Sunday, February 12, 2017

ఇదీజీవితం! ఓ సరదా లేదు, ఓ ముద్దు లేదు, ముచ్చటా లేదు. ఎప్పుడు హడావుడే,




                              అసలు మనకంటూ ఈ లైఫ్ లో టైం లేదా? ఎవరికోసం బ్రతుకుతున్నాము - ఎవరికొరకు లైఫ్. లైఫ్ ఈస్  సో షార్ట్ అని ఎవరో  అన్నారు. మరి ఈ చిన్ని జీవితం లో మనకంటూ ఇంత స్పేస్ లేదా?. బిజీ......బిజీ.....ఆల్వేస్   బిజీభార్య తో సినిమా చూసే తీరిక ఉండదుఇంట్లో పిల్లలతో గడిపే టైం ఉండదు. మరెందుకు ఈజివితం . తినటందుకు బ్రతుకుతున్నమాబ్రతికేటందుకు  తింటున్నామా?. పనికోసం   జీవిస్తున్నామా  జీవించటం కోసం పని చేస్తున్నామా?. ఏమో ఏమి అర్ధం కావటం లేదు.
                            ఓ కథ   గుర్తుకు వస్తుంది.   ఎక్కడో ఓ మారుమూల దీవిలో  ఓ జాలరి జీవిస్తుంటాడు.  ఓ సిటీ నుండి ఓ వ్యాపారి, పెద్ద మనిషి   పోయి  అతనితో నువ్వు సిటీ కిరా  నీకు డబ్బులు ,ఇస్త ఆదునిక సామాగ్రి ఇస్తా, మనుషులను పెట్టి చేపలను పట్టి బిజినెస్ చేద్దువు కాని  అంటాడు. ఆ జాలరి ప్రశ్నిస్తాడు , ఆ తరువాత ఏమవుతుంది అని.  ఆ వ్యాపారి నువ్వు డబ్బులు బాగా  సంపాదించవచ్చు, ఇల్లు కారు ఇంకా ఎన్నో కొనుక్కోవచ్చు అంటాడు. ఆ తర్వాత  అని అడుగుతాడు.  కాలుమీద కాలు వేసుకొని   కూర్చొని  జీవితం గడపొచ్చు అని   అంటాడు వ్యాపారి.  అప్పుడు ఆ జాలరి  నేను  నా పని తర్వాత,  ఇప్పుడు  అదే చేస్తున్నానుగా  అని ఆంటాడు. చూసారా అతను తన చిన్ని జీవితాన్ని ఎంత  హ్యాపీ గా  గడుపుతున్నాడు. మరి మనం-బిజీ... బిజీ... బిజీ .... సాయంత్రం ఇంటికి వచ్చాక చూసుకుంటే ఏముంటుంది,  stress తప్ప.
                           అస్సలు మన గురించి మనం జీవించడం మానేసి ఎంత కాలమయింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అస్సలు  మన జీవితంలో మనం ఉన్నామాఅందులో మనం కన్పించం. అందులో మన ప్రేఫెరేన్సుస్ లిస్టు చుస్తే అది ఇలా ఉంటుంది. ఇతరులు, ఉద్యోగం, ఫ్రెండ్స్, భార్య పిల్లలు, మనం. చూసారా ఈ లిస్టు లో మనం చివర. దీన్ని రివర్స్ చేస్తే ఎంత బాగుంటుంది. మన కంటూ మన జీవితం లో ఓ చిన్న స్పేస్, మన చిన్న చిన్న, పెద్ద పెద్ద సరదాలు, మనకు, మనకే ఇష్టం అయిన పనులు చేస్తూ ...జస్ట్ ఒక్క సారి imagine యండి..............నిజ్జంగా బాగుంది కదూ!.
                           అంటాం కాని. మనకు అదీ సాధ్యం కాదండి. ఇన్ని చెప్పుకున్న  ఒక్కరోజు ఆఫీసు పోక పొతే కొమ్పలన్తుకుపోవు. ఒక్క 24  గంటలు ఇంట్లోనించి కాలు కదపకుండా ఉండగలమా.  feverish  గా ఉందని ఇంట్లో సెలవ్ పెడ్తే, అది ఎక్కువ అవుతుందే తప్ప తగ్గదు. అదేంటో ఆఫీసు లో జనం మధ్య ఉంటె ఏది గుర్తుకు ఉండదు. ఎందుకంటే మనం బ్రతికేది మన కొరకు కాదు కదా అందుకు. ఫ్రాయిడ్ అన్నాడు మనం చేసే పనులన్నీ, రెండు రకాల ప్రేరణల వల్ల, చేస్తామట. ఒకటి లైంగిక వాంచ, రెండోది గొప్ప వాల్లమవ్వాలన్న కాంక్ష. నిజమే వీటి కొరకు నానా  గడ్డి కరుస్తంచివరికి మనల్ని మనమే మరిచిపోతం.నేను ఇందాకే చెప్పా కదా. చివరికి వెనక్కి తిరిగి చూసుకొంటే అందులో మనం ఎక్కడ కన్పించం. ఇది మన లైఫ్.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card