Saturday, September 29, 2018

పరోక్షంగా హిందూ సమాజ సంస్కృతి పై దాడి


హిందూత్వం .కులానికి సంభందించి కాదు మతానికి సంభందించి నది. హక్కులు కాదు ఆచారాలు  గురించి. అసలు హిందూత్వం నచ్చలేదు అంటే అసలు వాదనే లేదు .ఎవరి నమ్మకం వారిది కాబట్టి
      నెలసరి సాకుగా ఆలయ ప్రవేశం నిషిద్ధమనడం.. రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం తెలిపింది. నాకు తెలిసీ  హిందు ధర్మాన్ని నమ్మిన ఏ స్త్రీ కూడా ఆ సమయయంలో స్వంత ఇంట్లో కూడా దేవుడి కి పూజ సంగతి తర్వాత, పటం కూడా తాకదు   
      శబరిమలలో అయ్యప్ప సన్నిధానంలోకి ఆడవారిని రానివ్వనిదీ స్త్రీలంటే ద్వేషంతో కాదు. అయ్యప్ప నైష్ఠిక బ్రహ్మచారి. దేవుడికే కాదు.. అక్కడికి వెళ్ళే భక్తులకూ బ్రహ్మచర్యం తప్పనిసరి. 41 రోజుల అయ్యప్ప దీక్షకు మాలవేసుకున్న తరవాత కుబేరుడైనా, చక్రవర్తి అయినా కటిక నేలమీద ఆడ వాసన తగలకుండా ఒంటరిగా పడుకోవలసిందే. కఠోర బ్రహ్మచర్య దీక్షకు ముక్తాయింపుగా వేలూ లక్షల భక్తులు కిక్కిరిసి దర్శనం చేసుకునే ఇరుకైన దివ్య సన్నిధిలోకి వయస్సులోని స్త్రీలను అనుమతిస్తే అవాంఛనీయ ఘటనలు జరగవచ్చు. అవాంఛనీయ ధోరణులు ప్రకోపించవచ్చు. మామూలు మనుషులకు దేవుడినుంచి ధ్యాసమళ్లి, భక్తిపోయి రక్తి కలిగి, మగరాయుళ్లకు గుబులు పుట్టవచ్చు. అది ఆయా మహిళల క్షేమానికి మంచిది కాదు.
    క్షేత్రం పవిత్రత చెడుతుంది. స్థల మహత్మ్యం సన్నగిల్లుతుంది. దివ్యశక్తిని కోల్పోయాక ఆ క్షేత్రానికి వెళ్ళే ప్రయోజనం ఉండదు. నాస్తికుల, హేతువాదుల సరదా షికారుకు విహార కేంద్రంగా మాత్రమే అది పనికొస్తుంది. భక్తిగల పురుషులూ, స్త్రీలూ ఇక అక్కడికి పొమ్మన్నా పోరు.

       ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే శబరిమల దేవస్థానం దైవసన్నిధిలో మహిళల ప్రవేశాన్ని మొదటినుంచీ నిషేధించింది. ఈ నిషేధం కూడా బహిష్టు ప్రాయమైన 10 నుంచి 50 ఏళ్ళలోపు స్త్రీలకు మాత్రమే వర్తిస్తుంది. 10 లోపు, 50 పైన వయస్సుగల స్త్రీలను రానివ్వటానికి అభ్యంతరం లేదు. కనుక అయ్యప్ప స్వామిని పక్కా స్త్రీ ద్వేషి అనడానికి వీల్లేదు. ఈ ఆంకక్షూడా ఆ ఒక్క గుడిలోనే. దేశమంతటా, ఊరూరా ఉన్న ఏ అయ్యప్ప గుడిలోకైనా 10-50 వయోవర్గం సహా అన్ని వయస్సుల మహిళలూ నిక్షేపంలా వెళ్లవచ్చు.
           దేశమంతటా లక్షోపలక్షల దేవాలయాల్లో అన్నిటా స్త్రీ పురుషులకు సమాన ప్రవేశం ఉన్నా సరే... ఒక్కచోటే వేరే కట్టుబాటు ఉన్నది కనుక మహిళా హక్కులు మంట కలిశాయంటూ గగ్గోలు పెట్టాలా? ఆ ఒక్కచోట కట్టుబాటును పనిగట్టుకుని చట్టుబండలు చేస్తే తప్ప హేతువాదులు, హక్కులమ్మల కళ్ళు చల్లబడవా? అంత ప్రేమ ఆలోచన కలిగిన మేధావులు మిగిలిన మతాలలోని లోపాలని ఎందుకు  అడగరు
           ఇది మితవాద, వామపక్ష, స్త్రీవాదానికి సంబంధించిన అంశం కాదు, ఇది మేధావి తనం కాదు
పరోక్షంగా హిందూ సమాజ సంస్కృతి  పై దాడి
           

ఏది సంప్రదాయం? ఏది స్వేచ్ఛ? ఏది జోక్యం?





ప్రపంచమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటోంది. మనం మాత్రం మహిళలను ఆలయంలోకి అనుమతించాలా, వద్దా? అనే అంశం దగ్గరే ఊగిసలాడుతున్నాం!
             ఆ మధ్య ఒక మహిళా జర్నలిస్ట్‌ రాసిన వ్యాసంలో ఒలకబోసుకున్న ఆవేదన ఇది. శబరిమలైలోని స్వామి అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించడం గురించిన వివాదం కేరళ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు వెళ్లిన నేపథ్యంలోనే ఆమె ఆ వ్యాసం రాశారు. మనం’…. అంటే…. మొత్తం భారతదేశంలో మహిళల గురించి…. మాత్రం ‘…కాదు. కేవలం హిందూ మహిళల గురించి మాత్రమే ఆమె బాధ

ఇంతకీ అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చునా లేదా అంశం మీద నిర్ణయించే అధికారం కోర్టుల పరమైంది. తాజాగా సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. అంతకు ముందు కేరళ హైకోర్టులో జరిగాయి.      

                                     క్రైస్తవ సంప్రదాయంలో కూడా కొన్ని మతాచారాలలో స్త్రీలకు పరిమితులు ఉన్నాయి. కానీ వాటి గురించి చర్చించే అధికారం ఎవరికీ లేదంటున్నాయి ఆ వర్గాలు. చర్చిలలో అపరాధాలు ఒప్పుకునే కార్యమ్రాన్ని రద్దు చేయాలంటూ జాతీయ మహిళా కమిషన్‌ చేసిన సిఫారసులను అదే కేరళ చర్చి పెద్దలు, జాతీయ మైనారిటీ కమిషన్‌ తూర్పార పట్టాయి. మహిళా కమిషన్‌ చేసిన సిఫారసులు క్రైస్తవుల మనో భావాలను కించపరిచేవేనని ఎలాంటి శషభిషలు లేకుండా ప్రకటించాయి. క్రైస్తవుల మత విషయాలలో ఇతరుల జోక్యం సహించేది లేదని మైనారిటి కమిషన్‌ అధ్యక్షుడు ఘాయోరుల్‌ హసన్‌ రిజ్వి జూలై 29న మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మను హెచ్చరించడం కూడా జరిగిపోయింది.
                            ముస్లిం మహిళలకు వారి ప్రార్థనా స్థలాలలోకి అనుమతి ఉండదు.
                             ఈ రెండు అంశాల గురించి మాత్రం ఇతరులుఎవరూ మాట్లాడకూడదు. కానీ చిరకాలం నుంచి వస్తున్న ఒక హిందూ ఆచారం గురించి కోర్టులు తమ అభిప్రాయాలను యథేచ్ఛగా వెల్లడించవచ్చునా? కోర్టుల కంటే ముందే మీడియా తీర్పులు ప్రకటించ వచ్చునా? కాబట్టి ఆ మహిళా జర్నలిస్ట్‌ మహిళలకే సంబంధించిన ఈ రెండు అంశాల మీద కూడా    ఎందుకు స్పందించలేదు ? స్పందించాలని కోరుకుందాం. అయితే అది దురాశే అవుతుంది. అది వేరే విషయం. మరొక వాస్తవాన్ని కూడా గుర్తించాలి. భారతదేశంలో దాదాపు 99 శాతం ఆలయాలలో మహిళల ప్రవేశం మీద ఎలాంటి ఆంక్షలూ లేవు. కొన్నిచోట్ల మూలవిరాట్టును తాకుతూ అర్చనలు చేసే హక్కు కూడా ఉంది
                హిందూ ధర్మంలో ఏదైనా ఆరాధనకీ, విశ్వాసానికీ దేవుని ప్రతిమ, ఆలయం, గర్భగుడి వంటివి కీలకంగా ఉంటాయి. ఇది మితవాద, వామపక్ష, స్త్రీవాదానికి సంబంధించిన అంశం కాదు. ఇది మనోభావాలకి సంబంధించింది.
 అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు సైతం ప్రవేశం కల్పించాలని కోరుతున్నవారు హిందూ ధర్మం పట్ల కనీస మర్యాద ఉంటే దేవుడు ఆ ధర్మం చెబుతున్న వాస్తవాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Tuesday, September 25, 2018

హిందూ మతంలో నేను ఇంతవరకు నేర్చుకోన్నదేమిటి?





సప్త సముద్రాల లోతు కలిగిన విజ్ఞానం ఉన్న నా మతం నుండి నేను ఎందుకు ఏమి నేర్చుకోలేక పోయాను?  అవును తప్పు నాలోనే ఉందా? నేను ఇప్పుడు గుడికి వెళితే జరిగేది ఏమిటో నాకు ముందే తెలుసు. ఒక కౌంటర్ ఉంటుంది, అక్కడ అర్చన, కళ్యాణం, అభిషేకం టికెట్స అమ్ముతారు, ఏదో ఒకటి కొనాలి అంతే. అలా కాకుండా ఏదైనా ధర్మ సందేహాలు నివృతి చేసుకోవడానికి గుడికి వెళ్ళే రోజులు పోయాయి.  పూర్వం గుడిలో  యోగులు, యోగ భ్యాసం , మంత్రం, ధ్యానం నేర్పెవాళ్ళట!,  ఒకరో ఇద్దరో యోగులు నిత్యం ఉండే వాళ్ళట!, కాషాయ బట్టల్లో తెల్లగా నెరిసిన గడ్డంతో ఉన్న నిజమైన ఋషులను గురించి కధల్లో చదవటం తప్ప గుళ్ళలో చూసిన గుర్తు లేదు. అయినా.. గుడిని కూడా బిజినెస్ గా నడుపుతుంటే , ఇక్కడకు ఋషులు  ఎవరు వస్తారు?  వస్తే ఋషుల ముసుగులో  స్వామిజిలు రావాలి.  వాళ్ళ ఖర్చులు కూడా టెంపుల్ వాళ్ళే పెట్టుకోవాలి!.  నాకు మాత్రం నేనొక అర్చన టికెట్ కొనే యంత్రం గా మిగల దలుచుకోలేదు!,  నాకు నేర్చుకోవాలనుంది, మన కష్టాలను తీర్చి, సుఖాల తీరం చేర్చే వేదాల్లో ఉన్న మంత్రాలను నా నోటితో పలకాలనుంది.  నేను దేవుడిని తెలుసు కోవాలంటే అది నా మనసు దేవుని మీద పెట్టి చేసే  ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం. నేను నేర్చుకొనే మంత్రాలు నాకు మానసిక శక్తి ప్రసాదించు గాక, నా ధ్యానం నాకు ప్రశాంతత చేకూర్చు గాక.  హిందూ మతం లో సారాన్ని వదిలి, దానికి  ఎంతో సులువైనది గా మార్చి, కేవలం నేను కొన్న అర్చన టికెట్ నాకు మోక్షం ప్రసాదిస్తుంది అన్న బ్రమలు నాకు కలగకుండు గాక.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Address for Communication

Address card