Saturday, February 25, 2017

సద్గ్రంధాలకు బదులు మనకు మిగిలేది దుర్గంధాలే




                        స్వచ్ఛమైన పాలు ఒక పాత్రలో వున్నాయనుకొందాము. ఒకడు ఆ పాలను చూస్తూనే అన్నీ త్రాగేయాలనుకొన్నాడు.అంతలో ఎవరో పిలిస్తే అటు వెళ్లి కాసేపు గడిపినాడు. వచ్చి త్రాగుదామనుకొంటే అంతలో అతని అర్ధాంగి పిలిచి పెరటిలోని కరివేపాకు వెంటనే కోసి ఇవ్వమనింది. ఇచ్చి వచ్చేసరికి కాస్త ఆలస్యమైనది. అంతలో ఇంటికి ఎవరో అతి ముఖ్యమైన అతిథులు వచ్చినారు. వారితో కూర్చొని మాట్లాడకుంటే బాగుండదని కూర్చున్నాడు. ఆటంకాలన్నీతొలగించుకొని వచ్చి చూస్తే దానిలో ఈగ పడి వుంది. దానిని తీసివేసి కాచమన్నాడు భార్యను. ఆమె కాచితే అవి విరిగి పోయినాయి.

                             ఇది ఇప్పటి మన తెలుగు పరిస్థితి. పాలు తెలుగైతే ఈగ ఇంగ్లీషు. ఆ వ్యక్తి మన తండ్రి తరము వారికి ప్రతీక అని ఉహించుకొంటే వివిధములైన ఆలస్యములు వారి జీవితములో ఏర్పడిన అడ్డంకులు. ఆ తరములో కొన్ని అత్యంత అవసరాలకు కూడా సరిపడ డబ్బు వుండేది కాదు. కావున ఉద్యోగమ కొరకు చదువుకొన వలసి వచ్చింది. చదువు ముగియగానే ఉద్యోగము. ఉద్యోగమూ పెద్దదైతే పదవీ వ్యామోహము చిన్నదైతే అలవి మాలిన శ్రమ. ఇక ఇంటికివస్తే మనకు ఇష్టమైనవి చదివే తీరుబాటేదీ. ఇంతలో నవలలు ఒకప్రక్క, డిటెక్టివ్ నవలు ఇంకొకప్రక్క ,శృంగార సాహిత్యమనుపేరుతో అసభ్య అసహ్య అశ్లీల అవాంఛిత నవలలు, మాసపత్రికలొకప్రక్క, ప్రొద్దు పుచ్చుటకు సినిమాలొకప్రక్క, ఇక గ్రంథములు చదువుటకు వేసలుబాటేదీ!
                            ఒక అదృష్టమేమిటియంటే ఉత్సాహమున్న వారికి చెప్పేవారు ఆ కాలములో దొరికేవారు. ఇప్పుడు చెప్పేవారూ వినే వారూ కూడా కను మరుగే.

ప్రతి వూరిలో సాయంకాలము 8 గంటల తరువాత హరికథో పురాణ పఠణమో అవధానమో (అవధానము,కవి సమ్మెళనము సా. 5 గం. లకు మొదలయ్యేది.) కవి సమ్మేళనమో ఉండేవి. వినేవారు కూడా అందులోని మధురిమలను ఆస్వాదించే వారు. ఈప్పుడు వారూ లేరు వీరూ లేరు. అన్నింటికీ మించి ధన పిశాచి మన నెత్తిపై తాండవమాడుతూవుంది. పిల్లల వద్ద వుండేది ఆయా (లేక పనిమనిషి). వారిలో సంస్కారము మాయ. ఇవి ‘స్పీకింగ్లీష్’ ‘వాకింగ్లీష్’ ‘ఈటింగ్లీష్’  రోజులాయె. దీనికి తోడు పిల్లలకు ‘వెబ్బు’ లో దొరికే ‘గబ్బు’ మీద మోజెక్కు వాయె. ఆ కాలము వారి సంతానమునకే తెలుగు భాష అంతంత. ఇక వారి పిల్లల కెంతెంత.

                    ఇదికాక కొందరు మహా పండితులమనుకొన్నవారు మన మానాన మననుండనీక వ్యావహారిక భాష అంటూ ఇప్పుడు మనము వాడే తెలుగును ప్రభుత్వమును ఒప్పించి పుస్తకములలో జొప్పించి మనల నొప్పించు చున్నారు.

భాష వుంటే గ్రంధాలుంటాయి. గ్రంధాలుంటే సంస్కృతి నిలుస్తుంది. సంస్కృతి నిలిస్తే మనకు తెలుగు వారిగా గుర్తింపు వుంటుంది.

లేకుంటే సద్గ్రంధాలకు బదులు మనకు మిగిలేది దుర్గంధాలే !
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Friday, February 24, 2017

ఒక ఎకౌంటెంట్ - బీచ్ లో



ఒక ఎకౌంటెంట్  బీచ్ లో( జోక్ కాదు, నిజంగానే బీచ్ కెళ్ళాడు పొన్నూరులో బీచ్ లేదు ఆయనా వెళ్ళాడు ఎలాగో ఎకౌటంటూ అనే వాడెవడి కయినా తెల్సు), వాకింగ్  చేస్తుండగా , ఒక పాత దీపం  ఇసుకలో కప్పిఉండటాన్ని చూసి .చేతికి తీసుకుంటాడు.అలీ బాబా అద్బుత దీపం కదలు చిన్నపుడు వినివుండటం వల్ల దాన్ని అరచేతి కేసి  రుద్దుకున్నాడు.అంతే నిజంగానే దాంట్లోంచి ఒక భూతం బయటకి వచ్చింది. చెప్పింది "నేను చాలా శక్తివంతమైన దాన్ని ఒకరు నన్ను దీన్లో బంధించారు నాకు సహాయం చేసావు కాబట్టి ‘అద్భుతమైన’ పనులు లేదా  మీ ‘ప్రియమైన కోరిక’ ఏదయినా వుంటే తీరుస్తాను అంది. కానీ తనకి  ‘చట్టాలు’ ‘టాక్స్ లు’  ‘యాక్టులు’ తప్ప బయట ఇంకేమీ తెలియయవు కాబట్టి’ దానికి సంభంధించే  ఒక కోరిక కోరుకుంటాడు
Well,  ఇక్కడ ‘మోడీ’, అక్కడ ‘ట్రంప్’ సామాన్య ప్రజల సమస్యల పరిష్కరించడానికి కృషి చేసే విధంగా వారి మనసు మార్చగలవా ?”
భూతం  తన గడ్డం  అడ్డంగా ఊపింది.  ఆందోళనగా
"అయ్యో, అది చాలా కష్టం నా వల్ల కాదు  వేరే ఇంకోటి చెప్పండి ఈ సారి కచ్చితం గా చేస్తాను “ అంది
"నిజమే అది కఠినమైనదే, ప్రజలు కూడా పోరాడుతున్నారు.
 “మీరు ఖచ్చితంగా మరొక కోరిక కోరాలి"
అకౌంటెంట్  అలోచించి చెప్పారు
"ఈ మద్య భారతీయ ఆదాయపన్ను శాఖ వారు నల్లడబ్బు  వెలికితీత లో భాగంగా, ఆన్లైన్ లో ,విడిగా కొన్ని ప్రశ్నలతో ఫారాలు ప్రవేశ పెట్టారు. ఒక్కరూ పూర్తిగా అర్ధం చేసుకోలేక పోతున్నారు, కాబట్టి వాటిని  తిరిగి సులభంగా రూపొందించి నాకు సహాయం చేయగలవా “
ఒక అరగంట సుదీర్ఘమైన నిశ్శబ్దం తర్వాత గట్టిగా నిట్టూర్చి...  చివరికి భూతం  ఇలా చెప్పింది,
"లేదూ,...
మొదటి సమస్యే  చూద్దాం పదా! "
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

Thursday, February 23, 2017

వరకట్నం తీసుకోవడం తప్పా?


                 ఈ విషయం పరిశీలించే ముందు కొన్ని ప్రత్యేక అంశాలు కూడా పరిశీలించ వలసిన అవసరం వున్నది.
పుత్రులలో కన్న’పుత్రుడు, దత్త’ పుత్రుడు మాదిరిగా కొన్నకున్న పుత్రుడిని "క్రౌతుడు" అంటారు. వరునితరపు వారు అడుగకుండానే వధువు తండ్రి (కన్యాదాత) ప్రీతిపూర్వకంగా యిచ్చునది ‘వరకట్నం’ అంటారు. వరుని తరపువారు కన్యాదాతను అడిగి తీసుకొనుదానిని వర’విక్రయం’ అంటారు. అలాంటి వాటిలో వరకట్నం విశేషమయినది. మరి " వరవిక్రయం" జరిగినప్పుడు ఆ వరుని కొనుకున్న కన్యాదాతకు- ఆ వరుడు ‘క్రౌత’ పుత్రుని మాదిరిగానో లేక ‘దాసు’ని మాదిరో అవుతాడు కానీ అల్లుడు’ అవ్వడు.
                 దాసుడు కానీ, క్రౌత పుత్రుడు కానీ అయినవాడు చేసే పుణ్యకార్యాములలో, కర్మలలో భాగము యజమానికి చెందును. అటువంటి సమయంలో ఈ వర’విక్రయం’లో పొందిన వరుడు (అడిగి కట్నం తీసికొని పెళ్లి చేసుకున్న వరుడు ) తన తల్లి తండ్రులకు చేయు శ్రాద్ధాది పితృకర్మలలో పుణ్యాభాగము కన్యాదాతకు(భార్య తండ్రికి ) చెందును. తన తల్లి తండ్రులకు  చెందవు అందువలన వరవిక్రయం మంచిది కాదు.

                మన సాంప్రదాయంలో అష్టవిధ వివాహములు వున్నవి. అవి  ‘బ్రహ్మ, దైవ, ఆర్ష, ప్రాజాపత్య, అసుర, గంధర్వ, రాక్షస, పిశాచ’  అనే ఎనిమిది విధములు.
               మొదటి నాలుగు వివాహములలోని వారికి కలుగు సంతానము సత్సంతానము అనబడుతుంది.  వీటిల్లో కన్యదాత వద్ద  కట్నం తీసికొనే విధానం లేదు  కనుక అది  వివాహమే కాదు వరవిక్రయం జరిగిన ఎడల ఆ వరుడు "పతి" గా అనర్హుడే అవుతాడు.ఇంకా ఖచ్హితంగా చెప్పాలంటే మగ వ్యభిచారి అవుతాడు కానీ పతి  అనటానికి వీల్లేదు
ఆమె వారస వినియోగదారు లేదా వారస యజమానురాలు అవుతుంది కానీ భార్య కానే కాదు
               వేద ప్రతిపాదిత కర్మనుష్ఠనంలో యజ్ఞ యాగాది క్రతువులు చేయడం కోసం సహాయకారిగా హ ధర్మ చారిణి అవసరం. భార్యగా వున్న స్త్రీ కేవలం అన్నం వండి పెట్టాడానికో లేక దైహిక అవసరాలు తీర్చడానికో మాత్రమే కాదు, ఆమె మగవాడు చేయ ప్రతి పూజ, జప, కర్మ కాండ, యజ్ఞయాగాధుల నిర్వహణలో భూమిక వహిస్తుంది. భార్య లేకుండా చేయు ఏ కర్మకాండ కూడా, సిద్ధించదు. అందుకే శ్రేష్ఠమయిన కన్యను శ్రేష్ఠమయిన రీతిలో వివాహం చేసుకోవాలి
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


Address for Communication

Address card