Friday, January 20, 2017

ఇంతకు మించిన దుఃఖం మరొకటి ఉండగలదా?



    ఇంతకు మించిన దుఃఖం మరొకటి ఉండగలదా?     





             భార్య చనిపోతే ఆమె శవాన్ని ఏకాఎకిన భుజాన వేసుకుని 60 కి.మీ దూరం లోని ఇంటికి కాలి నడకన బయలుదేరిన భర్త!
             జబ్బు పడిన కొడుకుకి వైద్యం చేయించడం కోసం అతన్ని భుజం మీద వేసుకుని, వైద్యం అందక తన భుజం మీదనే ప్రాణాలు వదిలాడని తెలియక  డాక్టర్ల మధ్య పరుగులు పెట్టిన తండ్రి!
             పురుటి నొప్పులు పడుతున్న కూతురిని సైకిల్ వెనక సీటుపై కూర్చో బెట్టుకుని వెళ్ళి, ప్రసవం అయ్యాక పసికందుతో సహా అదే సైకిల్ పైన ఇంటికి తెచ్చుకున్న మరో తండ్రి!
              చనిపోయిన మహిళ దేహం రిగర్ మార్టిస్ లోకి వెళ్ళి పోవడంతో నిట్టనీల్గిన శవాన్ని మూట గట్టి రైలు పెట్టెలో పెట్టే వీలు లేక కట్టె పుల్ల విరిచినట్లు ఓ వంక కాళ్లతో నొక్కి పెట్టి మరో వంక చేతుల్తోనే సగానికి విరిచి మూట గట్టి దుంగకు వేలాడ దీసి రైలులోకి చేరవేసిన ఉదంతం మరొకటి!
             దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్! అన్నది నిజమే అయితే ఈ దేశానికి ఇంతకు మించిన దుఃఖం మరొకటి ఉండగలదా? (ఇవన్నీ మనం ఈ మధ్య వార్తల్లో చదివినవే)
                ఈ జన దుఃఖాన్ని దాచి పెట్టి కుహనా జాతీయవాదాలతో కృత్రిమ దుఃఖాన్ని చొప్పిస్తున్న నడమంత్రపు రోదనా మూర్తుల నుండి, తండ్రీ, రక్షించు నన్నూ, నా దేశాన్ని!! ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card