Tuesday, February 14, 2017

వదిలి వెళ్ళిన కాలాన్ని, విడిచి వెళ్ళిన పాదాన్ని, కరిగి పోయిన కలల్ని, కన్నీటిని మిగిల్చిన ఆశల్ని , తలుచుకుంటూ ఎదురు వచ్చే రేపుని వెళ్ళి పోనీయకు ..






ఇవీ మన నాయీబ్రాహ్మణ సంఘాల  అజెండా / మానిఫెస్టో లో వుండాల్సినవి.
           ప్రజా సంక్షేమమే నాయీబ్రాహ్మణ సంఘాల ప్రధాన లక్ష్యం. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిర్దిష్టమైన కార్యక్రమాన్ని ఎంచుకుని సాగుతోంది. నాయీబ్రాహ్మణ సంఘాల లక్ష్యం... ఎజెండా... ప్రణాళిక... కార్యక్రమం... అన్నీ ఒకటే. సంక్షేమ బాటలో పయనించడం, సంక్షేమ పథకాలు లక్ష్యిత వర్గాలకు చేరేలా చూడడం నాయీబ్రాహ్మణ సంఘాల ప్రధాన లక్ష్యం... సామాజిక సంక్షేమం
          నాయీబ్రాహ్మణ సంఘాల పుట్టుకకు మూలమే సామాజికంగా అణగారిన అన్ని వర్గాల సంక్షేమం. సమాజంలో తరతరాలుగా అనేక కారణాల వల్ల తీవ్రమైన అన్యాయాలకు గురైన సామాజిక వర్గాలు సమాజంలో సగౌరవంగా నిలబడే ప్రయత్నాలన్నింటినీ సంఘాలు తానే ముందుండి నడిపిస్తాయి. అలాంటి ప్రయత్నాలకు సంపూర్ణంగా ప్రజలు సహకరిస్తారు. వెనకబడిన వర్గాలు, ఆర్థికంగా వెనకబడిన వృత్తి పనివారికి ప్రభుత్వం నుంచి గరిష్ఠ స్థాయిలో సహకారం అందాలన్న విధానాన్ని తు.చ. తప్పకుండా అధికారంలో ఉన్న వారు పాటించి తీరాలన్నదే నాయీబ్రాహ్మణ సంఘాల విధానం కావాలి. అధికారం లోను, ఉద్యోగ ఉపాధి అవకాశాల పరంగా, ఆర్థిక సంపదల్లో వాటా పరంగా ఈ వర్గాలన్నింటికీ సమన్యాయం జరిగేలా ప్రభుత్వం వేసే ప్రతి అడుగూ ఉండాలని నాయీబ్రాహ్మణ సంఘాలు తన వజ్ర సంకల్పాన్ని చాటుతున్నాయి.
బీసీ సంక్షేమం
       రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీల సంక్షేమాన్ని  నాయీబ్రాహ్మణ సంఘాలు,నినాదంగా కాకుండా విధానంగా మార్చుకోవాలి. అధికారంలో బీసీలకు అందాల్సిన న్యాయమైన వాటాను ఇవ్వాలన్న మనసు ఉండాలేగానీ, మార్గం ఉంటుందని  నాయీబ్రాహ్మణ సంఘం విశ్వసిస్తోంది. కాబట్టే రాజ్యాంగ సవరణ, న్యాయపరమైన చిక్కులను సాకుగా చూపి స్థానిక సంస్థల్లో బీసీలకు అన్యాయం చేయాలన్న అన్ని రాజకీయ పార్టీల సంప్రదాయ కుట్రలను ఛేదించి, నాయీబ్రాహ్మణ సంఘాలే అభ్యర్థులను నిలిపేటప్పుడు జనాభాలో బీసీల నిష్పత్తిని గౌరవించాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది. ఆ తరవాత సుప్రీం కోర్టు కర్ణాటకకు సంబంధించి ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. మన రాష్ట్రంలో బీసీల జనాభా రీత్యా వారికి అన్యాయం జరగకుండా ఏ చర్యలూ తీసుకొనకపోవటం వల్లే స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వమే వాయిదా వేయించాల్సిన దుస్థితి ఏర్పడింది. బీసీలు మావెంటే ఉన్నారంటూ ప్రచారం చేసుకునే తెలుగుదేశం కూడా ఈ నాయీబ్రాహ్మణ సంఘాల విషయంలో మౌనం వహించి చోద్యం చూస్తోంది. మొత్తంగా రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదంటే బీసీలకు 23.45 శాతం మాత్రమే వాటా దక్కుతుంది. అందులో నాయీబ్రాహ్మణ కులానికెంత? అలా కాకుండా, 34 శాతం ప్రాతిపదికగా బీసీలకు రిజర్వు చేసిన స్థానాల్లో అన్ని నాయీబ్రాహ్మణ సంఘాల కి వాటా విడగొట్టి నాయీబ్రాహ్మణ అభ్యర్థులనే నిలబెట్టాలని  నాయీబ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు ప్రతిపాదించాలి. ఈ ప్రతిపాదనకు పెడార్థాలు తీయటం తప్ప.. అటు తెలుగుదేశం కానీ, ఇటు కాంగ్రెస్‌ ,బిజేపీ  కానీ చేసింది శూన్యం. దీన్ని బట్టే ఈ రాజకీయ పార్టీలకు  బీసీలంటే అందునా నాయీబ్రాహ్మణ  అంటే ఎంత చులకనో అర్థమవుతోంది. ప్రభుత్వం బీసీలను చిన్న చూపు చూస్తున్న విషయాన్ని అనేక అంశాలు స్పష్టం చేస్తున్నాయి.

         బడ్జెట్లో చూపించిన అత్తెసరు నిధులను విడుదల చేయటానికి కూడా ప్రభుత్వానికి మనసు రాలేదు. ఈ బీసీ కార్పొరేషన్‌కు కేటాయింపులు , రుణం పొందిన యూనిట్ల సంఖ్య , బీసీ కార్పొరేషన్‌కే కాదు... బీసీ సంక్షేమ పథకాలకూ  ఎంతో ప్రాధాన్యమివ్వాలి . తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని బీసీ హాస్టల్ వార్డెన్ పోస్టులు రద్దు చేసింది.  ఈ పోస్టులను ఎప్పటికప్పుడు బీసీ ల తోనే భర్తీ చేయాలి . రాష్ట్రంలో బీసీ హాస్టళ్లలో చాలా వాటికి హాస్టళ్లకు సొంత భవనాలు లేవు. దాదాపు 200 పైగా హాస్టళ్లకు వార్డెన్లు లేరు. అనేక హాస్టళ్లలో వాచ్‌మెన్‌, వంట మనుషులు, కామాటీలు లేరు. ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని  నాయీబ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా గర్హించాలి.
          బీసీల్లో ప్రతి కులానికీ న్యాయం చేయాలన్న తపనే  నాయీబ్రాహ్మణ సంఘాలకి మార్గదర్శకత్వం చేస్తుంది. ఉదాహరణకు, చేతి వృత్తులే ఆధారంగా జీవిస్తున్న లక్ష మందికి పైగా క్షురకులకు వృద్ధాప్య పింఛన్లు అందించాలి. క్షురక కార్మికులకు వృద్ధాప్య పింఛన్ల విషయంలో వర్తించే వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించాలి. క్షురక కార్మికులకు  విభిన్న పథకాల కింద గృహాలు మంజూరు చేయాలి అప్పుల ఊబిలో కూరుకుపోయిన క్షురక కార్మికులకు జీవితాల్లో వెలుగు నింపటానికి క్షురక కార్మికులకు, సహకార నాయీబ్రాహ్మణ సంఘాలకు కోఆపరేటివ్ బ్యాంకు రుణాల మాఫీ పథకాన్ని ప్రవేశపెట్టాలి. జీవిత,ఆరోగ్య, వైద్య బీమా పథకాల్ని ప్రవేశపెట్టాలి . బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 2004 వరకూ నాలుగు ఫెడరేషన్లు ఉండేవి. అవి ఇప్పుడే మయినావో తెలీదు. మిగిలిన బీసీ సంఘాలు  నాయీబ్రాహ్మణ సంఘాలని ఆదర్శంగా భావించి మరింత ముందుకు తీసుకు వెళ్తారు . నాయీబ్రాహ్మణ ఫెడరేషన్లకు  సకాలంలో నిధులు ఇవ్వటంతో కుల వృత్తుల వారికి ఆర్థిక సాయం అందించే వెసులుబాటు ఉండేది .    ప్రభుత్వం అనుసరించిన గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ విధానాలు గ్రామీణ ఆర్థిక, సామాజిక వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసి సంప్రదాయ కులవృత్తుల వారికి ముఖ్యంగా, నాయీబ్రాహ్మణలకు  తీరని ద్రోహం చేశాయి. ఆ దెబ్బ నుంచి వారు కోలుకోవటానికి, ఇకమీదటా సంప్రదాయ కులవృత్తుల మీద ఆధునికత దాడిని నిరోధించేలా, లేదా దానిని అధిగమించేలా  ప్రభుత్వం తరఫున చర్యలు ఉండాలని  నాయీబ్రాహ్మణ సంఘాలు  ప్రభుత్వం పై వత్తిడి తేవాలి.ఇందుకోసం కుల వృత్తుల వారికి అవసరమైన ఉపకరణాలు, ముడి పదార్ధాలు, విద్యుత్తు వంటి వాటిని నామమాత్ర ధరలకు సరఫరా చేయాలని ,నాయీ బ్రాహ్మణు  కులాల వారందరికీ విద్య, గృహనిర్మాణ, వైద్య సేవలను ఉచితంగా అందించాలని  నాయీబ్రాహ్మణ సంఘాలు కోరాలి. సంప్రదాయ వృత్తులను నమ్ముకున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి ఏర్పాట్లతో పాటు  ఎంటర్‌ప్రైజింగ్ సామర్థ్యాన్ని కల్పించాలని  నాయీబ్రాహ్మణ సంఘాల తరుపున ప్రజ  ఆశిస్తోంది. సంక్షేమం అంటే కేవలం హాస్టళ్లకు పరిమితం కాదు, సాయం అంటే  రెండు కత్తెర్లు రెండు కత్తులు,ఒక కుర్చీ మూడు తువ్వాళ్ళు  అనేలా ఉన్న  ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించాలి . ఈ వైఖిరిని నాయీబ్రాహ్మణ సంఘాలు  తీవ్రంగా ఖండించాలి . కష్టాలను పట్టించుకోని ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజులు వచ్చాయని నాయీబ్రాహ్మణ సంఘాలు హెచ్చరించాలి . ఆలోచనలు, ఆశలు ఉన్నా ఇంజినీరు, డాక్టరు వంటి వృత్తి విద్యా కోర్సులు చదువుకునే ఆర్థిక స్థోమత లేని నాయీబ్రాహ్మణ లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా  ఇచ్చిన మద్దతు కొనసాగాలి  అంతే కాక ప్రతి విద్యార్ధికి కొంత మొత్తం వారి రోజువారీ ఖర్చులు నిమిత్తం స్టై ఫండు గా ఇవ్వాలి.  రాష్ట్రంలోనే కాక దేశంలోనే నాయీబ్రాహ్మణ వర్గాలకు సంబంధించిన ఒక విప్లవాన్ని లేవదీయాలి . ఆ విప్లవాన్ని అణగదొక్కటానికి ప్రభుత్వం చేస్తున్న ఏ కుట్రనూ సఫలం కానివ్వబోమని  నాయీబ్రాహ్మణ ప్రతిజ్ఞ చేయాలి

నాయీబ్రాహ్మణ  కుటుంబ సంక్షేమం

            ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించాలని , నాయీబ్రాహ్మణ సంఘం  భావిస్తోంది. భూమిలేని వారికి  భూములు పంపిణీ చేసి వాటిపై హక్కులు కల్పించాలన్నది విధానం. రక్షిత మంచినీటి సదుపాయం, విద్యుత్తు సదుపాయాలు కల్పించటంతో పాటు విద్య, వైద్య సదుపాయాలను వారికి మరింత చేరువగా తీసుకు వెళ్లాలని కోరుతోంది.
            తరతరాలుగా తాము సాగుచేస్తున్న దేవాలయ ఈనాం నేలపై హక్కు తమకే ఉండాలంటూ  ఏళ్లుగా పోరాడిన వారి  ఆవేదనను అర్థం చేసుకోవాల్సింది  ప్రభుత్వమే. పావలా వడ్డీ రుణాలను వర్తింపజేయాలి. ఉపాధి హామీ పథకం ద్వారా భూములను అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించాలి.
             నాయీ బ్రాహ్మణ సంఘాల సమగ్ర సంక్షేమానికి కట్టుబడి ఉండాలి.  ప్రభుత్వం ఎలాంటి ఉపాధిపథకాలు రూపొందించకుండానే  కార్పొరేషన్ నుంచి నిధులు పంపిణీచేయటంతో లక్షల మంది అప్పుల్లో కూరుకుపోయారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి నాయీబ్రాహ్మణ వర్గాలకు చెందిన కొంత మంది చెల్లించాల్సిన మార్జిన్ మనీ బకాయిలను మాఫీ చేయటం ద్వారా ఆ వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలి. వారిని పారిశ్రామికులుగా మార్చేందుకు ప్రోత్సాహం అందిస్తూ వారికి పారిశ్రామిక వాడల్లోని భూమి ధరలో 33.3 శాతం రాయితీ ఇవ్వాలి , కరెంటు ఛార్జీలను యూనిట్టుకు రూపాయి మాత్రమే వసూలు చేసేలా నిర్ణయించాలి. మంగలి షాపులకు ఇంకా తక్కువకే ఇవ్వాలి.ఇవి కొన్ని  మాత్రమే.

               ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. భూ పంపిణీ వంటి కార్యక్రమాల ఊసేలేదు. ప్రభుత్వానికి మనసే రాలేదు. ప్రస్తుత బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా అదనంగా పెంచలేదు. రాష్ట్రంలో అన్ని బీసీ, రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రమాణాలను నవోదయ స్కూళ్ల స్థాయికి పెంచేలా వసతులు, ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలన్న ఆశయాలకు అనుగుణంగా తక్షణం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని  నాయీబ్రాహ్మణ సంఘము భావిస్తోంది.
             ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలన్న కల , సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయింపుల విషయంలో  ఉదార వైఖరి, నిరుపేద నాయీబ్రాహ్మణ లకు ఉచిత వివాహ పథకాన్ని, వితంతు పింఛన్లు, గృహాలు అందించాలి. ప్రవేటు  ఫైనాన్స్ ద్వారా రుణాలు తీసుకుని, అటు రుణాలు కట్టలేక, ఇటు కొత్త అప్పులు పొందలేక ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ప్రత్యామ్నాయంగా బ్యాంకుల ద్యారా ప్రభుత్వ హామీతో ఆర్ధిక వారికి ఊరట, వారిలో ఆత్మవిశ్వాసం మరింతగా పెంపొందించటానికి  నాయీబ్రాహ్మణ సంఘాలు చేయగలిగినదంతా చేయాలి. సంఘ సంస్థల ఆస్తుల పరిరక్షణకు నాయీబ్రాహ్మణ సంఘాల కట్టుబడి వుండాలి . కమ్యూనిటీ స్థలాల పునరుద్ధరణకు, నాయీబ్రాహ్మణ కళ్యాణ మండపాలకు  ప్రభుత్వం బడ్జెటరీ మద్దతు కల్పించాలని డిమాండ్ చేస్తుంది.

నాయీబ్రాహ్మణ  వికలాంగుల సంక్షేమం  

         సమాజంలో భౌతికపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్న నాయీబ్రాహ్మణ వికలాంగుల  ప్రతి ఒక్కరికీ గౌరవంగా జీవించే పరిస్థితి కల్పించటానికి  నాయీబ్రాహ్మణ సంఘాల కట్టుబడి ఉంటాయి. వారి మొహంలో చిరునవ్వు, గుండెల్లో ఆత్మవిశ్వాసం నింపేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని  నాయీబ్రాహ్మణ ప్రజావేదిక డిమాండ్ చేస్తోంది. ఈ వాతావరణాన్ని అధికారంలో ఉన్న వ్యక్తులు ఏనాడూ పట్టించుకోలేదు. నాయీబ్రాహ్మణ వికలాంగుల అవసరాలను, వారి గుండెల్లో ఆవేదనను మానవతా దృక్పథంతో అర్థం చేసుకునే ప్రయత్నమే చేయలేదు. కాబట్టే, వికలాంగులకు నామమాత్రంగా పింఛన్ రూపంలో చెల్లించేవారు. ఈ కొద్దిమొత్తం తీసుకోవటానికి వికలాంగులు కూడా అనేకసార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది . వీరందరికీ దుస్తులు కుడాసరఫరా చేయలేని దుస్థితిలో  ప్రభుత్వం ఉంది. కాస్మెటిక్స్ ఛార్జీల విషయంలోనూ  ప్రభుత్వానిది ఇదే తీరు. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఈ కార్పొరేషన్‌కు నామమాత్రంగానే నిధులు కేటాయించటంతో, బడ్జెట్‌ లేదన్న సాకుతో. వైకల్యం తీవ్రతను (శాతాన్ని) బట్టి నెలవారీ పింఛన్ మొత్తాన్ని పెంచుతామని నాడు హామీ ఇచ్చారు. ఈ హామీనే కాదు, కమిటీ చేసిన 19 సిఫారసుల్లో ఏ ఒక్కదాన్నీ  ప్రభుత్వం అమలు చేయటానికి ముందుకు రాలేదు. పాలకులకు మనసుంటే నే ఇలాంటి సమస్యలు పరిష్కారమవుతాయని నాయీబ్రాహ్మణ సంఘాము అభిప్రాయపడుతోంది.

నాయీబ్రాహ్మణ వృద్ధుల సంక్షేమం

            కేవలం అమెరికా వంటి సంపన్న దేశాల్లో, ఒకప్పటి సోషలిస్టు దేశాల్లో మాత్రమే వృద్ధులకు సంబంధించిన ఆలనా పాలనా చూసే వ్యవస్థలు, పథకాలు ఉండేవని విన్నాం. కోట్ల కొద్దీ ప్రజలున్న భారత దేశం లో అలాంటి పథకాల అమలు అసాధ్యమని అన్ని రాజకీయ సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాయి. మరి వృద్ధులు బతికేదెలా? జీవన సంధ్యలో వారికి చేయూత ఎవరిస్తారు? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం లభించాలని  నాయీబ్రాహ్మణ సంఘం కోరుకుంటోంది. ఈ విషయంలో ప్రభుత్వ చొరవను మరింత ముందుకు తీసుకు వెళ్లాని నిర్ణయించాలి.
     గతంలో వయో వృద్ధులకు పింఛన్ రూపంలో అందించేదీ ప్రతినెలా కూడా అందించేవారు కాదు. అయిదారు నెలలకు ఒకసారి విదిలించేవారు. ఈ కాలంలో అన్ని అర్హతలూ ఉన్నా కొత్తగా పింఛన్లు పొందాలంటే గగనమే. దీనికి మధ్యదళారులతో సంబంధం లేకుండా ప్రతినెలా టంచనుగా అందేలా తీర్చిదిద్దాలి.
   అర్హులందరికీ పింఛన్ అందించాలన్న చిత్తశుద్ది నేటి  ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదు. లక్షల  దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగులో ఉన్నాయి. ఇలా ఒకరు చనిపోతేనే ఇంకొకరికి ఇచ్చే పింఛనుగా కాకుండా నిస్సహాయ వృద్ధులందరినీ బతికించే పింఛనుగా వృద్ధాప్య పింఛన్‌ను రూపొందించాలని డిమాండ్ చేస్తోంది.

మహిళా సంక్షేమం

    అభ్యున్నతికి అన్ని విధాల తోడ్పడటంలో మహిళలకు పావలా వడ్డీకే రుణాలివ్వాలన్న  ఆశయం అమలు కావటంతో ఆంధ్రప్రదేశ్‌లో ఒక సామాజిక విప్లవం మొదలయ్యింది. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను తగ్గించుకున్న నేపథ్యంలో స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని నాయీబ్రాహ్మణ సంఘం డిమాండ్ చేస్తోంది.
     నిరుపేద బాలికలకు చేయూతనివ్వటానికి ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బాలికా సమృద్ధి యోజన  బాలికా శిశు సంరక్షణ పథకంస్వయం సహాయం సంఘాల్లోని కోటి మంది మహిళలకు వృద్ధాప్యంలో ఆర్థికంగా చేయూత అందించే లక్ష్యంగా  అభయ హస్తం.అన్నింటిలో నాయీబ్రాహ్మణ వాటా స్పష్టంగా వుండాలి. అరవై ఏళ్లు నిండిన తరవాత ప్రతి నాయీబ్రాహ్మణ మహిళకు నెలకు రూ.2,220కి మించకుండా పింఛన్ రూపంలో అందించాలన్నది నాయీబ్రాహ్మణ మహిళల కల.
----------ఇవీ మనముందున్న ఆశయాలు లక్ష్యాలు. –-----
----------- ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card