26 అక్షరాలు మాత్రమే ఉన్నఆంగ్లము 56 అక్షరాలున్న
తెలుగు కి సమానార్ధం ఇవ్వగలదా?
పాపము
|
=
|
Sin
|
పుణ్యము
|
=
|
???
|
ప్రశ్నలోని “పుణ్యము” నామ వాచకము (noun). విశేషణమో
(adjective), క్రియా విశేషణమో (adverb)
కాదు. నా ప్రశ్నను మరికొంత స్పష్టంగా
అడగాలంటే, ఈ క్రింది తెలుగు వాక్యానికి ఆంగ్ల భాషలో అనువాదం కావాలి.
“దానముల వలన ‘పుణ్యము’ సంప్రాప్తించును.“
కానీ “పుణ్యము” అనే తెలుగు పదానికి, ఆంగ్ల భాషానువాదంలో
కూడా ఒకటే పదం పడాలి సుమా!!!
దానికి వేరే తెలుగు అర్ధం వుండకూడదు.నాకు
గూగుల్లో వెతికినా ఏవేవో దగ్గర అనువాదాలు వచ్చినయ్ కానీ సరైనవి కాదు.(ఇలా
చాలాపదాలున్నాయి,ఉదా: ఆంటీ,అంకుల్,బావమరిది,మరదలు,వదిన ..... ఇలా బోలెడు స్పష్టంగా
లేనివి. “కేవలము ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలములో” “రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను
దీర్ఘములు అంటారు” ఇలాంటి వాక్యాలు చాలా
వున్నాయి)
సున్నితమైన విషయం. నిజానికి ఓ ప్రశ్న. సాధారణంగా
పిల్లలు, ఈ
కాలం పెద్దలు కూడా, తమ
తల్లి తండ్రుల్ని ‘మమ్మీ’,
‘డాడీ’ అని సంభోదిస్తుంటారు. సంబోధన ఏదైనా,
అనుబంధం ముఖ్యం;
కాదనను. నా ప్రశ్నల్లా
తల్లి తండ్రులు ‘అమ్మా-నాన్న’
అనే పిలుపులకు
బదులుగా, ‘మమ్మీ-డాడీ’
అనే సంబోధననే ఎందుకు
ఇష్టపడుతుంటారు? చాలా
అరుదుగా మాత్రమే, ‘అమ్మా-నాన్న’
అనే పిలుపు
వినిపిస్తుంటుంది. వీటిలో ‘నాన్న’
అనే సంబోధన మరీ తక్కువ.
ఎందుకలా?
ఈ ప్రశ్న సమాధానం భాషలతో ముడి పడి ఉందా?
తెలుగు అంటే అయిష్టం
అనే కన్నా ఆంగ్లభాషలో పట్టు సంపాదించాలనే తపన దీనికి కారణమా?
అతిసాధారణ విషయం కాబట్టి ఎవరూ పెద్దగా పట్టిచ్చుకోరుగానీ,
నిజానికి అత్యధికశాతం
పిల్లలు రెంటినీ తప్పుగా ఉచ్ఛరిస్తుంటారు. ఠక్కున చెప్పండి
తల్లిని ‘మమ్మీ’
అని పిలిచే ఆంగ్ల పద స్పెల్లింగ్
ఏంటో? ఒక్కసారిగా
అడిగితే ఎక్కువ శాతం “Mummy” అని
చెప్పారు. ఉచ్ఛారణకూడా
అలాగే ఉంటుంది.
సరైన స్పెల్లింగ్ “Mommy”.
మరి ఉచ్ఛారణో?
ఇక ‘డాడి’ విషయానికి వస్తే అది ‘డాడీ’ అంటున్నారో లేక ‘దాడీ’ అంటున్నారో లేక రెంటికి మధ్యలోలానా అన్నట్టు
ఉంటుంది పిలుపు. కాదు?
అనుబంధాలు, ఆప్యాయతల విషయాలు స్పెల్లింగులు-భాషలతో పెద్దగా సంబంధం
లేనివి. ఎలా పిలిచినా ఓ బిడ్డడి పిలుపు ఆ తల్లికే తెలుసు; తన కూతురి పిలుపులోని మాధుర్యం ఆ తండ్రే ఆస్వాదించగలడు.
కానీ, మన మాతృభాషని ఓ మాతృస్వరూపంగా భావిస్తే,
పాపం తనకు కూడా
తన శైలిలో తన పిల్లలు సంబోధిస్తే బాగుటుందనిపిస్తుందేమో? ఏఁవంటారు?
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment