Thursday, February 16, 2017

పెద్ద నోట్ల రద్దు వెనుక దాగిన భండారం బట్టబయలైందా?




( ఈ వ్యాసం నిజానికి ఒక నెల క్రితం ,అంటే  జనవరి’ 17- రెండోవారంలో వ్రాద్దామని అనుకొన్నాను. క్రింద ఇచ్చిన కొన్ని లింకుల ఆంగ్ల వ్యాసాలని తెలుగులోకి అనువదించి రాస్తే ఎక్కువ మందికి అర్ధమవుతుందని భావించాను ,కానీ పని వత్తిడి వల్ల చేయలేక పోయాను)


దేశభక్తి పేరుతో పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనం వెలికితీత ముసుగులో 90 రోజులుగా భారత ప్రభుత్వం, దాని పెద్దన్న నరేంద్రమోదీ ఆడుతున్న దొంగ నాటకం గుట్టు బట్టబయలైంది. దేశంలో ఎక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్ల వెనుక ప్రపంచ పెద్దన్న అమెరికా హస్తం ఉన్నట్టు, అమెరికా చెప్పినట్టుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌, ఆర్థిక శాఖ తలాడించినట్టు ఆసియా పసిఫిక్‌ రీసెర్చ్‌ డాట్‌ కామ్‌’ అనే సంస్థ 'దాచిపెట్టిన బహిరంగ రహస్యం: భారత చేపట్టిన క్రూరమైన నోట్ల రద్దు ప్రాజెక్టు వెనక వాషింగ్టన్‌' పేరుతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారత తీసుకోవడానికి ముందు, తెరవెనుకా, తెరపైనా ఏడాది కాలంగా జరుగుతున్నఏర్పాట్లు’, ఈ మొత్తం ప్రక్రియలో కీలక పాత్రధారులు, ఈ నిర్ణయం వెనక అసలు ప్రయోజనాలు, లబ్దిదారుల వివరాలను ఈ కథనం వెల్లడించింది,

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... మోదీ ప్రభుత్వ వాగాడంబరంపై సెటైర్లు వేసినట్లు నటించిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రాజన్ కూడా ఈ కుట్రలో సంవత్సరం పైగా పాల్గొని నాటకమాడినట్లు విదేశీ మీడియా బయటపెట్టడం సంచలనం గొల్పిస్తోంది.
డిజిటల్ ఎకానమీ పేరుతో చేసిన పెద్ద నోట్ల రద్దు.. "భారత ప్రజలకు మేలు చేసేందుకు కాదు. అందుకే డిజిటల్‌ పేమెంట్స్‌ లక్ష్యాన్ని తెరవెనక్కి నెట్టి, నల్లధనం, అవినీతి లక్ష్యాలను తెరముందుకు తెచ్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించారు. ఆ విధంగానే ఆయన ప్రకటన సాగింది. కానీ, ఈ మొత్తం వ్యవహారంలో కీలకపాత్రధారులందరికీ ఏం జరుగుతుందో తెలుసు, వారి లక్ష్యమేమిటో తెలుసు, వ్యూహమేమిటో తెలుసు.. కాగితాలపై మాత్రం ఎక్కడా ఏమీ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. రహస్యాలేవీ బయటకుపొక్కకుండా చర్యలు తీసుకున్నారు.

అలా 125 కోట్ల భారత ప్రజల అమాయకత్వాన్ని, దేశభక్తిమాటున, అవినీతిపై యుద్ధం చాటున వారిని తేలిగ్గా బుట్టలో వేసుకునే వెసులుబాటును గుర్తించిన తర్వాత, ఏకంగా మొత్తం దేశాన్ని ప్రయోగశాలగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో అమెరికా మార్చేసింది. వాస్తవాలను కప్పిపెట్టి, కాకమ్మ కబుర్లతో ఎన్డీయే సర్కారు కోట్లాది మంది ప్రజలను ‘‘బకరా’’లను చేసింది. ఫలితంగా దేశంలో కరెన్సీ కష్టాలు మొదలయ్యాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. నోట్ల రద్దుకు ముందు భారతలో నగదు లావాదేవీల వాటా 97 శాతం ఉంది. నోట్ల రద్దు తర్వాత పరిణామాలు చిన్న బ్రతుకులను ఛిద్రం చేసినప్పటకీ, డిజిటల్‌ పేమెంట్‌ సర్వీసుల్లో ఉన్న వీసా, మాస్టర్‌కార్డ్‌ ఇతర సంస్థలకు మాత్రం వ్యాపార విస్తరణ, లాభార్జన అవకాశాలను తెరిచాయి."

గత 14 ఏళ్లుగా దేశభాషల్లో వెబ్ సైట్లను విజయవంతంగా నిర్వహిస్తున్న వెబ్‌దునియా.కామ్’  తెలుగు వెబ్ సైట్ పెద్దనోట్ల రద్దు వెనుక నడచిన దేశద్రోహపూరిత నాటకానికి   -07 జనవరి 2017 న అక్షరరూపమిచ్చింది. దేశభక్తుల దేశద్రోహాన్ని ఇంత బాహాటంగా బయటపెట్టిన కథనం ఈ మధ్యకాలంలో చూడలేదు. అనేక వ్యాసాలు చదివినప్పటికీ దాని వెనుక సంవత్సర కాలంగా సాగిన ప్రయత్నాలను ఇంత వివరంగా ఆధార సహితంగా   కథనమూ ఇంతవరకూ బయటపెట్టలేదు.

దేశభక్తుల పార్టీ ఈ దేశానికి చేసిన అసలైన ద్రోహం గురించి తెలుసుకోవాలంచే తెలుగు.వెబ్‌దునియా.కామ్ (telugu.webdunia.com) లో వచ్చిన ఈ కథనాన్ని పూర్తిగా చదవండి. చదివి తరించండి.
వెబ్ దునియా వెబ్ సైట్‌లో వచ్చిన ఈ పెద్ద నోట్ల రద్దు భండారంపై కథనం లింకును కింద చూడండి.
125 కోట్ల మంది ప్రజలను బకరాలను చేసిన నరేంద్ర మోడీ... కరెన్సీ నోట్ల రద్దు వెనక పెద్దన్న హస్తం!?
http://telugu.webdunia.com/article/current-affairs/washington-is-behind-india-s-brutal-demonetization-project-117010700036_1.html
తాజా సమాచారం.
నగదు రహిత ఆర్థిక వ్యవస్థ ముసుగులో దేశ ఆర్థిక వ్యవస్థను సామ్రాజ్యవాదుల హక్కు భుక్తం చేసే భారీ కుట్ర అనూహ్య ఘటన కాదని ఒకటన్నర సంవత్సరం పైగా ఇటు భారత ప్రభుత్వమూ, అమెరికా ప్రభుత్వమూ, ద్రవ్య పెట్టుబడుదారులూ కలిసి అత్యంత గోప్యంగా, అతి రహస్యంగా, అతి మార్మికంగా సాగించిన క్రూర పథకంలో భాగంగానే ఇది జరిగిందని నిరూపించే అద్భుత వ్యాసాలు ఇంగ్లీషులో లభించాయి. సమయం ఉంటే వీటిని పూర్తిగా అనువదించి ఇక్కడే పోస్ట్ చేయాలని ఉంది కానీ ఇప్పుడు కుదిరేటట్లు లేదు. అంతవరకు ఆ రెండు కీలక వ్యాసాలను కింది లింకుల్లో చూడగలరు.
A Well-Kept Open Secret Washington Is Behind India’s Brutal Demonetization Project
http://www.globalresearch.ca/a-well-kept-open-secret-washington-is-behind-indias-brutal-demonetization-project/5566167
అమెరికా చెప్పిందే... మోదీ చేశారా..?
http://www.andhrajyothy.com/artical?SID=354497
వీటితో పాటు కేంద్ర బ్యాంకులకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకే నగదు రద్దు పథకాలు అమలు చేయాలని సామ్రాజ్యవాదుల ముద్దుల ‘పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ 2015 ఆగస్టులో పిలుపిచ్చిందంటూ కింది వ్యాసం పేర్కొంటోంది. నగదు రహిత వ్యవస్థల గురించి ఊదరగొడుతున్న నేతలు, వారి తైనాతీలు, భజనపరుల కుట్రల గురించి ఇంకా ఎవరికైనా సందేహం మిగిలి ఉంటే ఈ కింది వ్యాసం వాటిని తీీర్చవచ్చు.
Financial Times Calls For Abolishing Cash. “To Give More Power to Central Banks”
http://www.globalresearch.ca/financial-times-calls-for-abolishing-cash-to-give-more-power-to-central-banks/5472522?utm_campaign=magnet&utm_source=article_page&utm_medium=related_articles
10
వేల ఏళ్లలో ఘోరమైన పాలన ఇదే
మోదీ గారి పాలనలో ఇండియా వెలిగిపోతుంటే తగులబడుతోంటారమేటి అంటూ మోదీ భక్తులకు ఆగ్రహమూ, సందేహమూ కలిపి రావచ్చు. కానీ మహారాష్ట్రలో మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న శివసేన జనవరి 7వ తేదీన మోదీ పాలన గురించి ఒక గొప్ప కామెంట్ చేసింది. 10 వేల ఏళ్లలో ఘోరమైన పాలన ఇదే అనేసింది. ఆ ప్రకటన సారాంశం ఇక్కడ చూడండి.
"10
వేల ఏళ్లలోనే అత్యంత ఘోరమైన పాలన మోదీ సర్కారుదే. పెద్దనోట్ల రద్దు నల్లధనాన్ని రూపుమాపుతుందని ఆలోచిస్తున్న బీజేపీ నేతలు పిచ్చివాళ్ల స్వర్గంలో ఉంన్నారు. ఈ నిర్ణయంతో చివరకు మహిళలను కూడా అష్టకష్టాల పాలు చేశారు. పాత పెద్దనోట్ల మార్పిడికి అనుమతించలేదన్న ఆగ్రహంతో ఓ తల్లి అర్ధనగ్నంగా మారటం ప్రభుత్వ ప్రాయోజిత నిర్భయ ఘటన."
(
ఇది ఆంధ్రజ్యోతి జనవరి 7వ తేదీనాటి 2వ పేజీలో వచ్చిన వార్త. అధ్వానపు పరిపాలనపై ఈ చిన్ని వ్యాఖ్య చూశాక ఇక మాటల్లేవు....
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card