Saturday, April 26, 2014

మీ ఓనర్‌కు పాన్‌కార్డుందా?

మీ ఓనర్‌కు పాన్‌కార్డుందా?

మీ ఓనర్‌కు పాన్‌కార్డుందా?
ముందస్తు పన్ను కోత (టీడీఎస్) నుంచి తప్పించుకోవాలంటే మీ ఆదాయ వ్యయాలు, సేవింగ్స్ వంటి వివరాలను ఈ నెలాఖరులోగా మీమీ ఆఫీసుల్లో సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే మీ ఆదాయానికి అనుగుణంగా పన్ను లెక్కించి వచ్చే మూడు నెలల జీతం నుంచి టీడీఎస్ రూపంతో కోతలు తప్పవు. వీటిని తప్పించుకోవడానికి ఇప్పటి వరకు చేసిన సేవింగ్స్, వచ్చే మూడు నెలల్లో చేయబోయే వాటి వివరాలను తప్పకుండా ఇవ్వాలి. వీటితో పాటు పన్ను భారం తగ్గించుకోవడంలో ఇంటద్దె అలవెన్స్‌ది (హెచ్‌ఆర్‌ఏ) కీలకపాత్ర. అయితే మనలో చాలా మంది ఇంటద్దెను ఎంత ఎక్కువ చూపిస్తే అంత పన్ను భారం తగ్గుతుందనుకుంటారు.
కానీ హెచ్‌ఆర్‌ఏపై గరిష్టంగా ఎంత ప్రయోజనం లభిస్తుందనేదానికి మూడు సూత్రాలున్నాయి. ఈ మూడింట్లో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని గరిష్టంగా లభించే హెచ్‌ఆర్‌ఏగా భావించి ఆ మొత్తాన్ని మీ ఆదాయం లోంచి తగ్గిస్తారు. ఈ మినహాయింపు లెక్కించేటప్పుడు నాలుగంశాలను చూస్తారు. వాటిలో మొదటిది జీతం. ఇక్కడ జీతం అంటే గ్రాస్ పే కాకుండా బేసిక్ శాలరీ, డీఏ మాత్రమే. కంపెనీలిచ్చే ఇతర అలవెన్సులు, పెర్క్స్‌ను లెక్కలోకి తీసుకోరు. ఇక రెండవది కంపెనీ హెచ్‌ఆర్‌ఏ రూపంలో ఇస్తున్న అలవెన్స్ మొత్తం. మూడోది మీరు వాస్తవంగా చెల్లిస్తున్న అద్దె. చివరగా నాల్గోది.. ఎంతో కీలకమైనది.. మీరు నివసిస్తున్న నగరం. ఈ నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకొని గరిష్టంగా ఇంటద్దె అలవెన్స్ ఎంత లభిస్తుందన్నది లెక్కిస్తారు.
 ఇలా లెక్కిస్తారు
 ఎ. జీతంలో 40 శాతం (ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై మెట్రో నగరాల్లో అయితే 50 శాతం)
 బి. కంపెనీ ఇంటద్దె అలవెన్స్‌గా (హెచ్‌ఆర్‌ఏ) ఇచ్చే మొత్తం.
 సి. చెల్లించిన అద్దెలోంచి జీతంలో పదవభాగాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం
 ఇప్పుడో ఉదాహరణ చూద్దాం...
 హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న నగేష్ వార్షిక జీతం(బేసిక్+డీఏ) రూ.3,00,000. ఇంటద్దె అలవెన్స్ రూ.50,000. అంటే నగేష్ మొత్తం వార్షిక జీతం రూ.3,50,000. నగేష్ నెలకు రూ.5,000 చొప్పున సంవత్సరానికి అద్దెకింద  రూ.60,000 చెల్లిస్తున్నాడు.
 ఇప్పుడు నగేష్‌కి హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ ఎంత లభిస్తుందో చూద్దాం.
 ఎ. జీతంలో 40 శాతం అంటే రూ. 3,00,000లో 40 శాతం = రూ.1,20,000
 బి. ఇంటద్దె అలవెన్సు = రూ.50,000
 సి. చెల్లిస్తున్న అద్దెలోంచి జీతంలో 10 శాతం మినహాయించగా మిగిలిన మొత్తం రూ. 60,000 - 30,000 ( 3,00,000లో 10 శాతం) = రూ. 30,000
 ఈ మూడింటిలో తక్కువ మొత్తమైన రూ.30,000 మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. అంతే కాని అద్దెకింద చెల్లిస్తున్న రూ.60,000 కాదు కదా, కనీసం కంపెనీ హెచ్‌ఆర్‌ఏ కింద ఇస్తున్న రూ.50,000 కూడా క్లెయిమ్ చేసుకోలేం.
 కనీసం కంపెనీ ఇస్తున్న హెచ్‌ఆర్‌ఏ మొత్తమైనా పొందాలనుకుంటే అద్దె కింద కనీసం రూ.80,000 చూపించాల్సి ఉంటుంది. అప్పుడు హెచ్‌ఆర్‌ఏ అలవెన్స్ కింద లభిస్తున్న రూ.50,000 క్లెయిమ్ చేసుకోవచ్చు.
 అలా కాకుండా అద్దెను మరింత పెంచి చూపిస్తే ఏ మేరకు ప్రయోజనం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. నగేష్ నెలకు రూ.8,000 అద్దె చెల్లిస్తున్నట్లయితే సంవత్సరంలో రూ.96,000 చెల్లిస్తాడు.
 ఎ. జీతంలో 40 శాతం అంటే రూ. 3,00,000లో 40 శాతం  = రూ. 1,20,000
 బి. ఇంటద్దె అలవెన్సు = రూ. 50,000
 సి. చెల్లిస్తున్న అద్దెలోంచి జీతంలో 10 శాతం మినహాయించగా మిగిలిన మొత్తం రూ. 96,000 - 30,000 ( 3,00,000లో 10 శాతం) = రూ. 66,000
 ఈ మూడింటిలో కంపెనీ హెచ్‌ఆర్‌ఏగా ఇస్తున్న మొత్తమే తక్కువగా ఉండటంతో ఈ కేసులో కూడా గరిష్టంగా రూ.50,000 మాత్రమే క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంటుంది.

పోయిన కార్డుల స్థానంలో కొత్తకార్డులను ఎలా పొందాలో ?

గుర్తింపుకార్డుపోయిందా.. ఇలా చేయండి

          ఇప్పుడు ఎవరిజేబులో చూసినా పచ్చనోట్ల కన్నా ఎక్కువ కార్డులే కనిపిస్తున్నాయి. ఏటీఎం కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌లెసైన్స్, ఓటర్ గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు...ఇలా అన్నీ కార్డులే ఉంటున్నాయి. ఒకవేళ వీటిని పోగొట్టుకుంటే మళ్లీ ఎలా పొందాలో తెలియక చాలామంది ఆందోళన చెందుతుంటారు. పోయిన కార్డుల స్థానంలో కొత్తకార్డులను ఎలా పొందాలో తెలిపేదే ఈ కథనం... 
 
  పట్టాదారు పాసుపుస్తకం...
 
   పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ పోతే ముందుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. అక్కడ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పత్రికల్లో ప్రకటించాలి. ఏ ప్రాంతానికి చెందుతారో అక్కడ ఉన్న అన్ని బ్యాంకుల నుంచి ఒక ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి. ఏ బ్యాంకులోనూ వీటిని తాకట్టు పెట్టలేదనే పత్రాన్ని సమర్పించాలి. వీటితో పాటు పట్టదారు పాసుపుస్తకానికి రూ.1000, టైటిల్ డీడ్ కోసం రూ.100 చలానా తీసి మీసేవాలో దరఖాస్తు చేస్తే మళ్లీ పొందవచ్చు.
 ఏటీఎం కార్డయితే...
 
  ఏటీఎం కార్డును పోగొట్టుకుంటే మాత్రం వెంటనే అప్రమత్తం కావాలి. లేదంటే అకౌంట్‌లోని డబ్బులను భారీగా నష్టపోయే అవకాశముంది. ఈ కార్డు ఎవరికైనా దొరికితే దానిద్వారా డబ్బులు తీయలేకపోయినప్పటికీ... విచ్చల విడిగా షాపింగ్ చేసే ప్రమాదం ఉంది. అందుకే కార్డు పోయిన వెంటనే సంబంధిత బ్యాంకుకు చెందిన వినియోగదారుల సేవా కేంద్రానికి ఫోన్ చేసి కార్డును బ్లాక్ చేయించాలి. వారు ఒక No.. ఇస్తారు.దానిని తీసుకుని ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేస్తే, వారు ముందుగా క్రొత్త ATM ఫార్మ్ ఇస్తారు దానిలో ముందు తీసుకున్న ఫిర్యాదు No. తొ BANK FEE  చెల్లిస్తే  మన చిరునామాకు కార్డు పంపిస్తారు. ఆ తర్వాత వారం రోజులకు రహస్య పిన్‌కోడ్ నంబర్ ఇస్తారు.       
 
పాన్కార్డు
 
 
ఆదాయపు పన్నుకు అందించే పాన్(పర్మినెంట్ అకౌంట్ నంబర్)కార్డు పోగొట్టుకుంటే.. సంబంధిత ఏజెన్సీల్లో పాత పాన్కార్డు జిరాక్స్, రెండు కలర్ ఫొటోలు, నివాస, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు జత చేయాలి. కొత్తకార్డు కోసం అదనంగా మరో 105 రూపాయలు చెల్లించాలి. సుమారు 20 రోజుల్లో మరో కార్డును జారీచేస్తారు. www.nsdl.pan వెబ్సైట్లో మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

 
పాస్పోర్టు
 
 
పాస్పోర్టు పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. వారిచ్చే నాన్ట్రేస్డ్ పత్రంతో పాస్పోర్టు కార్యాలయం, హైదరాబాద్  పేరిట వెయ్యి రూపాయల డీడీ తీయాలి. శాఖ ప్రాంతీయ అధికారి విచారణ జరిపి కార్యాలయానికి సమాచారం అందిస్తారు. విచారణ పూర్తయిన మూడు నెలల తర్వాత డూప్లికేట్ పాస్పోర్టును జారీ చేస్తారు. తత్కాల్ పాస్పోర్టు అయిన పక్షంలో నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి. వివరాలకు www.passportindia.gov. in ను సంప్రదించవచ్చు.

 
ఓటరు గుర్తింపు కార్డు
 
 
ఓటు వేసేందుకు కాకుండా వివిధ సందర్భాల్లో గుర్తింపు కోసం ఉపయోగపడే ఓటరు గుర్తింపు కార్డును పొగొట్టుకుంటే పోలింగ్ బూత్, కార్డు నెంబర్తో *10  రుసుం చెల్లించి మీ సేవా కేంద్రంలో మళ్లీ కార్డు పొందవచ్చు. కార్డు నెంబర్ ఆధారంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే కార్డును ఉచితంగా తీసుకోవచ్చు. మరింత సమాచారం కోసం www. ceoandhra.nic.in  వెబ్సైట్ను సందర్శించవచ్చు.

 
ఆధార్కార్డు
 
 
ఆధార్కార్డు పోగొట్టుకుంటే టోల్ఫ్రీ నెంబర్ 18001801947లో పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే కొత్తకార్డును మళ్లీ పోస్టులో పంపిస్తారు. help@uidai. gov.in  వెబ్సైట్లో పూర్తి సమాచారం పొందవచ్చు.

 
డ్రైవింగ్ లెసైన్స్
 
 
వాహనం నడిపేందుకు డ్రైవింగ్ లెసైన్స్ తప్పనిసరి. అనుకోని పరిస్థితుల్లో డ్రైవింగ్ లెసైన్స్ పోగొట్టుకుంటే వెంటనే సంబంధిత పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. వారందించే నాన్ట్రేస్డ్ పత్రంతో పాటు డ్రైవింగ్ లెసైన్స్ ప్రతిని ఎల్ఎల్డీ దరఖాస్తుకు జతచేసి ఆర్టీవో కార్యాలయంలో అందజేయాలి. అలాగే 10 రూపాయల బాండ్పేపరుపై కార్డుపోవడానికి దారితీసిన పరిస్థితులను వివరించాలి. నెలరోజుల్లో తిరిగి అధికారుల నుంచి కార్డును పొందవచ్చు. aptransport.org వెబ్సైట్ నుంచి ఎల్ఎల్డీ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు పొందవచ్చు
 
రేషన్కార్డు
 
 
గుర్తింపుతో పాటు రేషన్షాపుల్లో సరుకులు తీసుకోవడానికి రేషన్కార్డు అవసరం. ఇదిపోతే www.icts2.ap.gov.in వెబ్సైట్లో లాగిన్ కావాలి. అక్కడ ఉన్న username guest, password guest123  సాయంతో విచారణ(క్వేరీ) ఉపయోగించి మన రేషన్కార్డు నంబర్ సాయంతో జిరాక్స్ ప్రతిని పొందవచ్చు. దాని ద్వారా ఏపీ ఆన్లైన్ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే మండల తహశీల్దార్ దానిని పరిశీలించి నామ మాత్రపు రుసుంతో అదే నంబరుపై కార్డు జారీ చేస్తారు.

 

ఆదాయ పన్ను కనీస మినహాయింపు-(బేసిక్ లిమిట్)-F.Y 13-14/A.Y 14-15


ఆదాయ పన్ను కనీస మినహాయింపును(బేసిక్ లిమిట్) రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలన్న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను ఆర్థిక   శాఖ తోసిపుచ్చింది. వ్యక్తిగత పన్ను శ్లాబులను సవరిస్తే సుమారు రూ.60,000 కోట్ల ఆదాయాన్ని నష్టపోవాల్సి వస్తుందని, దీంతో ఈ ప్రతిపాదనలను ఆమోదించడం లేదని ఆర్థిక శాఖ పేర్కొంది. కొత్తగా అమల్లోకి రానున్న డెరైక్ట్ ట్యాక్స్ కోడ్(డీటీసీ)లో పన్ను శ్లాబులను సవరిస్తూ యశ్వంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కొన్ని సిఫార్సులను చేసింది.

 బేసిక్ లిమిట్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచడమే కాకుండా, రూ.3-10 లక్షల ఆదాయంపై10%, 10-20 లక్షల ఆదాయంపై 20%, ఆపైన ఆదాయం ఉన్న వారిపై 30% పన్ను విధించాలని   సిఫార్సు చేసింది. ఈ సూచనలు పాటిస్తే భారీగా పన్ను ఆదాయం తగ్గుతుందని 2013 డీటీసీ ప్రతిపాదనల విడుదల సందర్భంగా ఆర్థిక శాఖ వ్యాఖ్యానించింది. ప్రస్తుత స్లాబుల ప్రకారం వార్షిక ఆదాయం రూ. 2 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. రూ.2-5 లక్షల వరకూ 10%,  రూ. 5-10 లక్షలకు 20%, రూ. 10 లక్షలు దాటితే 30% పన్ను అమలవుతోంది.

  సీనియర్ సిటిజన్లకు సంబంధించి పన్ను మినహాయింపుల వర్తింపు వయస్సును  65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించాలన్న ప్రతిపాదనకు మాత్రం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అలాగే వార్షిక ఆదాయం రూ.10 కోట్లు దాటితే సూపర్ రిచ్ ట్యాక్స్ పేరుతో కొత్త ట్యాక్స్ శ్లాబ్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వార్షిక ఆదాయం రూ.10 కోట్లు దాటితే 35 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  జీవిత బీమా కంపెనీలపై విధిస్తున్న 30% పన్ను పరిమితిని 15%కు కుదించాలన్న సలహాలను కూడా ఆర్థిక శాఖ పక్కనపెట్టింది. ఇదే విధంగా రిటైల్ ధరల ద్రవ్యోల్బణం ఆధారంగా పన్ను విధించాలన్న సూచననూ తిరస్కరించింది.

Friday, April 18, 2014

కొత్త టిన్ నంబర్లు!

వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని (హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో సహా) వ్యాపారస్తులకు పన్ను చెల్లింపుదారుల గుర్తింపు సంఖ్య (టిన్) కొత్త నంబర్లను ఇస్తామని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియా చెప్పారు. తొలి విడతగా 2 లక్షల మంది డీలర్లకు కొత్త టిన్ నంబర్లను కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కేటాయించిన కొత్త టిన్ నంబర్లు జూన్ 2వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ఫ్యాప్సీ ఆధ్వర్యంలో మంగళవారమిక్కడ జరిగిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ- వాణిజ్య పన్నులు’ అనే సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరాలాల్ మాట్లాడుతూ.. ‘మొత్తం 11 నంబర్లుండే టిన్ నంబర్‌లో మొదటి రెండు నంబర్లు రాష్ట్రం యొక్క కోడ్‌ను సూచిస్తుంది. మిగిలిన 9 నంబర్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని డీలర్లకు కేటాయించే టిన్ నంబర్ల విషయంలో.. ఇప్పుడున్న టిన్ నంబర్ల ముందు కొత్తగా కేంద్ర ప్రభుత్వం కేటాయించే మొదటి రెండు నంబర్లు పెట్టాలా లేక పూర్తిగా 11 నంబర్ల కొత్త టిన్ నంబర్‌ను ఇవ్వాలా అనే విషయంలో కేంద్రానికి లేఖ రాశామని’ ఆయన వివరించారు. వారం రోజుల్లో ఈ విషయంపై స్పష్టత వస్తుందని ఆ తర్వాతే కొత్త టిన్ నంబర్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. జూన్ 2 తర్వాత వ్యాపారస్తులు పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు రెండు రాష్ట్రాల ప్రత్యేక టిన్ నంబర్లు ఉపయోగించాలని సూచించారు. రెండు రాష్ట్రాల్లో చేసే వ్యాపార కార్యకలాపాలను బట్టి వేర్వేరుగా పన్నులుంటాయని చెప్పారు. ఆయా పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 53 శాతం తెలంగాణకు, 47 శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కేటాయింపులుంటాయని వివరించారు.

 రూ.50 వేల కోట్ల ఆదాయం: గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో వాణిజ్య పన్నుల ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.50 వేల కోట్లను వసూలు చేసిందని చెప్పారు. దేశంలోనే ఇంత మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించింది మన రాష్ట్రమే అని కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో వాణిజ్య పన్నుల బ కాయిలు రూ.12 వేల కోట్లుగా ఉన్నాయని, రీఫండ్ అయితే రూ.5 వేల కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. పాలనాపరమైన సౌలభ్యం కోసం మాత్రమే పదేళ్ల పాటు హైదరాబాద్ సంయుక్త రాజధానిగా ఉంటుందని వాణిజ్య పన్నులు చెల్లింపు, ఆదాయం కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఎలాంటి సంబంధం ఉండదని సమారియా వివరించారు. జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మకాలు చేయదలిస్తే సీ ఫామ్‌ను తప్పనిసరిగా దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా 2 శాతం సెంట్రల్ సేల్స్ టాక్స్ (సీఎస్టీ) చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. సీఎస్టీ, వ్యాట్, రవాణా చార్జీలు, టోల్‌గేట్ల అనేక రకాల పన్నులు అదనంగా చెల్లించాల్సి ఉంటున్నందున ధరలు కూడా పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల్లో నిర్వహించే వ్యాపారాలకు సంబంధిత వ్యాపారులు/సంస్థలు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియా తెలిపారు. అపాయింటె డ్ డేట్ అమల్లోకి వచ్చిన వెంటనే కొత్త నంబర్‌తో వ్యాపారాలు చేయాలన్నారు.  కొత్త రిజిస్ట్రేషన్ కోసం ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలని, వీరికి మే 8లోగా టిన్ నంబర్లు కేటాయిస్తామన్నారు. అపాయింటెడ్ డేట్ అమల్లోకొచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ ఫారాలు బట్వాడా చేస్తామన్నారు. జూన్ 2 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌తో మాత్రమే వ్యాపారాలు నిర్వహించాలన్నారు. జూన్ ఒకటవ తేదీ వరకు పాత నంబర్లతో వున్న సి ఫారాలను వినియోగించి, రెండో తేదీ నుంచి కొత్త నంబర్లతో ఫారాలు దాఖలు చేయాలన్నారు. రిటర్స్న్, ఇన్సెంటివ్, ఆడిట్లు ఇతర అంశాలపై సంబంధిత అధికారులను సంప్రదించాలని చెప్పారు. మే నెలాఖరు రిటర్న్స్‌లోనే జూన్ ఒకటో తేదీన జరిగే లావాదేవీలను పొందుపరిచాల్సి ఉంటుందని కమిషనర్ తెలిపారు. పన్నుల రిటర్న్స్‌కు సంబంధించి మూడు నెలల్లో క్లెయిమ్‌లు చెల్లిస్తామని చెప్పారు. ప్రతి వ్యాపారికి 11 అంకెల టిన్ నంబరు వుంటుందని, టిన్ నంబరులోని తొలి రెండు అంకెలు రాష్ట్రానికి సంబంధించినవని అడిషనల్ కమిషనర్ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 28తో టిన్ నంబర్ ప్రారంభమవుతుందన్నారు. తెలంగాణకు 36, సీమాంధ్రకు 37తో టిన్ నంబర్ మొదలవుతుందని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో వ్యాపారాలు నిర్వహించే వారు వేర్వేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు. 

రిజిస్త్రేషన్ విధానం వీడీయో రూపం లొ కావాలంటే ఇక్కద క్లిక్ చేయండి 
DEMO on ONLINE OPTION FORM.pdf 

వ్యాట్ ద్వారా ఏ జిల్లాలో ఎంత ఆదాయం

విలువ ఆధారిత పన్ను:

రాష్ట్ర సొంత పన్ను సంబంధిత ఆదాయ వనరుల్లో సింహ భాగం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ద్వారానే వస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం రూ.66 వేల కోట్లు కాగా అందులో 75 శాతానికి పైగా అంటే రూ.42,795 కోట్లు వ్యాట్ ద్వారానే వచ్చింది. ఇందులో 66 శాతానికి పైగా.. అంటే రూ. 28,277 కోట్లు కేవలం హైదరాబాద్ నుంచే రావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం నేపథ్యంలో.. జిల్లాలు, రంగాల వారీగా ఆదాయ వివరాలను సేకరించి కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎం) సమర్పించే పనిలో రాష్ట్ర ప్రభుత్వ శాఖలు నిమగ్నమయ్యాయి. 
 అందులో భాగంగా 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి 2012-13 వరకు వ్యాట్ ద్వారా ఏ జిల్లాలో ఎంత ఆదాయం వచ్చిందనే వివరాలను ఆర్థిక శాఖ సేకరించింది. ఈ వివరాలను జీవోఎంకు పంపనున్నట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే హైదరాబాద్‌లో వస్తున్న వ్యాట్ ఆదాయాన్ని సీమాంధ్ర కోల్పోవాల్సి వస్తుందని, సీమాంధ్ర ప్రాంతం ఆదాయ వనరులు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్‌లో వస్తున్న ఆదాయాన్ని సీమాంధ్రకు కూడా పంపిణీ చేయాల్సి ఉంటుందని కూడా కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Saturday, April 12, 2014

మనం గుడికి వెళ్ళినపుడు తీర్ధం తీసుకుంటాం కదా? ఎందుకో తెలుసా?

మనం గుడికి వెళ్ళినపుడు తీర్ధం తీసుకుంటాం కదా? ఎందుకో తెలుసా?
తీర్ధం అంటే ఓక గిన్నెలో పొసిన కాసిని నీళ్ళు కాదు

హిందూ శాస్త్రీయ గ్రంధాలు ఏమి చెపుతున్నాయంటే
ఒక రాత్రి అంతా రాగి పాత్రలో క్రిష్ణ తులసి ఆకులు వేసి 
మరుసటి రోజు ఆ నీటిని తీర్ధంగా తీసుకోవాలని చెపుతున్నాయి
దీనిలో ఉన్న సైంటిఫిక్ కారణాలు  ఎంటంటే  తులసిలో ఇరీడియం  అనే ధాతువు
వుంటుంది అది రాగి అనగా కాపర్ తో కలసి రసాయనక చర్య జరిపి
వెంటనే శక్తినిచ్చే (ఇనిస్టెంట్ ఎనర్జి ) ధాతువు గా తయారువుతుంది .
అది మనకి తెలియ చేయటానికే దేవాలయల్లో తీర్ధం గా అలవాటు  చేస్తారు 
నిత్యం మనలని అలవాటుగా తీసుకొమ్మని .
అందుకే ఎవరైనా ఆఖరి క్షణాల్లో  ఉన్నపుడు  కొంచెం   తులసినీళ్ళు నోట్లో పొయమంటారు
కొంచెం శక్తి వస్తే  బ్రతుకుతాడని .
 కనుక స్నేహితులారా
 ఇకపై మీరెప్పుడైనా  ఏగుడికి వెళ్ళిన ఇంట్లొ అయినా పై విధంగా ప్రయత్నం చేయండి.
చేయమని మీరు చెప్పగలిగిన పూజారికి చెప్పండి 
శాశ్త్రాన్ని  పాటించి మిమ్మల్ని  మీ మతాన్ని గౌరవించండి

Saturday, April 05, 2014

తిరుమల శ్రీవారి దర్శనానికి వివిధ సేవలకు మీ పి.సి.నుండే బుక్ చేసుకోండి

వీడియో లింక్ ఇది: http://bit.ly/srittdtickets


వీడియో లింక్ ఇది: http://bit.ly/srittdtickets
ముందుగా ఈ రకంగానైనా తిరుమల శ్రీవారిని సేవించుకోవడం అదృష్టంగా భావించి ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను..
శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి TTD కేంద్రాల చుట్టూ తిరిగి ఇబ్బంది పడాల్సిన పనిలేకుండా నేరుగా మీ కంప్యూటర్లోనే దర్శనం, వసతి, కళ్యాణోత్సవం, నిజపాద దర్శనం, తోమాల సేవ వంటి వివిధ సేవల టిక్కెట్లని ఎంత సులభంగా బుక్ చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను.
ఏమీ ప్లాన్ చేసుకోకుండా అక్కడికెళ్లి దర్శనం చేసుకోవడం చాలా సందర్భాల్లో ఇబ్బందికరంగానే ఉంటుంది.  అలా కాకుండా మీరు మీ కంప్యూటర్లోనే దర్శనం, వసతి టిక్కెట్లు దొరికే తేదీల్ని పరిశీలించుకుని మీకు అనువుగా ఉన్న తేదీన టిక్కెట్లు బుక్ చేసుకుని నేను వీడియోలో చూపించినట్లు ప్రింటౌట్లు తీసుకుని వెళితే ఎలాంటి అసౌక్యరం లేకుండా శ్రీవారి దర్శనం సుఖవంతంగా ఉంటుంది.
గమనిక: శ్రీ వేంకటేశ్వరుని కొలిచే ప్రతీ భక్తునికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ మిత్రులతోనూ షేర్ చేయడం ద్వారా వారికి స్వామి వారి దర్శనభాగ్యం కలగడానికి మీ వంతు సహకరించగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/srittdtickets
ముందుగా ఈ రకంగానైనా తిరుమల శ్రీవారిని సేవించుకోవడం అదృష్టంగా భావించి ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను..


శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి TTD కేంద్రాల చుట్టూ తిరిగి ఇబ్బంది
పడాల్సిన పనిలేకుండా నేరుగా మీ కంప్యూటర్లోనే దర్శనం, వసతి, కళ్యాణోత్సవం,
నిజపాద దర్శనం, తోమాల సేవ వంటి వివిధ సేవల టిక్కెట్లని ఎంత సులభంగా బుక్
చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించాను.


ఏమీ ప్లాన్ చేసుకోకుండా అక్కడికెళ్లి దర్శనం చేసుకోవడం చాలా సందర్భాల్లో
ఇబ్బందికరంగానే ఉంటుంది.  అలా కాకుండా మీరు మీ కంప్యూటర్లోనే దర్శనం, వసతి
టిక్కెట్లు దొరికే తేదీల్ని పరిశీలించుకుని మీకు అనువుగా ఉన్న తేదీన
టిక్కెట్లు బుక్ చేసుకుని నేను వీడియోలో చూపించినట్లు ప్రింటౌట్లు తీసుకుని
వెళితే ఎలాంటి అసౌక్యరం లేకుండా శ్రీవారి దర్శనం సుఖవంతంగా ఉంటుంది.


గమనిక: శ్రీ వేంకటేశ్వరుని కొలిచే ప్రతీ భక్తునికీ ఉపయోగపడే ఈ వీడియోని
మీ మిత్రులతోనూ షేర్ చేయడం ద్వారా వారికి స్వామి వారి దర్శనభాగ్యం
కలగడానికి మీ వంతు సహకరించగలరు.


వీడియో లింక్ ఇది: http://bit.ly/srittdtickets

నెట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోబోయే RAR, ZIP ఫైళ్ల లోపల ఏమేం ఉన్నాయో ముందు ప్రివ్యూ చూసుకోండి

ఇంటర్నెట్‌లో తెలిసీ తెలియని వెబ్‌సైట్ల నుండి చాలామంది గుడ్డిగా ZIP, RAR ఫైళ్లని డౌన్‌లోడ్ చేస్తుంటారు. ఈ కంప్రెస్డ్ ఫైళ్లలో వైరస్‌లూ, కీలాగర్లు, ట్రోజాన్ల వంటివి నిక్షిప్తం చేయబడే అవకాశం ఉంది. సో గుడ్డిగా ఫైళ్లని డౌన్‌లోడ్ చేసుకోకుండా ఈ వీడియోలో నేను చూపించినట్లు మీరు డౌన్‌లోడ్ చేసుకోబోయే RAR, ZIP ఫైళ్ల లోపల ఏమేం ఉన్నాయో ముందు ప్రివ్యూ చూసుకోండి.. ఆ తర్వాతే సేఫ్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి.
గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

Address for Communication

Address card