూసుకోండి.ఎలా సంపాయించావన్నదికాదు ముఖ్యం..ఎంత సంపాయించావన్నదే ఇవ్వాల్టి రోజుల్లో నిజం .
         సామాజిక పరిణమాన్ని ..నిజాన్ని..గ్రహించకుండా అవినీతి..అవినీతి అని ఎంతమంది మొక్కుకున్నా ఏమీ కాదు .చూస్తుండండి ..ఎవ్వరూ ఆపలేరు..జనం పూర్తిగా దోచుకోబడాలి.జనాలదెగ్గిర ..చిల్లి గవ్వకూదా ఉండకుందా .పన్నుల పేరుతో ప్రభుత్వాలు .నాయకులు..ఉద్యోగస్తులు ..వ్యాపారస్తులు ..అంతా దొచెయ్యాలి అప్పుడు మళ్ళీ సాయుధ పోరాటమో ..తిరుగుబాట్లో...1857..లు వస్తాయి.
ఎన్నికల్లో ప్రజలు తాము తీసుకున్న ప్రతి పైసాకు ..వాళ్ళు సమాధానం గా బలిపశువులవ్వల్సిందే. తప్పదు.అవినీతే రాజకీయ అజెండా గా మారిన పార్టీ జెండాలను మొస్తూ తిరిగే ..వారికి ..అధికారంలో ఉన్న ఏ పార్టీని ప్రస్నించే అధికారం లేదు. అవినీతి భూతానికి ..తనివితీరా ఆహారమవ్వండి ..ఓటరు మహాశయులారా
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card