మన దేశంలో డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు జరపలేమా?
సమాధానం:
ఇది చాలామందిని వేధించే ప్రశ్న. ఎన్నికలు నీతివంతంగా జరిగితే ఆ వచ్చే
నాయకులు నీతివంతంగా ఉంటారన్న ఆశ ఈ ప్రశ్నలో ఇమిడి
ఉంటుంది. లోక్ సత్తా పార్టీ నాయకులు జయప్రకాష్ నారాయణ
లాంటి నాయకులు సైతం ఎన్నికల్లో సరైన అభ్యర్ధులను ఎన్నుకుంటే దేశం దానంతట అదే బాగుపడుతుందని ప్రబోధిస్తున్నారు. కానీ
అది నిజమేనా?చెట్టు ముందా, విత్తు ముందా అని
ప్రశ్నిస్తే ఏమిటి సమాధానం? కోడి ముందా, గుడ్డు ముందా అని అడిగితే సంతృప్తికరమైన సమాధానం ఉంటుందా? ఎడతెగని తాత్విక ప్రశ్నగా మనముందు
నిలబడినట్లు కనిపిస్తుంది.
ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలంటే ఫిలాసఫీలోకి వెళ్లవలసి ఉంటుంది.
‘Survival of the fittest’ సూత్రం ప్రాతిపదికన జరిగిన ఈ పరిణామంలో జీవ పదార్ధం అమీబా దశ నుండి నేటి మానవుడి వరకూ రూపం మార్చుకుంటూ
వచ్చింది. ఈ పరిణామంలో కోడి,
గుడ్డులలో ఏది ముందు అని
వెతుక్కోవడం అంటే జీవ పరిణామ క్రమాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేదనే అర్ధం.
ఇదే పద్ధతిలో ‘డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు జరపలేమా’ అన్న ప్రశ్నను పరిశీలిస్తే ఆ ప్రశ్నకు దారి తీసిన పరిస్ధితులను
మనం సరిగ్గా అర్ధం చేసుకోలేకపోతున్నామన్న కంక్లూజన్ కు రావలసి
ఉంటుంది. ఎందుకంటే, ఈ ప్రశ్నలు, సమాధానాలను పరిశీలించండి.
డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు జరపవలసిన బాధ్యత, అధికారం ఎవరికి ఉంది? ఎలక్షన్ కమిషన్ కు ఉంది. ఆ ఎలక్షన్ కమిషన్ అధికారులను ఎవరు నియమిస్తారు?ప్రభుత్వం నియమిస్తుంది. ప్రభుత్వం నిర్వహించేది
ఎవరు?ఎన్నికల్లో గెలిచిన పార్టీ లేదా పార్టీల కూటమి.ఆ
పార్టీ లేదా పార్టీల కూటమి ఎన్నికల్లో ఎలా గెలుస్తున్నాయి?డబ్బు, మద్యం లాంటి అనేక ప్రలోభాల ద్వారా. మరి డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు
జరపలేమా? అసలు డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు జరపవలసిన బాధ్యత, అధికారం ఎవరికి ఉంది?ఇలా మనం మళ్ళీ మొదటికే వచ్చేశాం. ఇదొక వలయం. నిజం
చెప్పాలంటే మాయా వలయం. ఈ మాయా వలయం నుండి మనం బైటికి రాలేము.
(ఇంకావుంది.....పని వత్తిడి వల్ల, పోస్ట్
నిడివి వల్ల మొత్తం ఒక్క సారే వ్రాయలేకపోతున్నాను. ఇంట్రస్టు వుంటే తర్వాత పోస్టు
కోసం చూడండి)
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment