ఆమె కొంగు అలా అలా కదలాడుతుంటే గుండె ఝల్లుమనదా
నేను
ఫెమినిస్టుని. కాదుగానీ.. ‘ఫెమిన్
-ఇష్టున్ని’!.పూర్తిగా నిజం కాదు గానీ ఖచ్చితంగా
అబద్ధం కూడా కాదు. నాకు స్త్రీత్వంమ్మీద విపరీతమైన ఇష్టం, గౌరవం. అంతకుమించిన ప్రేమ. నేను అందాన్ని
ఇష్టపడతాను. (తప్పేం లేదు. అది ఎస్తటిక్ సెన్స్.. అంతే!!). మరో దురుద్ధేశ్యం
లేకుండా. అవకాశం వుంటే (నొచ్చుకోకుండా)
వాళ్లు ఎలాగయితే ఇంకా బాగుంటారో చెప్తాను.
పోతన
తన భాగవతంలో ‘ప్రహ్లాదు’ని గురించి “కన్ను దోయికి అన్య కాంత లడ్డం బైన మాతృ
భావము చేసి మరలువాడు” అని
చెప్తాడు. ఇంకెలా చూస్తాడుట ‘పంచశరద్వయస్కుడూ..
బాలుడు…!! (5 ఏళ్ల
కుర్రకుంక) (సరే సరే… సందర్భం
చీర నుంచి పారిపోయినట్లుంది. చీర కట్టిన చినదాన్ల గురించి పోతోంది. వదిలేసి చీరల దుకాణంలోకి
వద్దాం.
“చీర సొగసు చూడ తరమా?” శీర్షికతో కొన్ని పద్యాలు.
చీర .. ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడే భారతీయ
సంప్రదాయపు వస్త్రాలంకరణ. వనితను నిలువెల్లా కప్పి ఆమెను
దాచిపెట్టి, పెట్టకుండా
మరింత అందంగా చూపిస్తుంది.
ఈరోజుల్లో అమ్మాయిలు మరీ మాడర్న్ ఐపోవడంతో చీర కట్టడం చాలా తగ్గించారు/ మానేసారు అని అంటారు కాని
పెళ్ళిళ్లకు వెళ్లి చూడండి. రంగు రంగుల, తళుకు బెళుకుల చీర కట్టిన అమ్మాయిలతో
కళకళలాడిపోతూ ఉంటుంది. నాడైనా, నేడైనా,
భారతీయ వనితలకు మరింత
వన్నె తెచ్చేది మేలైన చీర. ఎంత అభివృద్ధి చెందినా , ఎన్ని ఆధునిక వస్త్రధారణలైనా ఈ చీరకున్న
గొప్పదనం చెక్కుచెదరనిది.
అందుకే ఈ చీర అనే అంశం మీద ఆచార్య ఫణీంద్ర, టేకుమల్ల వెంకటప్పయ్య, రవి, అనిల్ మాడుగుల, జె.కె.మోహనరావుగార్లు ఎంతో అందమైన
పద్యాలు వివిధ అంశాలతో జోడించి రాసారు. కానీ ఈ పద్యాలను
విశ్లేషించిన బ్నింగారు మాత్రం చీరను మరో కొంటెకోణంలో చూపించారు. ఎంతైనా
బ్నింగారి స్టైలే వేరు కదా.. అందుకే
చీర అందాలను
మరింత అందంగా కంద పద్యాలలో చూపించారు.
ఇక ఇంట్రస్టు
వుంటే చీర మీద పద్యాలు కూడా చదవండి.వ్యాసం నిడివి ఎక్కువ అవుతుందేమోనని ఎక్కువ
ఇవ్వటంలేదు
‘బ్నిం’ కందాల్లో అందాలు :
శారీ బ్లౌజుల నడుమన
వేరే ఆచ్చాదనమ్మువేయక, మెరిసే
నారీ నడుముల మడతల్
వారెవ్వా చూపుచుండు వరములె చీరల్.
భారత యంగనామణి శభాషని మెచ్చెడు సంప్రదాయమొ
ప్పారగ కుంకుమాంకిత శుభావహమౌ వదనారవిందయై
చీరనుగట్టి లక్ష్మి కళ జిల్కుచు కన్పడు నెల్లవారికిన్
గౌరవభావమున్ కరయుగమ్ములుమోడ్చి నమస్కరింపగన్
డా.ఆచార్య ఫణీంద్ర ఆటవెలది:
వయసు వచ్చినట్టి పడుచు పిల్లల ‘ఓణి’
కొంగు నిలువదాయె కోర్కె లూర!
వచ్చు వాడెవండొ – వాని స్పర్శ యదేమొ
కొంగు తడిమి చూపు పొంగులందు!
(యవ్వనంలో – శృంగార
రసం)
పసిడి రంగుల బూసలు బచ్చమణులు
ఇంపు సొంపుగ పుట్టించి కెంపులీను
వర్కు చీరల ధరియించు వనిత లిపుడు
అంద మొప్పార శోభల నందుకొనరె!
ఈ
అబ్బాయిలున్నారే … మరీ
కొంటెవారు.. శారీ,
బ్లౌజుల మధ్య మెరిసే
ఆ యింతి
నడుము మడతలు మామూలుగా
కాక ఒక వరములా కనువిందు కలిగించడానికి తోడ్పడుతాయట చీరలు! ఈనాడు అమ్మాయిలు ధరించే మాడ్రన్
డ్రెస్సులకన్నా చీరయే మరింత సొగసైనది. అందమైన చీర కట్టుకున్న
ఇంతి ముందుండగా
కదులుతున్న ఆమె చీరకొంగును చూసి గుండె ఝల్లుమన్న పోకిరీలు టీషర్టు, జీన్సుల అమ్మాయిలను కన్నెత్తైనా
చూడనంతగా మైమరచిపోతున్నారట. ఒంటినిండా కప్పే ఆరు గజాల చీర అతివ
అందాలను దాచీ దాచకుండా, చూపి
చూపకుండా ఆమె
ఒంపుసొంపులను మరింత సోయగంగా చూపించే అద్భుతమైన కాస్ట్యూమ్ ఈ చీరకాక మరింకొకటి
కలదా అని అంటున్నారు బ్నింగారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అంగీకరించిన సత్యమే కదా.. అందుకే అందీ
అందని జాబిల్లి అంటారు ఇటువంటి వాళ్లని. ఇప్పటికైనా అబ్బాయిలు ఈ మాటలను
మరోసారి తప్పక మననం చేసుకొంటారు.
అసలే
అందమైన అమ్మాయి. మరింత అందమైన చీర కట్టుకుని హిమాలయ శిఖరాలవలె ఉన్నతంగా
అలా నడిచివస్తుంటే, చుక్కలన్నీ
రాలి ఆమె చీర కొంగులో ఒదిగిపోగా, మలయమారుతంలా
ఆమె కొంగు అలా అలా కదలాడుతుంటే గుండె ఝల్లుమనదా మనసున్న మారాజుకి.. ఇక ఆ సొగసు చూడ ఎవరికైనా
తరమా?
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment