"దశరధ మహారాజా! ఆనాడు మీరు నాకు రెండుకోరికలు
ప్రసాదించారు, ఇప్పుడు
కోరవచ్చునా?"
"నీదే ఆలస్యం కైకా!"
"అయితే వినండి.
మొదటి కోరిక – GST ఫైలింగ్ ఈజీగా వుండాలి.
రెండో కోరిక - పెట్రోల్ రేట్లు GST పరిధిలోకి
రావాలి."
"కైకా! నీకిది న్యాయం కాదు. నువ్వు కోరాల్సింది
రాముణ్ని అడవులకి పంపించమని, భరతుడికి
పట్టాభిషేకం చేయించమని."
"రాత్రి 'సంపూర్ణ రామాయణం' సినిమా చూశాను. కైకేయిని విలన్‌గా చూపించారు,
నాకు నచ్చలేదు. అందుకేస్వార్ధం
వీడి ప్రజాక్షేమం కోసం అడుగుతున్నాను. ఇంతకీ నా కోరికలు తీరుస్తారా? తీర్చరా?"
"హయ్యో! యెంత పన్జేశావు కైకా! అసాధ్యమైన కోరికలు
కోరి మన రఘవంశం పరువు తీసేశావు. భగవాన్! ఇప్పుడు నాకేది దారి?"
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment