Tuesday, July 18, 2017

యాయిరే.. యాయిరే.. వారెవా ఇది ఏం జోరే.





కలలు అందరికీ ఉంటాయి.. కానీ వాటిని అందరితో  పంచుకోగలిగే వాళ్ళు తక్కువ. అందరూ ఏమనుకుంటారో అని ఒకవైపుకలలేవీ నెరవేరకపోతే నవ్వుతారేమో అన్న భయం ఇంకో వైపు.. ఇవన్నీ పట్టి ఆపుతూ ఉంటాయి. కానీ, ఆ టీనేజ్ అమ్మాయి అలా కాదు. అందరిలో ఒకరి గా బతకడానికి అమెకు ఇష్టం లేదు.. అందరిలోనూ ప్రత్యేకంగా నిలబడాలి, తన గురించి అందరూ చెప్పుకోవాలి అన్నది ఆమె కల. తనకంటూ ఓ స్థానం సంపాదించుకోవాలన్నది ఆమె కోరిక..
ఎవరేం అనుకుంటారో అన్న భయం  లేని ఆ అమ్మాయి తన కలలని గురించి ఎలా చెబుతుంది? గొంతెత్తి  ధైర్యంగా చెబుతుంది.. ఆత్మ విశ్వాసం తో చెబుతుంది. కేవలం ఆశల్ని మాత్రమే చెప్పిఊరుకోదు. వాటిని నెరవేర్చుకునే మార్గాల గురించీ, అందుకు పడాల్సిన శ్రమని గురించీ కూడా చెబుతుంది. అలా శ్రమ పడడానికి తను సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి ఏమాత్రం  మొహమాట పడదు కూడా.. ఈ చెప్పడం అన్నది మాటల్లో కాక పాటగా అయితే?
రాసింది:  ‘సిరివెన్నెలసీతారామశాస్త్రి.
సంగీతం: ఏఆర్ రెహ్మాన్.

 ఛిత్రం: ‘రంగేళి’ (1995)
గొంతులో పడుచుదనాన్ని పలికించే గాయని, ఇంకెవరు మన జానకమ్మే. జానకమ్మ అని ఎందుకన్నానంటే, ఈ పాట పాడినప్పుడు జానకి వయస్సు 56. పాడిందేమో పదహారేళ్ళ పడుచు పిల్లకోసం.యాయిరే.. యాయిరే.. వారెవా ఇది ఏం జోరే..’ పాట వింటూంటే.. వారెవా వచ్చిన చోటల్లా ఒక్కోసారి ఒక్కోలా పలకడం,
వారెవా’ జానకి అనకుండా వుండలేము.

P.S: I am not talking about movie, I am talking only about song especially about “JANAKI”.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card