Monday, May 15, 2017

భారతావని జబ్బు పడ్డది-( మూడవది ,చివరి భాగం- పద్మజా షా గారి ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఆంగ్ల వ్యాసానికి స్వేచ్చానువాదం)




భారతావని జబ్బు పడ్డది-( మూడవది ,చివరి భాగం- పద్మజా షా గారి ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఆంగ్ల వ్యాసానికి స్వేచ్చానువాదం)



వివిధ ప్రజా సమూహాల మధ్య తేడాలు సృష్టించడానికి మానవ నాగరికత- రంగు, భాష, దేవుళ్లు లేదా నడవడికలను బాగా దుర్వినియోగ పరిచింది. ఇలాంటి బూటకపు జీవ విభిన్నతను సృష్టించే క్రమంలో మన సొంత (మానవ) జాతీయుల మధ్య ఉండవలసిన ప్రాధమిక విధేయతను ధ్వంసం చేసుకుని అగౌరవ పరిచే కృత్రిమ విభజనలను, విభిన్నతలను మనం సృష్టించుకున్నాం. 
కుల వ్యవస్ధ అటువంటి బూటకపు జీవ విభిన్నతకు ఒక తుచ్ఛమైన ఉదాహరణ. మానవులు వివిధ జాతులు, తెగలు, రంగుల విభేదాలకు అతీతంగా ఉమ్మడిగా నివసిస్తూ పునరుత్పత్తి చేసుకోగలరు. ఎందుకంటే మనం అంతా మానవులమే గనుక. మన వృత్తులు లేదా నమ్మకాలు ఏకమైనప్పటికీ మనం అందరం అంతిమంగా మానవ కుటుంబానికి చెందిన వాళ్లం. సామాజికంగా-సాంస్కృతికంగా (కృత్రిమంగా) తయారు చేయబడిన మరియు రుద్దబడిన అటువంటి బూటకపు జీవ విభిన్నతలు ప్రజలు తామున్న దోపిడీ మూసలను, వివక్షలనూ బద్దలు కొట్టుకుని బైట పడకుండా నిరోధిస్తాయి.
                 భారత దేశ యువత ఇలాంటి విభజనల ఉడుం పట్టు నుండి బైట పడుతూ మరింత మానవీయంగా తయారవుతున్నారు. సామాజిక నిబంధనల సరిహద్దులను అధిగమిస్తూ నచ్చిన వ్యక్తిని ప్రేమిస్తున్న వాస్తవమే అందుకు ప్రబల సూచిక.
               ఈ ప్రాధమిక లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు కుటుంబ గౌరవం మరియు వారసత్వ స్వచ్ఛతల పేరుతో ఒక విస్తృతమైన సాంస్కృతిక మాయా నాటకాన్ని దాని చుట్టూ నిర్మిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మరియు ప్రతి ఒక్కటీ -స్త్రీలు, పిల్లలు, దేవుళ్లు, నమ్మకం, మతాచారాలు- ఈ ప్రబల, ప్రాధమిక లక్ష్యానికి లోబడి ఉండేవే. ధనిక కులాలు మరియు వర్గాల శక్తివంతమైన సాంస్కృతిక సర్వాధిపత్యం మిగిలిన సమాజంపైన తన మాయా వలను విసిరింది. పేదలు, భ్రష్టులు సైతం వారి సాంస్కృతిక మాయాజాలాన్ని మరింత స్థిర చిత్తంతో అనుసరించి అమలు చేయటానికి సిద్ధపడుతున్నారు.
                ప్రపంచ నాయకత్వానికై అర్రులు చాస్తున్న 21వ శతాబ్దపు ఇండియా ఇది. ప్రేమించడం ఎలాగో మర్చిపోయిన ఇండియా ఇది. ప్రధానంగా ఉన్నత తరగతి / ఉన్నత కుల ఆధిపత్యాన్ని కాపాడుకునే లక్ష్యంతో రోమియో-వ్యతిరేక దళాలుమరియు లవ్-జిహాదిస్టు వ్యతిరేకులుయువకులపై ఒత్తిడులు తెచ్చి తిరిగి తమ వర్గ, కుల, సమాజ, కుటుంబ పరిధుల్లోకి తెచ్చుకుంటున్నారు. కేవలం ముక్కలు చెక్కలు అయిన అటువంటి నేల పైనే ప్రజల మధ్య విభజన చిచ్చు పెట్టి లబ్ది పొందేరాజకీయాలు వృద్ధి చెందగలవు. 
                        మన చుట్టూ ఉన్న ప్రేమను నాశనం చేయటానికి స్వయం-ప్రకటిత ధర్మ పరాయణ కాపలాదారుల హింసను మౌనంగా చూస్తూ ఉండటం ద్వారా మనమే పరోక్షంగా ఆమోదిస్తున్నామా? లేక మన చిన్న సామ్రాజ్యాలు నిరంతరాయంగా కొనసాగేలా చూస్తున్న శక్తుల పదాతి సైనికులుగా పని చేస్తున్న కాపలాదారులను మన చేతికి మట్టి అంటకుండా ఉండే లక్ష్యంతో మనం మౌనంగా ఉన్నామా?  ఇక్కడ ఒక చచ్చిపోయిన కొడుకు అక్కడ ఒక చచ్చిపోయిన కూతురు జబ్బున పడ్డ ఒక అగ్ర రాజ్యం చెల్లించవలసిన ఒక చిన్న మూల్యమా
(.......ఇదే నేను వ్రాస్తున్న ముగింపు. ఆంగ్లంలో ఇంకా వుంది....)
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681




No comments:

Post a Comment

Address for Communication

Address card