Saturday, October 08, 2016

ఏడుపు కూడా అంత తేలిగ్గా యేమీ రాదు కొన్నిసార్లు!



మనిషికి, మనిషి స్నేహితుడు (వెన్నంటి వుండేవాడు)
మరణం, మనిషికి స్నేహితుడు
కాలం, మరణానికి స్నేహితుడు
కాలానికి అందరూ స్నేహితులే

ఏడుపు కూడా అంత తేలిగ్గా యేమీ రాదు కొన్నిసార్లు!
వొక్కసారి పగలబడి ఏడ్చేస్తే లోపల వున్న దుఃఖమంతా అలల్ని యీడ్చి వొడ్డుకి కొట్టినట్టు వుండేదేమో! ఇవాళ (26.09.2016 )చనిపోయిన నా మిత్రుడు,పొన్నూరు లో ప్రముఖ హోమియో వైద్యుడు *డా|| రాతిక్రింద కోటేశ్వరరావు(బుజ్జి)*,నిడుబ్రోలు మరణం తో మనసులో కలిగిన అలజడిని ఎలా ఆపుకోవాలో తెలీక...
అప్పట్నించీ లోపలి సజీవమైన అవయవమేదో వున్నట్టుండి నిర్జీవమైపోయినట్టు- లేదూ- వొక వెలితి యింక దేన్తోనూ నింపడానికి వొప్పుకోనట్టు లేదూ- ఆ మరణపు వొక్క క్షణం అబద్ధమే అని యింకా అనుకుంటూ వున్నట్టుగా వుంది.
_“అంతములేని ఈ భువనమంత పురాతన పాంధశాల
విశ్రాంతి గృహమ్ము, అందు ఇరు సంజెల రంగుల వాకిళుళ్ …….” _అన్న దువ్వూరి పద్యం గుర్తుకి వచ్చింది.
మరణాలు కొత్త కాదు. కానీ, ప్రతి మరణమూ కొత్తగా ఏడ్పిస్తుంది. అంతకు ముందు వెళ్ళిపోయిన మనుషులూ తక్కువ కాదు, కాని ఈ క్షణం వెళ్ళిపోయిన ఈ మనిషి యిలా వెళ్లి వుండకూడదనీ, మృత్యువు మరీ ఎక్కువ తొందరపెట్టి లాక్కు వెళ్ళిందనీ అనిపిస్తుంది

Address for Communication

Address card