మీకు తెలుసా? మీ దగ్గరున్న డబ్బు బ్యాంకులో వేస్తే
సురక్షతం లేదా నమ్మకంగా తిరిగి వస్తాయి అనుకుంటున్నారా?ఐతే మీరు పొరపాటు
పడ్డారన్నమాట. మీరు ఎన్నిలక్షలు కోట్లు ,ఎంత పెద్ద బ్యాంకులో వేసినా ఒకవేళ ఆ బ్యాంకు విఫలమైన లేదా దివాళా తీసిన సందర్భంలో మీకు
సెటిల్మెంటు ద్వారా వచ్చేది గరిష్టంగా (ఎక్కవ లో ఎక్కువ లిమిట్) ఒక లక్ష మాత్రమే.మీరు
కరెక్టుగానే చదివారు రూ.1,00,000/-మాత్రమే. ఎలాగో తెలుకోవాలంటే ఈ వ్యాసాన్ని
పూర్తిగా చదవండి.
ఏదైనా
బ్యాంకు విఫలమైన సందర్భంలో ఆర్‌బీఐ ఆధ్వర్యంలో నడిచే ‘డిపాజిట్
ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ
కార్పొరేషన్’(DICGC) డిపాజిట్
దారులకు చేయాల్సిన చెల్లింపులను
చేస్తుంది. ప్రజలు ఎక్కువగా పొదుపు
చేసేందుకు బ్యాంకు డిపాజిట్లను ఆశ్రయిస్తుంటారు.
గతంలో అప్పుడప్పుడు బ్యాంకులు విఫలమైన సంఘటనలు మనం చూశాం. ఈ విధంగా ప్రజలకు
ఇబ్బందులు గురిచేసిన వాటిలో ఎక్కువ శాతం సహకార బ్యాంకులు ఉన్నాయి.
ప్రైవేటు రంగంలోనైతే ఒక బ్యాంకు కొద్దిగా బలహీనంగా ఉందంటే మరో పెద్ద
బ్యాంకు దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. 2013లో 16 బ్యాంకులు విఫలమైతే అందులో ఎక్కువగా సహకార
బ్యాంకులే ఉన్నాయి. అందులో డిపాజిట్లరకు
చెల్లించేందుకు వెచ్చించిన మొత్తం
సొమ్ము రూ. 160 కోట్లు. ఈ నేపథ్యంలో మన డిపాజిట్లకు రక్షణనిచ్చే
డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ
కార్పొరేషన్(డీఐసీజీసీ) గురించి
తెలుసుకుందాం.
1.డిపాజిట్ ఇన్సూరెన్స్
అంటే?
డిపాజిట్ ఇన్సూరెన్స్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అనేది భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రముఖమైన అంశం. బ్యాంకుల్లో ఉన్న ప్రజల డిపాజిట్లు ఒక్కొక్కటి రూ. లక్ష వరకూ బీమా కవరేజీ పరిధిలోకి వస్తాయి. 1960ల్లో దక్షిణ భారత దేశంలో విస్తరించిన పలయ్ సెంట్రల్ బ్యాంకు విఫలమవడంతో డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అనే ఆలోచన తెరమీదకు వచ్చింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా దీన్ని అమలుపరుస్తున్నాయి. బ్యాంకుల మీద ప్రజలకు విశ్వాసం పెంచాలనే నేపథ్యంతో దీన్ని కొనసాగిస్తున్నారు. ఆ సంస్థను డిపాజిట్ ఇన్సూ్రెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ)గా వ్యవహరిస్తున్నారు.
డిపాజిట్ ఇన్సూరెన్స్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అనేది భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రముఖమైన అంశం. బ్యాంకుల్లో ఉన్న ప్రజల డిపాజిట్లు ఒక్కొక్కటి రూ. లక్ష వరకూ బీమా కవరేజీ పరిధిలోకి వస్తాయి. 1960ల్లో దక్షిణ భారత దేశంలో విస్తరించిన పలయ్ సెంట్రల్ బ్యాంకు విఫలమవడంతో డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అనే ఆలోచన తెరమీదకు వచ్చింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా దీన్ని అమలుపరుస్తున్నాయి. బ్యాంకుల మీద ప్రజలకు విశ్వాసం పెంచాలనే నేపథ్యంతో దీన్ని కొనసాగిస్తున్నారు. ఆ సంస్థను డిపాజిట్ ఇన్సూ్రెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ)గా వ్యవహరిస్తున్నారు.
2. అన్ని వాణిజ్య బ్యాంకులకు వర్తిస్తుందా?
అన్ని
వాణిజ్య బ్యాంకులకు వర్తిస్తుంది
అన్ని వాణిజ్య బ్యాంకులకు డిపాజిట్
ఇన్స్యూరెన్స్ వరిస్తుంది. ప్రాంతీయ
బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ
బ్యాంకులు పథకం పరిధిలోకి వస్తాయి. సహకార
బ్యాంకులకు సంబంధించి కొన్ని పరిమితులు
ఉన్నాయి. మేఘాలయ, చండీగఢ్, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలి తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న సహకార బ్యాంకులు డిపాజిట్
ఇన్స్యూరెన్స్ కలిగి ఉన్నాయి. ప్రాథమిక సహకార సంఘాలు డీఐసీ పరిధిలోకి రావు.
3. వేటికి
వర్తించదు ?
వీటికి
వర్తించదు కేంద్ర ప్రభుత్వ,
రాష్ట్ర ప్రభుత్వాల, విదేశాల డిపాజిట్లు, బ్యాంకుల అంతర్గత డిపాజిట్లు వంటి వాటికి డిపాజిట్
ఇన్స్యూరెన్స్ వర్తించదు. 2010 నుంచి 2015 వరకూ ఐదేళ్లలో
ప్రీమియం ద్వారా డీఐసీజీసీకి వచ్చే
ఆదాయం రెండింతలయింది. అయితే
క్లెయింలు మాత్రం దాదాపు సగం తగ్గిపోయాయి.
ఎందుకంటే బ్యాంకులు విఫలమవ్వడం తగ్గుతూ వస్తోంది.
4. వేర్వేరు బ్యాంకుల్లో ,
వివిధ ఖాతాల్లో డిపాజిట్లు ఉంటే ?
వేర్వేరు బ్యాంకుల్లో ,
వివిధ ఖాతాల్లో డిపాజిట్లు ఉంటే వినియోగదారులు ఒక బ్యాంకు శాఖలో చేసే డిపాజిట్లకు రూ. లక్ష
వరకూ మాత్రమే బీమా వర్తిస్తుంది. ఒక బ్యాంకులో ఎన్ని శాఖల్లో డిపాజిట్లు
చేసినా ఒకదానికి మాత్రమే ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఒకవేళ వేర్వేరు బ్యాంకుల్లో
డిపాజిట్లు కలిగి ఉంటే ఒక్కో బ్యాంకులో ఒక దానికి బీమా ఉంటుంది. ఉదాహరణకు
బ్యాంకు ‘ A'లో మీరు రూ. 80 వేల డిపాజిట్ కలిగి ఉన్నారనుకుందాం. దానిపై వచ్చే వడ్డీ రూ.9 వేలుగా పరిగణిద్దాం. ఏదో కారణాల వల్ల బ్యాంకు విఫలమైతే అప్పుడు డీఐసీజీసీ మీకు చెల్లించే మొత్తం రూ. 89 వేలు. ఒకవేళ
డిపాజిట్ విలువ రూ. 2 లక్షల మేర ఉందని భావిద్దాం. అప్పుడు కూడా మీకు చేసే చెల్లింపు రూ. 1 లక్ష వరకూ మాత్రమే పరిమితం అవుతుంది.
5. చెల్లింపులు ఎలా?
చెల్లింపులు ఎలా?
ఖాతాదారులకు బ్యాంకులు డిపాజిట్ సొమ్ము
చెల్లించడంలో విఫలమయిన నేపథ్యంలో, డీఐసీ నేరుగా నగదు రూపంలో కానీ,
విఫలమైన బ్యాంకు ఖాతా పుస్తకాల్లో గానీ డబ్బును జమచేస్తుంది. బ్యాంకు ఖాతాదారులకు బాకీ పడి ఉన్న
మొత్తాన్ని లేదా ఇన్స్యూరెన్స్ వర్తించేటంత సొమ్మును మాత్రమే డీఐసీ
చెల్లిస్తుంది.
6. బ్యాంకుల విలీన సందర్భంలో ఎలా?
బ్యాంకుల విలీన సందర్భంలో ఒక బ్యాంకు మరో
బ్యాంకులో విలీనమైనప్పుడు సైతం ఇన్స్యూరెన్స్ పరిధిలో ఉన్న బ్యాంకు ఖాతాదారులకు
బీమా వర్తిస్తుంది. ఉదాహరణకు బ్యాంకు ‘ఏ', బ్యాంకు ‘బి'లో విలీనమై, 75 శాతం డిపాజిట్‌కు క్రెడిట్ లభించినప్పుడు ‘ఏ'బ్యాంకులో ఖాతాలో రూ. 10,000 ఉన్నవారికి రూ. 7500
మాత్రమే వస్తుంది. మిగిలిన రూ.2500ను డీఐసీ
చెల్లిస్తుంది.
7. బ్యాంకు
డిపాజిట్లపై ప్రీమియం ఉంటుందా?
బ్యాంకు
డిపాజిట్లపై ప్రీమియం: ఒక్కో ఖాతాకు రూ. 100కు సంవత్సరానికి 5
పైసల చొప్పున ప్రీమియం ఉంటుంది. పథకం పరిధిలోకి వచ్చే బ్యాంకు ప్రతి ఖాతాపై ప్రీమియాన్ని
డీఐసీకి చెల్లిస్తుంది. దీన్ని ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. డీఐసీజీసీ నిర్వహించే నిధులు
* (డీఐసీ రెండు నిధుల(ఫండ్)ను
నిర్వహిస్తుంది. 1. డిపాజిట్ ఇన్స్యూరెన్స్ నిధి
2. సాధారణ నిధి ప్రీమియం) ద్వారా వచ్చిన డబ్బును డిపాజిట్ ఇన్స్యూరెన్స్ నిధిలో జమచేస్తారు. దీనిని కేంద్ర ప్రభుత్వ సెక్యురిటీల్లో
పెట్టుబడులుగా పెడతారు. పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని రెవెన్యూ ఖాతాకు
జమచేస్తారు. ఇన్స్యూరెన్స్ నష్టాలను రెవెన్యూ ఖాతా నుండి డెబిట్ చేస్తారు. కార్పొరేషన్ ఇతర ఖర్చులన్నింటినీ సాధారణ నిధి ద్వారా
నిర్వహిస్తారు.
8. ఉమ్మడి ఖాతాల విషయంలో ఎలా?
8. ఉమ్మడి ఖాతాల విషయంలో ఎలా?
ఉమ్మడి ఖాతాల విషయంలో
A, B, C అనే ముగ్గురు వ్యక్తులు వేర్వేరుగా
ఉమ్మడిగా మూడు ఉమ్మడి ఖాతాలు
కలిగి ఉన్నారు. ముగ్గురు వ్యక్తులకు
సంబంధించి ఒక్కో ఖాతాకు గరిష్టంగా
రూ. లక్ష వరకూ బీమా ఉంటుంది. ఒకవేళ
ముగ్గురు వ్యక్తులు ఉమ్మడి
ఖాతాలను వరుసగా అదే క్రమంలో కలిగి
ఉండకుండా మరో విధంగా ఖాతాలను (A,
B, C ; C, B, A ; B, A, C; లేదా
A, B, C ; A, B, D) క్రమంలో కలిగి ఉంటే
ఖాతాలకు బీమా ఏ విధంగా వర్తిస్తుందో
కింద చూద్దాం. ఏ సందర్భంలో అయినా బీమా అనేది ఖాతాకు వర్తిస్తుంది. అంటే
ఒక్కో ఖాతాకు గరిష్టంగా రూ. లక్ష బీమాను డీఐసీజీసీ కల్పిస్తుంది.
9. డిపాజిట్ ఇన్సూరెన్స్‌ను పెంచాల్సిన అవసరం ఉందా?
డిపాజిట్ ఇన్సూరెన్స్‌ను పెంచాల్సిన అవసరం ఉంది డిపాజిటర్లకు డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అనేది స్వల్పమైన ఊరటను
మాత్రమే కలిగించగలదు. ఖాతాల్లోని డిపాజిట్లకు కవరేజీ పరిమితి చాలా
తక్కువగా ఉంది. దీన్ని మార్చాల్సి ఉంది. బ్యాంకులు విఫలమవడమనేది
ప్రస్తుతం చాలా అరుదైన సంఘటన. ఇక్కడ
బీమా కవరేజీ అనేది ఒక్కో వ్యక్తికి
సంబంధించినది కాదు. దీంతో చివరగా
ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఏదైనా
బ్యాంకు విఫలమైతే ఒక్కో ఖాతాకు
బీమాను వర్తింపజేస్తారు.
No comments:
Post a Comment