ఈ 20 యేళ్లలో కొన్ని కొత్త
పదాలుపుట్టుకొచ్చాయి. కొన్నిపదాలకు కొత్త అర్థాలు పుట్టుకొచ్చాయి.
అసలు 20
యేళ్ల
క్రితం ఆ రోజు బడ్జెట్ వచ్చీ రావడమే ‘సరళీకరణ’ అనే పదాన్ని మోసుకొచ్చింది. సరుకు
ఏదైనా ఎలా ఉన్నా పాకేజింగ్ మాత్రం అందంగా ఉండాలి ,అనే
భావనకు ఇది సంకేతం. సారం కంటే రూపం ప్రధానమైపోయిన దశకు సంకేతం.
రేట్లు పెంచాం అనరు. హేతుబద్ధీకరించాం అంటారు. ఈ
ఒరవడిని అన్ని రంగాలు అంది పుచ్చుకున్నాయి. బ్రిటీషర్లు
లిఫ్ట్ అంటే అమెరికన్లు ఎలివేటర్ అంటారు చూశారూ అలా మార్కెట్ పాత
పదాలకు సొంత అర్థాల్ని ఇచ్చుకోవడమే కాకుండా ప్రత్యామ్నాయ పదాల్ని కూడా
సృష్టించుకుంది. ఇరవై యేళ్లక్రితం ఆరోగ్యంగా ఉండాలి అనేవారు. ఇపుడు
ఫిట్‌నెస్‌తో ఉండాలి అంటున్నారు. అప్పట్లో క్లబ్ సాంగ్స్ అనేవారు.
క్లబ్ డాన్సర్లనేవారు. ఇపుడు ఐటెమ్ సాంగ్స్ ఐటెమ్ గర్ల్స్
అంటున్నారు. జ్వోతిలక్ష్మీ, జయమాలిని, అనూరాధల కంటే ఒక అంగుళం ఎక్కువే
బొడ్డుకింద, మెడకింద దిగేయడానికి హీరోయిన్లబడే వారే సిద్ధమవడంతో క్లబ్‌డాన్సర్లనే
జాతి అంతరించింది. ఇరవై యేళ్లక్రితం సీరియల్ రచయితల హవా నడిచేది.
మేగజైన్లు బాగా నడిచేవి. 90ల్లో టీవీలు మన నట్టింట్లోకి వచ్చాక వాటి
గ్లామర్ తగ్గింది. సీరియళ్ల రచయితల్లో చాలామంది రూట్ మార్చి వ్యక్తిత్వ
వికాసకులు అయిపోయారు. టేబుళ్లమీద చేతి రుమాలు ఎలా మడిచి పెట్టుకోవాలి. సూప్ ఒళ్లో
పడకుండా ఎలా తాగాలి, ఇంటర్యూలో ఎలా కూర్చోవాలి లాంటి ఎటికెట్ కూడా
పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అయిపోయింది. స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్
జంటపదాలయి పోయాయి.
క్షౌరశాలలు అప్పటికే సెలూన్‌లుగా మారుతున్నాయి. అవి ఆ తర్వాత బ్యూటీ పార్లర్స్‌గా బ్యూటీ స్టుడియోలుగా ‘స్పా’లుగా మారిపోయాయి. దర్జీ షాపులు ‘బొతిక్’లుగా రూపాంతరం చెందాయి. మీడియాలో లైఫ్ స్టెయిల్ జర్నలిజం అనే పదం వచ్చి చేరడమే కాదు, ప్రధానమైన విభాగంగా మారిపోయింది. అంతా ఇపుడు ‘రూల్ ఆఫ్ లా’ గురించి వాదిస్తున్నారు. మామూలు సినిమాహాళ్లలో సామాన్య జనంతో పాటు వెళ్లి చూసే బాధ తప్పించుకోవడానికి ఉన్నత తరగతి మల్లీఫ్లెక్స్‌లను సృష్టించుకుంది. మల్టీప్లెక్స్ థియేటర్ల రాకతో దానికి అవసరమైన న్యూ జనరేషన్ సినిమాలు దర్శకులు వచ్చి చేరారు. ఈ 20 యేళ్లలో పెరిగిన మరో ట్రెండ్ బ్రాండ్. లో దుస్తులు కూడా బ్రాండెడ్ అవ్వాల్సిందే. ఏ తరగతికి అవసరమైన బ్రాండ్లు అన్ని విషయాల్లో స్థిరపడిపోయాయి. అంటే ఉన్నత తరగతి, ఉన్నత మధ్యతరగతి ఈ 20 యేళ్లలో అన్ని రంగాల్లో తనకు అవసరమైన వేదికలను సృష్టించుకోదగినంత ఎదిగింది అనేది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అది మనం సాధించిన అభివృద్ధి. అసలు అభివృద్ధే లేకుండా ఇదంతా సాధ్యం కాదు. కానీ ఇప్పటికీ NREGA లాంటి పథకాలు ప్రవేశపెట్టి ఓట్లు పొందాలని పాలకులు అనుకోవాల్సిన పరిస్థితి ఉండడం అభివృద్ధికున్న మరో పార్శ్వం.
ఫ్యూడల్ వ్యవస్థ రూపం మార్చుకుని పెట్టుబడిదారీ సమాజంగా మారడం లాంటి పునాది పరిభాషను పక్కన బెట్టి పైపైన కనిపించే విషయాలకే పరిమితమైతే .ఈ 20 యేళ్లలో భారత సంస్కృతీ సంప్రదాయాల మీద అత్యంత ప్రభావం చూపిన సాధనాలు-మూడు ఒకటి టీవీ, రెండు ఇంటర్ నెట్, మూడు-మొబైల్. ఈ ఇరవై యేళ్లలో అది జనజీవితాన్ని దాదాపు శాసించే స్థాయికి ఎదిగింది. ఏది మంచో ,ఏది చెడో, ఏది స్టెయిలో ,ఏది కాదో ,ఏది రుచికరమో, ఏది కాదో,ఏ ప్రదేశం చూడదగ్గదో ,ఏది కాదో ,అన్నీ టీవీనే చెప్పేస్తోంది. చివరకు పెళ్లాం మొగుళ్ల మధ్య గొడవలకు పంచాయితీలకు కూడా వేదికగా మారింది. రోటీ కపడా మకాన్ ఔర్ టీవీ అనే స్థితి. ఇక మిగిలిన మూడు ఈ 20 యేళ్లలోనే పుట్టి అంతలోనే విశ్వరూపం చూపించేశాయి. ఇంటర్‌నెట్ మనలోని అమాయకత్వాన్ని చంపేసింది. అవసరమైనవీ అవసరం లేనివీ కూడా బట్టబయలు చేసింది. మనలాంటి ముసుగు కప్పుకున్న సమాజాల్లో గుప్తమైన విషయాల మీద విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇంటర్ నెట్ మన జీవితాల్లోకి రాకముందు ఉన్న జనరేషన్స్‌కు వచ్చిన తర్వాత జనరేషన్‌కు ఉన్న తేడా మామూలుది కాదు. పట్టణీకరణ వల్ల ,దానికి అనుబంధంగా ప్రైవేట్ విద్య, హాస్టల్స్, స్వేచ్ఛ, దానికితోడు ఇంటర్ నెట్ అన్నీ కాక్‌టెయిల్ మాదిరి యూత్ లైఫ్‌ని మార్చేశాయి. ఇంటర్‌నెట్ సమస్త సమాచారానికే కాకుండా జ్ఞానానికి అజ్ఞానానికి కూడా వేదికగా మారింది. మొబైల్, ఇంటర్‌నెట్టూ -ముఖం తెలీకుండా సంభాషించుకునే- స్నేహించుకునే ఏర్పాటు చేశాయి. ముఖం లేని చోట మనిషి స్వైరుడు అవుతాడు. అందులోనూ కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు మనలాంటి ముసుగు సమాజంలో స్వైరం ఎక్కువగా ఉంటుంది.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment