“నీ హృదయపు లోతెంతుందో మధు పాత్ర లోతంతుంది
నీ మనసున మతెన్తుందో మధువున మత్తతుంటుంది
నీ భావుకత అందం ఎంతో సాకి అంతటి సుందరమూ
ఎవ్వడేన్తటి రసికుడయితే , అంతటి రసమయము మధుశాల.”
నీ మనసున మతెన్తుందో మధువున మత్తతుంటుంది
నీ భావుకత అందం ఎంతో సాకి అంతటి సుందరమూ
ఎవ్వడేన్తటి రసికుడయితే , అంతటి రసమయము మధుశాల.”
“జీవితం ఒక సత్యం. పదం ఒక సత్యం ఈ రెండు వేర్వేరు, ప్రపంచ సాహిత్యమంతా పదాలతో రూపు దిద్దుకొన్నదే , జీవితాన్ని అందుకోవడానికి పదాలు చేసిన ఒక వ్యర్థ ప్రయత్నం – సాహిత్యం” అని అంటాడు ‘హరివంశ రాయ్ బచన్.’
ఈ మధ్య పద్మభూషణ్ శ్రీ హరివంశ రాయ్ బచన్ (హిందీ సినీ నటుడు అమితాబ్ బచన్ గారి
తండ్రి) చే రచించబడి తెలుగు లోకి ‘దేవరాజు మహారాజు’ గారిచే అనువదించబడిన " మధుశాల" అనే కవితల పుస్తకం చదువుతున్నా.
ఇది సమీక్ష కాదు. నాకు నచ్చి ఏదో మీతో
దానిగురించి పంచుకుందామని ఈ ప్రయత్నం....
“మట్టె ఈ కాయం, మనసే ఉల్లాసం, క్షణ బంగురం ఈ జీవితమ్, అదే నా పరిచయం” అని తనను తాను పరిచయం చేసుకొనేవాడట. ఈ మధుశాల కవిత్వాన్ని ఎన్నో సభలలో తానే స్వంతగా చదివి వినిపించేవాడట.
ఇక ‘మధుశాల’ కవిత సంపుటి లో మొత్తం 135 కవితలు (రుబాయీలు) ఒక్కొక్కటి నాలుగు పాదాలుగా రచించబడినది. ప్రతి కవితలో " మధువు" ,"మధుపాత్ర", "సాకి" మరియు "మధుశాల" నాలుగు పదాలు వాడుతూ సమకాలీన జీవితం, తాత్వికత, దేశభక్తి , మతసామరస్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక విషయాలపై కవితలల్లారు.
ఇక్కడ ‘మధువు’ అంటే ‘మధువు’(ఈ
నాడు మనం పిలుచుకునే మందు) మాత్రమే కానక్కరలేదు మధుశాల అంటే మధుశాలే కాదు అని, కవి
అంతరార్థం. ఒక ధ్యేయానికి , ఒక గమ్యానికి అది సంకేతం, ధ్యేయాన్ని
బట్టి ఒక్కొక్కరి మధుశాల మారుతూ
ఉంటుంది అని రచయిత తన ముందుమాటలో తెలియజేసారు.
మధుశాల కు భావుకత్వాన్ని జోడిస్తూ
" గోరింటాకు పండిన చేతితో మణి భూషిత మధు పాత్ర తీసుకొని, మిసమిసలాడే బంగారుచ్చాయతో ద్రాక్ష రసం , సాకీ అందిస్తే, తాగే యోధులు రకరకాల సంప్రదాయ దుస్తులతో ఉంటె ఇంద్రధనస్సు పోటిపడదా , రంగురంగుల మధుశాల” అంటాడు పనివాడైనా, యజమాని అయినా మధువు దగ్గర
ఒకటే అంటాడు.మనందరికీ ఏడాదికి ఒక్క సారే
హోలీ, దీపావళి, కాని మధుశాల లో రోజూ పగలే హోలీ ,రాత్రి దివాలి అని రాస్తాడు.
ప్రకృతిని వర్ణిస్తూ, "ప్రభాత ప్రాతః కాలం సాకి ఉషస్సు పంచుతూ సాగెనహో, భుమ్యాకాశం కలిసే చోట మధువులు పారెను కిరణాలై, మధు కిరణాలు తాగిన పక్షులు పాటలు పిచ్చిగా పాడేనహో , ప్రతి ప్రభాతము, ప్రకృతిలోన వికసిన్చునదే మధుశాల" ఎంత అందమయిన భావన. హిమజాల్న్ని మధువుగా, నదులను సాకి లుగా -“పచ్చగా వూగెను పంటపొలాలు తాగిన మత్తులో” అంటూ వ్యవసాయ భారతాన్ని మధుశాల గా ఆవిష్కరిస్తాడు. దేశ భక్తిని వర్ణిస్తూ, “రుధిరాన్ని మధువుగా, ఆసీస్సుల మధుపాత్ర తీసుకొని , ముందుకు నడువు, అతి ఉదార గుణము భారతిది, త్యాగ శీలి సాకి, బలికోరే స్వాతంత్ర్యమే కాలిక - ఇక బలి వేదికే మధుశాల” అంటాడు. .
మనల్ని మందిరం , మజీదే విడగొట్టిందని, మధువు దగ్గర అందరు సమానులే, అందరి మనసులు కలిపేదే మధుశాల అంటాడు. చివరికి చనిపోయేటప్పుడు నా అధరములపై తులసి దళ పాత్ర కాదు, జివ్హాగ్రముపై గంగాజలమధువు అంటూ, శవయాత్రలో సైతం ‘మధుశాల’ అనమంటాడు. చితిపై నెయ్యి బదులు మధువు పొయ్యమంటాడు. పరలోక ప్రయాణానికి పిలిపించండి తాగేవాళను, తెరిపించండి మధుశాలను అంటాడు. ఇలా చెబుతూ పొతే ఎన్నో ఎన్నెన్నో... ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:
Post a Comment