Saturday, February 04, 2017

నాయకో నాయక





మా సొమ్ము మాకు పంచి
ప్రజా సేవ అంటవేందిరా నాయకో
నీ యబ్బ సొమ్మా?నీ యమ్మ సొమ్మా?
నీ అక్క సొమ్మా? నీ అత్త సొమ్మా?

మేమిచ్చిన కారు ఎక్కి, మేమిచ్చిన బట్ట తొడిగి
మేమిచ్చిన డబ్బు మెక్కి ,మేమిచ్చిన పదవి నొక్కి
మా మీదే సవారీ చేస్తావేందిర! నాయకో

ఓటు అడిగెటప్పుడు కాళ్ళు మొక్కినావురో
నోటులు మస్తుగ పంచి పూటుగ తాగించినావురో
ఆపైన.....తాపం తీరినంక గుర్రుమనే కుక్కలల్లె
మీద పడి కరుస్తవేందిర! నాయకో

తెల్ల బట్టలెయ్యగానె శాంతమూర్తివయ్యిపోవు
నమస్కారమెట్టి మాకు మస్కాలు కొట్టలేవు
అంబేద్కర్కి దండమెట్టి దళితుడవు అయ్యిపోవు
తురక టోపీ పెట్టగనె ముసల్మానువయ్యిపోవు

ఆడు బొక్కినాడని నీవంటవ్
నీవు మెక్కినావని ఆడంటడు
ఖాళీ అయ్యింది మాత్రం నా యింటి బొక్కసమేరా! నాయకో
నా కొంప ముంచినావురో! నాయకో
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card