Thursday, January 26, 2017

రైతే రాజు కానీ .......సబ్సిడీల మతలబ్బుల్లో మాటల్లేని తరాజు





                ఈ మధ్య కాలంలో ఎరువుల పురుగుమందుల షాపుల్లో  విజిలెన్సు ,వ్యవసాయ శాఖ వారి దాడులు విస్తృతంగా జరిగాయని మీలో చాలామంది వినే వుంటారు.వాటి వెనుక అంత బలమైన కారణం ఏమై వుంటుంది?
                 ముఖ్యంగా ఎరువులు,బయో మందుల పై ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. పటిష్ట మైన నిఘా లేకపోవటం , చట్టంలో లొసుగులు కారణం గా ఆ సబ్సిడీ దుర్వినియోగం అవుతుంది. కల్తీ రంగ ప్రవేశం చేసింది. దానితో ఆశించిన ప్రయోజనం నేరవేరటలేదు. ఇదీ ప్రధాన కారణం
                 ఎందుకిలా జరుగుతుంది ? ఇందులో తప్పెవరిది? అసలు లాభం ఎవరికి?నాకు తెలిసినంతవరకు వివరించే ప్రయత్నం చేస్తాను.         
                   సబ్సిడీ రేట్లకు ఎరువులు, బయో, పురుగుమందులు, విత్తనాలుసరఫరా చేయడం అంటే ప్రజల నుండి వాటి కోసం వచ్చే డిమాండును ప్రభుత్వమే సబ్సిడీ ధరలకు తీర్చడం. ఆ మేరకు వాటి ‘డిమాండు’  కంపెనీల వారి సరుకులకు పడిపోతుంది.(ప్రభుత్వమే తక్కువ ధరకి ఇస్తుంది కాబట్టి కంపెనీ వారు ఇష్టమొచ్చిన ధర కి అమ్మలేరు ) . అందువలన ఉత్పత్తి తగ్గించుకుని తద్వారా లాభాలు తగ్గించుకోవాల్సిన పరిస్ధితి బహుళజాతి వ్యవసాయ కంపెనీలకు, రెడీమెడ్ బయోటెక్నాలజీ వాటి కంపెనీలకు వస్తుంది.
                    ఇది ఒకవైపేమో సామ్రాజ్యవాద దేశాల్లో జి.డి.పి ని తగ్గిస్తుంది. మరోవైపేమో బహుళజాతి కంపెనీల పెట్టుబడి రియలైజేషన్ తగ్గిపోతుంది. అంటే వారి పెట్టుబడి, లాభాలు సృష్టించే పెట్టుబడిగా రియలైజ్ కావడం తగ్గుతుంది. అనగా అటు పెట్టుబడి మార్కెట్ తో పాటు సరుకుల మార్కెట్ ని కూడా తగ్గించడమే. ఇదే పరిస్ధితి స్వదేశీ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. స్వదేశీ కంపెనీలేవీ పూర్తిగా స్వదేశీ కాదు. వాటిలో చాలాభాగం విదేశీ పెట్టుబడులు ఉన్నాయి. అవి ఇంకా పెరుగుతున్నాయి. కాబట్టి వారందరికీ ఈ సబ్సిడీ వ్యవహారంలో అంత విముఖత! దాడులని ప్రోత్సహిస్తూ చిన్న చితక కంపనీల సరుకులని మార్కెట్లో పోటీ లేకుండా చేసి తమ అమ్మకాలు పెంచుకోవటానికి ఇది కూడా ఒక మార్గం.
                   సబ్సిడీ వాస్తవంలో ఏమవుతుందంటే ఒక కోణంలో దేశంలో అవినీతిని ఇంకా పెంచుతుంది. ఇంకా చెప్పాలంటే అవినీతి అనేది కేవలం బడా కంపెనీల వరకే కాకుండా కింది దాకా పంపిణీ అవుతుంది. కొన్ని కంపెనీలు ఎక్కువ లాభాల కోసం కల్తీ ని ఆశ్రయిస్తాయి . బ్లాక్ మార్కెటీర్లు సొమ్ము చేసుకుంటారు. అందుకే ఎరువుల పురుగుమందుల ముద్రించిన ధరలకి వాస్తవ విక్రయ ధరలకి చాలా వ్యత్యాసం వుంటుంది.
                   మరో కొణంలో చూస్తే ప్రతి సబ్సిడీని డబ్బు రూపంలో ఇచ్చే పధకానికి ఇప్పటికే శ్రీకారం చుట్టారు. దానిని వాటి భద్రతకు కూడా వ్యాపింపజేస్తారు. అంటే సరుకు బదులు డబ్బు జమ చేస్తారు. ఆ డబ్బు ఆహారం కొనడానికి బదులు కొంత లక్జరీ వస్తువుల కొనుగోలుకి ,కొంత తాగుడుకి బదిలీ అయితే మరికొంత ఫైనాన్స్ పెట్టుబడిదారులకు వరంగా మారుతుంది. చిట్ ఫండ్స్ అనీ, ఇంకా వాయిదా పద్ధతిలో స్తిరాస్తి  అనీ , ఇలాంటి ఇతర ద్రవ్య కంపెనీలు ఈ డబ్బు సేకరించి షేర్ మార్కెట్లకు తరలిస్తాయి. అది కాస్తా అంతిమంగా గ్లోబల్ ఫైనాన్స్ ‘షార్క్’ లకు చేరుతుంది. ఇదంతా మన కళ్లముందు జరిగేది కాదు. మనకి కనిపించేది ఐస్ బర్గ్ లాంటిదే. (పైకి కనిపించేది 10% మాత్రమే. మిగిలింది లోపలే దాగివుంటుంది).
                  ఈ వినిమయ చక్రంలో రైతు కి లాభం ఎంత. సబ్సిడీ నష్టాన్ని పూడ్చుకోవటానికి ప్రభుత్వం విధించే పరోక్ష పన్నుల ద్వారా అతను భరించే సబ్సిడీ భారమెంత? రైతులు కాని మిగిలిన ప్రజల పై పడ్డ భారమెంత ? అంతిమంగా, ఈ భహుళజాతి కంపెనీలు వాటి వాటి స్వదేశా లకి  అనేక రూపాల్లో  చేరవేసేది ఎంత? లెక్కలెక్కడ?
                        ఇలా చెబుతున్నందున సబ్సిడీ వాటి భద్రత చట్టం అవసరం లేదన్న అర్ధం తీసుకోకూడదు. ఒక చట్టం అనేది ఉండడం వలన జనానికి ఒక హక్కు వస్తుంది. ఆ చట్టాన్ని అమలు చేయాలంటూ ఆందోళన చేసేందుకు ఒక సాధనం(ఆయుధంగా ) అందుతుంది. అనేక అవినీతి కూపాలను దాటుకుని ‘కొంతయినా’ ప్రజలకు లబ్ది చేకూరే అవకాశం ఉంటుంది. ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681 

No comments:

Post a Comment

Address for Communication

Address card