మతమూ, కులమూ, వగైరా పవిత్ర
విలువలను కాపాడుకోవాలనుకునే వారి ఆగ్రహం తరచూ భౌతిక రూపంలోనే
వ్యక్తమవుతూ ఉంటుంది. సూత్రరీత్యా చెప్పుకుంటే వారు ‘కాన్పెప్టుయల్’గా ‘అ’భౌతికవాదులు
అయినప్పటికీ ప్రాక్టికల్‌గా పరమ భౌతికవాదులన్నమాట. మన భక్తిలో ఉండే తమాషా
అది. ధింగ్ అబౌ గ్లోబల్లీ. యాక్ట్ లోకల్లీ. . దటీజ్ ఇండియా. ఇది హైటెక్ యుగమా,
అత్యాధునిక యుగమా, కంప్యూటర్ యుగమా అని
మళ్లీ విశేషణాలతో విరుచుకుపడనక్కర్లేదు. దిసీజ్ ఇండియా. 90ల్లో మన సమాజంలో
కొత్త నమూనా అడుగుపెడుతున్నపుడు ఈ లాజిక్‌ను పూర్తిగా ఉపయోగించుకుంది.
మందు, పేకాట,సిగరెట్ అడిక్షన్స్ అని చర్చిస్తారు. కానీ డబ్బుతో
పులిసినోడికి, 'పై'కులపోడికి గులాంగిరీ
చేయడమనేది అన్నింటికన్నా అతి పెద్ద అడిక్షన్. తెల్లోడి ప్రతి
ఉత్పత్తి నాగరికత రూపంలో స్టెయిల్ రూపంలో ప్రవేశించాయి మనం దేనికైనా సులభంగా
బానిసలు కాగలమని ‘అడిక్షన్’ అనేది మన జాతి ధర్మమని గుర్తించారువారు.
ఇపుడూ
పెప్సీ కోలాలు రుచికరంగా ఉంటాయని తాగుతున్నామా,
రుచి మర్చిపోలేక పిజా వెంట పడుతున్నామా!
ఈ రుచి, అందం లాంటి పదాలున్నాయే
అవి ప్రమాదకరమైనవి. పైవాడు అంటే మనకంటే
ఆర్థికంగా పైనున్నవాడు ఏది రుచి
అని చెపితే అది మనకు కూడా రుచికరంగా
అనిపించాలి. ఏది నాగరికత అని చెపితే
మనం కూడా నాగరికత అనేసుకోవాలి. వాడు
పాస్తా యమ్మీ యమ్మీ అంటే వాలమ్మో
వాలమ్మో ఎంత బాగా చెప్పారు, రుచి అంటే పాస్తాదే
సుమండీ అనేయాలి. వాడు రష్యన్ సలాడ్ అంటే మనం కూడా టమోటా కీర ముక్కలను విసిరేసి వన్
రష్యన్ సలాడ్ ప్లీజ్ అనేయాలి. .
మార్కెట్ మన రుచులను మన
వస్త్రధారణను మన వాహనాలను నిర్ణయిస్తుంది. ఈ బాటిల్ ఇలా పట్టుకుని అమ్మాయితోనో
అబ్బాయితోనో మాట్లాడుతూ ఉండకపోతే నువ్వు సోషల్ బీయింగ్‌వి కాకుండా పోతావు.
అన్ సోషల్ ఎలిమెంట్ అయిపోతావు. పిజా హట్లో ఫోర్కులతో కుస్తీపడుతూ
తిప్పలు పడకపోతే కూడా అంతే.
ఏతా వాతా చెప్పొచ్చేదేమిటయ్యా అంటే
బాగుండడం అనేది కూడా అనుకరణే. శుధ్ధభౌతికం కాదు. సూత్రం అంటారా అయితే నూతన
అభివృద్ధి నమూనా రుచి వంటి పచ్చి భౌతికమైన విషయాన్ని కూడా ఒక కాన్సెప్ట్‌గా
మార్చింది అని చెప్పుకోవచ్చు
వస్తాద్ గారూ
ఉప్పుతో పళ్లుతోముతున్నారా...ఇదిగో
మాపేస్ట్ వాడండి అన్నవాడే పదిహేనేళ్ల
తర్వాత మీ పేస్ట్‌లో ఉప్పులేదా అయితే
మా పేస్ట్ వాడండి అనడం లేదూ!
- -----------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment