Sunday, January 29, 2017

కాలం మారిపోయింది గురూ!..అదే మాకాలంలో అయితేనా?..ఇలా ఉండేదా?



                      హాలీవుడ్ దర్శకుడొకరు ఒక పరిస్ధితిని ఊహించి ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజిమెన్అని సినిమా తీశాడు (నిన్న రాత్రే టీవీ లో చూసాను). అందులో హీరో ముసలోడిగా పుట్టి పసివాడిగా చనిపోయినట్లు చూపిస్తాడు. ఆయన అది ఊహించి తీసిన సినిమా. అది చూసి ఏ రయినా అదెలాగ ఉంటుందో చూద్దామను కుంటే సాధ్యమేనా? వ్యవస్ధ శాశ్వతమని భావించడం అలాంటిదే. వ్యవస్ధలో సమస్యలు, వైరుధ్యాలన్నీ పరిష్కారం అయ్యేంతవరకూ అది ముందుకు పోతూ ఉంటుంది. ఆ గమనంలో కొన్ని సార్లు వెనకడుగులుండవచ్చు, మానవ సమాజం గనక. కాని అవి తాత్కాలికమే.
           మనం ధరించే ఫ్యాంట్ ఎన్ని రూపాలు మార్చుకుందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం! 1970 ల ప్రారంభ కాలంలో పురుషులు ధరించిన ఫ్యాంట్ బాగా narrow గా ఉండేది. కాలికి అంటుకు పోయినట్లుండేది. ఫ్యాంట్ విడవాలంటే ఎవరైనా కింద కూర్చుని చివర్ల పట్టుకుని లాగవలసి ఉండేది. కొన్నాళ్ళకి అది అసౌకర్యంగా తోచింది. కిందినుండి తేలికగా విడవడానికి వీలు కలిగేటట్లుగా రూపం మార్చుకుని బెల్ బాటమ్ అయింది. 70 ల దశాబ్దం రెండో అర్ధభాగానికి వచ్చేసరికి ఈ బెల్ బాటం విస్తృతంగా వాడకంలోకి వచ్చింది. కానీ అది కూడా అసౌకర్యంగా మారింది. వెడల్పైన బెల్ బాటం నేలమీదికి రాసుకుని చినిగిపోయి అసహ్యంగా ఉండేవి. మళ్ళీ narrow వైపుకి మార్పు జరిగింది. ఈ సారి అంతకుముందరి narrow కాకుండా మరికొంత సౌకర్యవంతంగా మారింది. పైన లూజుగా, కిందికి వచ్చేసరికి పాదాలలో సగం వరకు ఉండేలా మారింది. అంటే పాత నేరో లోని అసౌకర్యాన్ని తొలగించుకుని బెల్ బాటంగా మారిన సౌకర్యాన్ని నిలుపుకుంది. కానీ అదీ తర్వాత అసౌకర్యంగా మారి మొత్తం లూజుగా ఉండేలా పార్లల్ వచ్చింది. అది గొట్టం ఫ్యాంటులా ఉండేసరికి అది కొద్ది కాలం మాత్రమే మనగలిగింది. ఇప్పుడది పార్లల్ బ్యాగీగా స్ధిరపడింది. పైనుండి కిందివరకూ ఏ స్ధానంలో ఎంత లూజు ఉండాలో అంతే ఉండేలా దర్జీలు ఫ్యాంటులు కుడుతున్నారు. ఈ పయనానికి ఎవరు మార్గదర్శకం? ఎవరిది పధకరచన? ఏ ఒక్కరిదీ కాదు. వస్త్రధారణకి ఒక వ్యవస్ధ మనకి తెలియకుండానే ఏర్పడిపోయింది. అది comfortability వైపుగా రూపం మార్చుకుంటూ వచ్చింది. సౌకర్యవంతంగా ఉండేలా రూపం మార్చుకుంటూ వచ్చింది. ఏ వ్యవస్ధకి సంబంధించిన పరిణామ క్రమాన్నైనా చూడండి మనకొక క్రమం కనిపిస్తుంది. అది సౌకర్యవంత మైన స్ధితికి దారితీస్తూ ఉంటుంది. మన హెయిర్ స్టైల్ కూడా ఇలాగే మారుతూ వచ్చిన క్రమాన్ని మనం గమనించవచ్చు.
మానవ సమాజం కూడా అంతే. సౌకర్యవంతమైన వ్యవస్ధ స్ధిరపడేదాకా వ్యవస్ధ మారుతూ ఉంటుంది. మానవ సమాజానికి సౌకర్యవంతమైనది ఏమిటి? వైరుధ్యాలు లేకపోవడమే సౌకర్యవంతం. పేద, ధనిక వ్యత్యాసాలు, పాలకుడు పాలితుదు వ్యత్యాసాలు, పట్టణం గ్రామం వ్యత్యాసాలు, శారీరక శ్రమకూ, మేధో శ్రమకీ వ్యత్యాసాలూ, మతం, కులం, ప్రాంతం, ఇలా సమస్త వ్యత్యాసాలు పరిష్కరించబడే వరకూ సమాజం మారుతూనె ఉంటుంది.
ధామస్ ఎడిసన్ బల్బు కనిపిడితే అమెరికా వాడు విదేశీయుడు కనిపెట్టాడని వాడడం మానేస్తున్నామా? శాస్త్ర బద్ద ఆవిష్కరణ ఎవరు చేసిన ప్రపంచం అంతా దానిని వినియోగిస్తుంది.
         హోళీ పండగరోజే రంగులు చల్లడానికి జనం పరిచయం లేకపోయినా అనుమతిస్తారు. కాని రోజు వచ్చి నేనీరోజు హోళీ జరుపుకుంటున్నా, రంగులు జల్లుతా అంటే జనం నాలుగిచ్చుకుంటారు. అంటే సామాజిక నియమాలకు ఒకరి ఇష్టాఇస్టాలతో నిమిత్తం లేదు. అవి జరిగిపోతుంటాయి. అయితే మనిషి చేయగల పని ఏమిటి? ఆ నియమాలను కనుగొని, పరిణామాలు ముందుకు సాగే క్రమంలో వాటిని వేగవంతం చేయడానికి తగిన చర్యలను మనిషి తీసుకోగలడు. ఏమిటా చర్యలు? విప్లవ సిద్ధికి ఒక వ్యవస్ధను ఏర్పరుచుకుని అందుకోసం కృషి చేయడం. ఆ కృషే కమ్యూనిస్టు పార్టీల ఏర్పాటు. ఆందోళనలు, ప్రజల సమీకరణ, వారి సహకారంతో సామాజిక మార్పుకు కృషి చేయడం. చేయకపోతే? ఆ పరిస్ధితి ఉండదు. మనిషి చేస్తాడు. ఎంతటి నిరాశామయ పరిస్ధితిలోనయినా మనిషి ప్రయత్నిస్తూనే ఉంటాడు. లేకుంటే సౌకర్యవంతమైన స్ధితి రాదు.
ఇప్పటి సామాజిక మార్పులు ఒక జీవిత కాలంలో సాద్యం కాకపోవచ్చు. ఇపుడున్నవారు తమ కృషితాము చేస్తే తరువాతివారు అక్కడినుండి కృషిని అందుకుంటారు. ప్రజలు పూనుకోవడానికి కొన్ని సామాజిక పరిస్ధితులు కూడ అవసరమే. కాని స్వీయాత్మక పరిస్ధితులు సిద్ధంగా లేవు. అంటే మార్పుని తలపెట్టాల్సిన వర్గం ఐక్యంగా లేదు.. ఎప్పుడన్నదే సమస్య తప్ప వస్తుందాలేదా అన్నది సమస్య కాదు.
చివరిగా చెప్పేది మానవ స్వభావం అనేది తనంతట తానే ఎక్కడా ఉండదు. మనిషి చుట్టూ ఉన్న సామాజిక పరిస్ధితుల భావాలు మనిషి జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుపై ప్రతిబింబించినప్పుడు పుట్టేవే భావాలు. సమాజం నుండి పుట్టే భావాలు సామాజిక సూత్రాలకు అతీతంగా ఉంటాయనడం సరైంది కాదు. రాముడి కాలంలో పుష్పక విమానం అంటే ఆర్టిస్టులు ఎలా గీస్తారు? బోయింగ్ విమానం బొమ్మని గీయరు. నాలుగు స్తంభాలు గల మందిరం గీసి రెక్కలు తొడుగుతారు. రాముడి కాలానికి మనిషి ఊహించగల విమానం అదే. గాల్లొ ఎగిరేవాటికి రెక్కలుండాలి. రాజులు ప్రయాణించేది కనుక రాజమందిరం ఊహించి దానికి రెక్కలు తొడిగారు. మనిషి మెదడుకి తమ చుట్టూ ఉన్న పరిస్ధితులకు అతీతంగా ఊహలు, భావాలు సాధ్యం కాదని చెప్పడానికి ఇది. అలాగే ఒక మనిషి ఇస్టా ఇష్టాలు, అతని భావాలు, ఊహలు, ఆశలు అన్నీ సమాజ పరిదులకి లోబడే ఉండాలి ఉంటాయి కూడా. మనిషి భౌతిక పరిస్ధితికి అతీతంగా అతని ఊహలు, భావాలు ఉంటాయని భావిస్తే చాలా శాస్త్రాలని తిరగరాయాల్సి ఉంటుంది.
అందువలన మనిషి స్వభావం ఊహాతీతంగా, సామాజిక నియామలకు అతీతంతా ఉండదని గ్రహించాలి. అది గ్రహించాక ఇతర అనుమానాలన్నీ దూదిపింజల్లా తేలిపోవలసిందే. ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Saturday, January 28, 2017

కొంతమందిది ‘మందు’ చూపు -మరి కొంతమందిది ‘ముందు’ చూపు



             నేను ఇంతకు ముందు media గురించిన చర్చలో power లో ఉన్నవాడు తనకు అనుకూలంగా వాడుకునే సాధనం అన్నాను. ఒక తరం నించి ఇంకో తరానికి చరిత్రని pass చేసే సాధనం కూడా media నే. ఈ మాధ్యమం ఉపయోగించుకుని పాలకవర్గం, గెలిచిన పక్షం ఎప్పుడూ వాళ్ళని వాళ్ళు elevate చేసుకునే విధంగా ప్రచారం జరుగుతుంది. అసలు నిజం చరిత్రలో శిధిలమైపోతుంది. ఈ నిజం కూడా ఎవడికి అర్ధమైనంతవరకు వాడికి తెలిసిందే నిజం. 


      గత చరిత్రని ఏమార్చటం (history Duping)  గురించి చాలా సార్లు చెప్పాను. ఇంకోసారి మాట్లాడుకునే ముందు current affairs in Andhra గురించి ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా ఆస్తులు కూడబెట్టడాని arrest చేశారు. కానీ సాక్షి tv చూస్తే అతనంత ఉత్తముడు, ధీరోదాత్తుడు ఇంకోడు కనపడడు. అదే tv లో ysr- గాంధీ తరువాత గాంధీ అంతటి వాడు. విజయమ్మ గారిని అడిగితే ఆవిడ బిడ్డ అంత అమాయకుడు ఇంకెవరూ లేరని, జగన్ ని అకారణంగా arrest చేశారని ఆవిడ ఆవేదన. అలాగే etv ,ఆంధ్రజ్యోతి చూస్తే అతనంత దారుణమైన మనిషి కనపడడు.ఒకో చానల్ ఒక్కొక్కరిని లేదా నచ్చిన వారిని  ఆకాశానికి ఎత్తేస్తుంది.నచ్చని వాళ్ళని దూషిస్తుంది. ysr గురించి చంద్రబాబు ని , చంద్రబాబు గురించి కాంగ్రెస్ నేతలనీ, వీళ్ళిద్దరి గురించి bjp ని, వాళ్ళ గురించి communists ని అడిగితే , ఎవడి version వాడికి ఉంటుంది. నిజమేంటంటే అందరూ ఎవరి స్వలాభం వాళ్ళు చూసుకుంటున్నారు. విచిత్రంగా జనాలు అలవాటు పడిపోయారు. ఎదోఒక చానల్ని నమ్మేవాడు అదే నిజమనుకుంటాడు వాదిస్తాడు. పైనే చెప్పా ఎవడికి అర్ధమైనంతవరకు వాడికి తెలిసిందే నిజం అంటాడని . history Duping అంటే ఇదే.

             మా హైస్కూల్ సోషల్ మాస్టర్ గాంధీగారిని తిట్టేవారు. ఆయన ఉద్దేశ్యం ప్రకారం గాంధీ వల్లే పాకిస్తాన్ వేరు పడిందని, స్వతంత్రం రావడానికి గాంధీ సత్యాగ్రహం కారణం కాదని, English వాళ్ళు ప్రపంచయుధ్ధం లో వారి దేశాన్ని వాళ్ళే కాపాడుకోవటానికి కష్టపడాల్సి వచ్చిందని, అప్పుడు భారతదేశాన్ని పరిపాలించడానికి కష్టమై వదిలి వెళ్లిపోయారని, అప్పటి వరకు వారు తయారు చేసిన Indian regiments ని కూడా యుధ్ధం లో వాడుకోవాల్సి వచ్చిందని ఇలా రకరకాలుగా చెప్పేవారు. ఆయన చెప్పేవరకు 9th std వరకు నాకు గాంధీ జాతిపిత. ఆయన వలనే స్వతంత్రం వచ్చింది. గాంధీ మహాత్ముడు. ఆయన చెప్పింది విని చరిత్రని వేరే కోణం లోంచి చూడొచ్చు అని తెలుసుకున్నాను. ‘ఇంటర్’ ఆఖర్లో అనుకుంటా నేను చెలం ‘మ్యూజింగ్స్’ చదివే వరకు నాకు గాంధీ గురించి ఆయన చెప్పిన అభిప్రాయం లోనే ఉండేవాడిని. నేను confuse అయ్యాను. ఎందుకంటే చెలం ప్రకారం గాంధీ మహాత్ముడు. మా మాస్టర్ గారి ప్రకారం పనికి రాని వాడు. ఆ confusion లో డిగ్రీ అయిపోయిన చాలా రోజుల తర్వాత నేను గాంధీ గారు వ్రాసిన ఆత్మకధ "My experiments with truth" చదివాను. చెలం చెప్పింది నిజమనిపించింది. కానీ నేను చదివిన చరిత్ర పుస్తకాల inference తో నాకు అనిపించింది ఏంటంటే 1915 నించి 1947 వరకు జరిగిన independence struggle లో రకరకాల situations లో ఆయన handle చేసిన తీరు ఆయన గొప్ప individual, గొప్ప leader అని prove చేస్తాయి కానీ మంచి administrator కాదన్న విషయాన్ని చెప్పకనే చెబుతాయి.ఆ రోజుల్లో నాకున్న నా ఆవేశానికి సుభాష్ చంద్ర బొస్ correct అనిపించాడు. స్వతంత్రం అన్నది ఎవడో ఇస్తే తీసుకునేది కాదు, యుధ్ధం చేసైనా గెలిచి సంపాదించాలనే concept correct అనిపించింది. గాంధీ గారి మాటలతో బొస్ గారు కూడా ఆగడం, గాంధీగారు almost నెహ్రూగారు చెప్పింది చెయ్యడం, నెహ్రూగారి political handling sequences, ఆయన అనుయాయులు ఆయన విధానాల్ని దెబ్బతీసిన తీరు,ఖిలాఫత్ అని ముస్లిములు ఆయనకి దూరమైన తీరునవఖలీ లో హిందూల మీద జరిగిన అత్యాచారానికి ఆయన స్పందించిన తీరు, partition time లో ముస్లిం లీగ్ జిన్నా, Poona pact time లో అంబేద్కర్ అతని team blackmail చేసి commitments తీసుకున్న తీరు, power కోసం నెహ్రూగారు చేసిన విన్యాసాలు,  ఇలాటివన్నీ చదివిన తరువాత అప్పుడు తిరిగి మళ్ళీ కొంత మా మాస్టర్ గారి మాటలకి justification దొరికినట్టు అనిపించింది. తర్వాత కారా  మాస్టరు గారు వ్రాసిన కుట్ర కథ చదివి history కి ఇంకో angle తెలుసుకున్నాను. ఇందులో history duping ఎంటయ్యా నువ్వు కూడా ఎక్కడో చదివి తెలుసుకున్నదే కదా అంటే, వెతుక్కుని ఎవడేవడో వ్రాసినవన్నీ చదివి కొంత ఊహించి, కొంత క్రోడీకరించి అర్ధం చేసుకుని ఓహో ఇదా అనుకోవడం తప్పిస్తే అసలేం జరిగిందో ఎవడికి తెలుసు. Result అర్ధం అవుతుంది కానీ ఏ situation నించి ఈ result వచ్చిందో ఎలా తెలుస్తుంది.
                 టోటల్ గా చెప్పేదేమిటంటే ఏ కాలం అయినా నాయకుల స్టేట్మెంట్లన్ని  వాస్తవాలుకాదు. చరిత్ర పేరుతొ చెప్పెలేక్కలన్ని నిజాలు కావు.ఎవరి వ్యక్తిగత కారణాలు వారికున్నాయి. ఏ ఉద్యమం అయినా ,ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడే ఎందుకు మొదలు  అని ఆలోచించటం మొదలు పెడితే చాలు!.....  ఎగిరిన తేనెటీగ ల్లో ఒకటయిన కుట్టక పోతుందా.. ఏ కారణం లేకుండా ప్రజలు కూడా వారిని గుడ్డిగా అనుసరించే రోజులు పోయినయ్.   కొంతమందిది ‘మందు’ చూపు -మరి కొంతమందిది ‘ముందు’ చూపు-అవసరం మనీ తోనో -వలపు కామిని తోనో – ఎదో సినిమాలో ‘బాబూమోహన్’  చెప్పినట్లుగా  ‘ఎక్కడ,ఏమిటి,ఎందుకు,ఎలా......
.అని ప్రయత్నిచారంటే  చాలు  ...చరిత్ర కొత్తగా.. వర్తమానం విచిత్రంగా. మీకు మీరే శత్రువుగా. జ్ఞానిగా, ఓ నిరుత్సాహం.ఓ నిట్టూర్పు. ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Friday, January 27, 2017

కొంతమంది వలసలు తో ఏర్పడిన అమెరికా అగ్ర రాజ్యం ఎలా అయింది- అనాదిగా వున్నా బారతదేశం ఎందుకు కాలేకపోయింది?.



                      "ఒక దేశంలో ఆర్ధిక పరిస్థితులపై , అక్కడి తెలివైన self -centred  స్వార్ధపరుల్ని ఎగదోసి, వాళ్ళ గుప్పిట్లో పెట్టించి – ఆ దేశ ప్రజల డబ్బులని banks లో పెట్టించి (మోడీ demonetisation  దీనికి పరాకాష్ట )- ఆ banks ని  మళ్ళీ తమ గుప్పిట్లో పెట్టుకుని -అక్కడ government ని ఈ స్వార్ధపరు ల గుప్పిట్లోకి తోసి -ప్రపంచ బ్యాంక్లు పెట్టి ఆ దేశం అభివృద్ధికి???? ధన సాయం చేస్తున్నట్లు నటిస్తూ -అప్పులకి వడ్డీలు లాగుతూ  - government ని  ఇరికించి -ఇంకో రకంగా డబ్బులిచ్చి ఆ దేశాలలో మారణాయుధాలు అమ్మి, bombs పెట్టి మారణకాండలు జరిపి, కబ్జాలు చేసి  ఒక అశాంతిని రేపి   - అక్కడ ప్రజల అశాంతిని డబ్బులతో ప్రవహించే ఈ మతాల మార్పిడిలో కూరుకు  పోయేలా చేసి - మత గురువులని  - ఆ మతం యొక్క ఆలయాలని ముందే డబ్బులతో కొనేసి -  మత మౌడ్యం తలకెక్కిన తరువాత , ప్రజల సాయంతో government ని control చేస్తూ - government సాయం తో ప్రజలని control చేస్తూ, వీళ్ళిద్దరి సాయం తో స్వార్ధపరుల్ని control చేస్తూ - -wonderful power play "
                     అన్ని దేశాల ప్రభుత్వాలు తమ ప్రజల వ్యాపార లావాదేవీల కోసం కొన్ని రూల్స్ చట్టాలు సులువుగా(అందరికీ అర్ధం అయ్యే విధంగా,అన్యాయం జరక్కుండా ,ఉపయోగపడేవిధంగా ప్రామాణిక business rools ) ఉండేవిధంగా తయారుచేశాయి. ఇంత సులువుగా ఉంటే మరి ఇన్ని అనర్ధాలు ఇంత పేదరికం ఎక్కడినించి పుడుతున్నాయి? జవాబు ఏంటంటే అవి బాగానే పని చేస్తాయి మనిషిలో స్వార్ధం పెచ్చు మీరనంతవరకు. స్వార్ధం పెచ్చు మీరినప్పుడు దాని ఫలశ్రుతి దరిద్రం, పేదరికం. ఇంతకుముందు ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యం, ఒక దేశం మీద ఇంకో దేశం యుధ్ధం చేసి గెలిచేవి,ఇప్పుడు పరిస్థితులలో అంత అవసరం లేదు. చదరంగం ఆటలో మనం రాజుని చంపము. కట్టడి చేస్తాము. అలాగే వేరే దేశం తాలూకు ఆర్ధిక పరిస్థితులని control చేస్తే ఆ దేశం automatic గా ఈ దేశం తాలూకు grip లో పడి ఉంటుంది. అదన్నమాట. ఇంతకు ముందు నేను చెప్పిన power play
                           America గురించి చాలామంది లాగే నాకు ఆసక్తి గా ,అద్భుతంగా,ఆచ్చర్యంగా వుండేది ఒకప్పుడు....,John.F. Kennedy quotation " Don't ask what your country can do for you, but see what you can do for your country" అనేది నా favourite quotes లో ఒకటి. Pre-Columbian, Colonization era ల గురించి మాట్లాడను కానీ ఆ తరువాత వాళ్ళు super power కింద ఎదిగిన విధానం నాకు ఆశ్చర్యం కలిగించేది, American history గురించి ఒకప్పుడు నాకు చాలా గొప్ప అభిప్రాయం ఉండేది John Perkins వ్రాసిన "Confessions of an Economic hit man" అన్న పుస్తకం చదివే వరకు
                Confessions of Economic hit man  పుస్తకంలో  స్థూలంగా చెప్పేది  పైన చెప్పిన self centered స్వార్ధపరుల్ని handle చెయ్యడంలో Economic hit man పాత్ర ఏంటనే. మిగతావి మనం general observation తో కొంచం common sense ఉపయోగిస్తే తేలుతుంది. ఈ రకమైన tactics వాడి అగ్రరాజ్యాలు చిన్న దేశాలని, ఎదుగుతున్న దేశాలని నాశనం చేస్తున్నాయి. మరి ఈ చిన్న దేశాలలో ఉన్న ఆ self centred స్వార్ధపరుల్ని ఆపేదెలా? మళ్ళీ ఒక శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు,మధ్వాచార్యుడు, గౌతమ బుధ్ధుడు పుట్టి ధర్మ సంస్థాపన చెయ్యాలి. మనిషికి తోటి మనుషుల మీద దయ, కారుణ్యం పెరిగేలా చెయ్యాలి. ఇది ఇప్పట్లో జరిగేలా కనపడటం లేదు. ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681  

Address for Communication

Address card