నాకు బాగా నచ్చిన పాటల్లో ఒకటి
‘సిరివెన్నెల’ సినిమాలో సీతా రామ శాస్త్రి గారు రాసిన ‘విధాత తలపున ప్రభవించినది’….ఇందులో నన్నేక్కువగా ఆకర్షించింది మొదటి చరణం:
ప్రాగ్దిస వీణియ పైనa
దినకర మయూఖ తంత్రుల పైన
జాగ్రుత విహంగ తతులే
వినీల గగనపు వేదిక పైన
పలికిన కిల కిల స్వనముల స్వరజతి
జగతికి శ్రీకారము కాగ,
విశ్వకావ్యమునకిది భాష్యముగా..
ఇది తొలిసంధ్య వర్ణన.
‘ప్రాగ్దిస వీణియ పైన=తూర్పు దిక్కుఅనే వీణ పైన
దినకర మయూఖ తంత్రుల పైన=సూర్యుడి కిరణాలనే తీగెల పై
జాగ్రుత విహంగ తతులే=అప్పుడే లేస్తున్న పక్షులు
వినీల గగనపు వేదిక పైన=నీలాకాశం అనే వేదిక మీద
పలికిన కిల కిల స్వనముల స్వరజతి=పలికే కువకువల స్వరాలూ ఒక స్వర ప్రవాహమై
జగతికి శ్రీకారము కాగా=ప్రపంచానికి శ్రీకారం అవుతున్నై
విశ్వకావ్యమునకిది భాష్యముగా..=విశ్వం అనే కావ్యానికి భాష్యంగా..
ఇక రెండో చరణం:
జనించు ప్రతి శిశు గళమున పలికిన
జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు
హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున
అనంత జీవన వాహినిగా..
సాగిన సృష్టి విలాసమిది
పుట్టే ప్రతి శిశువు గొంతులోంచి పుట్టే ఏడుపు జీవనానికి నాందీ వాచకం .ఆది హృదయమనే మృదంగం వినిపించే మొదటి స్పందన ,అలాంటి నాదం- అనాది రాగమైన- ఓంకారంతో మమేకమై -ఆదితాలంలో –అనంతమైన- జీవధారగా ప్రవహిస్తుంటే సాగుతున్న సృష్టి విధానం ఇది
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
విరించి (సృష్టికర్త - బ్రహ్మ) అయి ఈ సాహిత్యాన్ని రచిస్తున్నా
విపంచి (కోకిల) అయి ఈ గీతాన్ని వినిపిస్తున్నా...
అర్ధం తెలీయకుండానే చాలా మందికి నచ్చింది,మరి
అర్ధం కూడా తెలిస్తే ఎలావుంటుంది. సీతా రామ శాస్త్రి గారు రాసిన
‘హృదయ మృదంగ ధ్వానం’ అంటే ఇప్పుడు దీన్ని అర్ధం తెలిసికున్నాక మళ్ళీ
వినండి మీరే అనుభవిస్తారు
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment