అభివృద్ధిని భిన్నకోణాలతో చూడవచ్చు.
మానవుని కనీసావసరాలు తీరటం ఒక ప్రధాన కోణం అతని స్వేచ్ఛ మరో ప్రధాన కోణం.
మిశ్రమ
ఆర్ధికవ్యవస్థ నెహ్రూ ప్రభుత్వం చేపట్టటంతో మన అభివృద్ధి ప్రస్థానం మొదలయింది. ఈనాటి అసలు సమస్య ఉత్పత్తి
కాదు పంపిణీ. ప్రభుత్వం పెట్టే ఖర్చు సామాన్యుడికి చేరటంలేదు. 1990 లో విధ్వంసకర అభివృద్ధికి పునాది ఏర్పడింది. దిగువ వర్గాల
కనీసావసరాలు తీరటంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఉపాధి కల్పన పధకాలు 1970ల నుంచి ప్రముఖపాత్ర వహించాయి-.
. పేదరిక ప్రమాణం మార్చటం ద్వారా ప్రభుత్వలెక్కలు పేదరికం తగ్గినట్లు చూపుతున్నాయి. “రాబర్ట్ రెడ్ ఫీల్డ్” అనే ఆర్ధిక శాస్త్రవేత్త విశ్లేషణ ప్రకారం ఇది ద్వంద్వ అబివృద్ధి. రూపాయ
డిప్రిసియేషన్ ప్రభుత్వాన్ని నిస్పృహకి గురిచేస్తోంది
. విద్య సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. అది సేవారంగానికి అవసరమైన
నైపుణ్యాలు పెంచింది.
పారిశ్రామిక అభివృద్ది మొత్తం అబివృద్ధిలో ప్రదానమయింది - సాంకేతిక
అభివృద్ధి ఫలాలు అందరికీ చేరటంలేదు -బేసిక్ అవసరాలు తీరితే సరిపోదు. వైద్యంలో
అందరికీ సమాన అవకాశాలు లభించాయని రాజీవ్ ఆరోగ్య పధకం చూపించి అంటున్నారు. అది ఎటువంటి సమానత్వమో
అందరికీ తెలుసు.
విద్యావకాశాలు అందరికీ
లభించాయనుకోటం సరికాదు ఎకనామిక్ నీడ్స్ మాత్రమే చూడటం వల్లనే రష్యాలో ఆర్ధిక వ్యవస్థ విఫలమయింది.
అభివృద్ధి నమూనాలో మన దేశానికి స్పష్టత లేదు. రాజ్యాంగం మనది
సోషలిస్టు రిపబ్లిక్ అంటుంది. ఆదేశ సూత్రాలు అందుకు భిన్నంగా ఉంటాయి.
----- ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment