Showing posts with label indian history. Show all posts
Showing posts with label indian history. Show all posts

Wednesday, April 04, 2018

దైవ ప్రార్ధనలలో శృంగారం ఎందుకు మిళీతమైంది?


దైవ ప్రార్ధనలలో  శృంగారం ఎందుకు మిళీతమైంది


"కమలాకుచ చూచుక కుంకుమతో
నియతారుణి తాతుల నీలతనో
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే"
రసాత్మక శృంగార సుప్రభాతానికి అర్ధం, " ఓ శ్రీనివాస ప్రభో! గత రాత్రి శృంగార రసవాహినిలో తమ ధర్మపత్ని శ్రీదేవి ని కౌగిలిలో బంధించి ఆ సమ్మొహనములో పరవసించినది నీ వక్షస్థలం పై  కుంకుమ వర్ణం ముద్రలు పడ్డాయి. అవి ఆమె కమలాలవంటి కుచద్వయం నీ నీలి దేహం పై కుంకుమ వర్ణం తో మీరు కౌగిలిలో బంధించిన విషయం స్పష్టమౌతుంది. కమలములవంటి అక్షి ద్వయమున్న ఓ దేవా! మీకు విజయమగుగాక! అనేది ఆ సుప్రభాత శ్లోకానికి పరిపూర్ణ అర్ధం.
  

కాటుక కంటినీరు, చనుకట్టు పయింబడ నేల ఏడ్చెదో
కైటభధైత్యమర్ధనుని గాదిలి కోడల! యోమదంబ! యో
హటక గర్భురాణి!  నిను నా కటికిం గొనిపోయి యెల్ల క
ర్ణాట కిరాత కీచకులు కమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతి!”     
అమ్మా! భారతీ దేవీ! కాటుక కంటినీరు జాలువారుతూ వక్షద్వయం పై నున్న వస్త్రం రవికపైబడేలా ఎందులకు ఏడ్చావు తల్లీ!  రాక్షసుడైన కైటభుని చంపిన శ్రీమహవిషువు కోడలివైన నీకే కష్ఠమొచ్చిందని విలపిస్తావు! యో మహాదేవీ ఈ సమస్థ భువనాన్ని సృష్టించిన బ్రహ్మదేవుని ఇల్లాలివైన నిన్ను బయటకు తీసుకెళ్ళి ఆకర్ణాట కిరాత కీచకులైన రాజులకు అమ్మనని వారికి అంకితము ఇవ్వనని మనసా, వాచా, కర్మణా ప్రమాణం చేస్తున్నాను తల్లీ!”  అని అర్ధం.

సంస్కృత  శ్లోక సాహిత్యం, తెలుగు పద్య సాహిత్యం, పురాణ సాహిత్యం తెలుగు వారికున్నంత ఏ యితర భారతీయ భాషల వారికి లేదు. అయితే హిందువుల దైవ ప్రార్ధనలలో శృంగారం ఎందుకు మిళీతమైంది? మహా విజ్ఞులు, భాషా వాజ్మయం లో విస్తృత పరిజ్ఞానమున్న పండితులందరూ భక్తికి శృంగారాన్ని ఎందుకు మిళితం చేశారు? ఇదే ప్రశ్న ...సమాధానం కావాలి.  
 ప్రపంచములో ఏ జాతి జనుల దేవతలకైనా భార్యా బిడ్డలు కుటుంబం ఉండరు. కాని హిందూ మతధర్మంలో ఇది కనిపిస్తుంది. రూపం, ఆకారం, గుణ ఏదీలేదంటూ ఆదిమద్యాంత రహితుడూ, సర్వాంతర్యామి, నిరామయుడని చెపుతూనే ఆ దైవానికి ఇద్దరేసి భార్యలను అంతగట్టి విగ్రహాలను దేవాలయాలను నిర్మించి పూజలూ పురస్కారాలు చేస్తూ స్వర్ణాభరణాలతో అలంకరిస్తూ కళ్యాణాలు జరిపిస్తూ ఏకాంత సేవలూ చేస్తూ సంతొషపడటమంటే ఆదైవానికి కూడా మానవ ధర్మములోని శృంగారాన్ని అన్వయిస్తున్నాం కదా!
సుమారు 3000 సంవత్సరాల క్రితమే హరప్ప మొహోంజదారో కాలములోనే శివాలయాలు నిర్మించాం. అందులో శివలింగం పురుషుని అవయవాన్ని పోలి ఉంటుంది. పానవట్టం స్త్రీ అవయతత్వాన్ని పోలి ఉండి అసలు శివ స్వరూపమే - ప్రకృతి పురుషుల మేలు కలయికగా భావిస్తూ దైవమే భక్తి శృంగార స్వరూపం సృష్టి అంతా శృంగార స్వరూపంగా చెప్పుకుంటున్నాం. చతుర్విధ పురుషార్ధాలైన ధర్మ-అర్థ-కామ-మోక్షా లలో కామం తరవాతనే మోక్షానికి స్థానమిచ్చం. "కామి గాని వాడు మోక్ష గామి కాడు" అంటూ కామం (శృంగారం) ప్రాముఖ్యతను పెంచేశాం. శేంగార జీవనాన్ని వడలి అందరూ సన్యాసాన్ని స్వీకరిస్తే సృష్టి నిలిచిపోతుంది. అందుకే జీవన ధర్మం పాటించేటట్లు జీవనాన్ని నిర్దేశించారు.


దైవ చింతనలో పడి పోయి కాలం గడిపివేస్తే ఆహారం ఎలాలభిస్తుంది? సంసార ధర్మం పాటించకపోతే (శృంగారం లేకపోతే) సంతానం లేక సృష్టి కార్యం ఆగి సృష్టి కర్త (బ్రహ్మ) కు పనిలేకుండా పోతుంది. అందుకే ధర్మ, అర్ధాలో కామాన్ని కలిగి ఉంటేనే మానవ జీవితం మోక్షం పొందుతుంది.తన ధర్మ పత్నితో కలసి ఉండే  ధర్మం కామం అంటే శృంగారం. అన్య కాంతలతో జరిపే అధర్మ కామం వ్యభిచారం. అందుకే అనాదికాలములో బహుభార్యాత్వాన్ని, కొన్ని సందర్బాల్లో బహుభతృత్వాన్ని సంఘం సమాజం అనుమతించాయి. మానవాభివృద్ది ఇంత జరగటానికి మూలం కామం కోరికలే. కామమే లేకపోతే సృష్టే ఉండదు. వీటిపరమావధి సుఖమే. అందుకే అమలిన శృంగారం ఒక రకంగా పవిత్ర కార్యమే.

స్వామీజీల పుణ్యమా అని రోజంతా వేదాంత చర్చలు వైరాగ్య ప్రవచనాలు ప్రయోజనాలనివ్వవు. అందుకే భక్తి కార్యక్రమాలనుండి యువతకు మార్గనిర్దేశం చేసే టందుకే శృంగారాన్ని దైవకార్యాల్లో, దైవపఠనాల్లో సుగర్ కోటెడ్ (తీయనైన శృంగారాన్ని పైపూతగా దైవ పఠనాల్లో)  పూశారు అంటే శృంగారం తరవాతే భక్తి. జీవన అక్రమాన్ని రక్తి (శృంగారం), భక్తి (దైవ కార్యములో నిమగ్నం), ముక్తి (దైవములో కలిసిపోవటం)  అన్నారు. అంటే రక్తి తరవాతే ముక్తి.  శృంగారం ప్రధానంగా సాగే భక్తి గీతాలే అన్నమాచార్య కీర్తనలు, జయదేవుని అష్ఠపదులు, క్షేత్రయ్య పదాలు ఇవన్నీ శృంగార సమ్మిళితాలే. దేవుళ్ళకు భారయలున్నప్పుడు భక్తిలో శృంగారం తప్పుగాదు కదా!

చాలామంది హిందూ భక్తి సాహిత్యమంతా శృంగారమయమే కదా! అంటారు. ఇక్కడ మన మనసును దైవం వైపు మరల్చటానికి 10% మాత్రమే వాడారు. మిగిలిన 90% వైరాగ్యమే. అందుకే హిందూ తత్వం ఒక జీవన విధానమే కాని మతం కాదు అంటారు. ఎవరైనా అలా భావిస్తే అది వారి ధృష్టి దోషమే కాని, సృష్టి దోషం కాదు. కూరలో కరివేప రుచి కోసమే, తినటం మొదలెట్టాక కరివేపాకును పక్కన పెడతాం. ఆదైవ సన్నిధిలో శృంగారం ప్రవేశం (ఎంట్రి) మాత్రమే. లోపలంతా వైరాగ్య వైభోగమే.



శృంగార రహిత జీవితంతో విశ్వం జీవ రహితమౌతుంది. జీవుల సృష్టికి తొలిమెట్టు శృంగారమే. అది ప్రతి ప్రాణికి జన్మ హక్కు. అమలిన శృంగారం ఆరోగ్యాన్ని ఇస్తుంది. రోజూ శృంగారంలో క్రమ పద్దతిలో పాల్గొంటే ఈ యోగాలు, వ్యాయామాల అవసరమే ఉండదు. అనైతిక శృంగార ఫలితమే అతి ప్రమాదకర హెచైవి లాంటి రోగాలకు, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయటం మనం చూస్తూనే ఉన్నాం. అమలిన శృంగారం అత్యావస్యకం, దైవత్మం ఉన్న పవిత్రకార్యమే.      



Wednesday, November 29, 2017

ఏమిటీ భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ




సాధారణ ప్రజానీకాన్ని మోసగించడమేనా ...?
మీరే చూడండి ....
    
1- నాయకుడు కావాలంటే  రెండు సీట్లుకు కలిపి పోటీ చేయవచ్చు
     కానీ ....
     మీరు రెండు ప్రదేశాలలో ఓటు చేయలేరు,
2- మీరు జైలులో లాక్ అయిఉంటే ఓటు చేయడానికి లేదు
    కానీ
     నాయకుడు జైలులో ఉన్నప్పుడు ఎన్నికలలో పోటీ చేయవచ్చు.
3- మీరు జైలుకు వెళ్లినట్లయితే, అప్పటినుండి   మీ జీవితము పూర్తి అయిపోయినట్లే
     ఏ ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కారు,
కానీ ......
లీడర్ వారు  ప్రధాన మంత్రి లేదా అధ్యక్షుడిగా అయినప్పటికీ తరచుగా జైలులో హత్య లేక మానభంగం లాంటి కనెక్షన్ లో, , ఉండిన
ఏ ఇబ్బంది లేదు మళ్ళీ మళ్ళీ అర్హులే
4- బ్యాంకు లో ఒక చిన్న ఉద్యోగం పొందడానికి మీరు ఒక గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
అయితే,
నాయకుడు ఒక బొటనవేలి ముద్ర అయినప్పటికీ, భారతదేశం ఆర్థిక మంత్రిగా మారవచ్చు.
5-సైన్యంలో ఒక చిన్న సైనికుడు గా ఉద్యోగం పొందడానికి, అతను కనీసం విద్యా ,అదనంగా 10 కిలోమీటర్ల రేసు గెలవాలి,
కానీ ....
నాయకుడు నిరక్షరాస్యులు మరియు దివ్యాంగులు అయినప్పటికి అతను ఆర్మీ చీఫ్, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ అంటే రక్షణ శాఖ మంత్రి కావచ్చు
మరియు
వారి కుటుంబం ఇప్పటి వరకు పాఠశాల వరకు వెళ్ళలేదు, అయినా ఆ నాయకుడు దేశం యొక్క విద్య మంత్రి కావచ్చు
మరియు
వేలాది కేసులను ఆ నాయకుడు ఎదుర్కుంటున్నా.ఆ నాయకుడు పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క చీఫ్ అవ్వవచ్చు, అంటే హోం మంత్రి.
ఇంతకుముందు వ్యాసంలో రాసినట్లు
ప్రభుత్వ ఉద్యోగుల 35 ,30 సంవత్సరాల ఒక సంతృప్తికరమైన సేవ  తర్వాత కూడా ఏ పెన్షన్ కి అర్హులు కానప్పుడు కేవలం 5 సంవత్సరాల పదివితర్వాత ఎమ్మెల్యే / MP.లకు,ఇళ్ళ స్థల్లాలు, ప్లాట్లు ,ప్రయాణ రిజర్వేషన్లు. పెన్షన్ అనేది న్యాయమా ?

మీరు ఈ వ్యవస్థను మార్చాలని అనుకుంటు ఉంటే.
నాయకుడు మరియు ప్రజల కోసం ఒకే ఒక చట్టం ఉండాలి.


------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681





Thursday, July 27, 2017

అసలు భారతదేశం ఎప్పుడూ ఒక దేశం కాదు. ఇదంతా బ్రిటీషువాళ్ళ సృష్టి కాదా?





(కౌటిల్యుడు ఎందుకు అవసరం?నిన్నటి వ్యాసానికి ముగింపు)
                      వేర్పాటు వాదమే లక్ష్యంగా పెట్టుకున్న మన వామ పక్షాలు లేవనెత్తేటువంటి తప్పుడు ప్రశ్నలకు (కాశ్మీర్ ఇస్తే పాకిస్తాన్‌తో గొడవ తీరిపోతుంది కద. మనందరం ఒకటే. ఎవరి దగ్గర ఉంటే ఏమిటి?”, “వచ్చిన బంగ్లాదేశీ కాందిశీకులు ఎలాగూ వచ్చారు. పాపం, వాళ్ళకు శాశ్వత పౌరసత్వం ఇస్తే సరిపోతుంది కద?”, “అసలు భారతదేశం ఎప్పుడూ ఒక దేశం కాదు. ఇదంతా బ్రిటీషువాళ్ళ సృష్టి కాదా?”) సమాధానాలు తెలుసుకోవాలంటే కౌటిల్యుడిని అధ్యయనం చేయడం చాలా అవసరం.                  
                     ఎక్కువగా కౌటిల్యుడు అనే పేరు వినగానే అందరికి కుటిల రాజనీతి అన్న పదాలు స్ఫురిస్తాయి. అయన గురించి తెలుసుకున్న చాల మందికి ఆయన పేరు వినగానే western philosophers లో Machiavelli గుర్తుకు వస్తాడు. తద్వారా ‘కౌటిల్యుడు మనకు ఆదర్శం’ అంటే ఇబ్బంది పడతారు.
ఐతే కౌటిల్యుడు (ఈయన చాణక్యుడిగా అందరికి పరిచితం) ఇవేవీ కాడు. ఆయన ముఖ్యంగా ఒక మహోన్నత జాతీయవాది (nationalist).
                      దాదాపూ రెండువేల నాలుగు వందల ఏళ్ళకిందే, కౌటిల్యుడు ప్రజలలో జాతీయ భావం ఎంత అవసరమో గుర్తించాడు.
                       కౌటిల్యుడు ముఖ్యంగా ఒక శిక్షకుడు. ఒక గురువు. కాని ఎప్పుడు భారతావని ఆపదలో ఉన్నా ఆయన తన గురుకులాన్ని వదిలి వచ్చి భారతాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఛేదించాడు. అది దుష్ట నందుల వల్ల ప్రజలు ఇబ్బందుల్లో పడినప్పుడు కానీ, లేదా అలెగ్జాండర్ మన్నల్ని ముట్టడించినప్పుడు కానీ.
                      కౌటిల్యుడికి ఏనాడూ పదవి మీద అధికారం మీద వ్యామోహం లేదు. తన కర్తవ్యం ముగియగానే ఆయన మళ్ళీ తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
                    ఈ రోజు మనకు కావల్సింది అలాంటి కౌటిల్యుడే. అధికారం కోసం కాకుండా, దేశ క్షేమం కోసం పోరాడేవాడు. గమ్యం హర్షణీయం అయినప్పుడు దారిలో వచ్చే ఆటంకాలను సామ దాన భేద దండోపాయలతో నిర్మూలించే వాడు.
                   భారత దేశం మళ్ళీ చాలా రోజుల తరువాత ఒక కూడలికి (crossroads) చేరుకుంది. ఈ కూడలి దాటి సుగమమైన మార్గాన పయనించేందుకు, మనందరికి కౌటిల్యుడి శక్తి యుక్తులు కావాలి.
                  కౌటిల్యుడి సిద్ధాంతాల గురించి తెలుసుకోవాలనుకునే వారు, ఇంటెర్నెట్‌లో ఎన్నో చోట్ల చూడవచ్చు.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
              

Address for Communication

Address card