Friday, September 22, 2017

ఈ ఆచార వ్యవహారమేంటి? దీని మూలాధారం ఏమిటి?





                          సహజంగా మనిషి నైజం; తెలియని విషయాన్ని అనుమానించడం, తెలిసిన విషయాన్ని చులకనగా చూడడం. అబ్బే! అంతా బూటకం“, “ఓ అదా! ఏడిశాడు. చిటికెలో పని.ఎంత చదువుకోంటే అంత ఘాటుగా ఉంటాయి ఇలాంటి అభిప్రాయాలు. చదువుకున్న వాళ్ళ సంగంతి వేరనుకోండి.
ఈ రెంటిలో, తెలియని విషయాల గురించి కొన్ని అభిప్రాయాలు.
                                మనలో ఎంత మంది ఆణువు, పరమాణువులను చూశారు? డిఆక్సీరైబో కేంద్రక ఆమ్లం (DNA) తమ కళ్ళతో చూశారని ఎంతమంది చెప్పగలరు? ఏమో? కానీ, దానికి సైన్స్అనే పూత పూస్తే అంతే! బహుశః ఈ విషయాలనుసైన్స్తెరపై కాకుండా, ఆచార వ్యవహారాలు, పురాతన నమ్మకాలన్న తెరపై చూపితే, నమ్మే వాళ్ళ కన్నా నమ్మని వాళ్ళే ఎక్కువుంటారు. అదే, చదువుకొన్న వాళ్ళు! సైన్స్అనగానే, ఏ విషయాన్నైనా నమ్మేస్తారు. సైన్స్అనే ఏకైక పదం ఈ కాలం మనిషిని తెలియని విషయాలనునమ్మించాలంటే బ్రహ్మాస్త్రంకాదు కాదు అంతర్మహాద్వీపీయ ప్రాక్షేపిక ఆణు ప్రక్షేపాస్త్రం” (ICBM).
                               మా చిన్నప్పుడు సైన్స్ప్రకారం గ్రహాలు తొమ్మిది. మరి ఇప్పుడో? ఎనిమిది. ప్లూటోను పీకి పారేయడం జరిగింది జాబితాలోంచి. కానీ, అభ్యంతరాలెంత మాత్రం? అదే ఒక మోసగాడు నమ్మకం పేరిట ఒక వెధవ పని చేస్తే, మొత్తం ఆచార వ్యవహారాలను దుమ్మెత్తిపోస్తారు.
                               తొందర పడి నాకు సైన్స్ గురించి గల అభిప్రాయాల గురించి మీరు ఏ అభిప్రాయానికి రాకండోయ్. ఇలా ఒక టపాను రాసి నాకు తెలిసిన, తెలియని వాళ్ళతో ఇంటర్నెట్ ద్వారా శ్రమ లేకుండా, ఒక మాట మాట్లాడకుండా, ఒక్క అక్ష్రరం కాగితం మీద రాయకుండా వ్యక్త పరచ గలుగుతున్నానంటే, అది సైన్స్పుణ్యమా అనే. తలనొప్పి కలిగితే, పారాసిటామాల్ వేసుకుంటాను, మడి కట్టుకోని ఆయుర్వేదం మందే కావాలి అని భీష్మించుకొని కూర్చోకుండా. కృతఘ్నుడను కాదుసుమా!
                            వచ్చిన తిప్పల్లా, “సైన్స్అంటే నమ్మడం, మన గంభీరమైన వైజ్ఞానిక ఆచార వ్యవహారాలను నమ్మకపోవడం. ఆ సైన్స్అన్న పదం వెనకనున్న నమ్మకాన్ని మోసంతో సొమ్ము చేసుకున్న సంఘటనలు లేవా? కానీ అదే అచార వ్యవహారాలనేటప్పడికి, ఎందుకో అపనమ్మకం, చదువుకొన్న వాళ్ళకి. అక్కడే మండేది.
                    ఈ ఆచార వ్యవహారమేంటి? దీని మూలాధారం ఏమిటి? అని ఎంత మంది శోధన చేస్తారు? తెలుసుకోవాలంటే, బద్దకం. కాబట్టి నమ్మము. మన సంస్కృతిని మనం కాపాడుకోలేక పోతే, ఎవరో తెల్ల వాళ్ళు వచ్చి కాపాడాలా? కానీ విచిత్రమేమిటంటే, ఓ తెల్ల వాడు వచ్చి ఇది వీళ్ళ ఆచార వ్యవహారం దీని వెనుకనున్న కారణం ఇది అని చెబితే, ఓహో ఇక చూడండి
                     మధ్యలో ఇంకో వ్యంగ్యం. అటూ ఇటూ కాని అఘాయిత్యపు పండితులను తెరమీదికెక్కిచ్చి, తింగరబుచ్చి ప్రశ్నలేసి మరీ హాస్యాస్పదంగా మారుస్తారు మన మీడియా సోదరులు. టీ.ఆర్.పీ. పెరగొద్దు మరి?

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card