Wednesday, January 11, 2017

“పొన్నూరు లో ఉన్న విగ్రాహాలకి ఓ సరదా కధవుంది తెలుసా మీకు”




ఎప్పుడూ కూడికలు,తీసివేతలు వేసి వేసి విసుగొచ్చేసింది,కాసేపు ఏదన్నా
చదువుదామని అరమరలో వెదికితే ,తిలక్ వ్రాసిన “అమృతం కురిసిన రాత్రి” కనిపించింది.ఇప్పటికే చాలా సార్లు చదివా,అయినా ఇంకోసారి చదవాలనిపించింది. చదవడం మొదలు పెట్టీపెట్టకుండానే ఒక ‘కాలకేయుడు’ వచ్చాడు.కాలకేయుడని ఎందుకాన్నానంటే,అతను ఎవరికాలన్నయినా తినేస్తాడు కాబట్టి.కాసేపు చూసి ఇక లాభంలేదని టీ తాగి వద్దాం పద అని ఆషా సైకిల్ షాపువద్ద 5/- కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉండక,అకస్మాత్తుగా అతను హానిమాన్ విగ్రహాని చుస్తూ,”అతనెందుకు అలా తల పట్టుకుని కూర్చున్నాడు”అని అడిగాడు.

  “పొన్నూరు లో ఉన్న విగ్రాహాలకి ఓ సరదా కధవుంది తెలుసా నీకు” అన్నాను.తెలీదన్నాడు సరే చెబుతా విను అని ఇలా మొదలు పెట్టాను.”నీ లాంటి ఒకడు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా రాదా “అని హానిమాన్ ని అడిగాడు,హోనిమన్ “నేను చాలా రోగాలకి మందు కన్నుక్కున్నాను,కానీ ఎదువాళ్ళ మనసులో ఏముందో తెలుసుకొనే మందు కనుక్కోలేక పోయాను,అందుకే ఈ రాష్ర్ట భవిష్యత్ ఏంటని ఎప్పుడూ ఆలొచిస్తూవున్తాను.నువ్వు నన్నడిగితే నేను ఏమి చెప్పను? ప్రత్యేకరాష్టాల విషయాల్లో అనుభవమున్న ఆయన ఎదురుగానే వున్నాడు వెళ్లి అడుగు” అనిపొట్టిశ్రీరాములు విగ్రహాన్ని చూపించాడు.సరే అని  పోయి ఆయన్ని అడిగితే”అప్పడయితే నేను  నిరాహారదీక్ష చేసాను గాబట్టి సజావుగా జరిగిపోయింది,ఇప్పుడేమో పక్కరాష్ట్రం kcr చేసాడు.నావారాసులెవరన్నా మళ్ళీ చేస్తారేమో అని అప్పట్నించి నిలబడి మరీ వెదుకుతున్నాను.కావాలికావాలి అనేవారేగాని,ముందుకొచ్చే వారు కనబడలా, అసలు దీనికంతటీకి కారణం అదిగో ఆరాజ్యాంగం రాసినాయిన అంబేద్కర్, పోయి గట్టిగా నిలదీయి “అన్నాడు.హమ్మయ్య కరెక్టుగా సమాధానం చెప్పేవాడు దొరికాడాని ఆనందంగా  వెళ్లి అడిగా.ఆయనికి ఒక్కసారిగా కోపమొచ్చింది,చిటాలునా లేచి నుల్చుని “ఎవడికి తెల్సు ,నీను రాసిన రాజ్యాంగం ఇది కాదు,వాళ్ళ ఇష్టమోచ్చినట్లు మార్చుకున్నారు.వారిలో ఒకరు రామారావు గారు, మీ అన్న ,మీ ప్రియతమ ముఖ్యమంత్రి ,ఎదురుగానే ఉన్నారు,వెనుక ఆదర్శనేత,రాజశేఖర్రెడ్డి వున్నారుగా నన్నెందుకు అడుగుతావు” అని చిరాకు పడ్డాడు.ఇంకానయం కొట్టలేదు సంతోషం అనుకుంటూ, బతుకు జీవుడా అనుకుంటూ,రాజశేఖర్రెడ్డి గారిని కలిసా అయన”అసలు నేనుంటే రాష్ట్ర విభజన అనేది లేదు,ఇదంతా ఇప్పుడున్నవారి తప్పు నా కు దీనితో సంభందం లేదు “అని ముసుగేసుకున్నాడు దిమ్మదిరిగి ,అన్నగారు రామారావు గార్ని కదిలిద్దామని అడిగి చూసా.”ప్రత్యేకరాష్ట్రం ఏమిటి?,ప్రత్యేక హోదా ఏమిటి? బ్రదర్,అంతామిధ్య”.అంటూ గాల్లోకి చేయి పైకి చూపాడు.అంతే అక్కడే ఉంటే నువ్వు మిధ్య నేను మిధ్య అసలు ఈ ప్రపంచమే మిధ్య అంటాడేమోనని భయమేసి చల్లగా జారుకుని రంగా గారి వైపు వచ్చా,అనుభవజ్ఞుడు,డక్కామోక్కీలు తిన్నవాడు కదాని  ఆయన సింపుల్ గా తేల్చేసాడు”ఏమి మాట్లాడాలన్నా మా హైకమాండ్ అనుమతి తప్పనిసరి, త్వరలోనే స్పందిస్తాం ,అధికార ప్రభుత్వము వార్ని ఎదురుంచుకుని  మమాల్నెందుకు ఇబ్బందిపెడతావాని వెళ్ళు “అని వేలితో దారికుడా చూపాడు.ఆయన చూపిన దారి వైపు చూస్తే వీరయ్యచౌదరి గారి విగ్రహం కనబడింది.వెళ్లి అడిగేసా.”నేను ,మరి నా కాలంలో ఇలా లేదు అయినా ఎదోవొకటి తప్పనిసరిగా చేద్దాం,ఎందుకైనా మంచిది జగమెరిగిన నాయకులు షరాబ్ బజారులో ఓ మూలగా వున్నారు వాళ్ళ అభిప్రాయం తెల్సుకునిరా “అన్నాడు.ఏమి చేద్దాంమన్నాడు,దేని మీద అభిప్రాయం అడగాలి,అసలు నేనేమి అడిగాను ఆయనేమి చెప్పాడు.. అర్ధం గాగ బుర్ర గోక్కుంటూ షరాబ్ బజారు వైపు వెళ్లాను.అక్కడున్న గాంధీ గారు,పొట్టిశ్రీరాములుగారు ,చాలాభాధపడుతూ “నిన్న గాక మొన్న వచ్చిన నాయకులందరూ నడి రోడ్డు మీద నున్చుంటీ మేము ఒక మూలన ఉన్నాము,అయినా మా సలహాలు  ఇప్పటి తరానికి పనికిరావుగా “అని నిట్టుర్చారు
   బుర్ర హీటేక్కి ఇక లాభంలేదని  తిరిగి ఆఫీసు కోస్తూ దారిలో ఓ లెమాన్ టీ తాగి గట్టిగా రెండు దమ్ముల్లాగి,ఆఫీసు కెళ్ళి,మళ్ళీ నాకూడికలు  తీసివేతలుతో రొమాన్సు ప్రారంభిన్చాను.లెక్కలతో రొమాన్సు ఏంటి అని సందేహమా ఈ సందర్భంలో మీకు తిలక్ “అమృతం కురిన రాత్రి” లో రెండు వాక్యాలు చెప్పాలి”స్పందించే హృదయం,ఆస్వాదించే మనసు వుంటే రాతి తోనే కాదు నాతి తో కూడా సురతం సాధ్యమే,చూసే హృదయం వుంటే రోడ్డు ప్రక్కన బండ రాయి అందంగా వుంటుంది.నిన్న కురిసిన మంచు బిందువు నేటికీ అందంగానే వుంటుంది.”-- ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681----POSTED IN MY FACEBOOK AND WHATSAPP  ON 29.09.2016

No comments:

Post a Comment

Address for Communication

Address card