(కౌటిల్యుడు ఎందుకు అవసరం?నిన్నటి
వ్యాసానికి ముగింపు)
వేర్పాటు
వాదమే లక్ష్యంగా పెట్టుకున్న మన వామ పక్షాలు లేవనెత్తేటువంటి తప్పుడు ప్రశ్నలకు (“కాశ్మీర్ ఇస్తే పాకిస్తాన్‌తో గొడవ
తీరిపోతుంది కద. మనందరం ఒకటే. ఎవరి దగ్గర ఉంటే ఏమిటి?”, “వచ్చిన బంగ్లాదేశీ కాందిశీకులు ఎలాగూ వచ్చారు. పాపం, వాళ్ళకు శాశ్వత పౌరసత్వం ఇస్తే సరిపోతుంది కద?”, “అసలు భారతదేశం ఎప్పుడూ ఒక దేశం
కాదు. ఇదంతా బ్రిటీషువాళ్ళ సృష్టి కాదా?”) సమాధానాలు తెలుసుకోవాలంటే కౌటిల్యుడిని అధ్యయనం చేయడం చాలా అవసరం.
ఎక్కువగా కౌటిల్యుడు అనే పేరు వినగానే అందరికి
కుటిల రాజనీతి అన్న పదాలు స్ఫురిస్తాయి. అయన గురించి తెలుసుకున్న చాల మందికి ఆయన పేరు వినగానే western philosophers లో ‘Machiavelli’ గుర్తుకు వస్తాడు. తద్వారా ‘కౌటిల్యుడు మనకు ఆదర్శం’ అంటే ఇబ్బంది పడతారు.
ఐతే కౌటిల్యుడు (ఈయన చాణక్యుడిగా అందరికి పరిచితం) ఇవేవీ కాడు. ఆయన
ముఖ్యంగా ఒక మహోన్నత జాతీయవాది (nationalist).
దాదాపూ
రెండువేల నాలుగు వందల ఏళ్ళకిందే, కౌటిల్యుడు ప్రజలలో జాతీయ భావం ఎంత అవసరమో గుర్తించాడు.
కౌటిల్యుడు
ముఖ్యంగా ఒక శిక్షకుడు. ఒక గురువు. కాని ఎప్పుడు భారతావని ఆపదలో ఉన్నా ఆయన తన గురుకులాన్ని
వదిలి వచ్చి భారతాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఛేదించాడు. అది దుష్ట నందుల వల్ల ప్రజలు ఇబ్బందుల్లో పడినప్పుడు కానీ, లేదా అలెగ్జాండర్ మన్నల్ని
ముట్టడించినప్పుడు కానీ.
కౌటిల్యుడికి
ఏనాడూ పదవి మీద అధికారం మీద వ్యామోహం లేదు. తన కర్తవ్యం ముగియగానే ఆయన మళ్ళీ తన
ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
ఈ రోజు మనకు
కావల్సింది అలాంటి కౌటిల్యుడే. అధికారం కోసం కాకుండా, దేశ క్షేమం కోసం పోరాడేవాడు. గమ్యం
హర్షణీయం అయినప్పుడు దారిలో వచ్చే ఆటంకాలను సామ దాన భేద దండోపాయలతో నిర్మూలించే వాడు.
భారత దేశం
మళ్ళీ చాలా రోజుల తరువాత ఒక కూడలికి (crossroads) చేరుకుంది. ఈ కూడలి దాటి సుగమమైన మార్గాన పయనించేందుకు, మనందరికి కౌటిల్యుడి శక్తి యుక్తులు కావాలి.
కౌటిల్యుడి
సిద్ధాంతాల గురించి తెలుసుకోవాలనుకునే వారు, ఇంటెర్నెట్‌లో ఎన్నో చోట్ల చూడవచ్చు.
------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment