Showing posts with label DIGITAL ECONONY. Show all posts
Showing posts with label DIGITAL ECONONY. Show all posts

Friday, November 01, 2019

సిబిల్ ద్వారా రుణ చరిత్ర పొందే విధానం

రుణం పొందాలంటే బ్యాంకులు, సంస్థలు ముందుగా కోరేది రుణ చరిత్ర. సిబిల్ ద్వారా రుణ చరిత్ర పొందే విధానం తెలుసుకుందాం.


సిబిల్‌ అంటే క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(ఇండియా) లిమిటెడ్‌. ఇంకా సులువుగా చెప్పాలంటే రుణ చరిత్రలను అందించే సంస్థ.  సిబిల్‌ వ్యక్తులకు చెందిన రుణాలు, క్రెడిట్‌ కార్డుల చెల్లింపు వ్యవహారాలు వంటి సమాచారాన్ని  సేకరించి నివేదికలు తయారుచేస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్‌కు అందజేస్తాయి. ఈ సమాచారాన్ని ఉపయోగించి సిబిల్‌ రుణ చరిత్ర నివేదిక, క్రెడిట్‌ స్కోర్‌ను తయారుచేస్తుంది. వీటిని ఆధారంగా చేసుకుని బ్యాంకులు రుణ దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటాయి


సిబిల్‌ అంటే క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(ఇండియా) లిమిటెడ్‌. ఇంకా సులువుగా చెప్పాలంటే రుణ చరిత్రలను అందించే సంస్థ.  సిబిల్‌ వ్యక్తులకు చెందిన రుణాలు, క్రెడిట్‌ కార్డుల చెల్లింపు వ్యవహారాలు వంటి సమాచారాన్ని  సేకరించి నివేదికలు తయారుచేస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్‌కు అందజేస్తాయి. ఈ సమాచారాన్ని ఉపయోగించి సిబిల్‌ రుణ చరిత్ర నివేదిక, క్రెడిట్‌ స్కోర్‌ను తయారుచేస్తుంది. వీటిని ఆధారంగా చేసుకుని బ్యాంకులు రుణ దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటాయి.

క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ స్కోర్‌(సీఐఆర్‌) అంటే:

సీఐఆర్‌ అంటే సిబిల్‌ జారీ చేసే మూడంకెల సంఖ్య. ఇది రుణ చరిత్ర ఆధారంగా నిర్ణయమవుతుంది. ఇందులో నిర్ణీత కాలానికి సంబంధించి ఒక వ్యక్తి చేసిన రుణ చెల్లింపుల వివరాలు ఉంటాయి.

క్రెడిట్‌ స్కోర్‌ కోసం సిబిల్‌ వద్ద నమోదు చేసుకునే పద్ధతి:

ఆన్‌లైన్‌ ద్వారా:

  • క్రెడిట్‌ స్కోర్‌, రుణ చరిత్ర ఆన్‌లైన్‌లో సిబిల్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
    పాన్ ఉన్నవారు నిమ్పవలసిన వివరాలు కింది విధంగా ఉంటాయి.

    CIBIL-A.jpg
పాన్ లేనివారు నిమ్పవలసిన వివరాలు:


  • నిర్దేశించిన రుసుమును ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి.
  • వివరాలను ఆన్‌లైన్‌ నమోదు ద్వారా ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.
  • ధృవీకరణ పూర్తయిన తర్వాత రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోర్‌లను మెయిల్‌ ఐడీకి పంపిస్తారు.

ఆఫ్‌లైన్‌ ద్వారా:

  • పోస్ట్ ద్వారా సైతం ప‌త్రాల‌ను పంపి నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది.
  • మొదట వెబ్‌సైట్ నుంచి నమోదు పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • నమోదు పత్రంలో వివరాలను నింపాలి.
  • నమోదు పత్రానికి, కేవైసీ పత్రాలు, నిర్దేశించిన రుసుము  డీడీని జతపరుస్తూ నిర్దేశిత చిరునామాకు పోస్ట్‌ చేయాలి.
  • సిబిల్‌కి సీఐఆర్‌ కోసం ఆన్‌లైన్‌లో ఒక మెయిల్‌ను పంపించాలి.
    నమోదు పూర్తయిన తర్వాత మీ మెయిల్‌ ఐడీకి సమాచారం వస్తుంది.

ఉచితంగా రుణచరిత్ర:

  • సంవత్సరానికి ఒకసారి సిబిల్ ఉచితంగా రుణ చరిత్ర అందిస్తుంది.

రుణ దరఖాస్తు సమయంలో వివిధ దశలు:

  1. దరఖాస్తు దారుడు దరఖాస్తు ఫారాన్ని నింపి బ్యాంకు, ఆర్థిక సంస్థకు అందజేయాల్సి ఉంటుంది.
  2. వెంటనే రుణ సంస్థ, సిబిల్‌ను ఆశ్రయించి క్రెడిట్‌ స్కోర్‌, రుణ చరిత్ర నివేదికల కోసం ప్రయత్నిస్తుంది.
  3. ఈ దశలో క్రెడిట్‌ స్కోర్‌ ఎక్కువగా ఉంటే, దరఖాస్తు ప్రక్రియను కొనసాగిస్తారు.
  4. అందుకు అవసరమైన పత్రాల కోసం రుణసంస్థలు రుణగ్రహీతను సంప్రదిస్తా

బ్యాంకుల పరిశీలన ఇలా:

cibil.jpg
బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందేందుకు క్రెడిట్‌ స్కోర్‌ ఒక సాధనంగా మాత్రమే పనిచేస్తుంది. ఒక వ్యక్తి సమగ్ర రుణ చరిత్రను తెలియజేయడం వరకూ మాత్రమే సిబిల్‌ పరిమితమవుతుంది. మంచి క్రెడిట్‌ స్కోర్‌తో పాటు వ్యక్తి ఆదాయ వనరులు, వృత్తిపరమైన నైపుణ్యాలు, ఆస్తి−అప్పుల నిష్పత్తి వంటి వాటిని బ్యాంకులు లోతుగా విచారిస్తాయి. తర్వాత మాత్రమే రుణం మంజూరీ గురించి ఆలోచిస్తాయి.

సీఐఆర్‌లో ఉండే సమాచారం:

సీఐఆర్‌లో గృహ, ఆటోమొబైల్‌, వ్యక్తిగత, వాహన రుణాలు, ఓవర్‌డ్రాఫ్ట్‌లకు సంబంధించిన సమాచారం ఉంటుంది.
ఈ సమాచారాన్ని సిబిల్‌ వినియోగదారులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


Tuesday, November 07, 2017

ప్రజల్ని భయంకర చీకట్లోకి నెట్టిన జీఎస్‌టీ




ఎంతో ఆడంబరంగా అర్ధరాత్రి ప్రారంభించిన ఆర్థిక దోపిడీ జీయస్టీ(అచ్చం మన స్వతంత్రం మాదిరిగానే).     
           ఇప్పుడు భారతదేశం జీఎస్‌టీ అనే భయంకర రాక్షసి చేతుల్లో నలిగిపోతూ ఉంది. ఆయన తన గుర్రాన్ని శ్రామిక జనం, మధ్య తరగతి మీద పరుగులు తీయిస్తున్నారు. ప్రజల దుఃఖం వర్ణనాతీతం., భారత్‌ను అమెరికా చేయాలని కల... డిజిటల్‌ ఇండియా అంటారు. స్వచ్ఛభారత్‌ అంటారు. జీఎస్‌టీ అంటారు.
      అసలు ఆర్థిక సంస్కరణలు అంటే ప్రధాని మోడీకి తెలుసా? ఆర్థిక సంస్కరణలు అంటే..
చిన్న చిన్న అవసరాలకి బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్నవారిని ఆదాయ లెక్కలదడిగి వేధించటమా?
పరిశ్రమాధిపతుల కోటీశ్వరుల పదిలక్షల బ్యాంకు మొండి బకాయిలను దపదఫాలుగా రహస్యంగా మాఫీ చేయటమా? వాళ్ల మొండి బకాల మాఫీకి ప్రజల మీద జీఎస్‌టీ రుద్ది లక్షల కోట్లు వసూలు చేయటమా? ఆర్థిక సంస్కరణలు అంటే ఏమిటీ? శ్రమజీవి కడుపు కొట్టి కార్పొరేట్‌ సామ్రాజ్యాన్ని పెంచటమా? తక్కువ ధర పెట్రోల్‌ను డెబ్బది రూకలకు అమ్మటమా? ఆర్థిక సంస్కరణలంటే.. అన్నదాతల మీద దళారీ నిరంకుశ దోపిడీ పెంచటమా? భారతదేశాన్ని అదానీ, అంబానీ సామ్రాజ్యానికి తాకట్టు పెట్టటమా?
ఏమిటీ ఆర్థిక సంస్కరణలు అంటే..? అడవి దారి తెలియని వ్యక్తి వేటకెళ్లినట్టుగా ఉంది మోడీ పని...

        70శాతం ప్రజలకు ఇంగ్లీషు రాదు. ఆధునిక సాంకేతిక నైపుణ్యం తెలియదు. నగదు రహిత లావాదేవీలట... అంతటా కుప్పిగంతులే. 'బక్కోడి' కష్టం 'బలిసినోడికి' పెట్టినట్టుగా ఉంది.
        లక్షల సంఖ్యలో చిన్న చిన్న షాపులుంటాయి. లక్షల సంఖ్యలో ప్లాట్‌ ఫాం దుకాణాలు, కిళ్లీ కొట్టులు, నాలుగు చక్రాల వాహన షాపులు, సైకిల్‌ మీద తిరిగి అమ్మేవాళ్లు... వీళ్లు ఏమన్నారయ్యా మోడీజీ... జీఎస్‌టీ పేరుతో వీళ్ల కడుపు కొడుతున్నారు. ఏవో పొట్ట పోసుకొని బతుకుతున్న చిన్న వ్యాపారులు వీళ్లు... జీఎస్‌టీ పేరుతో కేంద్ర ఆదాయ పెంపు దృష్టితో లక్షల సంఖ్యలో ఉన్న వీళ్లపొట్ట కొట్టావు. జీఎస్‌టీని తిట్టుకుంటున్నారు మోడీజీ... పరిశ్రమల పేరుతో పేదల నేలను వాళ్ల దుఃఖం కన్నీళ్లలో దోసిళ్లతో సమర్పిస్తున్నావు కనుక... వాళ్ల నిశ్శబ్ధం భయంకర మార్పుకు సంకేతం
భారతదేశం, జీయస్టీ అనే భయంకర చీకటిలో దారి తెలియక ఊపిరాడక బాధపడుతూ ఉంది.
            'జీఎస్‌టీ' అంటే గూడ్సు అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌' అన్నారు. అంతా వలస భాష. ఏ ప్రజలకూ అర్థంకాని భాష. ఆచరణకు.. పదాలకు ఏమాత్రం సంబంధం లేని భాష. ఎవరిష్టమొచ్చినట్టు వారు వాడుకోవటానికి అనువైన పదాల టాక్స్‌ అది. మామూలు ప్రజలు పోయి ఒక షాపులో ఏదైనా వస్తువు ఖరీదు చేసి ''గతం కంటే ధర ఎందుకు పెరిగింది?'' అంటే జీఎస్‌టీ అంటున్నారు. ఎవరిష్టం వారిది. ఎవరి దోపిడీ వారిది. ''ఒకే పన్ను ఒకే ప్రజ.. ఒకే దేశం'' ఎలా సాధ్యమవుతుందో అర్థం కాదు. వ్యవసాయక దేశంలో, కోట్ల సంఖ్యలో నిరుద్యోగులున్న దేశంలో, లక్షల సంఖ్యలో చిన్న వ్యాపారులున్న దేశంలో, ఒక వస్తువు పది చేతులు మారి పది రూపాయల వస్తువు వంద అయ్యే దేశంలో జీఎస్‌టీ ఎలా అమలు పర్చాలో ఎలా అమలు అవుతుందో ఘనమైన ఏలుతున్న ప్రభువులకు తెలుసా? అసలు ఈ ప్రభువులకు భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాల ఉత్పత్తులు, వనరులు ఆధారాలు తెలుసా? పాత రైల్వేస్టేషన్‌లు బాగు చేయటం రాదు. బుల్లెట్‌రైలు.. రైలు మార్గం కొరకు వేల కోట్ల ఖర్చు... ఇవీ మోడీ ఊహల పల్లకీల రాజ్యం... పేదలపై బరువు భారం! బుల్లెట్‌ రైలు ఎవరి కోసం?
ఇవ్వాళ్ల భయంకరంగా దేశాన్ని ఊపిరి ఆడకుండా చేసిన జీఎస్‌టీ ఎవరికోసం? ఈ విధాన రూపకల్పనలో నియంతృత్వ భావజాలం ఉంది. తన మాట వేదం... రాష్ట్రాలు తన కాళ్ల కిందపడి ఉండాలి. జీయస్టీతో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి పూర్తిగా గంగలో కలిసింది.
జీఎస్‌టీ ప్రారంభించి ఎన్ని నెలలయ్యింది? ఈ కొద్ది కాలానికే జీఎస్‌టీలో ఎన్నో మార్పులు. ఇది తగ్గించామంటారు. దీనికి పెంచామంటారు. నిలకడలేని మాటలు. నిండుతనం లేని విధానాలు.. మన దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్‌జైట్లీకి పల్లెలు తెలుసా? వ్యవసాయం తెలుసా? వ్యవసాయ దేశమని తెలుసా? మనదేశ ప్రధాన ఉత్పత్తి ఏమిటో తెలుసా? వనరులు ఏమిటో తెలుసా? ప్రజల యిబ్బందులు తెలుసా? వాళ్లకు ఏమి అవసరమో తెలుసా? ఈ మూడు నాలుగు నెలల్లో జీఎస్‌టీలో ఎన్ని మార్పులు... చేర్పులు... ఇలా ఉంటుందా పన్నుల విధానం.. జీఎస్‌టీ వలన వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రజల కొనుగోలుశక్తి నశించింది. ఏ ధర ఎందుకు పెంచుతున్నారో ఎందుకు తగ్గిస్తున్నారో తెలియదు. చిన్న చిన్న వ్యాపారాలు మూసుకొంటున్నారు. డబ్బు లావాదేవీల వ్యాపార సంస్థలు దివాలా తీస్తున్నాయి. చిన్న పరిశ్రమలు మూసివేస్తున్నారు. జీఎస్‌టీ దారిలో ఎటుపోతోంది దేశం!

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Thursday, May 18, 2017

లైకులొస్తే.. అప్పిస్తారు



లైకులొస్తే.. అప్పిస్తారు
                                   సాధారణంగా సామాజిక వేదికల్లో ఫొటోలు పంచుకుంటాం.. మిత్రుల పోస్టులకు లైకులు కొడుతుంటాం. దీనికి భిన్నంగా ఎవరైనా తమ అవసరం గురించి తెలియజేస్తూ.. లైకులు కొట్టమంటే.. అలా వచ్చిన లైకులను బట్టి, అప్పు దొరికితే.. ఇలాంటి వినూత్న ఆలోచనతోనే టాటా క్యాపిటల్‌ సలామ్‌ లోన్స్‌ పేరుతో రుణాలను మంజూరు చేస్తోంది.
                                   రకరకాల కారణాలతో వ్యక్తిగత రుణాలు దొరకని వారెందరో. ఇలాంటి వారికి రుణాలను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా టాటా క్యాపిటల్‌ ‘సలామ్‌ లోన్స్‌’ను అందుబాటులోకి తెచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన వారు, తక్కువ ఆదాయం ఉన్నవారు, వార్షికాదాయం రూ.3లక్షలకు మించని వారు ఈ రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రుణం కావాలనుకునే వారు తమకెందుకు అప్పు అవసరం ఉందో తెలియజేస్తూ ఒక చిన్న వివరణను సమర్పించాలి. వెంటనే దీనిని www.doright.in వెబ్‌సైటులో 3-4వారాలపాటు కనిపించేలా చూస్తారు. దీంతోపాటు టాటా క్యాపిటల్‌ ఫేస్‌బుక్‌ పేజీ, ట్విట్టర్‌, యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేస్తారు. వీటిల్లో వచ్చిన లైకులు/సలామ్‌ల ఆధారంగా టాటా క్యాపిటల్‌ రుణాన్ని మంజూరు చేస్తుంది. అయితే, రుణం ఇచ్చే ముందు ఆ వ్యక్తుల పూర్తి సమాచారం సేకరించి, వ్యక్తిగత చర్చల అనంతరమే అప్పు మంజూరు చేస్తుంది.
                                  కనీసం రూ.25,000 నుంచి రూ.1,00,000 వరకూ రుణం ఇస్తారు. దరఖాస్తుదారుడి కనీస వయసు 21ఏళ్లు ఉండాలి. ఉద్యోగం చేసే వారికి గరిష్ఠ వయసు 60 ఏళ్లు. స్వయంఉపాధి పొందేవారికి 65ఏళ్లు. తీసుకున్న రుణాన్ని 12 నుంచి 36నెలల్లో తిరిగి చెల్లించవచ్చు. సాధారణ వ్యక్తిగత రుణాలకంటే.. 2-3% తక్కువకే ఇస్తారు. హామీలు, సిబిల్‌ స్కోరులాంటివేవీ అక్కర్లేదు. వ్యక్తిగత, చిరునామా, ఆదాయ ధ్రువీకరణలు, ఆరు నెలల బ్యాంకు ఖాతా వివరాలు ఇస్తే సరిపోతుంది.
                                 రుణం కావాలనుకునే వారు సొంతంగానూ లేదా.. వారి తరఫున ఇతరులెవరైనా సరే వెబ్‌సైటులో వారి అవసరాన్ని పేర్కొంటూ దరఖాస్తును దాఖలు చేయవచ్చు. సొంతంగా దాఖలు చేయలేని వారు SALAAM అని 56161561కు సంక్షిప్త సందేశం పంపించినా సరిపోతుంది.------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Wednesday, April 19, 2017

డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విజయవంతం అవుతుందా?



డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విజయవంతం అవుతుందా?


డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విజయవంతమవ్వడమనేది పన్నుల చెల్లింపుదారులతో పన్నుల నిర్వహణ యంత్రాంగం ఎంత నిజాయితీగా వ్యవహరిస్తుందనేదానిపై ఆధారపడివున్నది. ఇటీవల డిమానిటైజేషన్‌ ( పెద్ద నోట్ల రద్దు) లక్ష్య సాధనలో ప్రభుత్వం సఫలం కాలేదు. నల్లధనం కలవారికి బ్యాంకు అధికారులు సహకరించడమే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ బ్యాంకు ఖాతాలలో భారీ మొత్తాలను జమ చేసిన వారి నుంచి సామూహిక జరిమానా వసూలు చేసే ప్రయత్నాలలో కూడా ప్రభుత్వానికి అదే అనుభవం ఎదురయ్యే అవకాశం ఎంతైనావున్నది. తాము జమచేసిన సొమ్ముకు ఆధారాలేమిటో చెప్పాలని లక్షలాది బ్యాంకు ఖాతాదారులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. పన్నుల నిర్వహణ అధికారులు నిజాయితీపరులైన ఖాతాదారుల నుంచి లంచాలు తీసుకోకుండా వుండడంతోపాటు నిజాయితీపరులు కాని ఖాతాదారుల నుంచి పన్నులను పూర్తిగా వసూలు చేసిన పక్షంలో ప్రభుత్వ నోటీసులకు సత్ఫలితాలు సమకూరుతాయి. నిజాయితీపరులైన వ్యాపారులు, అధికారులకు ముడుపులు చెల్లించేందుకు అవసరమైన డబ్బును సమకూర్చుకోవడంపైనే  తమ శక్తియుక్తులను వినియోగించవలసిన పరిస్థితిలో వ్యాపారాలు ఎలా అభివృద్ధి చెందుతాయి?
  
                  ద్రవ్యలోటును యంత్రించగలిగితే విదేశీ మదుపుదారులను పెద్ద ఎత్తున ఆకర్షించడం సుసాధ్యమవుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. బహుళజాతి కార్పొరేట్ సంస్థలు మన దేశంలో పెద్ద ఎత్తున మదుపు చేయడానికి ఆసక్తితోవున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ మార్కెట్‌లో సరుకులకు గిరాకీ అపరిమితంగావున్నదని, వినియోగదారులను సంతృప్తిపరచడానికై కొత్త ఫ్యాక్టరీలను నెలకొల్పాలని బహుళజాతి సంస్థలు ఆరాటపడుతున్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

                అయితే ప్రస్తుత పరిస్థితి ఇంత ఆశాజనకంగా లేదు. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతి స్తంభించిపోయింది. పైగా అభివృద్ధిచెందిన దేశాలు తమ కంపెనీలు తిరిగి స్వదేశానికి రావాలని కోరుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ద్రవ్యలోటును నియంత్రించినప్పటికీ, దాని వల్ల విదేశీ పెట్టుబడులు దేశంలోకి పెద్ద ఎత్తున ప్రవహించే అవకాశం లేదు. ప్రస్తుతం వస్తున్న విదేశీ పెట్టుబడులు కూడా వచ్చే మార్చి నెల అనంతరం తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఎంతైనావున్నది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే ద్రవ్యలోటు నియంత్రణ వల్ల ప్రభుత్వ వ్యయాలు తగ్గిపోయి ఆర్థిక వ్యవస్థ పురోగతి పూర్తిగా మందగిస్తుంది. సరిగ్గా ఇటువంటి కారణాలతోనే 1930లో అమెరికా ఆర్థిక వ్యవస్థను మహా మాంద్యం ఆవహించింది. ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Address for Communication

Address card