Monday, January 23, 2017

సీతని తాకనైనా తాకని రావణాసురుడు ని రాక్షసుడన్నారు.అహల్యని చెరిచిన ఇంద్రుణ్ణి దేవుడన్నారు ఎందుకు?



సీతని తాకనైనా తాకని రావణాసురుడు ని రాక్షసుడన్నారు.అహల్యని చెరిచిన ఇంద్రుణ్ణి దేవుడన్నారు ఎందుకు?
 (ఇంతకుముందు పోస్టుకి కొనసాగింపు---3)


              ఇంతకుముందు రెండు పోస్టులు చదివారు కాబట్టి ధనికులే విజేతలనే నా భావన  ఈనాటిది కాదు అసలు సమాజం పురాణ కాలం నుండి అలానే అలవాటు చేయబడింది. ఈ పోస్టుకి  హెడ్డింగ్ గా పైన వేసిన ప్రశ్నకి –(‘ఎటాక్’ సినిమా పాటలో సిరాశ్రీ వ్రాసినది-)  మీకు సమాధానం తెలిసిందా. ఇలాంటి మరోప్రశ్న(నేను ‘’పొన్నూరు ఫ్రెండ్స్“  వాట్సప్  గ్రూప్లో చేరినప్పుడు మొట్టమొదటిసారిగా వ్రాసిన పోస్టు ) గిరిధారి అంటే కృష్ణుడు అని మనకి తెలుసు గిరి అంటే కొండ -దానిని ధారి అంటే ధరించినవాడు(మోసినవాడే) అని అలా పిలుస్తాం..కానీ ఆంజనేయుడు కూడా ఆపని చేసాడు కదా మరి వారి నెందుకు అలా పిలవం

              ఈ రెండు ప్రశ్నలకి సమాధానం తెలుసు కో గలిగితే   నా ఈ మాడు పోస్టులు  మీకు అర్ధమైనట్లే. ఇక  ప్రస్తుత విషయంలోకి వద్దాం  
             డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు జరిగితే ఎవరికి లాభం? ఎన్నికల్లో పోటీ చేసేవారికి కాస్త డబ్బు ఖర్చు తప్పుతుందే గానీ గెలిచేది ఆ ధనిక వర్గాలే.ప్రజాసేవ చేస్తానంటూ ఎవరన్నా నీతిమంతులు బయలుదేరితే వారిని నిరుత్సాహపరిచి ఎక్కడికక్కడ నలగ్గొట్టే పరిస్ధితులను, వ్యవస్ధలను ధనిక వర్గాలు నిర్మించి పెట్టుకున్నాయి. నీతిమంతులు ఎన్నికల్లో నెగ్గితే ఆ వ్యవస్ధలు చూస్తూ ఊరుకోవు.
                అందుకే రాజ్యం’ అనే పద ప్రయోగాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. ప్రభుత్వం అంటే కేవలం పార్లమెంటు, అసెంబ్లీలు. కానీ ఇవి రాజ్యంలో ఒక భాగం మాత్రమే. సైన్యం, పోలీసులు, పారామిలట్రీ బలగాలు, బ్యూరోక్రసీ, కోర్టులు, పార్లమెంటు, అసెంబ్లీలు, ధనిక పత్రికలు ఇవన్నీ కలిపి రాజ్యం అవుతుంది.
                రాజ్యాన్ని ఆధీనంలో పెట్టుకున్న వర్గాలు రాజ్యంలోని ఒక అంగం అయిన పార్లమెంటు, అసెంబ్లీలలో కొద్దిమంది నీతిమంతులు ప్రవేశిస్తే చూస్తూ ఊరుకోవు. ఏవైనా జరగొచ్చు. మన శిక్షాస్మృతిలో ఎన్ని నేరాలు లేవు? ఆ నేరాలలో ఏ ఒక్క నేరంలోనైనా వారు దొరికిపోవచ్చు.
               కాస్త ఆత్మగౌరవం ప్రకటించుకున్న పనామా, నికరాగువా, గ్రెనడా, జింబాబ్వే, కంపూచియా, లిబియా, సిరియా, ఇరాన్(ఈ  వరసలోకి శరవేగంగా నేట్టివేయబడుతున్న మన భారత్ కూడా సమీప భవిష్యత్తులో  చేరవచ్చు అని నాకనిపిస్తుంది). వాటిపై సాగిన, సాగుతున్న అంతర్జాతీయ కుట్రలను మనం మరువరాదు. ప్రపంచీకరణ యుగంలో అంతర్జాతీయ సంబంధాలను అసలే విస్మరించలేము. కాబట్టి మనకు కావలసింది డబ్బు, మద్యం లేని ఎన్నికలు కాదు. సమాజంలోని సంపదలన్నీ ప్రజలపరం చేసే సమ సమాజ వ్యవస్ధ మనకు కావాలి. ఆ వ్యవస్ధ ఎలా వస్తుంది అన్నది వేరే చర్చ. ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


No comments:

Post a Comment

Address for Communication

Address card