Thursday, August 10, 2017

కుక్క మరియు దాని తోక




 ప్రశ్న: కుక్క దాని తోకను ఎందుకు ఆడిస్తూ ఉంటుంది?
జవాబు: కుక్క తన తోకకంటే తెలివైనది కాబట్టి.

మరి తోకే కుక్క కంటే తెలివిగలదైతే...,
అప్పుడు తోకే కుక్కను ఆడిస్తూ ఉంటుంది!!!

       అనుకోకుండా ఈ రోజు యూటూబ్లో "Wag the Dog" అనే సినిమా చూడటం జరిగింది. ఈ సినిమా పై ఆలోచనను నిజంగా జరిగితే ఎలా ఉంటుందో మనకు చూపిస్తుంది. రాజకీయ నాయకులు తాము చేసే కొన్ని తప్పులను, ఆకర్షనీయంగా ఉండే వార్తలను సృష్టించి ఏ విధంగా తప్పించుకుంటారో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. 1997లో విడుదలైన ఈ సినిమా అమెరికా రాజకీయాలకు అనుగుణంగా తీసారు. ఇంకా పెద్ద వింతేమిటంటే ఈ సినిమా విడుదలైన తరువాత, ఈ సినిమాలో చూపించిన సంఘటనలు అమెరికా రాజకీయాలలో నిజంగానే జరిగాయి.

అమెరికాలో ఎన్నికలకు ఇంకా 2 వారాల సమయం ఉంటుంది. ప్రస్తుత అమెరికా అధ్యక్ష్యుడికి ప్రజలలో ఇంకా మంచి ఆధరాభిమానాలు ఉంటాయి. అయితే ఇంతలో ఒక  సెక్స్ స్కాండలు  బయటపడుతుంది, దానివలన అతని పాపులారిటీ దెబ్బతినే పరిస్తితి ఏర్పడుతుంది. దాని నుండి ప్రజల ఆలోచనలను మళ్లించటానికి, అధ్యక్ష్యుడికి ప్రచార సిబ్బంది ఒక నకిలీ యుద్దాన్ని సృష్టించాలని అనుకుంటారు. అలా సృష్టించాలంటే పత్రికలకూ, టీవీ చానల్లకూ ఆధారాలు చూపించాలి కాబట్టి, అలా ఆధారాలు తయారు చేయటానికి వారు ఒక హాలీవుడ్డు నిర్మాతను సంప్రదిస్తారు. ఆ తరువాత సినిమా అంతా ఈ నిర్మాత నకిలీ యుద్దాన్ని నిజమైన యుద్దమే నమ్మించటానికి తెయారు చేసే స్క్రిప్టులు, స్టంటులతో సినిమా చాలా రసవత్తరంగా సాగుతుంది.

చివరికి మచ్చపడ్డా కూడా నిర్మాతగారి మరియు అధ్యక్ష్యుడికి ప్రచార సిబ్బంది అత్భుత ప్రతిభా పాటవాల వలన, మచ్చపడ్డా కూడా ఇంకోసారి సారి అధ్యక్ష పదవిని అలకరించటంతో సినిమా ముగుస్తుంది...

మనరాష్ట్రంలో కూడా పార్టీలకు సొంత పత్రికలు, టీవీలు వచ్చేస్తుండటం వల్ల, మన పరిస్థితి కూడా తోకచే ఆడింపబడే కుక్కలాగా అయిపోతుందేమో.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card