Monday, April 30, 2018

ఇది అన్ని రకాల ప్రొఫెషనల్స్ కి అంకితం




పికాసో స్పెయిన్లో జన్మించిన చాలా ప్రముఖ చిత్రకారుడు. అతని చిత్రాలు బిలియన్ ,మిలియన్ల డాలర్ల చొప్పున ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడయ్యాయి ... !!

ఒక రోజు పికాస్సో , పడుకుని ఉన్నపుడు ,  యాదృచ్ఛికంగా ఒక మహిళ  ఆ మార్గం ద్వారా నడుస్తు అతనిని గమనించి, వారి దగ్గరకు వచ్చి, 'సర్, నేను మీకు పెద్ద అభిమాని. నేను మీ చిత్రాలను చాలా ఇష్టపడ్డాను. మీరు నాకు ఒక పెయింటింగ్ వేస్తారా? !! అని అడిగింది.
పికాస్సో నవ్వాడు., 'నేను ఇక్కడ ఖాళీ చేతులు తో ఉన్నాను. నావద్ద ఏమీ లేదు. నేను మళ్ళీ ఎప్పుడయినా పెయింటింగ్ చేస్తాను ..

కానీ ఆ స్త్రీ కూడా మొండిగా, 'నాకు ఇప్పుడే పెయింటింగ్ ఇవ్వండి, నేను మళ్ళీ నిన్ను కలవబోతున్నానో లేదో నాకు తెలియదు.'అంది
పికాసో జేబులో నుండి ఒక చిన్న కాగితాన్ని తీసి, పెన్నుతో దానిపై ఏదో ఒకదాన్ని ప్రారంభించాడు. 10 నిమిషాల్లోనే, పికాసో ఒక పెయింటింగ్ చేసి, ' తీసుకోండి, ఇది ఒక మిలియన్ డాలర్ల చిత్రలేఖనం.'అన్నాడు
Pablo Picasso – Algerian women (Delacroix) (detail), 1955

పికాసో ఇంత  త్వరగా కేవలం 10 నిమిషాల్లో పెయింటింగ్ వేయడం మహిళకు వింతగా అనిపించింది . ఒక మిలియన్ డాలర్ చిత్రలేఖనం  అని చెప్పాడు. నమ్మలేకపోయినా చేసేదిలేక ఆ పెయింటింగ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది .. !!
ఆమె పికాస్సో ని పిచ్హివాడు అనుకుంది. ఆమె మార్కెట్కి వెళ్లి ఆ పెయింటింగ్ యొక్క విలువ తెలుసు కోవలనుకుంది. ఆ పెయింటింగ్ నిజానికి మిలియన్ డాలర్లు విలువైన దే అని తెలుసుకుని  పెద్దగా ఆశ్చర్యం పోయింది !!
మరోసారి పికాసో వద్దకుకు వచ్చి, 'సర్, మీరు సరిగ్గా చెప్పావరు. ఇది నిజంగానే ఒక మిలియన్ డాలర్ పెయింటింగ్. '
పికాస్సో నవ్వాడు, "నేను ముందే చెప్పాను."
ఆ మహిళ, 'సర్, నన్ను మీ విద్యార్థిగా చేసికొని పెయింటింగ్ వేయటం నేర్పించండి. మీరు 10 నిమిషాల్లో ఒక మిలియన్ డాలర్ పెయింటింగ్ చేసినట్టుగా, నేను 10 నిమిషాల్లో దాన్ని చేయలేను, కనీసం 10 గంటల్లో అయినా మంచి పెయింటింగ్ చేస్తాను, కదా’ అంది'
పికాస్సో నవ్వి, "ఈ చిత్రలేఖనాన్ని నేర్చుకోవటానికి నాకు 30 సంవత్సరాలు పట్టింది, నేను 10 నిమిషాల్లో చేసాను అంటే దాన్నెలా వేయాలో తెలుసుకోవడానికి 30 సంవత్సరాల జీవితం ఇచ్చాను .. !! మీరు కూడా జీవితం ఇవ్వడం,వేయటం రెండూ నేర్చుకోవాలి .. అలా ఇవ్వగలరా ?అన్నాడు.
స్త్రీ నిశ్శబ్దంగా పికాసోను చూస్తూ ఉండిపోయింది ... !!
ఒక ప్రొఫెషనల్ లేదా సలహాదారుకి  10 నిమిషాల పనికి కూడా  రుసుము ఇవ్వబడుతుంది, కొంతమంది క్లైంట్ లు కేవలం కొద్ది కాలంలో చేయగలిగిన పనికి కూడా  చాలా ఫీజు అని భావిస్తారు. వారికి  ఈ కథ గురించి చెప్పండి

ఒక ప్రొఫెషనల్ లేదా కన్సల్టెంట్ తనపని  ఒక గంటలో చేయగలిగినా ,ఒక రాత్రి లో చేయగలిగినా అది  తన సంవత్సరాల అనుభవం,కృషి.

ఇది అన్ని  రకాల ప్రొఫెషనల్స్ కి అంకితం,


------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Saturday, April 28, 2018

రిటైర్మెంట్ తరవాత అధికారులు చంద్రబాబు వైపే ఎందుకు వేలు చూపుతున్నారు


ఒక రాష్ట్ర ఉన్నతాధికారులు పదవిలో ఉండగా రాష్ట్రప్రభుత్వలో జరిగే అవినీతి, బందుప్రీతి, కులజాడ్యం, ప్రాంతీయ పక్షపాతం ప్రొజెక్టులలో జరిగే అవినీతి తప్పిదాలపై మాట్లాడలేరు. అది న్యాయం కూడా కాదు. అది ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి నియంత్రణ చట్టాల క్రిందా, విధివిధానాల పరంగా కూడా సాధ్యం కాదు. అందుకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండగా ఐవైఆర్ కృష్ణారావు తదితరులు ప్రభుత్వ వ్యతిరేఖ వ్యాఖ్యలు చేయలేకపొయ్యారు. అయితే ప్రభుత్వ జాతి వ్యతిరెఖ పోకడలు, అవినీతి, బందుప్రీతి, చీకటి వ్యాపారాలు, రకరకాల రాజకీయాలు వారికి తెలిసినంతగా వేరెవరికీ తెలియదు. అందుకే పదవీ విరమణ తరవాత మాత్రమే వారు సరిగ్గా స్పందిస్థారు
ఆంధ్రప్రదేశ్ లో మితి మీరుతున్న అవినీతిపై మరో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్ )అజేయ కల్లం తన గళం విప్పారు. రాష్ట్రంలో ప్రతిచోటా అవినీతి వేళ్లూనుకు పోయిందని, సాగు నీటి ప్రాజెక్టులు తదితరాల పేరుతో అవినీతి విశృంఖలంగా మారిందని విచారం వ్యక్తం చేశారు. అపూర్వ విశ్వనగరం అమరావతి రాజధాని నగరం ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం;రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తోందని ఐవైఆర్ కృష్ణారావు తప్పు పట్టారు. అధికార కేంద్రీకరణ తప్పుడు విధానమని, కాస్మో బృహ మెగా నగరాల ఆలోచనే అసంబద్ధమని, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి తప్ప ప్రజలకు ఏవిధం గానూ ఉపయోగం కాదని కుండ బద్దలు కొట్టారు
70 శాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్న రాష్ట్రాల్లో మహనగరాల అవసరం లేదు. నాయకుల పేరు ప్రతిష్ట ల కోసం వారిని ప్రజలు ఎన్నుకోలేదు. ప్రజలకు విద్య ఆరోగ్యం ఉచితంగా అందించే ప్రభుత్వాలు చాలు. మిగిలిందంతా ప్రయివేట్ పరం చేసి కఠిన చట్టాల ద్వారా ప్రభుత్వ ప్రయివేట్ వ్యవస్థలను నియంత్రించే పాలన అవసరమని గుర్తించాలి
ప్రభుత్వం మొత్తం ఒకే చోట కేంద్రీకృతం ఎందుకు కావాలి, ఒకే నగరంలోనే అన్నీ ఎందుకు ఉండాలి, ఇవే ఆతరవాత రాష్ట్ర విభజనలకు ఊపిరిపోస్తాయనేది నేటి ఎపి ముఖ్యమంత్రికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అధికార కేంద్రీకరణ అనేది మౌలిక సిద్ధాంతానికే వ్యతిరేకం.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Thursday, April 26, 2018

హీరో ల, రాజకీయ పార్టీ ల, మరియు కుల అభిమానులకు .



ఒక వ్యక్తిని కాని, వ్యవస్థని కానీ తనలో ఉన్న లోపాన్ని వేలెత్తి చూపి సరిదిద్దుకునేలా చెప్పే వాడే అభిమాని. భజన చేసే వాడెవడు భజనపరుడే కాని అభిమాని కాడు.

     ఏ అభిమాన సంఘానికయినా ఎదుటి వాడి లోపాన్ని వేలెత్తి చూపడమే తప్ప తను అభిమానించే వారి తప్పులను వేలెత్తి చూపించే నిబద్దత ఉందా...! అలా చూపించిన సందర్భం ఎప్పుడన్నా ఉందా..!!

మనిషి అనే వాడెవడు ఎల్లప్పుడూ  కరెక్ట్ కాదు, తన నిర్ణయాలు కానీ తన చర్యలు కానీ అన్ని వేళలా సరికావు. ఏనాడన్నా ఈ అభిమాన సంఘాలు తమ వాళ్ళ గొప్పలు చెప్పడమే కానీ వాళ్ళ తప్పులను అంగీకరించగలిగారా..!        
                           పొరపాటున ఏకవచనం తో సంబోదించినందుకు సభాముఖం గా క్షమాపణ చెప్పిన పుచ్చలపల్లి సుందరయ్య గారి లాంటి సంస్కారం నుండి ఎదుటి వాడి భార్యా పిల్లలను కూడా తిట్టుకునే కుసంస్కారాన్ని ప్రోత్సాహిస్తుంది ఎవరు...! వ్యక్తి తీసుకునే నిర్ణయాలను అంగీకరించాలి లేదా విభేదించాలి కానీ, ఆ వ్యక్తి నే ఆరాధించడం అభిమానం కాదు దాస్యం.ఆ వ్యక్తిని  కుటుంబాన్ని దూషించటం ధ్వాంతము
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

మెగా మహా నగరాలు, గ్రేటర్నగరాల నిర్మాణ వల్ల సామాన్యులకి ఉపయోగమేనా?





బృహన్నగరాల (మహా పట్టణాలు )వల్ల ప్రజలకు సర్వ విధ భారం తప్ప ప్రయోజనం ఉండదు
అనుభవజ్ఞులు మహానగరాలను కట్టరు. అక్కడ రవాణా వ్యయం, నీటి సరఫరా, విద్య, ఆరోగ్యం, ఇంటి అద్దెలు తడిసి మోపెడై జీవన వ్యయం పెరిగి ప్రజలకు జీవితమే సమస్యగా తయారౌతుంది
              పెద్ద నగరాల్లో ఏముంటుంది? నేరాలు, వ్యభిచారం, చెడు అలవాట్లు పెరుగుతాయి. ప్రజలకు మనశ్శాంతి ఉండదు. అందువల్ల ప్రజలకు కావాల్సింది “గ్రామ స్వరాజ్యం”మాత్రమె నని ‘జాతి పిత మహాత్మా గాంధీ’ ఆనాడే చెప్పారు. స్వయం సమృద్ధి, స్వయంపాలన గల చిన్న ప్రాంతాలను టౌన్షిప్స్ గా మౌలిక సదుపాయాలు అన్ని పకడ్బంధీగా అభివృద్ధి చేస్తేనే ప్రజలకు అన్నీ వనరులు చౌకగా అందుబాటు లోకి వస్తాయి
           నగరాల పరిమాణం పెరిగే కొద్దీ ప్రజలు నివసించడానికి ఉపయోగపడేలా ఉండవని జర్మనీ తో పాటు పలు దేశాలు నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. నగరాలు పెద్దవయ్యే కొద్దీ అన్ని రకాల ఖర్చులూ పెరుగుతాయని జర్మనీలో జరిగిన అధ్యయనంలో వెల్లడైంది
            పెద్ద నగరాలుంటేనే పెద్ద పెద్ద సంస్థలు వస్తాయని ప్రజలను భ్రమల్లో ముంచడం తెలివి తక్కువ ఆలోచన. ‘మైక్రోసాఫ్ట్ ‘ప్రధాన కేంద్రం ఎక్కడుంది? లాస్ఏంజెలెస్, షికాగో, న్యూయార్క్’ లాంటి నగరాల్లో లేదు కదా? అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో (యూఎస్ ఏ) మారుమూల ప్రాంతమైన ‘రెడ్ మాండ్ ‘లో ‘మైక్రోసాఫ్ట్’ ప్రధాన కేంద్రం ఉంది
ఎంత పెద్ద సంస్థైనా ప్రశాంత వాతావరణం కోరుకుంటాయి. మన బెంగళూర్ ,హైదరాబాదు(సైబరాబాద్) లో గంటకు ఐదు కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలం. దాంతో సగం జీవితం ఉద్యొగానికి మిగతా సగం రవాణాకి సరిపోతుంది. ఇక నగర జీవికి బ్రతుకెక్కడ
‘వారెన్ బఫెట్’ అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని  ‘ఒమాహా’ అనే మారు మూల గ్రామీణ ప్రాంతం నుంచే నడుపుతున్నారు. పెద్ద నగరాలు కట్టడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకే మేలు జరుగుతుంది. స్థిరాస్తి ధరలను పెంచి భారీగా ఆర్జిస్తారు. మరి ఎందుకోసం అంతర్జాతీయ స్థాయి నగరాలు ?

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Wednesday, April 25, 2018

జీఎస్‌టీ దారిలో ఎటుపోతోంది దేశం!




             జీఎస్‌టీ' అంటే గూడ్సు అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌' అన్నారు. అంతా వలస భాష. ఏ ప్రజలకూ అర్థంకాని భాష. ఆచరణకు.. పదాలకు ఏమాత్రం సంబంధం లేని భాష. ఎవరిష్టమొచ్చినట్టు వారు వాడుకోవటానికి అనువైన పదాల టాక్స్‌ అది. మామూలు ప్రజలు పోయి ఒక షాపులో ఏదైనా వస్తువు ఖరీదు చేసి ''గతం కంటే ధర ఎందుకు పెరిగింది?'' అంటే జీఎస్‌టీ అంటున్నారు. ఎవరిష్టం వారిది. ఎవరి దోపిడీ వారిది. ''ఒకే పన్ను ఒకే ప్రజ.. ఒకే దేశం'' ఎలా సాధ్యమవుతుందో అర్థం కాదు. వ్యవసాయక దేశంలో, కోట్ల సంఖ్యలో నిరుద్యోగులున్న దేశంలో, లక్షల సంఖ్యలో చిన్న వ్యాపారులున్న దేశంలో, ఒక వస్తువు పది చేతులు మారి పది వస్తువు వంద అయ్యే దేశంలో జీఎస్‌టీ ఎలా అమలు పర్చాలో ఎలా అమలు అవుతుందో ఘనమైన ఏలుతున్న ప్రభువులకు తెలుసా? అసలు ఈ ప్రభువులకు భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాల ఉత్పత్తులు, వనరులు ఆధారాలు తెలుసా?
                     ఇవ్వాళ్ల భయంకరంగా దేశాన్ని ఊపిరి ఆడకుండా చేసిన జీఎస్‌టీ ఎవరికోసం? ఈ విధాన రూపకల్పనలో నియంతృత్వ భావజాలం ఉంది. తన మాట వేదం... రాష్ట్రాలు తన కాళ్ల కిందపడి ఉండాలి. దేశ ఆదాయమంతా తన గుప్పిట్లోకి రావాలి. ప్రతి రాష్ట్రం తమ ముందు జోలె పట్టుకొని నిలబడాలి. ఇప్పటికే రాష్ట్రాల అధికా రాలన్నీ కుదించేసారు. జీయస్టీతో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి పూర్తిగా గంగలో కలిసింది.
                జీఎస్‌టీ ప్రారంభించి ఎన్ని నెలలయ్యింది? ఈ కొద్ది కాలానికే జీఎస్‌టీలో ఎన్నో మార్పులు. ఇది తగ్గించామంటారు. దీనికి పెంచామంటారు. నిలకడలేని మాటలు. నిండుతనం లేని విధానాలు.. మన దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్‌జైట్లీకి పల్లెలు తెలుసా? వ్యవసాయం తెలుసా? వ్యవసాయ దేశమని తెలుసా? మనదేశ ప్రధాన ఉత్పత్తి ఏమిటో తెలుసా? వనరులు ఏమిటో తెలుసా? ప్రజల యిబ్బందులు తెలుసా? వాళ్లకు ఏమి అవసరమో తెలుసా? ఈ మూడు నాలుగు నెలల్లో జీఎస్‌టీలో ఎన్ని మార్పులు... చేర్పులు... ఇలా ఉంటుందా పన్నుల విధానం...
                జీఎస్‌టీ వలన వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రజల కొనుగోలుశక్తి నశించింది. ఏ ధర ఎందుకు పెంచుతున్నారో ఎందుకు తగ్గిస్తున్నారో తెలియదు. చిన్న చిన్న వ్యాపారాలు మూసుకొంటున్నారు. డబ్బు లావాదేవీల వ్యాపార సంస్థలు దివాలా తీస్తున్నాయి. చిన్న పరిశ్రమలు మూసివేస్తున్నారు. జీఎస్‌టీ దారిలో ఎటుపోతోంది దేశం!
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card