భారత దేశానికి అసలు ..ప్రమాదం.చైనా ..కాదు .పాకిస్తాన్ కాదు.
మనమెన్నుకుంటున్న మన నాయకులే అసలు శత్రువులు.వీళ్ళకి ప్రజల బాగోగులు కాదు..వీళ్ళ బాగొగులే వీళ్ళకి ముఖ్యం.వీళ్ళ మూర్ఖత్వానికి .. వీళ్ళ అతితెలివితనానికి..వీళ్ళ శాడిజానికి ..వీళ్ళ అత్యాశకి.. వీళ్ళ లంచగొండి తనానికి.. వీళ్ళ అహంభావానికి
వీళ్ళ దేశ భక్తి రాహిత్యానికి .వీళ్ళ గందర గోళానికి.. ప్రజలంతా బానిసలుగా అమ్ముడవటమో.. కొంత మేర తుడిచి పెట్ట బడటమో జరగటం ఖాయం .
ప్రక్రుతి విపత్తులకు..మానవతప్పిదాలకు..అధికారుల తప్పిదాలకు.. నాయకుల తప్పిదాలకు...ప్రజలు..ముందు ముందు భారీ మూల్యాలు..భారీ ప్రాణ నష్టాలు చవి చూడాల్సిందే.పందొమ్మిదో శతాబ్దం తొలినాళ్ళలో ప్రపంచాన్ని వణికించిన ..ప్లేగు..లాంటి మహామ్మారి విర్చుకబడ్తే ..ఇప్పుడున్న అపరిశుభ్ర వాతావరణంలొ పరిస్థిటేంటన్నది .ఎవరూ పట్టించుకోని .పెద్ద సమస్య.
ఇవేమీ పట్టించుకోని ఇలాంటి నాయకులకి ప్రత్యామ్నాయ సమర్ధ నాయకత్వం ..నాయకుడు ..పార్టీ..ప్రజలకి లేకపోవటం ..భారత జాతి చేసుకున్న దురద్రుష్టం.
దొంగల స్వామ్యం గా మరిన ప్రజాస్వామ్యాన్ని రక్షించే దెవ్వరు ?
ఈదేశాన్ని ..ముందుకు నడిపించేందుకు .. ఒక్కడు ..ఒక్క నాయకుడు కూడా కాగడా వేసి వెదికినా కనిపించటం లేదు .
అయ్యో ..
నా తల్లి భరత మాత ..పిల్ల లున్న గొడ్రాలిలా కనిపిస్తోంది .
అమ్మకు ప్రజాస్స్వామ్యం పేరుతో ..మరోసారి ..మనం పెట్టేది..ఆఖరి వందనమేనా?
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment