సమస్యలోంచి,పోరాటంలోంచి, అవసరంలోంచి,
త్యాగాలలోంచి, శ్రామికజెన సంద్రంలోంచి ,పేదల కష్టాలు, కన్నీల్లలోంచి ,పదునెక్కిన
మేథస్సు తెగింపులోంచి ,విశ్వవిద్యాలయ కర్మాగారాలోంచి,
అడవిలోంచి ,పల్లెలోంచి, ప్రశ్నించె తత్త్వం
లోంచి, పరిణతి చెందిన ఆలోచనల్లోంచి ,ప్రసంగం వినో,
పాటలు వినో ,సాహిత్యం చదివో, సంఘటన జరిగో ,అన్యాయం
జరిగో ,ఆలోచన పెరిగో.....
ప్రజల ప్రభావితం చేసే ప్రతిభతలోంచి, పుట్టుకు
రావాలి నాయకత్వం
అదేందో ఈ దేశంలో నాయకులకు మళ్ళీ నాయకులు పుడుతున్నారు.కులాలకు
పుడుతున్నారు.
డబ్బులోంచి పుట్టుకొస్తున్నారు చెంచా గిరిలోంచి,
జోకడంలోంచి ,బానిసత్వం అలవరుచుకుని,దానిలోంచి
డబ్బు ఖర్చుపెట్టి,ప్రజలను మభ్యపెట్టి ,సమస్యల మూలాల గురించి తెలియకున్నా,మాట్లాడటం రాకున్నా నీతి నిజాయితి
లేకున్నా పనికిమాలిన పనులు చేస్తున్నా నాయకులుఅవుతున్నారు.
నాయకత్వానికి అర్హతేంటి ?
నాయకత్వానికి పదవి గీటురాయా? కులం డబ్బు
వారసత్వం లేకుండా పుట్టుకు రాకూడదా?
రాజకీయాలలోకి వస్తెనే నాయకుడా? పార్టీలో పని
చేస్తేనే నాయకుడా? ఎటువంటి సమాజంలో బతుకుతున్నామో...కళ్ళ ముందు ఏది
జరిగినా గతంకన్నా తక్కువే నష్టం జరిగిందని సంతోష పడాలా?..
------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment