Tuesday, October 31, 2017

సంకల్పం



            చాలా రోజుల తరువాత నాకు ‘యండమూరి’ గారు గుర్తుకు వచ్చారు. ఆయన గురించి ఎందుకు చెప్పాలనిపించింది అంటే రక రకాల subjects ని తెలుగు పాఠకుల దగ్గరికి తీసుకు వచ్చారు. ఆయన నవల "థ్రిల్లర్" .మీలో కొంతమంది అయినా చదివివుంటారు.  అందులో absurdity తీసుకుని రాసారు.
           నాకు వృత్తి రీత్యా ఖాళీ దొరకక చదవడం తగ్గించాను.ఆయన ఈమధ్య  వ్రాసినవి  ఏమీ చదవలేదు కూడా.  అప్పట్లో ఒక interview లో మీరు అసలు మీరు ఇన్ని successful నవలలు  ఎలా వ్రాస్తారు  అని అడిగితె  correct wording గుర్తులేదు కానీ, "నేను  వ్రాసేదానితో నా పాఠకులు వాళ్ళని వాళ్ళు identify చేసుకుంటే అది సక్సెస్ ఫుల్ నవల వ్రాసినట్టే - చదివిన వాళ్ళు తమని తాము ఎంతలా ఆ నవల తాలూకు క్యారెక్టర్ కి దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తే అంత  ప్రభావితం అయ్యి నట్టు " అని అన్నారు.
అలా ప్రభావితం అయిన వాళ్ళలో నేనూ ఒకడిని –
        నేను ఇప్పుడు చెప్పబోయేది కూడా అయన పుస్తకాలలో వుండే వుంటుంది. కానీ నాకు అనిపించింది వ్రాస్తాను. ప్రతీ వాడికి జీవితంలో ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత clarity of  thought  వచ్చినా,  ఎంత పోరాడినా అవకాశాలు రావచ్చు, రాక పోనూ వచ్చు. కానీ ఎవడి జీవితానికి వాడే రాజు. తనలో తనకి నమ్మకం పోయినవాడు -వాడు ఓడిపోయినవాడు.
అసలు గెలవటం అంటే ఏమిటి.
ఒక రిక్షా వాడి కొడుక్కి auto కొనుక్కోడం టార్గెట్ అయితే,  వాడికి అది వస్తే చాలు తృప్తి/ గెలుపు. ఒక clerk కొడుక్కి manager post వస్తే చాలు అనుకుంటే అది వాడికి దొరికి పొతే ఒక తృప్తి/ గెలుపు .ఒక అంబాని కొడుక్కి, ఒక మల్టీ నేషనల్ తో ఢీ కొని  ఒక deal close చేస్తే ఒక తృప్తి/ గెలుపు .ఒక నిజమైన గురువుకి వాడి శిష్యుడు సాధిస్తే తృప్తి/ గెలుపు .ఇప్పుడు ఒక రిక్షా వాడి కొడుకు మల్టీ నేషనల్ deal close చెయ్యాలంటే - చెయ్యొచ్చు - -కానీ దానికి కావలిసిన శిక్షణ , ఆ పరిస్థితికి చేరుకోవడానికి కావలిసిన ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ఒక పట్టుదల, దానికి తగ్గ వాతావరణం ఉంటే ఆ పరిస్థితికి చేరొచ్చు. ఎన్నో కారణాల వాళ్ల చేరలేకపోనూ వచ్చు. కానీ ఈ ప్రయత్నం వాడిని ఆటో డ్రైవర్ కంటే better position లోనే నిలబెడుతుంది.
         పూర్వం మనవాళ్ళు "ఉద్యోగం పురుష లక్షణం అన్నారు"  - ఉద్యోగం అంటే జీతమొచ్చే పని అని కాదు - - ఉద్యోగం అంటే ప్రయత్నం.
        Shiv Khera అని ఒకాయన ‘You can win అని ఇంగ్లీషులో ఒక పుస్తకం వ్రాసాడు. అందులో ఆయన ఏమన్నాడంటే   ముందు నీ జీవితానికి నువ్వు ఏమీ కావాలని అనుకుంటావో అది define చెయ్యి  - తరువాత దాని కోసం ప్రయత్నం చెయ్యి - ప్రయత్నం అంటే రోజూ పగటి కలలు కనడం కాదు. ఒక పేపర్ మీద వ్రాయి ఎలా సాధించాలి అనుకుంటున్నావో  స్టెప్ బై స్టెప్. దాని మంచి చెడ్డలు నువ్వు చేస్తున్నప్పుడు తెలుస్తాయి. అనుగుణంగా నీ పద్ధతి  improvise చేసుకుంటూ వెళ్ళు - fail అవ్వడమనే ఛాన్స్ లేదు.
       ఇది ఫుల్ ప్రూఫ్ అని నాకు అనిపించింది. కానీ ఎక్కడైనా ఆగిపోతే? - solution తెలియకపోతే  ఏమిటని ?- -అసలు  solution లేని సమస్య లేదు ఈ ప్రపంచంలో  - అది ఆ క్షణానికి మన తెలివికి అందక పోవచ్చు - కానీ ఆలోచిస్తూ, ప్రయత్నిస్తూ పొతే, ఖచ్చితంగా దొరుకుతుంది. అంత solution వెతికేంత తెలివితేటలూ లేకపోతే - ఈ జీవిత కాలం లో చేరుకోలేకపోతే ఇంతకు ముందు నేనన్నట్టు  దాని కోసం నువ్వు చేసే ప్రయత్నం వృధా పోదు - ఎంతో కొంత అనుభవాన్ని, జ్ఞ్యానాన్ని ఇస్తుంది. అది ఇంకెవరికైనా ఉపయోగ పడుతుంది.
                 పూర్వం మనవాళ్ళు దేవుడికి ‘ సంకల్పం’ చెప్పమనే వారు. సంకల్పం అంటే నువ్వు ఏది కోరుకుంటూ ఉన్నావో   దానిని ఒక clarity తో గట్టిగా అనుకోవడం.
        సంకల్పం అంటే గుర్తుకు వచ్చింది నాకు "కొమరం పులి" సినిమా. మంచి concept -  డైరెక్టర్ పాపం ఏదో తీసాడు - -కానీ పవన్ కల్యాణ్- సీన్ కి రెండు సార్లు ‘సంకల్పం’ ‘సంకల్పం’ అని అరిచాడు - డైరెక్టర్ సరిగ్గా సంకల్పించుకోలేదు ఏది తీద్దామని  - అక్కడ కొట్టింది దెబ్బ
                      సరే ఇంక విషయానికి వద్దాం.  అసంతృప్తి ఎప్పుడూ ఉంటుంది, నువ్వు కావాలనుకున్నది నీకు దొరక్కపోతే. నువ్వేమి కావాలనుకుంటున్నావో   అది నీకు తెలియకపోతే.
                   అసలు ముందు నువ్వు నీకు ఏమి కావాలో తెలుసుకోవాలి. ‘సద్గురువు’ అన్నవాడు నీకు ఇదే చెప్తాడు. ప్రతివాడికి Jackie chan లాగ fighting abilities , లేదా రాహుల్ గాంధీ లాగ ఒక political legacy , లేదా Prince Charles లాగ ఒక royal back ground etc .,  ఉండకపోవచ్చు.
                  జీవితం సుఖంగా ఉండాలంటే నేను అనుకునే దేమిటంటే నీకు ఉన్నదేమిటో గుర్తించి, కావలసిందేమిటో గుర్తెరిగి, చెయ్యాల్సినదేదో చేస్తూ, ఆటుకి- పోటుకీ వెరవక  - అనుకున్నది సాధించడానికి  ప్రయత్నిస్తూ, జరగపోతే క్రుంగిపోక - నీలో ఉన్న నీతో- సత్సంబంధాలు పెంచుకుంటూ - నీ చుట్టు పక్కల వాతావరణం అధ్యయనం చేస్తూ, సమత్వం పొందుతూ - సమాజ హితానికి నువ్వు చెయ్యగలిగేదేమైనా ఉంటే అది చేస్తూ - నువ్వు సంతోషంగా ఉండి - -నీ చుట్టుపక్కల సంతోషాన్ని కలుగ చేస్తూ బ్రతికేయ్యడమే. జీవితానికి అర్ధం పరమార్ధం కూడా అదే.
Then You are the Hero
                హిందూ వేదాంతం లో  ఇది మన వాళ్లెప్పుడో చెప్పారు -చదవడానికి తీరిక, అర్ధం చేసుకోవడానికి ఓపిక, అనుసరించడానికి ధైర్యం కావాలి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Friday, October 13, 2017

సొంతింటి కల.. నిజమయ్యేలా...


                సొంతిల్లు.. ఇది ప్రతి ఒక్కరి కల. దీన్ని నిజం చేసుకోవడానికి గృహరుణంతో బాటలు వేసుకునేవారే చాలామంది కనిపిస్తారు. పురుషులే ఈ రుణాలు తీసుకోవాలన్న భావన పాతది.. డబ్బును సమర్థంగా నిర్వహించే మహిళలూ ఇప్పుడు గృహరుణాలతో తమ సొంతింటి కలను తీర్చుకుంటున్నారు. వీరిని ప్రోత్సహించేందుకు బ్యాంకులు, రుణ సంస్థలూ ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. మహిళలకు గృహరుణం తీసుకునేందుకు ఉన్న మార్గాలేమిటి? ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? తెలుసుకుందాం..
              బ్యాంకు ఖాతా, రుణం తీసుకోవడం, ఇంకా ఇతర ఆర్థిక సంబంధిత విషయాలేమైనా కావచ్చు.. బ్యాంకులు, రుణ సంస్థలు మహిళలను ముఖ్యమైన ఖాతాదారులుగా భావిస్తాయి. అందుకే, వారికి ప్రత్యేక వెసులుబాట్లు కూడా కల్పిస్తుంటాయి. అంతర్జాతీయంగా చూసినప్పుడు పురుషులకన్నా.. మహిళల రుణగ్రహీతల సగటు 3.7శాతం తక్కువేనని ఓ నివేదిక చెబుతోంది. క్రెడిట్‌ స్కోరు, రుణ చరిత్ర నివేదిక, వాయిదాల చెల్లింపులులాంటి వాటిల్లో పురుషులకన్నా మహిళలే మెరుగ్గా ఉన్నట్లు తేలింది. దీన్నిబట్టి, మగవారితో పోలిస్తే.. డబ్బు నిర్వహణ, అప్పులు తదితర వాటిల్లో మహిళలు ఎంతో ముందున్నట్లు తెలుసుకోవచ్చు. అంతేకాదు.. అత్యవసరాలకోసం పొదుపు చేయడం, అవసరమైనప్పుడు ఆర్థిక సలహాదార్లను సంప్రదించడంలోనూ నేటి మహిళలదే పైచేయి.
         ఈ నేపథ్యంలో మహిళలు ప్రాథమిక దరఖాస్తుదారులుగా, లేదా సహదరఖాస్తుదారులుగా ఉండి గృహరుణం తీసుకొంటే కాస్త తక్కువ వడ్డీ రేటు వర్తిస్తుంది. తాము తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించే విషయంలో మహిళలు చాలా నిబద్ధతతో ఉంటారన్న కారణం ఇక్కడ కీలకంగా మారుతుంది. అందుకే, బ్యాంకులు కూడా వారికి తమ వంతు ప్రోత్సాహాన్ని వడ్డీ రాయితీ రూపంలో అందిస్తుంటాయి. అయితే, రుణానికి దరఖాస్తు చేసుకునేప్పుడు మహిళలు తప్పనిసరిగా గమనించాల్సిన కొన్ని విషయాలున్నాయి.


పత్రాలు చూసుకోండి..

గృహరుణానికి దరఖాస్తు చేయాలనుకున్నప్పుడు.. మీరు ముందుగా దానికి సంబంధించిన దరఖాస్తును ఎలాంటి తప్పుల్లేకుండా పూర్తి చేయాలి. దీనికి అనుబంధంగా వ్యక్తిగత, చిరునామా, వయసు ధ్రువీకరణ పత్రాల్లాంటివి సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారు ఉద్యోగి అయితే.. ఆమె తన ఆదాయ ధ్రువీకరణ కోసం రెండేళ్ల ఫారం-16, ఆదాయపు పన్ను సమర్పించిన రుజువులు, మూడు నుంచి ఆరు నెలల వేతన వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ స్వయం ఉపాధి పొందుతుంటే.. గత రెండేళ్ల బ్యాలెన్స్‌ షీట్‌, లాభనష్టాల పట్టికతోపాటు బ్యాంకు ఖాతా వివరాలను కూడా జత చేయాల్సి ఉంటుంది. రుణ సంస్థలు కొన్ని అదనపు పత్రాలను కూడా అడిగేందుకు అవకాశం ఉంది.
          ప్రస్తుతం పలు సంస్థలు గృహరుణం కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తున్నాయి. ఇక్కడ అవసరమైన పత్రాలన్నింటినీ డిజిటల్‌ రూపంలో అప్‌లోడ్‌ చేయాలి. వీటిని పరిశీలించిన రుణ సంస్థలు ఎంత మేరకు రుణం రావచ్చనే విషయాన్ని తెలియజేస్తాయి. దీన్ని బట్టి మీరు ఇంటిని వెతుక్కోవడం సులభం అవుతుంది. మీరు ఇంటిని నిర్ణయించుకున్న తర్వాత ఆ ఆస్తికి సంబంధించిన పత్రాలను రుణ సంస్థ ప్రతినిధికి అందిస్తే సరిపోతుంది. రుణం ఇచ్చేముందు సంబంధిత సంస్థలు ఈ పత్రాలను క్షుణ్నంగా పరిశీలిస్తాయి. ఆ తర్వాతే రుణం మంజూరు చేస్తాయి.
* సాధారణంగా దరఖాస్తు చేసిన 10-12రోజుల్లో గృహరుణం మంజూరవుతుంది. అయితే, సమర్పించిన పత్రాల్లో ఏదైనా వ్యత్యాసం ఉంటే.. అదనంగా మరికొంత వ్యవధి పట్టొచ్చు.


సహదరఖాస్తు కావాలనుకుంటే..

        మహిళలు గృహరుణం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు తన జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, పిల్లలను సహదరఖాస్తుగా పేర్కొనవచ్చు. ఉమ్మడి వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడు లేదా ఉమ్మడిగా కలిసి ఉంటున్నప్పుడు అన్నదమ్ములను కూడా సహదరఖాస్తుగా పేర్కొనేందుకు వీలుంది. తక్కువ ఆదాయం ఉన్నప్పుడు కొన్నిసార్లు అనుకున్న మొత్తంలో రుణం రాకపోయే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఉమ్మడి రుణం కోసం దరఖాస్తు చేయవచ్చు. వివాహం అయిన మహిళలు భర్తతో కలిపి లేదా రక్త సంబంధీకులతో కలిపి ఉమ్మడి రుణానికి దరఖాస్తు చేయవచ్చు. అప్పుడు రుణ మొత్తం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సహ రుణగ్రహీత ఆస్తిలో కూడా సహ యజమానిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఇద్దరికీ పన్ను మినహాయింపులు వర్తిస్తాయి.

ఎలాంటి బాకీలు లేకుండా...

       ముందే అనుకున్నట్లు రుణ చెల్లింపుల్లో మహిళలు ఎలాంటి పొరపాట్లకూ తావీయరనే చెప్పొచ్చు. అయినప్పటికీ.. మీరు తీసుకున్న రుణాలకు సంబంధించి, అన్ని వివరాలనూ మీకు అందుబాటులో ఉంచుకోండి. అధీకృత క్రెడిట్‌ బ్యూరో నుంచి ఎప్పటికప్పుడు రుణ నివేదిక, క్రెడిట్‌ స్కోరును తెలుసుకోండి. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపులో ఆలస్యం, వ్యక్తిగత, గృహరుణ వాయిదాలను సమయానికి చెల్లించకపోవడం ఇవన్నీ కూడా రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోరు మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. సరైన క్రెడిట్‌ స్కోరు ఉన్నప్పుడు కావాల్సిన రుణాలు వేగంగా పొందేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు వడ్డీల్లో కూడా రాయితీ పొందే అవకాశం కలుగుతుంది
.
ప్రత్యేక పథకాలు..

          మహిళల కోసం ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వం కూడా కొన్ని ప్రత్యేక పథకాలను ప్రవేశ పెట్టింది. భారత ప్రభుత్వం ‘అందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా మహిళల పేర్లమీదే సంబంధిత ఇళ్లను కేటాయిస్తోంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పేర్లమీద ఇళ్లు కొన్నప్పుడు స్టాంపు డ్యూటీలోనూ రాయితీనిస్తున్నాయి. గృహరుణం తీసుకొని ఇల్లు కొన్నప్పుడు, చెల్లించే వడ్డీకి ఆదాయపు పన్ను మినహాయింపు వర్తిస్తుందన్నది తెలిసిందే.                             
    దంపతులిద్దరూ కలిసి, గృహరుణంతో ఇల్లు కొన్నప్పుడు.. ఇద్దరూ కూడా వారి వారి వాటాల మేరకు ఈ మినహాయింపు పొందేందుకు అవకాశం ఉంది.
సాధారణంగా మన దేశంలో తక్కువ మంది మహిళల పేరు మీద ఇళ్లు ఉన్నాయి. మహిళల ఆర్థిక స్వేచ్ఛకు ఇది ఇబ్బందికరమైన అంశమే. ఈ పరిస్థితిని మార్చేందుకు అటు ప్రభుత్వంతోపాటు, ఇటు ఆర్థిక రుణ సంస్థలూ ప్రయత్నం చేస్తున్నాయి. దీనికోసం ప్రత్యేక రాయితీలు, పథకాలను అందిస్తున్నాయి. ఈ అవకాశాన్ని అందుకొని, గృహ యజమానులుగా మారాల్సిన తరుణమిదే.


ఏ వడ్డీ ఎంచుకోవాలి..

        గృహరుణ వడ్డీ రేట్లు రెండు రకాలుగా ఉంటాయి. స్థిర, చలన విధానంలో వీటిని తీసుకోవచ్చు. స్థిర వడ్డీ విధానాన్ని ఎంచుకున్నప్పుడు ఎంత చెల్లించాలి.. ఎన్నాళ్ల వరకూ చెల్లించాలి అనే విషయంలో కొంత స్పష్టత ఉంటుంది. తొలినాళ్లలో రుణానికి చెల్లించే నెలసరి వాయిదాల్లో అధిక భాగం వడ్డీ కిందే జమ అవుతుంది. కొంత మేరకే అసలులో తగ్గుతుంది. కాలం గడుస్తున్న కొద్దీ వడ్డీ భాగం తగ్గి, అసలు మొత్తం తగ్గుతూ వస్తుంది. చలన వడ్డీ రేట్లతో పోలిస్తే.. ఫిక్స్‌డ్‌ రుణాల వడ్డీ రేట్లు కాస్త అధికంగానే ఉంటాయి. అంతేకాకుండా.. వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పుడు ఆ ప్రయోజనం అందకపోవచ్చు.
         చలన వడ్డీకి రుణం తీసుకున్నప్పుడు మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా.. ఈ వడ్డీ రేటులో హెచ్చుతగ్గులుంటాయి. బేస్‌, ఎంసీఎల్‌ఆర్‌ రేట్లతో ఇది ముడిపడి ఉంటుంది. ఇవి దీర్ఘకాలంలో తగ్గుతూ..పెరుగుతూ ఉంటాయి. స్థిర వడ్డీ రేటుతో పోలిస్తే.. చలన వడ్డీ రేటుతో ప్రయోజనాలు ఎక్కువే. అందుకే, చాలామంది ఈ విధానంలో రుణం తీసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తారు. ఈ రుణాలకు ఎలాంటి ముందస్తు చెల్లింపు రుసుములు కూడా ఉండవు.


           - రవీంద్ర రావు, సీఈఓ, గృహశక్తి, ఫుల్లర్టన్‌ ఇండియా హోం ఫైనాన్స్‌
 

ఇది మీరు ఇంతకుముందు విని ఉండవచ్చు అయినా మరోసారి వినవచ్చు




http మరియు https మధ్య తేడా ఏమిటి?
మీరు చాలామంది ఈ తేడా గురించి తెలుసుకోని ఉండవచ్చు, కానీ ఇది ఇంకా తెలుసుకోని వారి కోసం ....
భారతదేశంలో 32 లక్షల డెబిట్ కార్డులు మోసాల బారిన పడ్డాయి. మిమ్మల్ని సురక్షితంగా ఉంచడం గురించి
 http: // మరియు https: // ల మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే
http
అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ( Hyper Text Transfer Protocol)
S అంటే (పెద్ద ఆశ్చర్యం) "సెక్యూర్" కొరకు ఉంటుంది. మీరు ఒక వెబ్సైట్ లేదా వెబ్ పేజీ, సందర్శిస్తే వెబ్ బ్రౌజర్ లో చిరునామా చూడండి, అది బహుశా ఇలా ప్రారంభమవుతుంది: http: /// అంటే వెబ్సైట్ మీ బ్రౌజరుతో మాట్లాడటం అని అర్థం .సాధారణ అసురక్షిత భాష. ఇంకొక మాటలో చెప్పాలంటే, మీ, మీ కంప్యూటర్ సంభాషణలు మరో వెబ్సైట్తో "వినడం" ఎవరకైనా సాధ్యమవుతుంది. మీరు వెబ్సైట్లో ఒక ఫారమ్ను పూరించినట్లయితే, ఆ సైట్కు మీరు పంపే సమాచారాన్ని ఎవరైనా చూడవచ్చు. ఇలాంటి వాటిల్లో  ఎప్పుడైనా మీ క్రెడిట్ కార్డ్ నంబర్ను మీరు ఎక్కడా నమోదు చేయకూడదు
అలా
వెబ్సైట్ http తో కాకుండా వెబ్ అడ్రసు https  తో కానీ ప్రారంభిస్తే మీ కంప్యూటర్లో ఒక్క వెబ్సైట్తో మాత్రమె  మాట్లాడుతున్నారని అర్థం .సురక్షిత కోడ్. ఇంకెవరో వినలేరు చూడలేరు
ఇది చాలా ముఖ్యమైనది, అవునా?      
ఏదయినా వెబ్సైట్  మీ క్రెడిట్ / డెబిట్ కార్డును నమోదు చేయమని అడుగుతే మీరు వెంటనే అడ్రస్ బార్ వైపు చూడాలి, https: // తో ప్రారంభం అవక పొతే  ఎట్టి పరిస్తిలోను సున్నితమైన( sensitive ) వివరాలు   నమోదు చేయ కూడదు   
       ఏదైనా వెబ్ సైట్ యొక్క పేరును తనిఖీ చేస్తున్నప్పుడు, first look డొమైన్ పొడిగింపు కోసం చూడండి (.com లేదా .org, .co.in, .net మొదలైనవి). దానికి కొద్దిగా ముందు వెబ్సైట్ లేదా డొమైన్ పేరు వుండాలి. ఉదాహరణకి , http://amazon.diwali-festivals.com, డాట్  కాం కి  ముందు పదం " diwali-festivals " (NOT "అమెజాన్"). కాబట్టి, ఈ వెబ్పేజీ amazon.com కు సంబంధించినది కాదు, కానీ " diwali-festivals.com" కు చెందినది.
మీరు బ్యాంకుల పేరుతొ జరిగే మోసం కూడా ఇదే విధంగా తనిఖీ చేయవచ్చు.
మీ ebanking  లో login  అయ్యే ముందుగానే ".com" అనే పేరుకు ముందు మీ బ్యాంకు పేరు ఉందా లేదా అని నిర్ధారించుకోండి. "Something.icicibank.com" -icici చెందినది, కానీ’ “ icicibank. Something.com  “ బ్యాంకు కు చెందినది  కాదు "some1else".కు చెందినది
  ఆన్లయిన్ మోసాల బారిన పడకుండా కొంతమంది అయినా జాగ్రత్త పడాలని.....ఆశిస్తూ

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Friday, October 06, 2017

ఇదేం సోషియాలజీరా నాయనా? చచ్చిపోతున్నాను


             యూట్యూబ్‌లో వీడియో చూస్తుండగా.. వాట్సాప్‌ మెసేజ్‌ టోన్‌.. వెంటనే ట్విటర్‌లో కూత.. మరుక్షణంలో ఫేస్‌బుక్‌ నోటిఫికేషన్‌.. ఇవి చాలవన్నట్టు స్కైపీలో కాల్‌.. సోషల్‌ మీడియా స్మార్ట్‌ అయ్యాక చాలామందికి ఇలా అష్టావధానం చేయక తప్పట్లేదు. కానీ మల్టిపుల్‌ సోషల్‌ మీడియా యాక్టివిటీ్‌సతో మల్టిపుల్‌ కష్టాలు తప్పేట్టు లేదు. లిప్తపాటులో సామాజిక మాధ్యమాలన్నీ చుట్టేయడం అలవాటైతే.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం ఖాయం
       GST,IT ఇతరా పని వత్తిడివల్ల ఈ మధ్య సోషల్ మీడియా కి కొద్దిగా దూరంగా ఉన్నా లంచ్ బ్రేక్ లో  అక్కడే ఉన్న నాక్లయింటు ,బాల్య స్నేహితుని ఫోన్లో వాట్సాప్ చూస్తూ “ఏరా వాట్సప్ చూడటానికి టైము వుండటం లేదా అని అడిగా” .అంతే ఇలా విసుక్కున్నాడు ‘‘ఎలా చావనురా? ఇదుగో చూడు; అక్షరాలా ఏడు వేల మెసేజీలున్నాయి;. మొత్తం మెమరీ అంతా మట్టిగొట్టుకుపోతున్నది; ఫోన్ స్లో; డిలిట్ చేస్తూ కూర్చోవటానికే టైమ్ లేదు, ఇక వాటిని చదివేంత ఓపిక, సమయం ఎక్కడుందిరా;? ఎవడో గ్రూపులో జాయిన్ చేస్తాడు, లెఫ్ట్ అని కొడదామని అనుకుంటే, అదీ అందులో కనిపించి దొబ్బేస్తుంది; వాడు ఫీలవుతాడు; వెంటనే ఫీలై ఫోన్ చేసి చెడామడా ఆడేసుకుంటాడు; ఎవడేమనుకుంటాడో ఏమో; ఈ ఫీలింగ్ తో అన్ని గ్రూపులూ భరిస్తున్నాను; పోనీ, ఈ అడ్డమైన స్మార్ట్ భీకర ఫోన్ వదిలించుకుందామంటే, మా ఆఫీసరు గ్రూపు, మా కొలీగ్స్ గ్రూపు, మా కులపోళ్ల గ్రూపు, మా అపార్ట్ మెంట్ గ్రూపు, మా మందు దోస్తుల గ్రూపు అన్నీ ఇందులోనే;. ఏంబే;? వాట్సప్ లో లేవా? తీసేస్తావా? అంటూ కస్సుమంటున్నారు; చివరకు ముఖ్యమైన సమాచారం ఏదో పెడతాడు, మా ఆఫీసర్; ఏదో తొక్కలో మెసేజీ, వేలల్లో అదొక్కటి అనుకుని ఊరుకుంటానా? ఫోన్ చేసి తిట్టేస్తున్నాడు; యూ నాన్సెన్స్ ఫెలో, సోషల్ గా ఉండటం తెలియదా? అంటున్నాడు; ఇదేం సోషియాలజీరా నాయనా? చచ్చిపోతున్నాను         
         నాదో దరిద్రపు ఫోన్, డిలిట్ చేయాలంటే ఒక్కొక్కటీ సెలక్ట్ చేసి మరీ డిలిట్ కొట్టాల్సి వస్తున్నది;. మొన్న రాత్రి కూర్చున్నాను, పొద్దున్న నాలుగు గంటలకు గానీ తెమల్లేదు; తెల్లారి ఆఫీసు డుమ్మా;. కాస్త కాఫీ తాగి సేద తీరానో లేదో, మరో రెండొందల మెసేజీలు; జాతికి పట్టిన వైరసురా ఇది;? వీడియోలు, ఫోటోలు, నా ఖర్మరా నా ఖర్మ;. హాయిగా ఏ నోకియా పాత మోడల్ ఫోన్ కొనేస్తానూ అనుకుంటే, ఫోన్ నంబర్లన్నీ మెయిల్ తో లింకై ఉండిపోయాయి;
        ఇక ఇలా కాదని, మొన్న ఓ డాక్టరు దగ్గరికి పోయాను, కాస్త ఏదైనా నాలుగు టాబ్లెట్లు ఇస్తాడేమో, ఈ తలతిక్క వాట్సప్ బాధల నుంచి రిలీప్ కోసం అనుకున్నాను; వెళ్లాక ఏముంది? తనూ మెసేజీలు డిలిట్ చేస్తూ బిజీగా ఉన్నాడు.సరే అని ఇక్కడ నువ్వూ ఇంతే ,ఇప్పుడు ప్రపంచం అందరికి రిలీఫ్ కావాలనుకొంటా
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Address for Communication

Address card