Showing posts with label SCEIENCE. Show all posts
Showing posts with label SCEIENCE. Show all posts

Tuesday, June 09, 2015

మొబైల్ బ్యాంకింగ్



మొబైల్ బ్యాంకింగ్ అంటే ఏ సమయంలోనైనా సురక్షితంగా బ్యాంక్ ఖాతాను నిర్వహించుకునే వెసులుబాటు. రెండేళ్ల క్రితమే మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చినా, ఈ సదుపాయం వినియోగిస్తున్న వారు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. 81 కోట్ల మొబైల్‌ కనెక్షన్లు ఉన్న దేశంలో, భవిష్యత్తులో మొబైల్‌ బ్యాంకింగ్‌ వినియోగదార్ల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందని బ్యాంకర్లు భావిస్తున్నారు. మొబైల్‌ బ్యాంకింగ్‌ వినియోగానికి ఏ విధమైన రుసుమును బ్యాంకులు వసూలు చేయడం లేదు.

సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్కటీ మన ముంగిటకే వస్తున్నాయి. అలాగే ఇప్పుడు బ్యాంక్ లావాదేవీల్లో కూడా విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందుకే ఉదాహారణే ఈ మొబైల్ బ్యాంకింగ్. మనం ఎక్కడ ఉంటే అక్కడినుంచే మొబైల్ ఫోన్ ద్వారా కేవలం ఒక్క ఎస్‌ఎంఎస్ పంపిస్తే మనకు కావాల్సిన సేవలపై బ్యాంకు ఆదేశాలు ఇవ్వడమే మొబైల్ బ్యాంకింగ్. ఈ మొబైల్ బ్యాంకింగ్ వల్ల కొన్ని ప్రయోజనాలుంటే మరికొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

మొబైల్ బ్యాంకింగ్ వల్ల ప్రయోజనాలు:
* ఎప్పుడైనా బ్యాంకింగ్: మొబైల్ బ్యాంకింగ్ సహాయంతో ఎప్పుడైనా, ఎక్కడనుంచైనా బ్యాంకు లావాదేవీలను నిర్వహించవచ్చు. ముఖ్యంగా నాన్ బ్యాంకింగ్ అవర్స్‌లో ఇది ఎంతగానో ఉపయోగం. మీరు ఇంట్లో నుంచే మీ డెస్కటాప్, ల్యాప్ టాప్‌ల సాయంతో బ్యాంకింగ్ లావాదేవీలు చేయవచ్చు.

* మొబైల్ బ్యాంకింగ్ ఉచితం: మొబైల్ బ్యాంకింగ్ అనేది ఉచితం. దీనికి బ్యాంకులు ఎలాంటి రుసుము వసూలు చేయవు. దీనికల్లా మీరు చేయాల్సింది మీ మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవడమే.

* సెక్యూర్ బ్యాంకింగ్: బ్యాంకులు మొబైల్ అప్లికేషన్‌ని ప్రారంభిస్తాయి. వాటిని మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకుంటాం. బ్యాంకు లావాదేవీలు అన్నీ కూడా బ్యాంకు సర్వర్‌లోనే నిక్షిప్తం అవుతాయి. మీ ఫోన్ లేదా సిమ్ కార్డులో స్టోర్ అవ్వవు.

మొబైల్ బ్యాంకింగ్ వల్ల నష్టాలు:
* స్మార్ట్ ఫోన్ లేని వారు మొబైల్ బ్యాంకింగ్ లావా దేవీలను నిర్వహించ లేరు.

* మీ స్మార్ట్ ఫోన్‌లో వైరస్ ఉన్నట్లైతే మొబైల్ బ్యాంకింగ్ కన్నా, ఇంటర్నెట్ బ్యాంకింగే అత్యంత ఉత్తమం అని నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు.

* మార్కెట్లో స్మార్ట్ ఫోన్‌లకు తక్కువ యాంటీ వైరస్ సాప్ట్ వేర్లు ఉండటం మరో కారణం. మొబైల్ బ్యాంకింగ్ సేఫ్‌గా నిర్వహించాలంటే స్మార్ట్ ఫోన్‌లో యాంటీ వైరస్ తప్పనిసరి.

మొబైల్ బ్యాంకింగ్‌లో పేరు ఎలా నమోదు చేసుకోవాలి:
* మొబైల్ బ్యాంకింగ్ సదుపాయం పొందాలనుకునే వారు ఆ సదుపాయం అందిస్తున్న ఏదైనా ఒక బ్యాంకులో ఖాతాదారులైవుండాలి.

* దేశంలోని మొబైల్ సర్వీసులు అందిస్తున్న సంస్థల్లో ఏదో ఒక సంస్థ చందాదారులై ఉండాలి. ఆ మొబైల్ సంస్థకు, బ్యాంకుకు మధ్య మొబైల్ బ్యాంకింగ్ సేవలందించే విషయంలో భాగస్వామ్య ఒప్పందం కలిగివుండాలి. మీ మొబైల్ నెంబరును బ్యాంక్‌కు తెలియజేయాలి.

* మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందాలనుకునే వారు సంబంధిత బ్యాంకులో నిర్దిష్ట దరఖాస్తు ఫారం పూర్తి చేయడం ద్వారా ఆ సేవలను తమకు విస్తరింపజేయాలంటూ బ్యాంకును అభ్కర్ధించాలి. ఏ ఖాతా ద్వారా మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందుకోవాలనుకుంటున్నారో ఆ ఖాతాను మీ ఖాతా ఐడీని అనుసంధానం చేయాలి. ఒక ఖాతాదారుడు ఒకే ఐడీతో గరిష్టంగా అయిదు ఖాతాలతో అనుసంధానం కావచ్చు.

* సంబంధిత బ్యాంకు మీకు మొబైల్ బ్యాంకింగ్ పిన్ ఇస్తుంది. ఆ పిన్ ఆధారంగా లావాదేవీలు నిర్వహించుకోవాలి. మీకు ఇచ్చిన పిన్ నెంబరు చాలా జాగ్రత్తగా టైప్ చేయాలి. పొరపాటున తప్పుడు నెంబరు టైప్ చేయకూడదు. ఒకవేళ పొరపాటున టైప్ చేసినా మూడుసార్లు వరుసగా తప్పుడు నెంబరు టైప్ చేస్తే ఖాతా స్తంభించిపోతుంది.

మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఎలాంటి సేవలు పొందవచ్చు:
1. ఖాతాలోని బ్యాలెన్స్ వివరాలు
2.
గతంలో చేసిన మూడు లావాదావీల వివరాలు
3.
చెక్ బుక్
4.
చెక్ పేమెంట్ నిలిపివేతకు ఆదేశం జారీచేసే అవకాశంవుంది
5.
ఫిక్స్‌డ్ డిపాజిట్ వివరాలు
6.
విద్యుత్, మొబైల్ ఫోన్, బేసిక్ ఫోన్ బిల్లుల చెల్లింపులు తదితర సేవలను వినియోగించుకోవచ్చు.

Friday, February 06, 2015

Income Tax Slab for A.Y. 2015-16 (F.Y. 2014-15)

ఆండ్రాయిడ్ ఫోన్ రహస్య కోడ్లు



       ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారికి ఉపయోగపడే పలు రహస్య కోడ్లు క్రింద ఇవ్వబడినవి. గమనిక: వీటిలో కొన్ని కోడ్లు డాటా చెరిపివేయడం మరికొన్ని ఫోన్‌ పనిచేయకుండా చేస్తాయి కనుక కోడ్లు వాడే ముందు జాగ్రత్తగా చూసుకుని అవసరమైనవి మాత్రమే వాడుకోగలరు.
*#06# – ఫోను IMEI నంబరు తెలుసుకోవడానికి
*#0*# –సాంసంగ్ ఫోన్‌లలో సర్వీస్ మెనూలోకి ప్రవేశించడానికి
*#*#4636#*#* – ఫోను గురించిన సమాచారం, ఫోను మరియు బ్యాటరీ వాడకం యొక్క గణాంకాలు
*#*#34971539#*#* – కెమేరా గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి
*#*#273282*255*663282*#*#* – అన్ని ఆడియో, వీడియో ఫైళ్ళు తక్షణం బ్యాకప్ తీసుకోవడానికి
*#*#232339#*#* – వైర్‌లెస్ లాన్ పరిక్షించడానికి
*#*#0842#*#* –బ్యాక్ లైట్ మరియు వైబ్రేషన్ పరిక్షించడానికి
*#*#2664#*#* –తాకేతెరను పరిక్షించడానికి
*#*#1111#*#* – FTA సాఫ్ట్వేర్ వెర్షను తెలుసుకోవడానికి
*#12580*369# –సాఫ్ట్వేౠ మరియు హార్డ్వేరు సమాచారం తెలుసుకోవడానికి
*#9900# – సిస్టం డంప్ మోడ్
*#301279# – HSDPA/HSUPA కంట్రోల్ మెనూ
*#7465625# – ఫోను లాక్ స్టేటస్ తెలుసుకోవడానికి
*#*#7780#*#* – డాటా పార్టిషియన్ని ఫ్యాక్టరీ స్థితికి తీసుకురావడానికి
*2767*3855# –ఫోన్ లో డాటాని పూర్తిగా చెరిపివేయడానికి
##7764726 –మోటోరోలా ఫోన్‌లలో రహస్య సర్వీస్ మెనూ చూడడానికి
*#*#232338#*#* –వైఫి మాక్ చిరునామాని తెలుసుకోవడానికి
*#*#0289#*#* – ఆడియోని పరిక్షించడానికి
*#*#2663#*#* –సోన్‌ యొక్క తాకేతెర వెర్షను చూడడానికి
*#*#0588#*#* –ప్రాక్సిమిటీ సెన్సార్‌ని పరిక్షించడానికి
*#*#3264#*#* – RAM వెర్షను చూడడనికి
*#*#232331#*#* –బ్లూటూత్ ని పరిక్షించడానికి
*#*#232337#*# – బ్లూటూత్ పరికరం చిరునామాని తెలుసుకోవడానికి
*#*#7262626#*#* –ఫీల్డ్ టెస్ట్ చేయడానికి
*#*#8255#*#* –గూగుల్ టాక్ సేవలను పర్యవేక్షించడానికి
*#*#4986*2650468#*#* – ఫోను, హార్డ్వేర్, పిడిఎ, ఆర్‌యఫ్ కాల్‌ డాటా ఫిర్మ్‌వేర్ గురించిన సమాచారం తెలుసుకోవడానికి
*#*#1234#*#* – పిడిఎ మరియు ఫోను ఫిర్మ్‌వేర్ గురించిన సమాచారం తెలుసుకోవడానికి
*#*#2222#*#* –  FTA హార్డ్వేర్ వెర్షను తెలుసుకోవడానికి
*#*#44336#*#* – Show Build time and change list number
*#*#8351#*#* – Enable voice dialing log mode, dial *#*#8350#*#* to disable it
##778 (+call) – Show EPST menu
*#*#197328640#*#* – Enable test mode for service

*#9090# – Diagnostic configuration
*#872564# – USB logging control
*#*#7594#*#* – Enable direct powering down of device once this code is entered 

Wednesday, January 14, 2015

యోగా.. ఇప్పుడు అందరికీ ఓ ఆరోగ్యసూచిక

ఇంటర్నెట్ పుణ్యమాని ఇంట్లో కూర్చుని ఒక్క ‘క్లిక్’ కొడితే చాలు.. కిరాణా దుకాణం, బట్టల కొట్టు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాల షాపు అన్నీ మన కళ్లెదుట ప్రత్యక్షం.. ‘ఆన్‌లైన్ షాపింగ్’ అందుబాటులోకి రావడంతో మనం కాలు కదపకుండానే అన్నీ నేరుగా ఇంటికే వచ్చేస్తాయి.. ఆఫీసుకెళితే సమయం తెలియకుండా పనిలో పడిపోవడం.. ఇంటికెళ్లాక కాలక్షేపం పేరుతో గంటలకొద్దీ టీవీకి అతుక్కుపోవడం.. శరీరానికీ, మనసుకూ ఏ మాత్రం పని లేకుండా అంతా యాంత్రికంగా గడిచిపోవడం...
***
ఉదయం లేవగానే తప్పదు కనుక- కొన్ని పనుల్ని మొక్కుబడిగా ముగించడం.. బైకో, కారో ఉంటో ‘స్టార్ట్’ చేసి ఎక్కేయడం.. ‘లిఫ్ట్’లో పనిచేసే చోటకు చేరుకోవడం.. నడకను కూడా దూరం చేసుకోవడం.. అనేకానేక అనారోగ్యాలకు దగ్గర కావడం.. వినూత్న జీవనశైలితో రాజీపడిపోవడం.. ఒత్తిడి పెరిగిపోయిందని అనుక్షణం విసుగెత్తిపోవడం...
మార్కులు, ర్యాంకుల ధ్యాసలో పిల్లలు, ఇంటి బాధ్యతలతో గృహిణులు, ఆఫీసు వ్యవహారాల్లో ఉద్యోగులు.. నేటి నవ నాగరిక కాలంలో అందరిదీ ఉరుకులు,పరుగుల జీవనమే.. ఒత్తిళ్లు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక బాధలు నిత్య జీవితంలో అంతర్భాగమయ్యాయి.. ధనిక, పేద తేడా లేదు.. చిన్నా పెద్దా వ్యత్యాసం లేదు.. ఎవరిని కదిపినా కష్టాలు, కలతలే.. సాంకేతిక విజ్ఞానం విస్తరించినా, ఆధునిక సౌకర్యాలు ఎంతగా సమకూరినా అన్నీ సజావుగా సాగుతాయన్న నమ్మకం లేకుండా పోయింది... పరిపూర్ణ శారీరక, మానసిక ఆరోగ్యం ప్రశ్నార్థకం కావడంతో అనేక దుష్ఫలితాలను చవిచూడక తప్పడం లేదు.. అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం, మనోవైకల్యం వంటివి సర్వసాధారణమై పోయాయి..

.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శారీరక, మానసిక ఉత్తేజానికి ‘యోగా’ ఓ ఆశాకిరణమైంది. వ్యక్తిత్వ దీపాన్ని వెలిగించుకోవడానికి, జీవన రథాన్ని ముందుకు నడిపించడానికి, అనుబంధాలను పెంచుకుంటూ నిత్యం ఆనందం పొందడానికి ‘యోగా’ దోహద పడుతోంది. మానసికంగా సర్వోన్నత స్థితికి చేరేందుకు ‘ఆధ్యాత్మికత’ ఓ మార్గమైతే.. ఆ దారిలో గ మ్యాన్ని చేరుకోవడానికి ‘యోగా’ కూడా అవసరమే. ‘ఆధ్యాత్మిక ప్రజ్ఞ’ సాధించేందుకు సత్యసంధత, నీతి, నిజాయితీ, ఇంద్రియ నిగ్రహంతో పాటు యోగా, ధ్యానం, ప్రార్థన వంటివి ఎంతగానో సహకరిస్తాయి. వ్యాపారం, ఉద్యోగం, చదువు.. ఎందులో రాణించాలన్నా- చేసే పనిమీదే మనసంతా కేంద్రీకృతం కావాలి. ఏకాగ్రతతో విజయపథంలో పయనించాలంటే యోగా ఓ దిక్సూచిలా పనిచేస్తుంది. అందుకే- ఒత్తిళ్లను జయించే సాధనంగా నేడు దేశవిదేశాల్లో చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. యాంత్రిక జీవనంలో యోగా ఓ దివ్యౌషధంలా పనిచేస్తుందని అనేక అధ్యయనాల్లో తేలడంతో ఇపుడు అందరి దృష్టి దీనిపైనే పడింది.
‘యోగా’ చరిత్ర...
ప్రపంచానికి ‘యోగా’ను పరిచయం చేసిన ఘనత మన దేశానిదే. వేద కాలానికి పూర్వమే ‘యోగా’ భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైంది. వేల సంవత్సరాల క్రితం ఇది మన దేశంలో పుట్టి అనతికాలంలోనే విశ్వవ్యాప్తమైంది. సంస్కృత పదమైన ‘యోగా’కు ‘విజ్ఞానం’ అనే అర్థం ఉందని విజ్ఞులు చెబుతారు. నాలుగు వేదాల్లో ఒకటైన రుగ్వేదంలో యోగాకు సంబంధించిన అంశాలెన్నో కనిపిస్తాయి. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ‘్భగవద్గీత’లోనూ దీని ప్రస్తావన ఉంది. ‘యోగా’ను ఆచరించిన వాడే- కోర్కెలపై మమకారం లేకుండా కర్మలపై దృష్టి కేంద్రీకరించగలడన్నది ‘గీతా’ సారాంశం. ‘యోగా’ అన్నది మతసంబంధమైన అంశం కాదు. శారీరక, మానసిక సమస్యలను జయించి ‘ఆధ్యాత్మిక ప్రజ్ఞ’ సాధించేందుకు ఇది ఓ అద్భుత సాధనం. ఈ స్థితికి చేరుకునేందుకు యోగాలో అనేక పద్ధతులను త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. వ్యాయామం, ధ్యానం, ఆసనాలు, ప్రాణాయామం వంటివి ఇందులో ప్రధానాంశాలు. మూడు రకాల ఆరోగ్యాలను చేకూర్చే శక్తి ఉన్నందునే దీనికి ఇంతటి ప్రాధాన్యం ఏర్పడింది. వ్యాయామం, ఆసనాలతో శారీరక ఆరోగ్యం, ప్రాణాయామంతో మానసిక ఆరోగ్యం, ఏకాగ్రత, ధ్యానంతో ఆధ్యాత్మిక ఆరోగ్యం సిద్ధిస్తాయి. యోగాలో కనిపించే ‘శిక్షణ, క్రమశిక్షణ’ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి.
ఎల్లలు లేనిది..
నిజానికి యోగా ఓ మహా సముద్రం లాంటిది. లోతుకు వెళ్లేకొద్దీ ఇందులో అన్నీ అద్భుతాలే. నేర్చుకున్నకొద్దీ ఇంకా ఎంతో మిగిలే ఉంటుంది. సాధకుడి శరీరంపై, మనసుపై ఇది ఎంతో ప్రభావం చూపుతుంది. యోగ శాస్త్రంలో నిగూఢమైన అంశాలను అవగతం చేసుకుంటే - ఆధునిక జీవితంలో అనేక సమస్యలకు, సవాళ్లకు సమాధానాలు లభిస్తాయి. యోగాకు సంబంధించిన ప్రతి ఫలితాన్ని శాస్ర్తియ దృక్పథంతో విశే్లషించుకుంటే దీనిపై తప్పకుండా నమ్మకం ఏర్పడుతుంది. యోగాను ఆచరిస్తే మనం ఆలోచించే పద్ధతుల్లోనే కాదు, జీవన విధానంలోనూ మార్పును గమనించవచ్చు. మానసిక రుగ్మతలతో పాటు అనేక శారీరక సమస్యలను అధిగమించేందుకు యోగా తోడ్పడుతుందని అనేక అధ్యయనాల్లో తేలింది. వెన్నునొప్పి, ఆస్తమా, కీళ్ల సమస్యలు, ఒత్తిళ్లు, జ్ఞాపకశక్తి మందగించడం వంటి అనేక సమస్యల
నుంచి విముక్తి ప్రసాదించే దివ్యశక్తి యోగాలో ఉందని ఇప్పటికే పలు పరిశోధనలు ఘోషిస్తున్నాయి.
‘ఎనిమిది మెట్ల’తో ఎంతో ఉన్నతికి..
‘యోగా’ అంటే శరీరాన్ని విల్లులా వంచడం, ముద్దలా చేసి మెలికలు తిప్పడం కాదు. ఇలాంటి విద్యలన్నీ సాధారణ వ్యాయామం కింద వస్తాయి. ‘యోగా’కు ఉన్న అర్థం ఎంతో విస్తృతమైనది. యోగా సాధనలో ఎనిమిది సోపానాలు అధిగమిస్తే శారీరక, మానసిక వికాసం పొందవచ్చు. ‘యమ’ ( అహింస, సత్యసంధత, ఇంద్రియ నిగ్రహం వంటివి), ‘నియమ’ ( తపస్సు, దైవ చింతన), ఆసన ( పలు రకాల ఆసనాలు), ప్రాణాయామం (శ్వాసను నియంత్రించడం), ధ్యానం ( ఒక లక్ష్యం మీద మనసు కేంద్రీకరించడం), ప్రత్యాహారం ( బాహ్య సంబంధ విషయాల నుంచి మనసును తప్పించడం), ధారణ ( ఒకే విషయంపై మనసు పెట్టి ఏకాగ్రతతో పనిచేయడం), సమాధి ( సాధనలో అత్యున్నత స్థితి ఇది. దీన్ని చేరాలంటే మిగతా ఏడు మెట్లనూ ఎక్కి రావాలి) ..అనే 8 సోపానాలు యోగాలో కీలకాంశాలుగా పేర్కొంటారు.
యోగా యోధులు..
ప్రపంచ ప్రఖ్యాత యోగా గురువులు ఎవరంటే మనదేశానికి చెందిన ఇద్దరి పేర్లు చెబుతారు ఎవరైనా. ఆ ఇద్దరూ కర్నాటకకు చెందినవారే. మొదటి స్థానం బికెఎస్ అయ్యంగార్‌కే దక్కింది. పతంజలి చెప్పిన యోగాకు ప్రాచుర్యం కల్పించి, తన ఆలోచనల మేరకు చిన్నచిన్న మార్పులు చేసి అందరికీ నేర్పించారు. ప్రత్యేక శిక్షణ సంస్థను నెలకొల్పారు. ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేశారు. మైసూరు సమీపంలోని బెల్లూరులో పుట్టి చిన్నతనంలోనే తన బావ సూచనతో యోగా నేర్చుకున్నారు. జిడ్డు కృష్ణమూర్తివంటి వారితో కలిసి బోధనలు చేశారు. ఈయన చెప్పే యోగాకు ‘అయ్యంగార్ యోగా’గా కీర్తి దక్కింది. 1991లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2014లో పద్మవిభూషణ్ అవార్డులతో భారత ప్ర భుత్వం సత్కరించింది. ఆయన రాసిన పుస్తకాలు ‘లైట్ ఆన్ యోగా’, ‘లైట్ ఆన్ ప్రాణాయామ’, ‘లైట్ ఆన్ ది యోగసూత్ర ఆఫ్ పతంజలి’ వంటివి జనాదరణ పొందాయి. 90 ఏళ్ల వయసులోనూ రోజూ 3 గంటలపాటు యోగా, ఒక గంటపాటు ప్రాణాయామం చేసిన ఆయన 95 ఏళ్ల వయసులో, ఈ ఏడాది ఆగస్టు 20న పరమపదించారు. ప్రఖ్యాత యోగా గురువు రామ్‌దేవ్ బాబా యోగాశైలిని ఆయన విభేదించారు.
పట్ట్భా జాయిస్
ప్రపంచ ప్రఖ్యాత యోగా గురువుల్లో రెండోస్థానం కె.పట్ట్భా జోయిస్‌దే. సంప్రదాయ యోగాకు భిన్నంగా కొన్ని మార్పులు చేసి, జిమ్నాస్టిక్స్ తరహాలో అష్టాంగ విన్యాస యోగను ఆయన సృష్టించి బోధించారు. ఈ రంగంలో పరిశోధన, శిక్షణ కోసం కె.పట్ట్భా జోయిస్ అష్టాంగ యోగా ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభించారు. మైసూరు మహారాజు కృష్ణ రాజేంద్ర వడయారు తీవ్ర అస్వస్థతకు గురైనపుడు ఎవరి చికిత్సా పనిచేయనప్పుడు తన యోగావిద్యతో ఆయనకు సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయడంతో ఇక జోయిస్‌కు తిరుగులేకుండాపోయింది. 1916లో పుట్టిన ఆయన 93 ఏళ్ల వయసులో సహజ మరణం పొందారు. ఆయన రాసిన ‘యోగమాల‘ పుస్తకం అత్యంత ప్రజాదరణ పొందింది.
రామ్‌దేవ్ ప్రచారం..
బాబా రామ్‌దేవ్ ‘యోగా’ సృషికర్త కానప్పటికీ- ఆ విద్యకు నేడు బహుళ ప్రచారం తెచ్చిన వ్యక్తిగా ప్రఖ్యాతి పొందారు. వేల ఏళ్లకు పూర్వమే పతంజలి మహర్షి యోగా సూత్రాలను సంకలనం చేసి అనేక విషయాలను సూత్రీరించారు. ఆ తర్వాతి కాలంలోనూ ఎంతోమంది యోగులు, రుషులు యోగాను జనబాహుళ్యంలోకి తెచ్చారు. జీవనశైలి, దృక్పథం, ప్రవర్తన వంటివి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నది కాదనలేని వాస్తవం. యోగాను జనం భాషలో బోధించడం, ఆరోగ్యానికి అనుసంధానించడంలో బాబా రామ్‌దేవ్ ఇపుడు విభిన్న శైలిలో కృషి చేస్తున్నారు. ఆధునిక జీవితంలో మృగ్యమైపోతున్న ఆరోగ్య భాగ్యాన్ని తిరిగి అందించేందుకు యోగా ఓ అద్భుత సాధనమని ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రాణాయామంలో కొన్ని మార్పులు ప్రవేశపెట్టిన రామ్‌దేవ్ యోగాకు సంబంధించిన అనేక అంశాలపై లోతుగా అధ్యయనం చేశారు. జనం మధ్యకు వెళ్లడమే కాదు, ఆధునిక ప్రసార మాధ్యమాలను ఆయన విస్తృతంగా వినియోగించుకుంటూ దేశవిదేశాల్లో యోగాకు ఒక ‘క్రేజ్’ సంపాదించిపెట్టారు. యోగాకు సంబంధించిన అనేక పుస్తకాలు, వీడియో సీడీలే కాదు, అంతర్జాలాన్ని, టీవీ చానళ్లను ఆయన
సమర్థవంతంగా వాడుకుంటున్నారు. యోగాతో పాటు ఆయుర్వేద వైద్యానికి ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు.
నియంత్రణ, చట్టబద్ధత ఏదీ..?
ఏ వస్తువుకైనా డిమాండ్ పెరిగితే దానికి మార్కెట్ మరింతగా విస్తరిస్తుందనే ఆర్థిక సూత్రం ‘యోగా’కు కూడా వర్తిస్తుంది. అన్ని వర్గాల వారిలో ఆసక్తి రానురానూ పెరగడంతో ‘యోగా’లో మెళకువలు నేర్పేందుకు ఎన్నో సంస్థలు తామరతంపరగా వెలుస్తున్నాయి. యోగా శిక్షకులూ అందుబాటులో ఉంటున్నారు. యోగా తరగతులు నిర్వహిస్తామంటూ ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. రోజూ ఉదయానే్న టీవీ చా నళ్లలో యోగా క్లాసులు ప్రసారం కావడంతో వాటిని చూసేవారే కాదు, నేర్చుకోవాలనుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మరో వైపు- తగినంత అనుభవం, అర్హతలు లేని వారు సైతం ‘యోగా టీచర్ల’ అవతారం ఎత్తుతూ దీన్ని వ్యాపార మయం చేస్తున్నారు. ‘్ఫన్ చేస్తే చాలు.. మీ ఇంటి ముంగిటకు వచ్చి ఆసనాలు, వ్యాయామం నేర్పుతాం..’ అంటూ ప్రచారం చేసుకునేవారూ రంగ ప్రవేశం చేశారు. అయితే, మిగతా చదువులకు ఉన్నట్లు యోగ విద్యకు సంబంధించి ప్రభుత్వం ఆమోదించిన సిలబస్ గానీ, ధ్రువీకరణ పత్రాలు గానీ లేకపోవడంతో మిడిమిడి జ్ఞానంతో ప్రమాదకరమైన ఆసనాలను నేర్పేవారూ పుట్టుకొస్తున్నారు. సరైన రీతిలో యోగాను అభ్యసిస్తే- ఆ పాఠాలు, క్రమశిక్షణ, ఏకాగ్రత, ఉన్నత విలువలు వంటివి జీవితంలో ఎదగడానికి తోడ్పడతాయి. యోగాకు ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని- ఇదో మంచి ఆదాయ మార్గంగా భావించేవారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. విలువైన కాలాన్ని, ధనాన్ని వృథా చేసుకోకుండా సరైన శిక్షకుడి వద్ద తమకు అనువైన పద్ధతుల్లో దీన్ని నేర్చుకోవాలి. శిక్షకులపై అవగాహనతో పాటు ఆచితూచి నిర్ణయం తీసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. అనుభవజ్ఞులను ఆశ్రయిస్తే మనకు అవసరమైన యోగా పద్ధతులను నేర్చుకుని మంచి ఫలితాలను సాధించవచ్చు.
‘పేటెంట్’ దక్కేలా...
యోగా విద్య ఇపుడు మంచి ‘కెరీర్’గానూ రూపొందుతోంది. గనుక ప్రభుత్వమే తగినన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో దీన్ని ఒక కోర్సుగా ప్రవేశ పెట్టేందుకు, నిష్ణాతులైన వారిచే తగిన సిలబస్ రూపొందించేందుకు ప్రయత్నాలు జరగాలి. ఏవో కొన్ని ఆసనాలను నేర్పిన వారు యోగా గురువులు కాలేరు. సుశిక్షితులైన యోగా నిపుణులను తీర్చిదిద్దడానికి పటిష్టమైన వ్యవస్థ ఏర్పడాలి. గుర్తింపు పొందిన శిక్షకులు మాత్రమే యోగా నేర్పేలా ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ ఉండాలి. అపుడు ఈ రంగంలోనూ ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయి. ఈ విద్య మన దేశానికే చెందినందున అంతర్జాతీయ స్థాయిలో ‘యోగా’పై మనకు ‘పేటెంట్’ దక్కేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాల్సి ఉంది. యోగాకు విశ్వవ్యాప్త గుర్తింపు, ఆదరణ లభించడం హర్షణీయమే అయినప్పటికీ.. ఈ విద్యపై చట్టపరంగా సర్వహక్కులూ మన దేశానికే ఉండాలి.

ఆద్యుడు పతంజలి
ఇప్పుడు అందరూ ఆరాధిస్తున్న యోగాకు ఆది గురువు పతంజలి. యోగా భారతదేశంలో పుట్టింది. యోగాను కనుగొన్నది, శాస్తబ్రద్ధం చేసినది ఆయనే. క్రీ.పూ. 200 సంవత్సరంలో ఆయన జీవించారని, శ్రీకృష్ణుని కాలానికి అటూఇటూగా జీవించారని చెబుతున్నప్పటికీ 5వేల ఏళ్లనాటికే పతంజలి యోగాను బోధించాడని అందరూ అంగీకరిస్తున్నమాట. యోగశాస్త్రం, యోగా సూత్రాలను ఆయన రచించారు. పాణిని రాసిన అష్ట్ధ్యాయికి పతంజలి భాష్యం రాశారు.
మనిషి శరీరంలో ఉండే ప్రాణశక్తికి ఉత్తేజం కలిగించడం ద్వారా కుండలినీ శక్తి ఉద్భవిస్తుందని, దానివల్ల మానసిక, శారీరక ఆరోగ్యం, బుద్ధి వికాసం కలుగుతాయని ఆయన భావించారు. అది సాధించడానికి యోగా ఉపకరిస్తుందని సూత్రీకరించారు. 195 యోగా సూత్రాలతో ఓ గ్రంథాన్ని వెలువరించారు. ఈ శాస్త్రాన్ని నాలుగు పాదాలు (సమాధి, సాధన, విభూతి, కైవల్య)గా వర్గీకరిస్తూ 26 తత్వాలు రాశారు. మొత్తంమీద యోగ శాస్త్రాన్ని 8 అంగాలుగా (యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి) వర్గీకరించారు.
ఆహారపు అలవాట్లు, శరీరస్థితి, మానసిక స్థితి, ఏకాగ్రత సాధన, భక్తి, చక్కటి శ్వాస, స్థిరచిత్తం వంటివి సాధించడం ద్వారా అలౌకిక స్థితికి చేర్చేది యోగా. దీనివల్ల నాడీవ్యవస్థ చేతనమై మానసిక, శారీరక, ఆధ్యాత్మికంగా శక్తిసంపన్నులై ఒత్తిడిని తట్టుకోగలిగి, ఆరోగ్యంగా ఉండగలిగేలా మనిషి తీర్చిదిద్దబడతాడని యోగా నిరూపించింది. మనసు, స్పృహ, చైతన్యం యోగాకు కీలకం. పతంజలి చెప్పిన సూత్రాలలో రాజయోగ, హఠయోగ విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాయి.

యోగా డే...ప్రత్యేకత
జూన్ 21 తేదీని ‘అంతర్జాతీయ యోగా డే’గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వినతికి స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ తేదీనే ఎందుకు ‘యోగా డే’గా గుర్తించారో తెలుసా..? సూర్యుడి గమనం ఆధారంగా సంవత్సరంలో అత్యంత సుదీర్ఘమైన పగలు జూన్ 21నే ఉంటుంది. ఆ రోజునే యోగా డేగా గుర్తించాలని మోదీ కోరారు. సెప్టెంబర్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో మోదీ ఈ ప్రతిపాదన చేశారు. ఆ తరువాత కేవలం మూడు నెలల్లో అది అమల్లోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితిలో ఇంతవరకు మరే ప్రతిపాదనా ఇంత తక్కువ వ్యవధిలో కార్యరూపంలోకి రాలేదు. అలాగే ఐక్యరాజ్య సమితి ఏర్పడిన తరువాత మరే తీర్మానానికి యోగా డే తీర్మానానికి దక్కినంత మద్దతు లభించలేదు. ఈ సమితిలో 195 దేశాలుంటే ఇప్పటివరకు 177 దేశాలు యోగా డేను సమర్థించాయి. భద్రతామండలిలోని ఐదు దేశాలూ దీనికి మద్దతు తెలిపాయి. ఐక్యరాజ్య సమితి గుర్తించినందువల్ల ఏటా జూన్ 21న ఆయా దేశాల్లో యోగాపై అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు, వినూత్న కార్యక్రమాలు, పోటీలు సాధికారికంగా నిర్వహిస్తారు.
కరీనా...శిల్పా.. యోగా
శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వ్యాయామంగా యోగాను చెప్పుకోవాలి. మనిషి ఒత్తిడిని తట్టుకుని, శరీరాకృతిని మెరుగుపరుచుకుని, సంయమనంతో ప్రశాంతంగా జీవించడానికి యోగా ఉపయోగపడుతుంది. భారతదేశంలో పుట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న యోగా ఇటీవలి కాలంలో జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోవడానికి సినీతారలు, ఇతర సెలబ్రిటీలు, ప్రసార మాధ్యమాలు కారణం. జనంలో వచ్చిన చైతన్యమూ అందుకు తోడవుతోంది. పతంజలి మహర్షి చెప్పిన యో గాను ఆధునిక యుగానికి తగ్గట్లు మార్పులు చేర్పులు చేసుకుని ఎవరికివారు ప్రత్యేకతలతోకూడిన యోగాను అనుసరిస్తున్నారు. ప్రాణాయామం, యోగాను రోజువారీ కార్యక్రమంగా, క్రమం తప్పకుండా చేస్తూ ఈ రంగంలోనూ రాణించిన సినీతారలు ఎందరో ఉన్నారు.
బాలీవుడ్ తార కరీనాకపూర్‌కు యోగా అంటే ప్రాణం. టీవీ,సినీ వ్యాపార ప్రకటనల్లో తళుక్కున మెరిసే ఈ తార తన సౌందర్య రహస్యమంతా యోగాయే అంటోంది. ఆ మధ్య ఒళ్లు బాగా పెరిగిపోయినప్పుడు జీరోసైజ్ రావడానికి యోగాను ఆమె ఆశ్రయించి సత్ఫలితం సాధించారు. అయితే, సంప్రదాయ యోగాకు బదులు ఆమె ‘పవర్ యోగా’ను పాటిస్తారు. అంటే- ఓ గదిలో 105 డిగ్రీల ఫారన్‌హీట్ వేడి, 40 శాతం తేమతోకూడిన వాతావరణంలో ఆమె రోజూ గంటన్నర పాటు యోగా చేస్తారు. ప్రాణాయామం అందులో భాగమే. ఆరారా ఆహారం, వేడిచేసి చల్లార్చిన మంచినీళ్లు తరచూ తాగడం ఆమె హాబీలు. కరీనా యోగాపై వచ్చిన పుస్తకం ‘ఫ్రమ్ ఎక్సెల్ టు ఎక్సెస్’ మార్కెట్లో హాట్‌కేకుల్లా అమ్ముడుపోయింది.
భారతీయ సెలబ్రిటీల్లో శిలాశెట్టి కూడా యోగాలో ట్రెండ్ సెట్టరే. మెడనొప్పి, స్పాండిలైటిస్, వెన్ను సంబంధిత సమస్యలతో ఆమె ఇబ్బందిపడ్డప్పుడు యోగాను ఆశ్రయించారు. అద్భుతమైన ఫలితాలు సాధించారు. చూడముచ్చటైన శరీరాకృతి, మేని సౌందర్యం ఆమె సొంతమయ్యాయి. ఆమె విడుదల చేసిన ‘శిల్పాస్ యోగా’ అనే పుస్తకం సరికొత్త ట్రెండ్ సృష్టించింది. ప్రతీరోజు కనీసం గంటపాటు ఆమె యోగా చేస్తారు.
ఇక ప్రముఖ నటీమణులు సోనమ్‌కపూర్, లారాదత్తా కూడా యోగా అంటే ఇష్టపడేవారే. వారు చేసిన యోగాకు సంబంధించి డివిడిలు మార్కెట్లో లభిస్తున్నాయ. పిల్లల్ని కన్న తరువాత శరీరం కొన్ని మార్పులకు లోనవుతుందని, వాటినుంచి తేరుకుని మళ్లీ నాజూకుగా తయారవడానికి యోగా తోడ్పడుతుందని అంటారు లారాదత్తా. తొలికాన్పు తరువాత యోగాతో మళ్లీ నాజూకుగా తయారయ్యాయని చెబుతున్నారు. అయితే సోనమ్‌కపూర్ మాత్రం బిక్రమ్ యోగాను అనుసరిస్తారు. ఇక ప్రపంచ ప్రఖ్యాత పాప్ గాయని మడోన్నా అష్టాంగ, హఠ యోగ చేయడంలో దిట్ట. తీవ్రమైన మానసిక ఒత్తిడి నుంచి యోగాతో ఉపశమనం పొందుతున్నట్లు ఆమె చెబుతారు. హాలీవుడ్ ప్రముఖులు మెగారియాన్, జెన్నిఫర్ అనిస్టిన్ సహా లెక్కలేనంతమంది తారలు ఇప్పుడు యోగాకు దాసులయ్యారు.
..................................
‘అనారోగ్యం, పేదరికం..
ఇవే మన దేశంలో
ప్రధాన సమస్యలు. యోగాతో
అనారోగ్యాన్ని, నల్లడబ్బు
వెలికితీతతో పేదరికాన్ని
దూరం చేయవచ్చు.’
- బాబా రామ్‌దేవ్
.................................
మార్చిలో ప్రపంచ యోగా వీక్

ఉత్తరాఖండ్‌లోని రిషీకేష్‌లో ఏటా అంతర్జాతీయ యోగా వారోత్సవాలు నిర్వహిస్తారు. వేలాదిమంది యోగా అభ్యాసకులు, బోధకులు అక్కడికి వస్తారు. వచ్చే ఏడాది మార్చి 1నుండి 7వరకు ఈ వారోత్సవాలను నిర్వహించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. యోగాశిక్షణ, ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, గంగాహారతితో వేడుకలు ముగుస్తాయి. గంగానదీతీరంలో ఉండే ఏకైక యోగా శిక్షణ కేంద్రం ఇక్కడ ఉంది. దీనిని రిషీకేష్ యోగా పీఠ్ నిర్వహిస్తోంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ వారోత్సవాలకు సహకరిస్తోంది.

Tuesday, October 28, 2014

సైబర్ ముప్పు



ఉగ్రవాద చర్యలతో ప్రపంచాన్ని గడగడలాడించిన ఆల్‌ఖైదా మూకలను తేలికపాటి మానవరహిత విమానం 'ద్రోణ్' బెంబేలెత్తించింది. ఒక యాభై వేల రూపాయలు వెచ్చిస్తే- అదే విమానాన్ని 'హ్యాక్' చేసి తమ నియంత్రణలోకి తెచ్చుకుని పెను విధ్వంసానికి పాల్పడవచ్చని కొందరు సైబర్ నిపుణులు నిరూపించారు. గత నెలలో న్యూమెక్సికోలో ప్రయోగాత్మకంగా ఈ పరీక్ష నిర్వహించి వారు విజయం సాధించారు. స్ఫూఫింగ్ అనే ప్రక్రియ ద్వారా ద్రోణ్‌ను తమ అదుపులోకి తెచ్చుకోగలిగారు. అయితే ఇదంతా అమెరికా రక్షణ వ్యవస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రయోగ ప్రక్రియ. అలాంటి సాంకేతిక పరిజ్ఞానం పొరపాటున సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కితే, వారే ఈ నైపుణ్యాన్ని సొంతం చేసుకోగలిగితే? ఆ ఊహే ఇప్పుడు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనలో ముంచెత్తుతోంది!

వ్యక్తిగత స్వేచ్ఛకు ముప్పు
నింగిలో ఎగురుతున్న ద్రోణ్ విమానాన్ని తమ అదుపులోకి తీసుకురాగల పరిజ్ఞానం ఆవిష్కృతమైంది. భవిష్యత్తులో అసాంఘిక శక్తులు ఈ పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రయాణీకుల విమానాన్నో, దాన్ని నియంత్రించే ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ కంప్యూటర్లలోకి చొరబడితే? ఆ నష్టం అనూహ్యం! ఇలా జరగడానికి ఆస్కారం లేదని భరోసా ఇవ్వలేని పరిస్థితులే అంతర్జాతీయ సమాజాన్ని వణికిస్తున్నాయి. గత వారం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కంప్యూటర్లను 'డీఎన్ఎస్ ఛేంజర్' అనే మాల్‌వైర్ స్తంభింపజేసి ప్రకంపనలు సృష్టించింది. దీని తాకిడికి అనేక సంస్థలు తమ సర్వర్లను ముందుజాగ్రత్తగా మూసివేశాయి. ప్రపంచానికి పొంచిఉన్న సైబర్ ముప్పునకు ఈ ఉదాహరణలే ప్రబల నిదర్శనాలు. అంతేకాదు సైబర్ దాడుల ముసుగులో ఇంతకన్నా ప్రమాదకర పరిస్థితి ప్రస్తుతం ప్రపంచం ముంగిట్లో ఉంది. ప్రత్యర్థి దేశాలు రక్షణ రంగంలో ఒకరిపై ఒకరు సైబర్ అస్త్రాలను సంధించుకుంటున్న వైనాన్ని కథలుగా విన్నాం. ఇప్పుడు అనేక దేశాల్లోని సైబర్ నేరస్థుల ముఠాలు ఆన్‌లైన్‌లో కుమ్మకై, వేలకోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాయి. మరోపక్క ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని కొందరు తమకు గిట్టనివారి వ్యక్తిగత జీవితాన్ని రచ్చకీడుస్తున్నారు. ఈ తరహా సైబర్ నేరాల్లో మనరాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఇటీవల జాతీయ నేరాల నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక వెల్లడించడం- ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. సైబర్ దాడులనుంచి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వాలు నానాపాట్లు పడుతున్నాయి. బ్యాంకుల వంటి ఆర్థిక సంస్థలూ తమ ఖజానా సైబర్ ముఠాల బారినపడకుండా ఉండటానికి అష్టకష్టాలు పడుతున్నాయి. ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుకోవడం ఇంచుమించు అసాధ్యంగా మారింది. వెరసి, ప్రస్తుత సమాచార సాంకేతిక యుగంలో మనిషి జీవితం అనిశ్చితికి మారుపేరుగా నిలుస్తోంది.
ఇరాన్‌లోని అణురియాక్టర్లను తన నియంత్రణలోకి తెచ్చుకున్న 'స్టక్స్‌నెట్' ఉదంతం గుర్తుండే ఉంటుంది. ఇరాన్ చేపట్టిన అణుకార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి స్టక్స్‌నెట్‌ను రూపొందించాయి. దీన్ని అణురియాక్టర్లను నియంత్రిస్తున్న కంప్యూటర్ వ్యవస్థలోకి చొప్పించాయి. దాంతో ఆ కంప్యూటర్లు నియంత్రణ కోల్పోయి పనిచేయకుండా ఆగిపోయాయి. అణురియాక్టర్లు నిలిచిపోయాయి. ప్రపంచ దేశాల మధ్య మొదలైన సైబర్ యుద్ధానికి ఈ ఉదంతం ఉదాహరణ. అదే ఊపుతో 'ఫ్లేమ్' పేరుతో సమాచారం తోడివేసే (డేటామైనింగ్) వైరస్‌ను అమెరికా రూపొందించింది. కంప్యూటర్‌లోకి చొరబడిన తరవాత సమస్త సమాచారాన్నీ ఇది తస్కరించి తన యజమానికి చేరవేస్తుంది. కీ బోర్డు మీద టైపుచేసే ప్రతి మాట, కంప్యూటర్లో చూసే ప్రతి పేజీనే కాదు, అక్కడ జరిగే సంభాషణలనూ యజమానికి అందజేస్తుంది. కంప్యూటర్ అనుసంధాన వ్యవస్థల్లోని నిర్దుష్ట సమాచారాన్ని స్కాన్‌చేసి మరీ చోరీ చేస్తుంది. దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధాలు సైబర్ ప్రపంచంలోకి అడుగుపెట్టాయనడానికి ఇదో నిదర్శనం. శత్రుదేశం వెబ్‌సైట్లను హ్యాక్‌చేసి పిచ్చిమాటలతో నింపివేసే ధోరణులు పోయి, కీలక వ్యవస్థలనే నియంత్రణలోకి తెచ్చుకోగలిగే రోజులు వచ్చేశాయి.
ఇరాన్ అణుకార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయిల్ ప్రయత్నిస్తుంటే, మరోవైపు చైనా తన పని తాను నింపాదిగా చేసుకుంటూ పోతోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ స్వయంగా రంగంలోకి దిగి అమెరికాతోపాటు అనేక ఇతర దేశాలనుంచి సున్నితమైన సమాచారాన్ని చోరీ చేస్తోంది. చైనా చేపట్టిన సైబర్‌యుద్ధ తంత్రం తమ భద్రతా వ్యవస్థకు ప్రమాదకరంగా మారిందని అమెరికా ఆందోళన చెందుతోంది. యుద్ధంలాంటి విపత్తు సంభవించినప్పుడు అమెరికా తక్షణమే కార్యాచరణలోకి దిగకుండా నిరోధించగలిగే సామర్థ్యం చైనా సమకూర్చుకుందని ఇటీవల అమెరికా కాంగ్రెస్ సలహా మండలి ఒక నివేదికలో హెచ్చరించింది. దాదాపు అన్ని దేశాలు సైబర్ దాడులనుంచి తప్పించుకునేందుకు భద్రత చర్యలు చేపడుతున్నాయి. సైబర్ ఆయుధాలనూ రూపొందించుకుంటున్నాయి. శాంతికాముక దేశమైన జపాన్ సైతం సైబర్ ఆయుధాల రూపకల్పనకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తన రక్షణకోసం చర్యలు తీసుకునే హక్కు ప్రతి దేశానికీ ఉంది. కాని ప్రత్యర్థి దేశాన్ని ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదు. ప్రత్యర్థి దేశం కంప్యూటర్ల వ్యవస్థలను తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్న ప్రస్తుత ధోరణులు భవిష్యత్తులో ప్రపంచ వినాశనానికి దారి తీయవచ్చు. అణురియాక్లర్లు వాటంతట అవే పేలిపోయేలా, క్షిపణులు హఠాత్తుగా గాలిలోకి ఎగిరేలా వాటి వ్యవస్థలను నియంత్రించే ప్రయత్నాలు- ప్రపంచ భవిష్యత్తుకే పెను ప్రమాద ఘంటిక!
దేశాల మధ్య జరుగుతున్న సైబర్ యుద్ధాన్ని పక్కనపెడితే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సైబర్ ముఠాలు పేట్రేగిపోతున్నాయి. దేశదేశాల్లోని సైబర్ నేరస్థులు ఒక్కటై ముఠాలుగా ఏర్పడుతున్నారు. చోరీ సమాచారాన్ని మార్పిడి చేసుకొంటూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. అమెరికాలోని ఫెడరల్ నేషనల్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనే ఆర్థిక సంస్థనుంచి రెండు రోజుల వ్యవధిలో ఓ ముఠా 130లక్షల డాలర్లు తస్కరించడం అందుకు దాఖలా. వారు బ్యాంకు సర్వర్‌లోకి చొరబడి ఖాతాదారుల డెబిట్ కార్డుల సమాచారాన్ని తస్కరించారు. డెబిట్ కార్డుల ద్వారా డబ్బు తీసుకునే సదుపాయం పరిమితంగా ఉంటుంది. బ్యాంకు సర్వర్‌లోకి చొరబడిన ముఠా ఈ పరిమితిని అపరిమితం చేసింది. అనంతరం డెబిట్‌కార్డుల సమాచారాన్ని గ్రీస్, ఉక్రెయిన్, ఇంగ్లాండ్, రష్యా, స్పెయిన్ దేశాల్లోని సభ్యులకు పంపింది. ఈ సమాచారంతో వారు అక్కడ నకిలీ డెబిట్ కార్డులు సృష్టించారు. ఏటీఎం కేంద్రాల ద్వారా 130లక్షల డాలర్లు తస్కరించగలిగారు. ఇలాంటి నేరాలు నిత్యకృత్యమవుతున్నాయి. ఇందుకు ఆర్థిక సంస్థలూ మినహాయింపు కాదు. పేరొందిన ఆర్థిక సంస్థలు సైతం సైబర్ నేరాల పాల్పడుతున్నాయి. విశ్వసనీయత కోల్పోతామన్న భయంతో ఆయా సంస్థలు తమ నష్టాలను బయటకు చెప్పుకోలేకపోతున్నాయి. దీంతో సైబర్ నేరగాళ్ళు మరింత రెచ్చిపోతున్నారు. ఎనానిమస్, డార్క్‌మేటర్, మాస్టర్ ఆఫ్ డిసెప్షన్స్, షోడోక్రూ వంటి పేర్లతో ఈ ముఠాలు వందల మందిని సభ్యులుగా చేర్చుకొని తమ సాంకేతిక పరిజ్ఞానానికి మరింత పదును పెట్టుకొంటున్నాయి. తస్కరించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ అవలీలగా సీమాంతర నేరాలకు పాల్పడుతున్నారు.
సైబర్ నేరగాళ్లవల్ల వ్యాపార సంస్థలే ఎక్కువగా నష్టపోతున్నాయి. 2011లో అమెరికా సైబర్ నేరగాళ్లు వివిధ సంస్థలకు చెందిన 25వేలకోట్ల డాలర్ల మేథోసంపత్తిని కొల్లగొట్టారని ఆ దేశ రక్షణ సంస్థ 'పెంటగాన్' సైబర్ కమాండ్ అధినేత కీత్ అలగ్జాండర్ వాపోయారు. ప్రముఖ యాంటీ వైరస్ సంస్థ లెక్కల ప్రకారం సైబర్ నేరగాళ్లనుంచి కాచుకోవడానికి అమెరికా సంస్థలు నిరుడు ట్రిలియన్ డాలర్లు ఖర్చుపెడుతున్నాయని తేలింది. 'ఫార్చున్' సంస్థ 500 కంపెనీల్లోని 168 సంస్థలను అధ్యయనం చేసినప్పుడు వాటిలో 162 సంస్థలు హ్యాకింగ్ బారినపడినట్లు తేలింది. దీన్నిబట్టి సైబర్ నేరగాళ్లవల్ల వ్యాపార సంస్థలకు జరుగుతున్న నష్టం ఏపాటిదో అర్థమవుతోంది. గత ఏడాది ప్రఖ్యాత గూగుల్, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్, సోనీ, ఏటీ అండ్ టీ సంస్థలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో నిస్సాన్‌తోపాటు విసా, మాస్టర్‌కార్డ్ సంస్థలూ హ్యాకింగ్ బారినపడ్డాయి. మనదేశం విషయానికి వస్తే, గత ఏడాది సైబర్ నేరాల కారణంగా రూ.35వేలకోట్ల నష్టం సంభవించింది. ఈ తరహా నేరాల విషయంలో మనదేశం ప్రపంచంలో అయిదో స్థానానికి చేరిందని మెకాఫీ నివేదిక తెలిపింది. 2012 మొదటి మూడు నెలల్లో దేశంలోని వంద ప్రభుత్వ వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని కేంద్ర ఐటీ, సమాచార మంత్రిత్వశాఖ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 43.1కోట్లమంది సైబర్ నేరాల బారిన పడితే, అందులో మనదేశంలోనివారు 2.9కోట్లమంది ఉన్నారు. తప్పుడు సమాచారంతో బుట్టలో వేసుకునే స్పామ్ మెయిల్ విషయంలో మనదేశం అమెరికాను మించిపోయి అగ్రస్థానానికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా రోజూ 8,950కోట్ల స్పామ్ మెయిళ్లు బట్వాడా అవుతున్నట్లు తేలింది.
కొత్త వ్యూహాలు జరూరు
జాతీయ నేరాల నమోదు సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం నిరుడు మనరాష్ట్రం మొత్తం మీద ఐటీ చట్టం కింద 349 సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయి. ఈ అంశంలో దేశంలోనే మనది మొదటిస్థానం. గత ఏడాది ఈ కేసుల సంఖ్య కేవలం 105. అరెస్టుల విషయంలోనూ(242మంది) దేశంలో మన రాష్ట్రానిదే ప్రథమ స్థానం. అంతర్జాలంలోని సామాజిక అనుసంధాన వేదిక(సోషల్ నెట్‌వర్క్) పరిచయాల ఆధారంగా మోసాలకు పాల్పడేవారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ముఖ్యంగా మాయమాటలతో యువతులను మోసగించి, వారిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఉదంతాలు రోజూ వెలుగుచూస్తున్నాయి. ఈ విషసంస్కృతి మారుమూల ప్రాంతాలకూ విస్తరించింది. అయినా అనేక ఘటనలు కేసులుగా నమోదు కావడంలేదు.
దేశంలో ఆన్‌లైన్ లావాదేవీల వ్యాపారమూ శరవేగంగా విస్తరిస్తోంది. అయినా సైబర్ నేరాలపట్ల ప్రజలకు ఉన్న అవగాహన బాగా తక్కువ. అందుకే లాటరీ తగిలిందని తప్పుడు మెయిల్ పంపించి పెద్దయెత్తున డబ్బు కొల్లగొట్టే నైజీరియన్ మోసాల సంఖ్య మనదగ్గరే ఎక్కువవుతోంది. రూ.కోట్ల విలువచేసే లాటరీ కలిసిందని చెప్పగానే వెనకాముందు ఆలోచించకుండా అడిగినంత డబ్బు మాయగాళ్ల ఖాతాల్లో డిపాజిట్ చేసేవారి సంఖ్యకూ కొదవలేదు. సైబర్ నేరాలు భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తాయనడంలో సందేహంలేదు. వీటిపట్ల ప్రజలను అప్రమత్తుల్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సైబర్ నేరాలను పసిగట్టి నిందితులను అరెస్టు చేయాలంటే నిఘా వ్యవస్థలను సాంకేతికంగా బలోపేతం చేయాల్సి ఉంది. ఇతర దేశాల మాదిరిగా దేశరక్షణకు సంబంధించి సరికొత్త సైబర్ యుద్ధతంత్ర వ్యూహాలను రచించాలి. అప్పుడే దేశానికి, దేశపౌరులకు సంపూర్ణ భద్రత లభించినట్లు!


Address for Communication

Address card