Wednesday, August 30, 2017

వాడ్ని చంపెయ్యండి ...






వాడే .. బలవంతుడు ...
వాడికి కొనుగోలు శక్తి పెరిగినది
అందుకే ధరలు పెంచాము

వాడే .. బలహీనుడు ..
బతకలేక పోతున్నాడు ...కొనలేకపోతున్నాడు
వాడికి ఏమీ అందకుండా బందు చేస్తున్నాము

‘చుక్క’ లు తాగి ‘లెక్క’ కక్కేది వాడే
రోగాలతో కునారిల్లి ఆస్పత్రికి డబ్బు పోసేదీ వాడే
ఆకలే ఆస్తిగా ‘అందరి’ అంతస్తులు పెంచేదీ వాడే

ఎటు చూసినా జీవశ్చవాలు మద్యం తాగేందుకే బతికి ఉన్నాయి
ఎంత దయగల ప్రభుత్వం
మీకు అన్నం పెట్టేందుకే మీ జేబుకు కన్నం పెడుతున్నారు నీ బాగోగులు చూసేందుకే నిన్ను బ్రష్ట్టు పట్టిస్తున్నారు

చెమట చిందించు రూపాయి సంపాదించు ప్రభుత్వ గల్లా పెట్టెకు అందించు చేరుతావు మృత్యువు అంచు

వాడు పేదోడు ..
మంత్రాంగం నడిపేవారికి మాత్రం పెద్దోడు ..
వాడు రక్తాన్ని చెమటగా మార్చే వాడు

వాడు చెమటను ఖర్చు చేస్తాడు
వీడు దాన్ని రక్తముతో పీల్చి పొదుపు చేస్తాడు
వాడు బతకాలి ... లేదు వాడ్ని చంపెయ్యండి

 
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Tuesday, August 29, 2017

నాయకుడెక్కడినుండి పుడతాడు.?



సమస్యలోంచి,పోరాటంలోంచి, అవసరంలోంచి, త్యాగాలలోంచి, శ్రామికజెన సంద్రంలోంచి ,పేదల కష్టాలు, కన్నీల్లలోంచి ,పదునెక్కిన మేథస్సు తెగింపులోంచి ,విశ్వవిద్యాలయ కర్మాగారాలోంచి,
అడవిలోంచి ,పల్లెలోంచి, ప్రశ్నించె తత్త్వం లోంచి, పరిణతి చెందిన ఆలోచనల్లోంచి ,ప్రసంగం వినో,
పాటలు వినో ,సాహిత్యం చదివో, సంఘటన జరిగో ,అన్యాయం జరిగో ,ఆలోచన పెరిగో.....
ప్రజల ప్రభావితం చేసే ప్రతిభతలోంచి, పుట్టుకు రావాలి నాయకత్వం

అదేందో ఈ దేశంలో  నాయకులకు మళ్ళీ నాయకులు పుడుతున్నారు.కులాలకు పుడుతున్నారు.
డబ్బులోంచి పుట్టుకొస్తున్నారు చెంచా గిరిలోంచి, జోకడంలోంచి ,బానిసత్వం అలవరుచుకుని,దానిలోంచి  డబ్బు ఖర్చుపెట్టి,ప్రజలను మభ్యపెట్టి ,సమస్యల మూలాల గురించి  తెలియకున్నా,మాట్లాడటం రాకున్నా నీతి నిజాయితి లేకున్నా పనికిమాలిన పనులు చేస్తున్నా నాయకులుఅవుతున్నారు.
నాయకత్వానికి అర్హతేంటి ?
నాయకత్వానికి పదవి గీటురాయా? కులం డబ్బు వారసత్వం లేకుండా పుట్టుకు రాకూడదా?
రాజకీయాలలోకి వస్తెనే నాయకుడా? పార్టీలో పని చేస్తేనే నాయకుడా?టువంటి సమాజంలో బతుకుతున్నామో...కళ్ళ ముందు ఏది జరిగినా గతంకన్నా తక్కువే నష్టం జరిగిందని సంతోష పడాలా?..

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Tuesday, August 15, 2017

సియ్యేలు,అడిటర్లు,అకౌంటంట్లుకు ‘మానసిక వత్తిడి’ ఎలా వుందో చూడండి




    సత్యగ్రహాలతో పుట్టిన దేశ రాష్ట్రాలు నిరసన సత్యగ్రహల్తోనే చూపిస్తారు... ఆత్మహత్యలతో పుట్టిన దేశ రాష్ట్రాలలో నిరసన , కోపం అన్నీ ఆత్మహత్యలతోనే చూపిస్తారు...
      ఆత్మహత్య చేసుకోవడం అన్నది ఒక మానసిక రుగ్మతగా నిపుణులు పరిగణిస్తారు. ఒక మనిషి దైర్యాన్ని కోల్పోయినప్పుడు , నిస్సహాయ స్థితిలో ఆసరా దొరకనప్పుడు,ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడినప్పుడు ఒక్కోసారి మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య వైపు ఆలోచిస్తాడు పరీక్ష పాసు కాలేదని ఒకరు, పాసైనా మంచి మార్కులు రాలేదని ఒకరు, వచ్చినా కోరుకున్న కాలేజీలో సీటు దక్కలేదని ఒకరు, వచ్చినా క్యాంపస్‌ ఇంటర్వ్యూలో నచ్చిన కొలువు వరించలేదని ఒకరు, ప్రేమ విఫలమైందని ఒకరు, సఫలమైనా పెళ్లి దాకా వెళ్లలేదని ఒకరు, అప్పుల బాధతో ఒకరు...అనారోగ్యంతో ఒకరు, భర్త పుట్టింటికి పంపలేదని ఒకరు, భార్య టీవీ రిమోట్‌ ఇవ్వలేదని ఒకరు...
     ఇప్పుడీ కోవలోకి సియ్యేలు,అడిటర్లు,అకౌంటంట్లు కూడా జేరే రోజు దగ్గరలో వుందనిపిస్తుంది      .అంటే దీనంతటికీ కారణం ‘మానసిక వత్తిడి’ . మన పొన్నూరులోని ప్రముఖ ఆడిటర్ శ్రీ.P.V.V .ప్రసాద్ గారు ఈ రోజు వాట్సప్ ద్వారా పంపిన ఒక ఆర్టికల్ చదివిన తర్వాత వచ్చిన సరదా(ఒక వేళా సీరియస్ కూడా అవ్వొచ్చేమో)ఆలోచన,ఇక పై వ్రాసేదంతా అయన ఆంగ్లంలో నాకు పంపిందే. ఎక్కువ మందికి అర్ధంకావాలని తెలుగులోకి మార్చి వ్రాస్తున్నా!
సియ్యేలు,అడిటర్లు,అకౌంటంట్లుకు మానసిక వత్తిడి’ ఎలా వుందో చూడండి
Due dates for next 2 months
15th August - Service tax return for Q1
20th August - GSTR 3B for July
5th Sept  - GSTR 1 for July
10th Sept -  GSTR 2 for July
15th Sept - GSTR 3 for July
20th Sept - GSTR 3B for August
20th Sept - GSTR 1 for August
25th Sept - GSTR 2 for August
30th Sept - GSTR 3 for August
30th Sept - GST Tran 1 last date
Other work :-
1.Accounting work
2.Individuals IT Returns
3.Sale tax return Ist Qtr.
4.Sale tax demands and assessment orders
5.Income Tax notice reply
6.New GST Registration
7.Opten Composition scheme last date 16.08.17
8.GST tax payment
9.Download TDS form 16 Ist Qtr
10.Income Tax Audit 30.09.17
And after 30th Sept ROC returns, TDS/TCS returns & IT returns  fillings .....
వీరికి పర్సనల్ జీవితాలు ఉండవా? అన్ని లావాదేవీలని జాగ్రత్తగా పరిశీలించే సమయం ప్రభుత్వం ఇస్తుందా? మరెందుకు దీనిలో క్వాలిటీ కావాలని కోరుకోరు ? ప్రభుత్వానికి హృదయపూర్వక విన్నపము ఏమిటంటే,వీరు కుడా మనుషులే యంత్రాలు కాదు.సహాయం,కనీసం సానుభూతి అయినా చూపించండి
 క్లయింట్లకు సేవ చేయటం అంటే దేశానికి సేవ చేయటమే కదా?
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

GSTR-3B దాఖలు చేయటానికి డబ్బులున్నాయా....లేకపొతే రెడీ చేసుకోండి



        జూన్ నెలలో మీకు ఇన్పుట్ టాక్స్ ఎక్సెస్ బాలన్సు ఉందా.అయినా సరే మీరు జూలై నెలలో GSTR-3B లో దానిని కలపకుండా బాలన్స్ అఫ్ టాక్సు చూసుకోవాలి.చెల్లించ వలసి వస్తే ముందు చెల్లించి తర్వాతా రిటన్ ఫైల్ చేయాలి.
మరి మన గత నిల్వ టాక్సు ఏమవుతుంది.కొంత కాలం ప్రభుత్వం వాడుకుంటుంది.ఎందుకలా?
ఇది ప్రభుత్వ సాంకేతిక లోపం కారణంగా ప్రస్తుతం కుదరట్లేదు
ఎందుకంటే...వివరంగా
     గతంలో నిల్వ ఉన్న టాక్సు యధాతధంగా కొత్త చట్టంలోకి మారట్లేదు.దానికి ఒక ప్రాసెస్స్ TRAN-1 అనే ఫారం సమర్పించాలి ,ఎవరయినా ఇప్పటికే ఒక వేళా దాన్ని దాఖలు చేసివుంటే వారికి మాత్రమే ఈ నెలలోనే ఇన్పుట్ క్లైము చేసుకుని GSTR-3B దాఖలు చేయటానికి అవకాశంగా వుంది .లేకపొతే అది దాకలు చేసేంతవరకు దాన్ని మర్చిపోవటమే
మరి వెంటనే దాకలు చేయాలనిపిస్తుందా.అసలు మెలిక ఇక్కడేవుంది
       ప్రభుత్వం మెదట సెలవిచ్చినట్లు మధ్య ఆగస్టులో ఆ ఫారాన్ని విడుదల చేస్తామనిచెప్పారు.కానీ ఇంతవరకు విడుదల చేయలేదు.మరెలా  ...దీనర్ధం మీ డబ్బు ఒక నెల అడ్వాన్సు గా వారివద్ద ఉంచుకోవటానికి ఓ మార్గం
           ఎలా అంటారా ఈ నెల 20 వ తేదీ లోపు  GSTR-3B సమర్పించాలి,20 లోపు TRAN-1 వస్తుందా రాదా  మీలో ఎవరు కోటీశ్వరుడు  వ్యాఖ్యాత చిరంజీవి నడుగుదామా....అడుగుదామంటే చాలావున్నాయి ఉదాహరణకు ఆల్రెడీ VAT చట్టంలో వుండి కొత్త చట్టంలోకి మారాలనుకొంటే మీకు GST వచ్చిన దగ్గరనుంచి 90 రోజులు (3 నెలలు) గడువుఇచ్చారు.కానీ ఇప్పుడు 40 రోజులకే GSTR-3B
వేయక పొతే పెనాల్టీ అంటున్నారు .ఎలా సాధ్యం?
         GST ప్రారంభంలో మీకు టెన్షన్ పడవద్దు మీకు 2 నెలలు వెసులుబాటు ఇస్తున్నాం అర్ధం చేసుకోవటానికి అని హామీ ఇచ్చారు.కానీ నెల గడిచి 10 రోజులయినా అయ్యిందో లేదో కళ్ళముందు ఆగిపోయిన టాక్సు లెక్కలు కనబడే సరికి పాత లెక్కనే కొత్తగా ఫారం పుట్టుకొచ్చింది..ఇలా మరికొన్నివిశేషాలు ఉన్నాయి

     ఇందులో నీతి:
     ప్రభుత్వం తనకు రావాల్సిన దాన్ని ఎలాగయినా వసూలు చేసుకుంటుంది.మీకు రావాల్సింది వారికి దయగలిగినప్పుడు ఇస్తారు.వారు హామీ ఇచ్చారనో,గడువిచ్చారానో నింపాదిగా వున్నారంటే ఇక అంతే సంగతులు

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card