ఒక ఎకౌంటెంట్ బీచ్ లో( జోక్ కాదు, నిజంగానే బీచ్
కెళ్ళాడు పొన్నూరులో బీచ్ లేదు ఆయనా వెళ్ళాడు ఎలాగో ఎకౌటంటూ అనే వాడెవడి కయినా
తెల్సు), వాకింగ్ చేస్తుండగా , ఒక పాత
దీపం ఇసుకలో కప్పిఉండటాన్ని చూసి .చేతికి
తీసుకుంటాడు.అలీ బాబా అద్బుత దీపం కదలు చిన్నపుడు వినివుండటం వల్ల దాన్ని అరచేతి
కేసి రుద్దుకున్నాడు.అంతే నిజంగానే
దాంట్లోంచి ఒక భూతం బయటకి వచ్చింది. చెప్పింది "నేను చాలా శక్తివంతమైన దాన్ని
ఒకరు నన్ను దీన్లో బంధించారు నాకు సహాయం చేసావు కాబట్టి ‘అద్భుతమైన’ పనులు లేదా మీ ‘ప్రియమైన కోరిక’ ఏదయినా వుంటే తీరుస్తాను
అంది. కానీ తనకి ‘చట్టాలు’ ‘టాక్స్ లు’ ‘యాక్టులు’ తప్ప బయట ఇంకేమీ తెలియయవు కాబట్టి’
దానికి సంభంధించే ఒక కోరిక కోరుకుంటాడు
“Well, ఇక్కడ ‘మోడీ’, అక్కడ ‘ట్రంప్’ సామాన్య ప్రజల
సమస్యల పరిష్కరించడానికి కృషి చేసే విధంగా
వారి మనసు మార్చగలవా ?”
భూతం తన గడ్డం అడ్డంగా ఊపింది. ఆందోళనగా
"అయ్యో, అది
చాలా కష్టం నా వల్ల కాదు వేరే ఇంకోటి
చెప్పండి ఈ సారి కచ్చితం గా చేస్తాను “ అంది
"నిజమే అది కఠినమైనదే, ప్రజలు కూడా
పోరాడుతున్నారు.
“మీరు ఖచ్చితంగా మరొక కోరిక కోరాలి"
అకౌంటెంట్ అలోచించి చెప్పారు
"ఈ మద్య భారతీయ ఆదాయపన్ను శాఖ
వారు నల్లడబ్బు వెలికితీత లో భాగంగా,
ఆన్లైన్ లో ,విడిగా కొన్ని ప్రశ్నలతో ఫారాలు ప్రవేశ పెట్టారు. ఒక్కరూ పూర్తిగా అర్ధం
చేసుకోలేక పోతున్నారు, కాబట్టి వాటిని తిరిగి సులభంగా రూపొందించి నాకు సహాయం చేయగలవా “
ఒక అరగంట సుదీర్ఘమైన నిశ్శబ్దం తర్వాత
గట్టిగా నిట్టూర్చి... చివరికి భూతం ఇలా చెప్పింది,
"లేదూ,...
మొదటి సమస్యే చూద్దాం పదా! "
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment