జూన్ నెలలో
మీకు ఇన్పుట్ టాక్స్ ఎక్సెస్ బాలన్సు ఉందా.అయినా సరే మీరు జూలై నెలలో GSTR-3B లో
దానిని కలపకుండా బాలన్స్ అఫ్ టాక్సు చూసుకోవాలి.చెల్లించ వలసి వస్తే ముందు
చెల్లించి తర్వాతా రిటన్ ఫైల్ చేయాలి.
మరి మన గత నిల్వ టాక్సు ఏమవుతుంది.కొంత కాలం ప్రభుత్వం
వాడుకుంటుంది.ఎందుకలా?
ఇది ప్రభుత్వ సాంకేతిక లోపం కారణంగా ప్రస్తుతం కుదరట్లేదు
ఎందుకంటే...వివరంగా
గతంలో నిల్వ
ఉన్న టాక్సు యధాతధంగా కొత్త చట్టంలోకి మారట్లేదు.దానికి ఒక ప్రాసెస్స్ TRAN-1 అనే ఫారం సమర్పించాలి ,ఎవరయినా ఇప్పటికే ఒక వేళా దాన్ని దాఖలు చేసివుంటే
వారికి మాత్రమే ఈ నెలలోనే ఇన్పుట్ క్లైము చేసుకుని GSTR-3B దాఖలు చేయటానికి అవకాశంగా వుంది .లేకపొతే అది దాకలు
చేసేంతవరకు దాన్ని మర్చిపోవటమే
మరి వెంటనే దాకలు చేయాలనిపిస్తుందా.అసలు మెలిక ఇక్కడేవుంది
ప్రభుత్వం
మెదట సెలవిచ్చినట్లు మధ్య ఆగస్టులో ఆ ఫారాన్ని విడుదల చేస్తామనిచెప్పారు.కానీ
ఇంతవరకు విడుదల చేయలేదు.మరెలా ...దీనర్ధం మీ
డబ్బు ఒక నెల అడ్వాన్సు గా వారివద్ద ఉంచుకోవటానికి ఓ మార్గం
ఎలా
అంటారా ఈ నెల 20 వ తేదీ లోపు GSTR-3B
సమర్పించాలి,20 లోపు TRAN-1 వస్తుందా రాదా మీలో ఎవరు కోటీశ్వరుడు వ్యాఖ్యాత చిరంజీవి నడుగుదామా....అడుగుదామంటే చాలావున్నాయి
ఉదాహరణకు ఆల్రెడీ VAT చట్టంలో వుండి కొత్త చట్టంలోకి మారాలనుకొంటే మీకు GST వచ్చిన
దగ్గరనుంచి 90 రోజులు (3 నెలలు) గడువుఇచ్చారు.కానీ ఇప్పుడు 40 రోజులకే GSTR-3B
వేయక పొతే పెనాల్టీ అంటున్నారు .ఎలా సాధ్యం?
GST
ప్రారంభంలో మీకు టెన్షన్ పడవద్దు మీకు 2 నెలలు వెసులుబాటు ఇస్తున్నాం అర్ధం
చేసుకోవటానికి అని హామీ ఇచ్చారు.కానీ నెల గడిచి 10 రోజులయినా అయ్యిందో లేదో
కళ్ళముందు ఆగిపోయిన టాక్సు లెక్కలు కనబడే సరికి పాత లెక్కనే కొత్తగా ఫారం
పుట్టుకొచ్చింది..ఇలా మరికొన్నివిశేషాలు ఉన్నాయి
ఇందులో నీతి:
ప్రభుత్వం తనకు రావాల్సిన దాన్ని ఎలాగయినా వసూలు
చేసుకుంటుంది.మీకు రావాల్సింది వారికి దయగలిగినప్పుడు ఇస్తారు.వారు హామీ
ఇచ్చారనో,గడువిచ్చారానో నింపాదిగా వున్నారంటే ఇక అంతే సంగతులు
------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment