ఏమిటీ “భారతదేశం” ?
"వందేమాతరం, సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం
సస్య శ్యామలాం, మాతరం, వందేమాతరం"
వందేమాతర గీతం ఎందుకు ఉద్వేగానికి
గురిచేస్తుంది? నా భారతదేశపు జెండాకి నేను వందనం చేస్తున్నప్పుడు ఎందుకు నేను
ఆనందం గా వుంటాను? నేను కేవలం నా ఆలోచనలలో నేను సృష్టించుకున్న ఒక భావాన్ని
ప్రేమిస్తున్నానా? సరే భారతదేశం గురించి emotions పెచ్చు మీరిపోయిన నా గోల వదిలేస్తే,
భారతదేశాన్ని ద్వేషించడానికి అందరూ సవా లక్ష కారణాలు చెప్తున్నారు. ద్వేషించడానికి
ఉన్న కారణాలు ఏమిటని అనుకోగానే నాకు శ్రీశ్రీ వ్రాసిన ఒక పాట గుర్తుకు వచ్చింది(శ్రీ
శ్రీ గారికి క్షమాపణ ల తో). ఆ పాట వింటే ఈ దేశం మీద ద్వేషానికి కావలసిన అన్నీ
కారణాలు చెప్పినట్టనిపించింది.
“పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా ...” ఇలా అంటూనే
“అవినీతి, బంధుప్రీతి,
చీకటి బజారు
అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు”...
“పదవీ వ్యామోహాలు,
కులమత బేధాలు
భాషా ద్వేషాలు చెలరేగే నేడు
ప్రతి ఒకడు మరిఒకని దోచుకొనేవాడే
తన సౌఖ్యం తన స్వార్ధం చూసుకునేవాడే
స్వార్ధమే అనర్ధదాయకం
అది చంపుకొనుటే క్షేమదాయకం”
కారణాలు సరే,
ఆయనే చెప్పిన solution
కూడా సరే,
కానీ ఎవరైనా వాళ్ళ స్వార్ధం చంపుకోగలరా?
తనకంటే ఎక్కువగా తన దేశాన్ని ప్రేమించగలరా ?
స్వార్ధం మాట వదిలేస్తే ఈ దేశాన్ని ప్రేమించడానికి ఎవరి దగ్గిరా కారణం లేదా? విదేశాలకి వెళ్ళకుండా,ఈ దేశంలోనే బ్రతకడానికి గత్యంతరం లేకపోవడం
తప్ప ఎవరి దగ్గిరా ఒక్క reason
కూడా లేదా?
అసలు ఇంత మంది తమ జీవితాలని త్యాగం చేసి తెచ్చిన స్వతంత్రం కి అర్ధం ఏమిటి?నాకు తెలిసి “స్వతంత్రం
అంటే విచ్చలవిడితనం తో కూడిన స్వేచ్ఛ కాదు,
అది ఒక భాద్యత. అందుకే అందరికీ అదంటే భయం.”
------------
ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681
No comments:
Post a Comment