Monday, July 10, 2017

దేశం అంటే మనుషులు కాదు మట్టే!



నిజం ‘గురజాడ’ వారని క్షమించమని కోరుతూ (కీర్తిశేషులు,గురజాడ అప్పారావు గారు 1910 సంవత్సరంలో రచించిన దేశమంటే మట్టి కాదోయ్‌,దేశమంటే మనుషులోయ్‌’ అన్నగేయం ప్రజల్లో దేశ భక్తిని ప్రబోధించి, దేశాభివృధ్ధికై ప్రజలను కార్యోన్ముఖుల్ని చేసింది),ఇప్పుడు మట్టికున్న విలువ మనిషికి లేదు.నిజంగా!
                       బీదరికం ఇంత భయంకరంగాఉంటుందా? పేదవాళ్ల జీవితాలు ఇంత దారుణంగా ఉంటాయా..పేదరికం ఇంత అనాగరికంగా ఉంటుందా..? పేదరికం ఇంత దరిద్రం గా ఉంటుందా? పేదరీకం ఇంత నీచంగా ఉంటుందా... ప్రజలకు ఇన్ని కష్టాలున్నాయా..ప్రజలకు ..ఇన్ని ఈతి బాధలున్నాయా..? మనుషులు..పందులు..సహజీవనం చేస్తున్నారని మాకెందుకు చెప్పలేదు..? మనుషులు..దోమలు..కలిసి బ్రతుకు తున్నారని..మాకు ఎందుకు తెలియచెయ్యలేదెందుకు .. మీ పేదరికాన్ని..నేను నిర్మూ లిస్తాను...మీకోసం..కాంక్రీటు ఇళ్ళు కట్టిస్తాను..మీకు తాగటానికి బిస్లరీ వాటర్ ప్లాంట్ ప్రతి ..బస్తీ లోనూ ఏర్పాటు చేస్తాను ..ప్రతి ఇంటికీ కంప్యూటర్....ఆనందం కోసం..ఇంటింటికీ ఎల్ సీ డీ టీ వీలు ..ప్రతి స్లం లోనూ ..అంతర్జాతీయ స్థాయిలో..వాలీబాల్ కోర్టులు....ఫుట్బాల్ కోర్టులు... ఒక్కటేంటి.. స్వర్గం మీముందుకు తెస్తాను.ఒక వేళ ..మీరు చనిపోతే..గంధపు చెక్కలతో తగలబెట్తిస్తాను......బూడిదను..గంగానదిలో ..మేమే..కలిపే క్రియలకు ఈ క్షణం నించే..శ్రీ కారం చుడుటున్నాము...
                 కొంచెం మార్పుతో అటూ ఇటూ గా..60 సంవత్సరాలనించి వింటున్న మాటలివేగా.అన్ని పార్టీలు ఇచ్చే హామీలు ఇలాగే వుంటాయి. ప్రభుత్వం ఇన్ని పధకాలు,ఇన్ని సబ్సిడీలు ,మరెన్నో వరాలు ఎన్నో సహాయాలు ,కానీ  ప్రజల జీవితాలు  అయోమయంగా! ఎందుకని?
 మన ముందు తరాలవాళ్ళు స్వాతంత్ర్యం కోసం ..నాశనమయ్యారు . వచ్చిన స్వాతంత్ర్యాన్ని ..నిల్పుకో లేక మనం నాశన మవుతున్నాము .... మన భవిష్యత్ తరాలు సంగతేంటి.....ఒక్క సారి ఆలోచించండి.. అందుకే..మనల్ని..ప్రతిసారీ నమ్మిస్తూ ‘కొనుక్కుంటూ’ ‘అమ్ముతుంటే’.. ..మనమున్నదే అమ్మ కానికనుకుంటున్నారు..మనం ఆనందంగా అమ్ముడు పోతున్నాం,ప్రతీ సేవా తిరిగి కొనుక్కుంటున్నాం..అమ్మకం కొనుగోలు రెండూ ఉన్నాయి మరి లాభాలెవరికి?
                ప్రలోభ పెట్టే రాజకీయ నాయకులని..ఇక నమ్మటం మానేయండి.ప్రభుత్వం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు..ప్రభుత్వం అంటే..దొంగసారా బట్టీ కాదు.ప్రభుత్వం అంటే ..ఇసక స్మగ్లింగ్ కాదు ..గనుల్ని దోచెయ్యటంకాదు..ప్రజా ధనం లూటీ కాదు.. ప్రభుత్వం అంటే మాఫియా కాదు..ప్రభుత్వం అంటే లాభనష్టాల MNC కంపనీ కాదు
         ...ప్రభుత్వం అంటే ..వ్యాపారం కాదు సేవ.....ప్రజలకి అండ, గుదిబండ కాదు.ప్రభుత్వం అంటే ప్రజలు ..మీరు నేను మనమందరం ..మన నిన్నటి,నేటి,రేపటి తరం.. అందుకే యువకులారా మన రేపటి తరం కోసం..అక్షారాలని కొత్త ఆనకట్టలని చేసి..కొత్త భావాలతో వ్రాయండి.,కొబ్బరాకు సందులో వెన్నలని,సముద్రతీరాల్ని, అందాల వర్ణన వదిలి నిజ ప్రపంచంలోకి రండి. ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card