Sunday, August 25, 2019

అతి త్వరలో దేశంలో ఎదో “సంచలనం” జరగబోతోంది-జాగ్రత్త



SOURCE:
Forwarded by

T J Girish
Secretary & Chairman Taxation Committee
T D C C I Tumkur 572101
08162283552
9844069192

ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముందు భారీ ఆర్ధిక మాంద్యం పొంచి వుంది
                         భారతదేశంలో ఇప్పుడు  ప్రకటించని ఆర్థిక సంక్షోభం ఉంది. ఇలాంటి సంక్షోభాలు ప్రజలకు నెమ్మదిగా కనిపిస్తాయి. ప్రస్తుత పరిస్థితి సంక్షోభం యొక్క మొదటి రౌండ్ మాత్రమే అని నేను భావిస్తున్నాను.
                         ఈ మధ్యే బ్యాంకుల ‘ఎన్‌పిఎ’ ను పెంచారు అంటే. మూలధన కొరత అంటే తాజాగా పెట్టుబడి లేదు అని అర్ధం . దివాలా చట్టం ఆసరాతో బ్యాంకులో బాకీలు ఎగ్గొట్టటం లేదా దేశం వదిలి పారిపోవటం , బ్యాంకు ఉద్యోగుల్లో  మరియు వ్యాపార సంస్థలలో నిరంతర మోసాలు దీనికి కారణం అయివుండొచ్చు
                       గృహాలను కొనుగోలు ,అమ్మకాలు చేయడం తగ్గిపోయింది.అంటే ఉక్కు, సిమెంట్, బాత్రూమ్ అమరికలు, నిర్మాణాలు క్షీణించడం. దీని వలన  బ్యాంకుల లో ‘ఎన్‌పిఎ’లు ఇంకా పెరుగుతాయి. ఈ ఎన్‌పిఎలు సంక్షోభాన్ని మరింత ఎక్కువ చేయడం ద్వారా వ్యక్తిగత స్థాయికి కూడా రావచ్చు.
                      వాహన అమ్మకాలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో మొదటిసారి ద్విచక్ర వాహనాల అమ్మకం ప్రతికూల వృద్ధిని చూపుతోంది. మారుతి ఉత్పత్తిని 50% తగ్గించింది. చాలా మంది ఆటో డీలర్లు మూసివేస్తున్నారు. అంటే ఉక్కు, టైర్ మరియు ఇతర ఉపకరణాలపై గణనీయమైన తగ్గింపు చేయాలని డిమాండ్ ఉంది.
                    పై మూడు విషయాలు కోటి ఉద్యోగాల తొలగింపుకు మరియు ప్రభుత్వ పన్ను ఆదాయాన్ని తగ్గించడం పై ప్రబావితం చూపుతాయి. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వం విసుగు చెంది, ప్రతిదానిపై పన్నులు వేయడం ద్వారా తన నష్టాన్ని పూర్తి చేయాలనుకుంటుంది,లేదా ప్రభుత్వం లాభాలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగిస్తుంది మరియు ఆ నష్టాన్ని (లోటును) ప్రభుత్వ ఖాతాలో చూపుతుంది. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వ ఆస్తులు తమ అభిమాన కార్పొరేట్ శక్తుల కి  తక్కువకే అమ్ముతారు .అందువలన కూడా  నష్టాలు పెరుగుతాయి.
                 భారతదేశంలో ఈ సంక్షోభం మార్చి 2020 లో  సామాన్య ప్రజల స్తాయికి రావొచ్చని   నా కనిపిస్తుంది, సగటు భారతీయులలో చాలామందికి దీని గురించి తెలియదు. చిన్న వ్యాపారస్తులు  సబ్బు, షాంపూ మరియు డిటర్జెంట్ లాంటివి కూడా అమ్మలేకపోతున్నప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది.
              గత కొన్ని సంవత్సరాలుగా, “ఎఫ్‌ఎంసిజి” రంగం కూడా మాంద్యం యొక్క పట్టులో ఉంది-
                 బాబా రామ్‌దేవ్ పతంజలి కంపెనీ ప్రకటనను మీరు చివరిసారి ఎప్పుడు చూసారో  మీకు గుర్తుందా? పతంజలి టీవీలో 2 సంవత్సరాల క్రితం చాలా చురుకుగా ఉండేది., కానీ గత ఒక సంవత్సరం నుండి, భారతదేశ “ఎఫ్‌ఎంసిజి” మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పతంజలి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది .. పతంజలి ఉత్పత్తుల అమ్మకాలు తగ్గిపోతున్నాయి. ఇది కాకుండా, “పతంజలి ఆయుర్వేదం” కంపనీ 2018 ఆర్థిక సంవత్సరంలో 10% రెవెన్యూ లోటును చూపించింది. పతంజలి, హిందూస్తాన్ లివర్ వంటి అగ్ర సంస్థలు కూడా  వృద్ధిలో లేకుండా పడిపోయాయి.
               గ్రామీణ ప్రాంతాల్లో సబ్బు, టూత్‌పేస్ట్, హెయిర్ ఆయిల్, బిస్కెట్లు వంటి వేగంగా అమ్ముడయ్యే  వినియోగ వస్తువులకు కూడా డిమాండ్ గణనీయంగా తగ్గింది. ఎంట్రీ లెవల్ కార్లను తయారుచేసే “ఎఫ్‌ఎంసిజి”, ద్విచక్ర వాహనాలు,ఆటో కంపెనీలు లాంటివి కూడా ఇందులో ఉన్నాయి. ఇది  గ్రామీణ ప్రాంతాల మీద  ఆధారపడిన ఆ వ్యాపారాల అభివృద్ధి ని  కూడా మందగించింది.
          ఇప్పుడు రవాణా-“ఇండియన్ ఫౌండేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్” నివేదిక ప్రకారం, ట్రక్ అద్దెలలో(బాడుగల్లో) 15% తగ్గుదల నవంబర్ 2018 నాటికి నమోదు అయ్యింది . అలాగే ‘ఫ్లీట్ యుటిలైజేషన్’(లగేజీ రవాణా వాహనాలు ఉపయోగించటం)  దాని కంటే ఎక్కువ పడిపోయింది. మొత్తం 75  ట్రంక్  రవాణా మార్గాలు, అద్దెలు గణనీయంగా తగ్గాయి.  పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడం వల్ల సరుకు డిమాండ్‌పై స్పష్టమైన ప్రభావం ఉంది. ట్రక్కుల ద్వారా రవాణాకు ఎక్కువ అవకాశాలుండే  ఉత్పాదక రంగం నుండి డిమాండ్ కనీస స్థాయిలో కూడా లేదు.         
               గత ఏడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్ మరియు జూన్ మధ్య, ఫ్లీట్ యుటిలైజేషన్ 25% నుండి 30% కి తగ్గింది. కనుక ఇది రవాణాదారుల ఆదాయాన్ని కూడా 30% తగ్గిస్తుంది. తరువాతి త్రైమాసికంలో చాలా మంది ఆపరేటర్లు ఫ్లీట్ యొక్క EMI  ల డిఫాల్ట్లో కూడా వుండి ఉండవచ్చు
నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల నెలవారీ ఖర్చు తగ్గింది . ఏప్రిల్‌ తరువాత వ్యవసాయంలో రవాణా దాదాపు మందగించింది. జూన్‌లో “ఎఫ్‌ఎంసిజి” ద్వారా పండ్లు, కూరగాయల డిమాండ్ 20% తగ్గింది. సరుకు రవాణా డిమాండ్ తగ్గడం వల్ల, మొదటి త్రైమాసికంలో ట్రక్  బాడుగలు దేశంలోని అన్ని ప్రధాన మార్గాల్లో 30% తగ్గాయి.

 ఈ స్థితిని సరిదిద్దటానికి ప్రభుత్వం ఎదో చేయ బోతుంది. ఆర్ధిక మంత్రి ట్వీట్లు  ఆ దిశగా నే వున్నాయి
.జాగ్రత్త గా ఉండండి. మీ డబ్బులు హారతి కర్పూరంలా కళ్ళ ముందే  కరిగి పోవచ్చు

------------ధరణికోటసురేష్  కుమార్, ఆడిటర్    పొన్నూరు@9441503681

Thursday, August 08, 2019

ఇదీ చుక్కల భూమి కథ



         చుక్కల భూములు.. కొద్దిరోజులుగా తరచూ వినిపిస్తున్న మాట. ఈ క్రమంలో అసలు చుక్కల భూములు అంటే ఏమీటి?  తెలుసుకోవాలంటే బ్రిటీష్‌ పాలనా కాలం నుండి పరిశీలించాల్సిందే..
సాధారణంగా భూమిని దాని యాజమాని స్వభావం ఆధారంగా ప్రభుత్వ, పోరంబోకు, మాన్యం, ఈనాం భూమి తదితర పేర్లతో పిలుస్తారు. ఆంగ్లంలో డాటెడ్‌ ల్యాండ్స్‌గా గురింపు పొందిన వాటిని తెలుగులో చుక్కల భూములు అంటారు. 1906 నుండి 1916 వరకు ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించింది. కొన్ని ప్రాంతాల్లో భూమి ఉన్నా, అవి రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్నా వాటి యజమాని ఎవరో తెలియలేదు. దీంతో చట్టబద్ధంగా యజమాని అధీనంలో లేని భూములన్నింటికీ అప్పటి ప్రభుత్వం గుర్తుకోసం తన రికార్డుల్లో చుక్కలు పెట్టింది. అందువల్ల ఆయా భూములకు చుక్కల భూములు అనే పేరు వచ్చింది. నాటి నుండి ఈ భూములు అధిక శాతం ప్రభుత్వ అధినంలోనే ఉన్నాయి. కొన్ని భూముల్లో మాత్రం ప్రజలు సాగు చేపట్టడం, ఇతర అవసరాలకు వినియోగించడం ద్వారా వారి అధీనంలోకి వెళ్లాయి. ప్రస్తుతం పలు వివాదాల నేపథ్యంలో, ఇతర కారణాల దృష్ట్యా భూములకు సంబంధించిన పాత రికార్డులన్నింటినీ మండలాల నుండి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి ఇటీవలే తరలించారు. ఈ క్రమంలోనే చుక్కల భూముల లెక్కలూ తేల్చాలని ప్రభుత్వం భావించినట్లు తెలిసింది. అందులో భాగంగానే చుక్కల భూములను ప్రభుత్వం మళ్లీ తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమచారం.
                               ఇప్పటికే కొన్ని భూములు పలువురి అధీనంలో ఉన్నదృష్ట్యా అవి ఎవరి అధీనంలో ఉన్నాయో అందుకు తగిన ఆధారాలను అధికారులకు చూపాల్సి ఉంటుంది. ఇదుకుగాను 1916 నుండి చుక్కల భూములు ఎవరి అధీనంలో ఉన్నాయో నిర్థారించేందుకు అధికారులు పూనుకున్నారు
                                     దీంతోపాటు ఈ భూములకు సంబంధించి క్రయ విక్రయాలు, బదలాయింపులు, వంశపారంపర్యంగా సంక్రమించడం తదితర కారణాలతో చేతులు మారిన దృష్ట్యా గత 12 ఏళ్లలోనూ భూములు ఎవరి అధీనంలో ఉన్నాయో అందుకు సంబంధించిన ఆధారాలతోనూ అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకుగాను రిజిస్ట్రార్‌ డాక్యుమెంట్‌, ఇసి, 10.1, భూమి సిస్తు రశీదులను ఫారం ఎఫ్‌-3తో జోడించి దరఖాస్తును అధికారులకు అందించాలి.
              అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియపై సంబంధిత భూములకు చెందిన రైతుల్లో అనుమానాలు, ఆందోళనలు నెలకొన్నాయి. తరతరాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములకు చుక్కల భూములనే పేరుతో గందరగోళంలో పడేశారని చెబుతున్నారు.

Wednesday, August 07, 2019

“విద్య నేర్చిన విశ్వామిత్రుడివి,-వివేకం నేర్పిన సరస్వతీ పుత్రుడివి”

“విద్య నేర్చిన విశ్వామిత్రుడివి,-వివేకం నేర్పిన   సరస్వతీ పుత్రుడివి”



మేము నిడుబ్రోలు జెడ్ పి హెచ్ స్కూల్ లో చదివే  రోజుల్లో  బయట గోడ కి  నల్ల రంగు పూసిన బోర్డు వుండేది.దానిమీద ప్రతీరోజు ఒకరు ఆరోజు వారు చదివిన న్యూస్ పేపర్లోని  వారికి నచ్చిన ముఖ్య విషయాన్ని హెడ్డింగ్ లాగా రాయాలి  అనే నిభందన  (వారు ప్రవేశపెట్టిన దే )వుండేది. దానికోసం తప్పని సరిగా న్యూస్ పేపర్ చదివే వెళ్ళేవాళ్ళం. పత్రిక చదవటం  అలా అలవాటు అయ్యింది
ప్రతి ఒక్కరికీ సొంతంగా నేర్చుకునే తెలివి కొంత ఉంటుంది. విద్యార్థులు సొంతంగా నేర్చుకునే విధంగా ప్రతి విషయంపై వారికి అవగాహన కల్పించడమేగాక వారితో నిరంతరం చర్చించి అభ్యాసాన్ని సులువు చేసిన రూపశిల్పి
పత్రికలో ఏ వార్తలని ఎలా అర్ధం చేసుకోవాలి ,తప్పనిసరిగా ఎడిటోరియల్ ఎందుకు చదవాలో వివరించి చదివించిన మార్గదర్శి
తెలుగా? ఆంగ్లమా? అని భేదం లేదు.   విజ్ఞానమా? భూగోళమా? అని తేడా లేదు...
అన్నీ వారికి  కొట్టిన పిండి...
అలాంటి గురువు గారు
మన గురువు గారు, నిడుబ్రోలు జెడ్ పి హెచ్ స్కూల్ మాజీ హెచ్ఎం పాములపాటి అంకినీడు మాస్టర్ గారు  ది. 06.08.19 సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారని తెలియజేయుటకు చింతిస్తున్నాను.
“అడుగుతావా ఏమైనా ఆఖరిసారిగ నన్ను....,
ఏడవకు మరి ఎదురుగా చూడు...,
ముగిసింది బ్రతుకు వచ్చింది మృత్యువు...,
పోతోంది వెలుగు వస్తోంది చీకటి...,
సాగనంపు నన్ను చివరి క్షణం..”
.................  అన్నట్లుగా చెవుల్లో  మ్రోగుతోంది మీ గొంతు
మాస్టారు మీకు  అంతిమంగా మీకేమిఇవ్వగలం
“తస్మైశ్రీ గురవే నమః “   అనే ఒక నమస్కారం తప్ప
------------ధరణికోటసురేష్  కుమార్, ఆడిటర్    పొన్నూరు@9441503681


Monday, August 05, 2019

గ్రాంధిక భాషలో సోషల్ మీడియా

కొన్ని శతాబ్దాల క్రితం అనగా 1945 – 1960 ల మధ్య, WhatsApp ఉండిఉంటే, అప్పట్లో సంక్షిప్త సమాచార ప్రక్రియ ఎలా సాగిందో తెలుసా…….!
అతడు :- సఖీ………!
ఆమె :- ప్రియా……!

అతడు :- రాత్రి భోజనము పూర్తి అయినదా ?
ఆమె :- అయినది. మరి మీరు భుజింతిరా ?
అతడు :- ఎపుడో………..!
ఆమె :- ఇంకా ?
అతడు :- ఇపుడే ముఖవాచకమును తెరిచితిని. అందు తమరు ఎగుమతి చేసినట్టి “స్వతః చిత్రము” మహత్తరముగానున్నది. వేల ఇష్టములను నొక్కవలెనన్న పరవశము కలిగినది మాకు. కానీ ఒక ఇష్టము మాత్రమే లెక్కకు వచ్చును కదా !
ఆమె :- నా యొక్క స్వతః చిత్రము తమకు అంతగా నచ్చినదా ప్రియా ?
అతడు :- అవును దేవి. మీ వెనకాల జాలువారుచున్నట్టి జలపాతపు అందాలు తమ అధరహాసపు సౌందర్యము ముందు తేలిపోవుచున్నవి.
ఆమె :- పోండి స్వామి. మీరు మరీనూ…….
అతడు :- ముఖవాచకమునందు ఆ యొక్క చిత్రము కిందనే వ్యాఖ్య ను లిఖించితిని కదా సఖి.
తమరు దానిని చదవనే లేదా ? ఇతరులు దానిని చదవకనే చదువుచూ లెక్కకు మించి ఇష్టములను నొక్కుచున్నారు.
ఆమె :- చదివకనేం……! పలుమార్లు పరిపరి విధములా చదివితిని. మిక్కిలి ఆనందమున మునిగితిని. ఇంకనూ ఆయొక్క మకరందపు మడుగులోనుండి పైకి తేలలేకపోవుచున్నాను.
అతడు :- అటులనా ?
ఆమె :- అవును స్వామీ….
అతడు :- ఇంకా ……..?
ఆమె :- మీరే చెప్పాలి.
అతడు :- వర్షము ఎడతెరిపి లేకుండగా కురియుచున్నది. అంతర్జాలమునకు సాంకేతములు బహు అల్పముగా అందుచున్నవి. సందేషముల పంపకమునకు అంతరాయము కలుగుచున్నది. ఇక పడుకునెదము. ప్రాతః కాలమున మరలా శుభోదయముతో పలకరించుకొందాము.
ఆమె :- అవును స్వామీ…….. ఇక పవళింపవలెను.
మీకు శుభరాత్రి.
అతడు :- అటులనే దేవి. మీకునున్నూ నా తరుపున శుభరాత్రి మరియు మధుర కలలు.

Address for Communication

Address card