‘సామాజిక
స్మగ్లర్లు కోమట్లు’ అనే మీ పుస్తకంలో ఏమి రాసుంటారో అందరు ఊహించే వుంటారు (పుస్తకం
పేరు ప్రకారం చాలు )
నేను పొన్నూరు అనే చిన్న పట్టణం లో ఆడిటర్ గా
,ఎకౌంటెంట్ గా ఉంటూ సుమారు గత ముప్పై
సంవత్సరాలగా వ్యాపారస్తులు, మరి మీరు చెప్పే కోమట్లుకి వృత్తి రీత్యా దగ్గరగా మసులు తుంటాను
కోమట్లు
వ్యాపారం చేస్తారు కాబట్టి, వారు లాభాలకి సరియిన లెక్కలు చూపకుండా,మిగులు డబ్బుని
నల్లడబ్బు గా మారుస్తారని మీ ప్రధాన
ఆరోపణ, సరుకులు ధరల పెరుగుదల, తరుగుదల ముందుగానే పసిగట్టి ,వారి లాభాలు పెంచు కోవటానికి రహస్యంగా నిల్వ చేసి ప్రభుత్వానికి తెలియకుండా
జాగ్రత్తపడి ధరలు పెరగటానికి పరోక్షంగా కారణం అవుతున్నారని ద్వితీయ ఆరోపణ .మొదలయినవి
మీ పుస్తకంలో వున్నాయి
అయితే
ఇక్కడ గౌరవనీయ కంచె ఐలయ్య గారి ఉదేశ్యం స్పష్టంగా లేదు ,కోమట్లు అనే
పదాన్ని ‘వ్యాపారస్తులుకి ప్రత్నామ్యాయంగా’ వాడారా? లేక కుల ప్రాతిపదికిన
ఉపయోగించారా?
ప్రాచీన కాలం నుండి (ముఖ్యంగా వారు పుస్తకం
వ్రాసే కాలానికి). వ్యాపార రంగంలో అన్ని రకాల కులాల వారున్నారు ఇంకా స్పష్టంగా
చెప్పాలంటే ప్రస్తుత వ్యాపార రంగంలో కోమట్లు కాని వారు కూడా అధికంగా వున్నారు ) కనుక
అన్ని కులాల వ్యాపారస్తులు స్మగ్లర్లె అని
వ్రాయాలి,అలా జరగలేదు .కేవలం ఒక కులాన్ని మాత్రమే టార్గెట్ చేసి
వ్రాసారనిపిస్తుంది. కేవలం కోమట్లు మాత్రమే
పైన చెప్పిన మోసాలు చేస్తూ మిగిలిన కులాల వ్యాపారస్తులు నిజాయితీగా
ఉంటున్నారని అయన ఉద్దేశ్యమా ? రుజువులు చూపగలరా?
ఇది సహేతుక మైన కారణం కాదు ఒక ‘ప్రొఫెసర్’ ఎలా పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చారు.
పోనీ
కుల ప్రాతిపదికిన వ్రాసారనుకున్నా కోమట్లు లో వ్యాపారస్తులు కాని వారు చాలామంది
వున్నారు.మరి వారుకూడా స్మగ్లర్లె అయితే అదే వృత్తిలో వున్న మిగిలిన కులాల
వ్యక్తులు కూడా స్మగ్లర్లె అవ్వాలి కదా .మీతో నాతో కలిపి.
అంటే మీ పుస్తకం ఒక సిద్హాంతము అనుసరించి గానీ,
ఒక సమాజాన్ని పరిశీలించి గానీ వ్రాయలేదు. ఆకర్షనీయ మయిన టైటిల్ పెట్టి పుస్తకాలు
అమ్ముకోటానికి , ప్రచార ఆర్భాటం ద్వారా మీకు దగ్గరయిన సమాజంలో పరోక్షంగా మేధావిని
అనిపించుకోవటానికి తాపాత్రయము తప్ప శాస్త్రీయమైన పరిజ్ఞానం లేదు ఈ పుస్తకంలో. కులాలని
,జాతులనీ విమర్శించి ఎవరిని సంతృప్తి
పరచాలని . లేదా ఎవరిని రెచ్చగోట్టాలని .
ఇది కాకుండా మీ దగ్గరేమయిన అదనపు సమాచారం ఉంటే మాట్లాడండి. పైన ప్రశ్నకి సమాధానం మీరే
చెప్పాలి. మీరు మాత్రమె చెప్పాలి.ఎందుకంటే రాసింది మీరే కాబట్టి.ఆలోచనలు మీవి
కాబట్టి
------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
.
No comments:
Post a Comment