“ ఈ ప్రకృతి మూలమైన,
అనంతమైన శక్తి స్వరూపమే భగవంతుడు”. నిరాకారుడైన భగవంతుని గురించి చెప్పగలిగేది ఇది. ఇదే అనాదిగా
వస్తున్నది. అదే నిజం. ఇంకో రకంగా “ మనిషి తనకు అర్ధం కాని,
భయపెట్టే విషయాన్ని అధిగమించడానికి తనలోని మంచి లక్షణాలని, ధైర్యాన్ని కలబోసి సృష్టించుకున్న అవతారం భగవంతుడు”.
ఈ
భగవంతుడికి మనిషి తనకు తెలిసిన మంచి లక్షణాలు,
తన ఊహకి అందగలిగిన ఎన్నో అద్భుతమైన లక్షణాలు అన్నీ ఆపాదించాడు. తనకి భయం
కలిగినప్పుడు ఈ భగవంతుడిని శరణు వేడితే రక్షిస్తాడని ఒక నమ్మకాన్ని
ఏర్పరుచుకున్నాడు.
నిజానికి ఈ బ్రహ్మాండం అనంతమైన శక్తి స్వరూపం. ఈ శక్తి స్వరూపం
తనలోని వేనవేల రూపాలని రకరకాల సంయోగాలతో వేరు వేరు రూపాలని ప్రదర్శిస్తుంది.
అందులో మనిషి ఒకడు.
ఈ వేరు వేరు రూపాలన్నీ
తిరిగి నశించి ఆ బ్రహ్మాండమైన శక్తిలో లీనమవ్వడమే. ఇది మన పూర్వీకులు తమలోని
అంతర్గత శక్తిని ఈ విశ్వరూపానికి అనుసంధానం చేసి కనుక్కున్న గొప్ప సత్యం.
ఆ అంతర్గత శక్తిని జాగృతం
చేసి ఈ బ్రహ్మాండం లోని అనంతమైన శక్తికి అనుసంధానం చేసినప్పుడు తనకి కలిగిన
అనుభవాలని క్రోడీకరించానికి మనిషి చేసిన ప్రయత్నం లోని భాగాలే వేదాలు, సంహితలు అన్నీ. అవి సాధించడానికి ఈ శరీరాన్ని తయారు చేసే
విధానాలే ఈ యోగాలు. ఆ శక్తిలో లీనమవ్వడమే మనిషి తాలూకు పరమార్ధం. అయితే దానికి ప్రయత్నం ఎందుకు,
ఏ పని చేసినా, ఎలా బ్రతికినా అందులో కలుస్తూనే ఉంటాడు అన్నప్పుడు దాని కోసం ఈ
వెతుకులాట, ఇంత సంఘర్షణ అవసరమా అనిపిస్తుంది. నిజంగా నాకు తెలిసి అవసరం
లేదు. కానీ సుఖాన్ని, ఆనందాన్ని వెతికే మనిషి నిరంతరము ఆ అనంతమైన శక్తికి తన అంతర్గత
శక్తిని అనుసంధానం చెయ్యడంలోనే ఆనందం ఉందని తెలుసుకుంటే దానికే ప్రయత్నిస్తాడు.
అది కాదన్నప్పుడు అది తెలుసుకునే దాకా ఈ భౌతికమైన ప్రపంచంలో వెతుకుతూనే ఉంటాడు.
ఎప్పుడైతే తన కంటికి కనపడుతూ ఉన్న ప్రపంచంలోనే వెతుకుతూ ఉంటాడో, ఏవైతే శరీరానికి సుఖాన్ని ఇచ్చే వస్తువులతో తన ఆత్మశక్తికి మబ్బు
పట్టిస్తాడో, అంతవరకు ఈ నిజం అతనితో దొబూచులాడుతూనే ఉంటుంది. కావలిసినవి
దొరికినప్పుడు ఆనందం, దొరకనప్పుడు బాధ,
దుఃఖం, ఇంకొకడికి దొరికితే ఈర్ష్య,
ఈ సంఘర్షణలో క్రోధం అన్ని రసాలు,
తనుకు తానుగా తయారు చేసుకుంటున్న పరిస్థితులని తానే పరిష్కరించుకుంటూ, కొంత ప్రకృతి చేత,
కొంత తనచేత ఒత్తిడి చేయబడి మార్పులకి గురికాబడుతున్న ప్రకృతికి తిరిగి adjust అవుతూ, ఆ మార్పులని తిరిగి analyze చేసి దాని లక్షణాలని కనుక్కుంటూ ఎంతో long march చేసి కొత్తవి కనుక్కుంటున్నాను అని భ్రమ పడడమే తప్పితే కొత్తగా
సాధిస్తున్నదేమీ లేదు. ఇంతకు మునుపు అంతర్గత శక్తులని క్రోడీకరించే పనిలో అంతర్గత
శక్తులకి కుండలినీ వగైరా పేర్లు పెట్టిన మనిషి ఇప్పుడు science అభివృధ్ధిని సాధించి బయట ప్రపంచం నించి శక్తులని తెలుసుకుని primordial soup, black
hole, quasar, neutron
star, supernova, galaxy
ఇలాటి పేర్లతో గుర్తించి వాటి ద్వారా
మనిషిలోని ఈ అంతర్గత శక్తిని define చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ నిజం కనుక్కోగలిగినా ఆఖరికి
మనిషి అది తన దగ్గిర ఉన్నదేనని తెలుసుకుంటాడు. వేల సంవత్సరాల నించి ఈ
భగవంతుడు ఉన్నాడని నమ్మి, రకరకాల మతాలతో విధానాలతో,సిధ్ద్ధాంతాలతో
ఆ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించిన మనిషి,
తిరిగి హేతువాదం, భౌతికవాదం అని మొదలు పెట్టి,
science
ని అభివృధ్ధి పరిచి తిరిగి ఆ అనంతమైన శక్తి
స్వరూపాన్నివేరే పధ్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే నేను science advancement
leads to God అన్నాను. Spiritual plane అన్నదాని definition
భగవంతుడిని,
ఆ శక్తిని, మనం తెలుసుకోవడానికి మనం అనుసరిస్తున్న విధానాలని బట్టి మారుతూ
ఉంటుంది. కృష్ణుడు భగవద్గీత చెప్పినా,
శంకరాచార్యుడు అద్వైతం అన్నా,
రామానుజాచార్యుడు విశిష్టాద్వైతం అన్నా,
మధ్వాచార్యుడు ద్వైతం అన్నా,
నింబార్కుడు ద్వైతాద్వైతం అన్నా,
బుధ్ధుడు ధర్మాసూత్రాలని చెప్పినా,
మహమ్మద్ ప్రవక్త కొరాన్ చెప్పిన,
క్రీస్తు బైబిల్ చెప్పినా ఎవరు చెప్పినా ఇదే చెప్పారు. ఇప్పుడు మనం science experiments చేసి ఆధారాలతో prove చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాం.
దీనినే ఈశావాశ్య ఉపనిషత్తు లో మనవాళ్లు
మంచి శ్లోకంలా చెప్పారు.
“ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే
ఓం శాంతిః శాంతిః శాంతిః “
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment