Monday, September 11, 2017

భిక్షా పాత్రకు కూడా మతం ఉంది!




            కాలం అనుకూలంగా లేకపోతే (టైం బాగోకపోతే) తాడే పామై కరుస్తుందంటారు. (ఇక్కడ నెపాన్ని కాలం మీదికి నెట్టేసినా దానర్ధం స్ధల, కాల పరిస్ధితులుఅని నేనుకుంటున్నాను.) మియాన్మార్ (బర్మా) లో ముస్లింల పరిస్ధితి అలానే తగలడింది. ఒక బౌద్ధ భిక్షువుకు చెందిన భిక్షా పాత్రను ఒక ముస్లిం మహిళ పగలగొట్టిందన్న అనుమానంతో ముస్లింల పైనా, మసీదుల పైనా దాడి జరిపారు అహింసావాదులైన భౌద్ధ మత ప్రజలు హింసకు దిగటమే ఆచ్చర్యం  .
            బౌద్ధ భిక్షువులకు భిక్షా పాత్ర పరమ పవిత్రమైంది కాబోలు, ముస్లింలపైన దాడులు మొదలు పెట్టారు.
             మియాన్మార్ ప్రజలు ప్రధానంగా బౌద్ధమత ప్రజలు. ముస్లింల సంఖ్య అక్కడ చాలా తక్కువ. బౌద్ధులు, ముస్లింలకు మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతుంటాయి. అహింసో పరమ ధర్మఃఅని బుద్ధుడు చెప్పాడంటారు. మత ప్రవక్తల బోధనలకు ప్రజల దైనందిన భౌతిక ఆచరణకి ఎంత చుక్కెదురో మియాన్మార్, శ్రీలంక దేశాల్లోని బౌద్ద మతం ఒక ఉదాహరణ కావచ్చు.   
            మి యాన్మార్ లోనైతే రోహింగ్య ముస్లింల పైన అక్కడి బౌద్ధులు సాగించే హత్యాకాండ అత్యంత ఘోరం. మియాన్మార్ ప్రభుత్వం కూడా రోహింగ్య ముస్లింలు తమ దేశం వారు కాదని ప్రకటించడంతో వారు ఏ ప్రభుత్వం కిందికి రాని అనాధ పౌరులుగా (stateless citizens) మిగిలిపోయారు. దానితో బౌద్ధుల దాడులకు వాటంగా దొరుకుతున్నారు.
                         రోహింగ్యాలు మియాన్మార్ దేశీయులు కాదని మియాన్మార్ ప్రభుత్వం వాదిస్తుంది. వారిని బ్రిటిష్ వారు వలస పాలనా కాలంలో వ్యవసాయం చేయడం కోసం బెంగాల్ నుండి తీసుకొచ్చారని, కనుక వారి బాధ్యత తమది కాదని వాదిస్తుంది. ఈ లెక్కన ప్రపంచంలో ఎన్ని దేశాలు ఎంతమందిని తమ వారు కాదని ప్రకటించాలి? ప్రెస్ టి.వి ప్రకారం రోహింగ్యాలు 8 శతాబ్ద కాలంలో వలస వెళ్ళిన పర్షియన్, టర్కిష్, బెంగాలి, పఠాన్ ముస్లింలు. కనీసం శతాబ్దం కిందట వలస వచ్చారని భావించినా వారిని స్ధానికులు కాదని చెప్పడం ఆధునిక మానవతా విలువలకు, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం.
          పాలకులే పగబట్టినపుడు ముస్లింలు భిక్షా పాత్రకు కూడా లోకువేనని తాజా ఘటన స్పష్టం చేస్తోంది.
    ఎక్కడోవున్న ముస్లింలకు రక్షణ లేదని ,వెంటనే వాటిని ఆపాలని ఇక్కడ MRO,కలెక్టర్లకి మొక్కుబడి వినతి పత్రాలిచ్చి చేతులు దులుపుకుంటున్నారు భారతీయ ముస్లింలు.
      తరతరాలుగా మనది జీవభూమి,కారుణ్య భూమి ,పిలవండి మనదేశానికి,వద్దుంటున్న ఆదేశంలో ఎందుకు ఎంతమందిననయినా భరించే ‘భారత’దేశం,భరించగల దేశం
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card