Sunday, January 08, 2017

జ్యోతిశ్శాస్త్రంలో ‘జ్యోతిః’ ఉన్నది కదా? జ్యోతి అంటే? ఆలోచించండి!!!




మొదటిగా ఒక చిన్న ప్రశ్న:.  ఇండియాలో 500/- 1000/- నోట్లు రద్దుచేసి కొత్త నోట్లు వస్తాయని,ప్రపంచం లో ఏ జ్యోతిష్కుడు ముందుగా  ఎందుకు చెప్పలేకపోయారు? అన్నఆలోచనతోనే ఈ పోస్టు
ఈ పోస్టు జ్యోతిష్యం గురించి కాదు. అసలు జ్యోతిష్యమంటే సగటు మనిషికి ఉన్న అవగాహన ఏమిటి అని
1. Science అంటే ఏమిటీ?        2. జ్యోతిష్యం అంటే ఏమిటి?
ఉన్నట్టుండి ఈ ప్రశ్నలు వేసినపుడు ఎవరూ ఠక్కున సమాధానం చెప్పలేరు. మీరూ ప్రయత్నించి చూడండి. ముఖ్యంగాజ్యోతిష్యంఅంటే ఏమిటని ప్రశ్నించినపుడు, Science అన్న పదాన్ని వివరించడానికన్నా కాస్తంత ఎక్కువ సమయం తీసుకుంటారు.
Science అంటే ఏమిటి?
టూకీగా ఇదిఅని చెప్పడం కష్టం. నిఘంటువులు వెతికినా, చుట్టుపక్కల వారిని ప్రశ్నించినా ,గూగుల్లో ప్రయత్నించినారక రకాల నిర్వచనాలు. కానీ, Science అంటే ఏమిటని నేను  పరిశీలిస్తే, నాకు దొరికిన అర్థాలు.
  1. పరిశోధనలు, ప్రయోగాలు, పరీక్షలు, R&D ల వల్ల నిత్యం అభివృద్ధి చెందేది
  2. Repeatability ఉన్నది
  3. కనిపించేది / భౌతికమైనది
  4. మనకు కనీస అవగాహన ఉన్నది. అంటే చిన్నతనంనుండీ పాఠశాలలో మనము తెలుసుకున్నది
  5. Which defines/explains or at least attempts to define/explain every phenomenon rationally
  6. మనం స్వయంగా తెలుసుకునే అవకాశం లేనపుడు, ఏదో ఒక సంస్థచేత ప్రామాణికంగా నిరూపించబడిందన్న నమ్మకం ఉన్నది
  7. పుస్తకాలు, Internet వంటి మాధ్యమాలలో కనీస అవగాహనకు తోడ్పడే విధంగా సమీక్షలు లభించేది
  8. అందరూ, ముఖ్యంగా మేధావులు, నమ్మేది
  9. Conflicting theories లేనిది
ఇలా మరి కొన్ని వివరణలు. మొత్తానికి Science అనేది ఒక ఆధునిక, ప్రామాణిక, హేతుబద్ధమైన విషయం ఇదీ నేను గ్రహించినది.
జ్యోతిష్యం అంటే?
చిత్ర విచిత్రమైన సమాధానాలు.
  1. చేయ్యి చూసి చెప్పేది
  2. చక్రాలు చూసి చెప్పేది (ఏ చక్రాలు అన్న ప్రశ్నకు సరిగా సమాధానం దొరకలేదు)
  3. పంచాంగం చూసి చెప్పేది
  4. Date of birth, Time of birth కావలసినది
  5. గ్రహాల కలయికలవల్ల తెలిసేది
  6. Mathematical
  7. కొందరి జీవనాధారం
  8. నమ్మకం
జోస్యాలను ఎంతశాతం నమ్ముతారన్న ప్రశ్నకు,కరెక్టుగా సమాధానం లేదు. కానీ, ఒక మంచి సంఘటన జరుగుతుందని చెప్పే జోస్యాన్ని, చెడు జరుగుతుందని చెప్పే జోస్యానికన్నా ఎక్కువగా నమ్ముతారని తెలిసింది. నిజానికి, రెంటినీ నమ్మక పోయినా, మంచి జరుగుతుందని చెప్పినపుడు ఆశ యొక్క పరిణామమే ఆ కాస్తా నమ్మడమట.

జోస్యాలు / Predictions
నిత్య జీవితంలో, తెలిసీ తెలియకుండానే మనమందరమూ జోస్యాలు చెబుతుంటాము; ఇతరులు చెప్పిన జోస్యాలు వింటుంటాము కూడా! ఉదాహరణకు, సిటీకి కొత్తగా వచ్చి అద్దేకొంప వెతుక్కుంటున్న వ్యక్తికి సలహా రూపంలో ఫలానా కాలనీ మంచిది అద్దెలు కూడా రీజనబుల్‌గా ఉంటాయి. అంచేత అక్కడ ప్రయత్నించండిఅని సలహా ఇచ్చారనుకుందాం. మీరు సలహా ఇవ్వడానికి సరైన ఆధారాలు ఉండే ఉంటాయి. మీరు ఎప్పుడో ఒకప్పుడు, అక్కడ ఉండి ఉండడం వల్లనో, లేక ఇప్పుడు మీరుంటున్నది అక్కడే కాబట్టో, లేక మీకు తెలిసిన వ్యక్తి ఒకరు అక్కడ నివసిస్తూ చెప్పిన మాటల వల్లో ఆ లొకాలిటీ అంటే మంచి అభిప్రాయం ఏర్పడింది. అవసరంలో ఉన్నాడు కనుక, ఆ వ్యక్తికి మీకు తెలిసినంతమటుకు ఒక సరైన సలహానే ఇచ్చారు. కానీ – మీ సలహా నూటికి నూరుపాళ్ళూ నిజమవుతుందని గ్యారంటీ ఉన్నదా?

సలహా జోస్యం. ఈ రెండు పదాలతో ఆటలాడుతున్నాననిపిస్తోందా?

స్టాక్ మార్కేట్ కుప్ప కూలిన తరువాత, ఎన్నికల ఫలితాలు వెలువడినపుడు, భూకంపాలు సునామీలవంటి ప్రకృతి వైపరిత్యాలు సంభవించిన తరువాత కారణాలను విశ్లేషించే నైపుణ్యం ఈ కాలం శాస్త్రవేత్తలైన చాలా మందికి ఉంటుంది. ఎటొచ్చీ ఇటువంటి విశేషాలను జరుగకముందు ఖచ్ఛితంగా ఊహించడమే కష్టం. ఎన్నో prediction models ఉన్నాయి. కానీ, ఏవీ సరిగ్గా అంచనా వెయ్యలేవు. వాతవరణాన్ని అంచనా వేశే శక్తి సామర్థ్యాలు రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నాయనటం అతిశయోక్తి కాదు కానీ ఈ models కు కూడా ఒక పరిమితి ఉన్నది.
కానీ, ఇటువంటి Scientific predictions నూటికి నూరు శాతం ఖచ్చితంగా నిజమవ్వకపోయినా, ఒక సగటు వ్యక్తి Science అన్న విషయాన్ని అనుమానించడు. కానీ జ్యోతిష్యం వంటి వాటిని మాత్రం అనుమానిస్తాడు. ఎందుకని? Science, జ్యోతిష్యం అన్న పదాల అర్థం గురించి నేను వేసిన ప్రశ్నలకు లభించిన సమాధానాలు కారణాన్ని తెలుసుకోవడానికి తోడ్పడ్డాయి.
జ్యోతిష్యం శాస్త్రమా / Science?
The Science of the movements of the heavenly bodies and divisions of time dependant thereon, short tract for fixing the days and hours of the Vēdik sacrifices.

ఒక సగటు మనిషి జోతిషాన్ని శాస్త్రం అని అంగీకరించలేకపోవటానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భాషాపరంగా – ‘జోస్యంఅనే పదం చాలా తేలికగా వాడబడుతున్నది. అందువల్ల ఆరు వేదాంగాలలో ఒకటైన జ్యోతిశ్శాస్త్రం, ఇతరత్రాలు ఐన హస్త సాముద్రికం, చిలక జోస్యం, Numerology, Fortune Telling – అన్నీ ఒకటేనన్న అపోహ ఉన్నది!
హస్త సాముద్రికం గురించి నాకు బొత్తిగా తెలియదు. చిలక జోస్యం నిజమో కాదో తెలియదు. Tarrot Card reading గురించి కూడా తెలియదు. Mathematics ఆధారంగా వీటికి ఏదన్నా Software program సృష్టించవచ్చా?
Numerlogy కు గణిత సంబంధం ఉన్నా, దాని లెక్కలన్ని Gregorian Date of birth లేదా English Alphabets నో వాడుకుంటాయి. కాబట్టి దీని గురించి కూడా ఏమీ చెప్పలేను.
కానీ Astrology కోసం అన్నన్ని Software programs ఉన్నాయంటే ఆలోచించండి! ఈ programs లోని astronomy module ను (అంటే, ఏ గ్రహం ఎక్కడ ఉందో తెలిపే logic) పక్కన పెట్టండి. ఈ programs – planetary positions, associations, aspects వంటి అంశాలను Mathematical గా లెక్క గట్టి, ఏదోకొంత స్థాయి వరకు జోస్యాలను చెబుతాయి. ఆ programs లో Artificial Intelligence వంటివేమీ ఉండవు. కేవలం గణితం. గణిత శాస్త్రంలో మూఢ నమ్మకాలు ఉంటాయంటారా?
సరే! ఈ programs నూటికి నూరు శాతం ఖచ్చితమైన జోస్యాలు చెబుతాయా? చెప్పలేవు! కారణం , తప్పిదాలే కాకుండా, ఇతరత్రా కారణాలూ ఉన్నాయి. Input data లో తప్పులు; high precision computation errors, Uranus – Neptune – Pluto వంటి గ్రహాలను పరిగణించడం, వివిధ సిద్ధాంతాల కలగూరగంప logic ఇత్యాదులు.
Science కున్న వనరులు జ్యోతిషానికి ఉన్నాయా?
Scientific term అయిన ‘Meteorite’ అంటే ఏమిటో తెలుసుకోవాలన్న కోరికను తీర్చుకోవడానికి ఒక సగటు వ్యక్తికున్న సులభసాధ్యమైన వనరులు, జ్యోతిశ్శాస్త్రంలోని అస్తంగత దోషంగురించి తెలుసుకోడానికి ఉన్నాయా?
మంచి నీటితో నడిచే Scooter సృష్టించినట్టు నమ్మబలకాలనుకునే బూటకపు శాస్త్రవేత్త భయపడేట్టు ఒక మోసకారి అయిన జ్యోతిష్కుడు ఎవరికన్నా భయపడే పరిస్థితులు ఉన్నాయా?
చిన్నతనం నుంచీ అంచలంచెలుగా Science గురించి నేర్పినట్లు, జ్యోతిశ్శాస్త్రం గురించిన అవగాహన, కనీసం తల్లిదండ్రుల వద్దనైనా దొరుకుతుందా?
తెలుసుకోవాలనే జిఙ్ఞాస ఉండి, కాస్తంత అర్థమయ్యేట్టు తేలికగా ఎవరన్నా చెబుతారా అంటే, D-60, ఢాం, ఢూం అని jargon ప్రయోగించే పండితులే అధికంగా ఉన్నారు. అది అందని ద్రాక్ష అయి కూర్చుంటుందే తప్ప, పది మంది అర్థం చేసుకొని, తెలుసుకోవాలనే ఆసక్తికి నోచుకోలేక పోతుంది.
జ్యోతిషం ‘Science కాదుఅని గుడ్డిగా నమ్మే పరిస్థితి ఏర్పడింది. ఖగోళ శాస్త్రం Science అయితేజ్యోతిషం కూడా ముమ్మాటికీ ఒక శాస్త్రమే.
ఈ పోస్టు ద్వారా ఎవరినీ నమ్మించే ప్రయత్నం చేయటంలేదు. అటువంటి ప్రయత్నం కూడా వ్యర్థమే అని తెలుసు! ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


No comments:

Post a Comment

Address for Communication

Address card