GST లో చిన్న వ్యాపారాలు లేదా TOT వారి
రిటర్నలు,వాటి సంగతి
ప్రవేశ మినహాయింపు పరిమితిని
(సుమారు సం.20 లక్షలు నుండి 50 లక్షలు లోపు )దాటిన తరువాత, పన్ను చెల్లింపుదారులు సమిష్టి పథకానికి (ప్రస్తుతం TOT మాదిరి గా )
ఎంపిక చేసుకోవచ్చు, ఇందులో ఏ ITC సదుపాయాలూ
లేకుండా పన్నులు చెల్లించవలసి ఉంటుంది.
ప్రస్తుతం ఈ రకమైన కేటగిరీ వారికి తయారీ
స్థానం వారికి 1% మిగిలిన వారికి 2.5% గా ఉంటుందనిపిస్తుంది
ఇలాంటి పన్ను చెల్లింపుదారులు సరళమైన త్రైమాసిక
రిటర్న్ప్రస్తుతం మాదిరే మూడ్నెల్ల కో సారి (GSTR-4) ను
నిర్దేశించిన ఫార్మాట్ ప్రకారం దాఖలు చేయవలసి ఉంటుంది. అదనంగా (GSTR-9A) అని సంవత్సరానికొక సారి మొత్తం వివరాలతో అస్సేసమెంటు లాగ దాఖలు
చేయాలి
ఈ రిటర్న్ లో పన్ను
చెల్లింపుదారుడు అమ్మకాల వివరాలు మొత్తం విలువ మరియు ,తన పన్ను చెల్లింపు యొక్క
వివరాలు, చెల్లించిన పన్నును సూచిస్తు రిటర్న్ దాఖలు చేయాలి. సాధారణ పన్ను
చెల్లింపుదారుల నుండి కొనుగోళ్లకు ఇన్వాయిస్-స్థాయి కొనుగోలు సమాచారాన్ని చెల్లించేవాడు
ప్రకటించాల్సి ఉంటుంది .కౌంటర్-పార్టీ పన్ను చెల్లింపుదారులచే అప్లోడ్ చేసిన
వాయిస్ ఇన్వాయిస్ సమాచారం నుండి స్వీయ-ముసాయిదా మరియు మిగిలిన వారివద్దనుండి
కొనుగోలు వివరాలు అంటే అన్ రిజిస్టర్డ్
లేదా ఇన్న్వాయిస్ లేకుండా చెల్లించేవాడు ప్రకటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనల
ప్రకారం GST లో రిజిష్టర్ కాని వారి వద్ద
కొనుగోలు పై కూడా టాక్సుకూడా ఆ సరుకు అమ్మిన వారే భరించాలి దీన్నే GST విధానంలో ‘రివర్స్
టాక్సు’ అంటున్నారు
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment