మనం బ్రతుకుతున్న దేశాన్ని ప్రేమించడానికి
ఏ కారణం కావాలి
“ఈ దేశంలో ఉద్యోగం చేసి ఇక్కడ production ఇస్తే ఈ దేశానికి సేవ చేసినట్టు కాదా? నాకు ఇక్కడ సుఖం దొరకటంలేదని,
సుఖం దొరికే చోటుకి వలస పోవాలా?
పక్షులు, జంతువులు వలస ఎందుకు పోతాయి. జీవితానికి కావలిసిన తిండి నీరు
దొరక్క. ఈ దేశం అంత కంటే దిగజారిపోయిందా?”
నేను ఇలా అంటే కాదనటానికి ఇంకో ఉదాహరణ వచ్చింది “బ్రతకడానికి తిండి చాలు. అది అవసరం. జిహ్వని మరపించడానికి తిండికి
రుచి ఎంత అవసరమో ఆనందంగా ఉండడానికి జీవితానికి సుఖం కావాలి. ఒక physical comfort కావాలి, కొంత secured
feeling కావాలి. అది డబ్బుతో వచ్చేదైతే, అది సంపాదించగలిగే అవకాశం ఉంటే దేశభక్తి అని వదులుకోవడం ఎందుకు? సంపాదించింది తీసుకుని ఈ దేశంలోనే బ్రతుకుదాం.
నేను విదేశాలు వెళ్లడానికి అవకాశాలు రాక,
తెలివితేటలు సరిపోక ఇలాగ భారతదేశం అని చెప్పి నన్ను నేను మభ్యపెట్టుకుంటున్నానా?
నాకు ఎవరో చెప్పిన quote
గుర్తుకు వచ్చింది – “Patriotism is the
last refuse of a scoundrel”. నేను
నిజంగా వేరే దేశంలో ఇంతకంటే ఎక్కువ డబ్బు,
సుఖం దొరికితే కొత్త పాట పాడతానా?
నేను నా భారతదేశాన్ని, నా సంస్కృతిని ఎందుకు ఇంతలా ప్రేమించాలి? ఎందుకు ఈ సంస్కృతిని కాపాడుకోవాలనుకుంటున్నాను? ఒక emotional
middle class intellectual ని
కాబట్టి, జీవితం లో నిత్యం సమరం చేస్తున్నాను కాబట్టి ఇలా ఆలోచిస్తున్నానా? నిజంగా నా దగ్గిర నేను secured గా బ్రతకడానికి. నా విలాసాలకి కావలిసినంత సంపత్తి ఉంటే ఇలా
ఆలోచించనా?అసలు మనం బ్రతుకుతున్న దేశాన్ని ప్రేమించడానికి ఏ కారణం కావాలి ? ఈ దేశాన్ని బాగు చెయ్యడమనే అవసరం ఏముంది? అసలు దీని కంటే ముందు అసలు ఏమిటీ “భారతదేశం” ? అసలు ఏది భారత దేశం?
------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment