Friday, June 29, 2018

లైసె ఫెయిర్ (laissez-faire)



                         లైసె ఫెయిర్ (laissez-faire)  అని ఇంగ్లీష్ లో ఓపదం వుంది.అంటే ప్రభుత్వ నియంత్రణ అనేది దాదాపు లేకపోవడం. దేంట్లోనూ ప్రభుత్వం జ్యోక్యం చేసుకోకపోవటం .అంతా పెట్టుబడిదారీ కంపెనీల ఇష్టారాజ్యానికి వదిలివేయడం. కేవలం ఆస్తి హక్కులను (అది కూడా బడా ధనికుల ఆస్తి హక్కులు మాత్రమే అని ప్రత్యేకంగా  చెప్పనవసరం లేదు) సంరక్షించడానికి తప్ప ప్రభుత్వం మిగిలినవన్నీ వదిలేయాలన్న అవగాన దానిలో ఇమిడి ఉంటుంది.
అయితే ఇది ఊహలకే పరిమితం. ఇటువంటి పరిస్ధితి ఆధునిక చరిత్రలో ఎక్కడా, ఏ దేశంలో లేదు.
ప్రభుత్వాలు అవసరం అయితే దాని నిర్వహణకు సిబ్బంది కావాలి. ఆ సిబ్బంది సేవలకు మరికొంత సిబ్బంది కావాలి. ఆ సిబ్బంది సేవలకు ఇంకా సిబ్బంది కావాలి. ఇది చివరికి నాలుగోతరగతి ఉద్యోగుల దగ్గర ఆగుతుంది. అంటే ఈ నాలుగు లేదా ఐదు మెట్ల సిబ్బంది మొత్తం ఆ ప్రభుత్వాలను ఆధిపత్యంలో ఉంచుకునే ధనికవర్గాలకు సేవలు చేయడానికే అన్నమాట!  దీన్నే బ్యూరోక్రసీ అంటున్నారు.
               బ్యూరోక్రసీ ఉండగానే సరిపోదు. జనాన్ని అదుపులో ఉంచడానికి బలగం కావాలి. అది సాయుధమై ఉండాలి. వాళ్ళే పోలీసులు, పారా మిలట్రీ, సైన్యం. ఆ తర్వాత  రాజకీయ నిర్వహణ కోసం చట్ట సభలు ఉండాలి. ఆయా ధనిక గ్రూపుల మధ్య తగాదా తీర్చే వ్యవస్ధ (కోర్టులు) ఉండాలి. కోర్టులు అందరి కోసం అనుకుంటారు గానీ వాస్తవానికి వాటి అసలు ఉద్దేశ్యం ధనిక పెత్తందార్ల తగాదాలు తీర్చి పరస్పర ఆమోదయోగ్యమైన ఒప్పందాలు కుదర్చడమే. అలాగని పచ్చిగా చెప్పలేరు గనక ప్రజాస్వామ్యం పేరుతో అందరి తగువులూ తీర్చుతున్నట్లు నటిస్తారు. కానీ సరిగ్గా గమనిస్తే సామాన్యులకు న్యాయం ఎప్పుడూ అందుబాటులో ఉండదని చూస్తూనే ఉన్నాం. అలాగే పోలీసుల వద్ద కూడా సామాన్యుడికి అరుదుగా ప్రవేశం దొరుకుతుంది.
                         ఇవన్నీ, అనగా బ్యూరోక్రసీ, చట్ట సభలు, కోర్టులు, రక్షణ బలగాలు అన్నీ కలిసినదే రాజ్యం. పరిమిత అర్ధంలో దీన్ని ప్రభుత్వం అంటున్నాం. డబ్బు పెట్టుకోగలిగినవాడికే ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. అంటే రాజ్యం అనేది డబ్బున్నవాడి కోసమే పని చేస్తుంది. సామాన్యులను పాలిస్తుంది. రాజుల కాలంలోరాజ్యం వీరుల భోజ్యంఅన్నారు. ఇప్పుడు కూడా అదే నిజం. కాకపోతే వీరులకు అర్ధం ఇప్పుడు కత్తి తిప్పేవాడని కాకుండా నోటు తిప్పేవాడని చెప్పుకోవాలి. నోటు తిప్పేవాళ్లెవరు? ఇంకెవరు, ధనిక వర్గాలు. వారికి రకరకాల పేర్లు: భూస్వాములు, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులుఇలా!
                       కాబట్టి లైసె ఫెయిర్ అనేది ఎన్నడూ ఆచరణలో లేదు. సాధ్యం కాదు కూడా. పెట్టుబడిదారుల ప్రయోజనాల రీత్యా కూడా అది సాధ్యం కాదు. సాధ్యం అయితే పెట్టుబడి గ్రూపుల మధ్య తగాదాలు పరిష్కారం చేసే రాజ్యాంగ యంత్రం బలహీనంగా ఉండి వారిని కూల్చివేసే శ్రామికవర్గ విప్లవాల పని సులువవుతుంది.
                     నూతన ఆర్ధిక విధానాలకూ లైసె ఫెయిర్ కూ తేడా ఇప్పటికే గ్రహించి ఉంటారు మీరు

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Tuesday, June 26, 2018

మీరేమంటారు


ఒక తాగుపోతు లాయర్ వద్దకు వచ్చి ఇలా అడిగాడు" నేను ప్రభుత్వఅనుమతి ఉన్న షాపుల్లోనే మందు బాటిల్ కొని ఇంటికి తెచ్చుకున్నాను కానీ ,నా భార్య తాగనివ్వటం లేదు ,ప్రభుత్వ్య పనికి ఆటంకం కలిగించినందుకు నా భార్య మీద కేసు పెట్టవచ్చా?" అని. మీరేమంటారు

దిక్కులేని దేవుడు




ఇంతకీ తిరుమల శ్రీవారికి ఎన్ని ఆభరణాలు ఉన్నాయి? వాటి విలువ ఎంత? శ్రీవారి నగలకు విలువ కట్టే షరాబు ఎవరైనా ఉన్నారా? అది సాధ్యమేనా? బెజవాడ గోవిందరెడ్డి అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టులో దాఖలు చేశారు. అసలు శ్రీవారికి ఉన్న ఆస్తులు.. ఆయనకు బంగారం, వెండి ఇతర రూపాల్లో ఉన్న ఆభరణ, వస్తువుల విలువెంత అన్నది ఆయన ప్రశ్న... ఆభరణాలు అసలు ఎన్ని ఉన్నాయంటూ హై కోర్టు ఆదేశించిందే కానీ, అది ఎంతవరకు సాధ్యమన్నది ప్రశ్న...
 
  కోనేటి రాయడిని చూసేందుకు రెండు కళ్ళూ చాలవు. ఆ విగ్రహ సౌందర్యం అద్భుతం. అలాంటి స్వామివారు సర్వాలంకార భూషితుడైతే... ఇక చెప్పేదేముంది. నూనె దీపాల వెలుతురులోనే స్వామివారి వైభవాన్ని రోజూ మనం దర్శించుకుంటున్నామంటే ఆ అలంకారాల గురించి ఏమని చెప్పేది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం దాదాపు 11 టన్నుల ఆభరణాలు శ్రీవారి సొంతం.. ఒక్కో సేవకు ఒక్కో రకమైన ఆభరణం.. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల వారి తొలి కిరీటాన్ని సమర్పించటంతో మొదలైన ఆభరణాల వెల్లువ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
.. ఇప్పటి వరకు బహిరంగంగా తెలిసిన లెక్క ప్రకారం శ్రీవారికి ఏడు కిరీటాలు ఉన్నాయి. వీటిలో వజ్రాల కిరీటంతో పాటు, గద్వాల మహారాణి కిరీటం లాంటివి ముఖ్యమయినవి. తరువాత సువర్ణ పద్మపీఠం, సువర్ణ పాదాలు, నూపురాలు, పగడాలు, కాంచీగునము, ఉదర బంధము, దశావతార హారము, వడ్డాణము, చిన్న కంఠాభరణము, బంగారు పులిగోరు, సూర్య కఠారి, నాగాభరణాలు, స్వర్ణ పద్మాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో.... లెక్కకు అందనన్ని ఉన్నాయి. ఇలాంటి వాటిని లెక్కించటానికి ఎంత సమయం పట్టాలి



        ఏ కిరీటంలో ఎన్ని వజ్రాలు పొదిగి ఉన్నాయి. ప్రస్తుత కాలంలో వాటి ఖరీదు ఎంత? అని లెక్కలు కట్టే వ్యవస్థ టిటిడికి ఇప్పటిదాకా లేదు. ఇంతకు ముందు తమిళనాడులోని ఓ సంస్థ శ్రీవారి నగల విలువ కట్టేదట.
        వెంకన్న నగల విషయంలో లెక్కలేకపోవటం వల్లే


 తిమింగళాలు బొక్కసాన్ని మెక్కేస్తున్నాయి. ప్రాచీన ఆభరణాల్లో పొదిగిన వజ్రాలు మార్పిడికి గూడా గురైనట్లు వస్తున్న ఆరోపణలకు సమాధానం లేదు. ఇందుకు తార్కాణం టిటిడి దగ్గరే ఉంది. ఇవాళ ఓ చానల్లో ప్రసారమైన కథనంలో డాక్యుమెంట్‌ ఎవిడెన్స్ ను కూడా ప్రదర్శించారు.. మీడియా ముందుకు వచ్చి దుఃఖపడ్డారు.. కానీ, నగల గురించి జరిగిన విచారణలో టిటిడి సమర్పించిన ఓ అఫిడవిట్‌లో కొన్ని ముత్యాలు, పచ్చలు, ఇతర విలువైన రాళ్ళు కనిపించకుండా పోయినట్లు ఒప్పుకుంది. వింతల్లోకెల్లా వింతేమిటంటే.. పోయిన రాళ్ళు, పచ్చలు, ముత్యాల విలువ ఒక్కోటి పది రూపాయలు.. ఇరవై రూపాయలకు మించి లేదట.. రాయల వారి కాలంలోనూ వాటికి ఇంత చీప్‌ రేట్లు ఉండవేమో... ఇంత చౌకైన రత్నాలు.. రత్నాలేనా? లేక రాళ్లా? అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఈ విధంగా లెక్కలు గట్టడం, వాటిని స్వామివారికి సమర్పించిన భక్తులను అవమానించటం.. ఆ ఆభరణాలను విలువైనవిగా భావించి ధరిస్తున్న స్వామి వారిని దారుణంగా మోసం చేయటం...
 
     20 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలూ గల్లంతయ్యాయి. వీటికి జవాబు ఇప్పటి వరకు ఎవరి నుంచీ రాలేదు.. టిటిడి చైర్మన్‌కు తిరుగే లేదు.. రెండువేల విఐపి దర్శనాలను పదహారు వేలు చేస్తారు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వమూ వేచి చూసే ధోరణిలో ఉంది. ఇంత జరిగాక కూడా అవకతవకలను అరికట్టడానికి పూనుకోకపోతే... భక్తుల ‘భక్తి సమర్పణ’ భోక్తల పాలు కావటం దానిని ఆపటం ఎవరితరం కాదు...పాపం పండితే కానీ, దాన్ని రాల్చలేమంటారు.. మరి భగవంతుని సొమ్మును మింగుతున్న వారి పాపం పండేదెప్పుడో?
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Thursday, June 21, 2018

నువ్వే నచ్చినట్టు బతికి చూడు




ఫలానా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి గంటకు లక్ష సంపాదిస్తే నెలకెంత అనే లెక్కలు పెట్టే జెనరల్ నాలెడ్జ్ (?) ప్రశ్న వల్ల ఉపయోగమేమిటి? నువ్వు కూడా సంపాదించి లెక్క పెట్టుకోవాలి తప్ప.. అలాగే ఫలానా దేశంలో నెమళ్ళు తెలుపు రంగులో ఉంటాయని , మరో దేశంలో దోమలు కుట్టకుండా ఉంటాయని చదువుకోవటం దేనికి? నిజంగా కావాలంటే వెళ్ళి చూడాలి తప్ప.... నీకు స్మశానంలో దెయ్యాలుంటాయో లేదో నిజంగా తెలుసుకోవాలంటే దెయ్యం కథలు చదవటం కాదు ఈ రాత్రే వెళ్ళి చూడు.. ఇంకా అన్నం ఉడికిందా లేదా అని మెతుకును పట్టుకొని చూడటమెన్నాళ్ళు చేస్తావు ఎన్ని నీళ్ళు పోస్తే నీకు ఆ అనుమానం రాకుండా ఉడికిపోతుందో నేర్చుకోలేవూ? ఈత కొట్టాలంటే ఒడ్డున కూర్చొని చూడటం కాదు నీళ్ళల్లో దూకాలి.. వర్షం లో తడవటం బావుంటుందని ఎవరో చెప్తే వినటం కాదు నిజంగా తడిస్తేనే ఎందుకు బావుంటుందో తెలియాలంటే తడిచి చూడు.. ఫైనల్లీ బతకటం ఎలా బావుంటుందో వాడూ వీడూ చెప్పటం కాదు.. నువ్వే నచ్చినట్టు బతికి చూడు !
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Friday, June 15, 2018

తల్లిదండ్రులకు ఓ సామాజిక బాధ్యత వుంది




వారం క్రితం ఒక పెద్దాయనను కలిశాను.. ఏవో పర్సనల్ విషయాలు మాట్లాడుకున్నాం.
వాళ్ల ఇంట్లో టీవీ లేదు. పదివేలు పెడితే టీవీ వస్తుంది కదా.. కొనుక్కోవచ్చు కదా అని కొందరు మిత్రులు ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఇంట్లో టీవీ వద్దనుకుని కొనుక్కోలేదు.
పిల్లలు సెవన్త్, టెన్త్, ఇంటర్ చదివేప్పుడు కేబుల్ కనెక్షన్ కట్ చేయించడం వేరు.. అసలు టీవీ అనే అలంకరణ లేకుండా వుండడం వేరు.ఈ రోజుల్లో మరీ తక్కువ
ఆ పెద్దాయనకు ఒక ఆఫీసు వుంది. ఆయనకు ఒక కొడుకు. ,చదువుతున్నాడు. శని, ఆదివారాలు ఆఫీసుకు వచ్చి పనిచేస్తేనే స్కూలు ఫీజులు కడతానని తండ్రి నిక్కచ్చిగా చెప్పాడు. ఆ పిల్లాడు శనాదివారాలు ఆఫీసుకు వచ్చి తనకు చేతనైన పని చేస్తుంటాడు.
...
సరిగ్గా నిన్ననే.. ఓ మీడియా వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. వారి ప్రొఫైల్ చూశాను. ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేత కంకర రాళ్లు మోయించడం, బడి శుభ్రత కార్యక్రమంలో పిలకాయలను కూలీలుగా వాడుకోవడం గురించి తాను రాసిన కథనం, అది పత్రికలో అచ్చయిన వైనం గురించి ఓ పోస్టు వుంది.
...
పిల్లలకు చదువు ఎంత అవసరమో పనికూడా అంతే అవసరం. పిల్లలతో పనిచేయించడం బాలకార్మికత్వం కాదు. అది వారి ఎదుగుదలకు పనికొచ్చే విషయమే.
అసలు మనకు.. మన పిల్లలు Multiple Tasks ఎదుర్కోవడం, నేర్చుకోవడం ఇష్టం వుండదు. సింగిల్ టాస్క్, సింగిల్ ఎయిమ్, సింగిల్ టార్గెట్ వుండాలనుకుంటాం.
...
మనకు సినిమా ప్రభావాలు బాగా వుంటాయి. పేద పిల్లాడు.. రోజుకు ఇరవై గంటలు వెట్టి చాకిరీ చేస్తుండడంలాంటి సినిమా ప్రభావాలు బాగా వుంటాయి. కానీ.. ఓ సంపన్న కుర్రాడు, ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు.. రోజుకు ఇరవై నాలుగు గంటలు చదువు తో పాటు చాకిరీ చేస్తుండడంలాంటివి మనకు కన్నుకానవు.
...
పిల్లలను చదివించండి.. కానీ పనిచేయించండి.
అంట్లు తోమడం, ఇల్లు ఊడవడం, కలుపు పీకడం, గొడ్లను మేపడం దగ్గరనుంచి అన్ని పనులను నిర్దాక్షిణ్యంగా చేయించండి. చేయకపోతే ఈత బరితెతో నాలుగు పీకులు పీకండి. వీపుమీద వాతలు తేలాయని వాడు టీవీ నైన్ దగ్గర మొరపెట్టుకొని నాలుగు మార్కులు సంపాదించుకుంటే సంపాదించుకోనివ్వండి.
...
కానీ తల్లిదండ్రులకు ఓ సామాజిక బాధ్యత వుంది. వారి మీద ప్రేమతో దాన్ని మర్చిపోకండి
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card